• facebook
  • whatsapp
  • telegram

కర్బన రసాయన సమ్మేళనాలు, అనువర్తనాలు

1. మీథేన్ (CH4) అణువు ఆకృతి ఏది?
జ‌:  టెట్రాహెడ్రల్

 

2. ఇథిలీన్ (C2H4) వాయువు ఉపయోగం ఏమిటి?
ఎ) ప్లాస్టిక్ తయారీలో     బి) కృత్రిమంగా పండ్లను మగ్గించడంలో     సి) మస్టర్డ్ వాయువు తయారీలో      డి) అన్నీ
జ‌: (డి) అన్నీ

 

3. వెల్డింగ్ చేయడంలో ఉపయోగించే కర్బన పదార్థం?
జ‌:  ఎసిటలీన్

 

4. వోలర్ అనే శాస్త్రవేత్త యూరియా అనే కర్బన పదార్థాన్ని తయారుచేశాడు. దీని రసాయన ఫార్ములా ఏది?
జ‌: NH2CONH2

 

5. CO + H2 మిశ్రమాన్ని పారిశ్రామిక ఇంధనంగా ఉపయోగిస్తారు. దీన్ని సాధారణంగా ఏమని పిలుస్తారు?
జ‌: వాటర్‌గ్యాస్

 

6. కిందివాటిలో దేన్ని పారిశ్రామిక ఇంధనంగా వినియోగించరు?
ఎ) వాటర్ గ్యాస్      బి) సెమీవాటర్ గ్యాస్    సి) ప్రొడ్యూసర్ గ్యాస్        డి) గోబర్ గ్యాస్
జ‌: (డి) గోబర్ గ్యాస్

 

7. కిందివాటిలో దేన్ని మెడిసిన్‌గా ఉపయోగిస్తారు?
ఎ) బెంజీన్             బి) క్లోరోఫాం              సి) ఆస్పిరిన్                డి) ఫ్రియాన్
జ‌: (సి) ఆస్పిరిన్

 

8. కిందివాటిలో దేనికి ట్యూమర్, క్యాన్సర్ సోకే స్వభావం (కార్సినోజెనిక్) ఉంటుంది?
ఎ) బెంజీన్           బి) టోలిన్            సి) బెంజీన్, టోలిన్         డి) మీథేన్
జ‌: (సి) బెంజీన్, టోలిన్  

 

9. కీటక నాశనకారిణిగా దేన్ని ఉపయోగిస్తారు?
జ‌: గెమాక్సిన్

 

10. DDT తయారీలో ఉపయోగించే మూలకం ఏది?
జ‌: క్లోరోబెంజీన్ + క్లోరోఫాం

 

11. కిందివాటిలో దేన్ని 'ఉడ్ ఆల్కహాల్' (Wood alcohol) అని అంటారు?
ఎ) మిథైల్ ఆల్కహాల్       బి) ఇథైల్ ఆల్కహాల్    సి) ప్రొపైల్ ఆల్కహాల్    డి) బ్యూటైల్ ఆల్కహాల్
జ‌:  (ఎ) మిథైల్ ఆల్కహాల్

 

12. ఇథైల్ ఆల్కహాల్ ఉపయోగం ఏది?
ఎ) ఇంధనంగా     బి) ఔషధాల తయారీలో          సి) బీరు, విస్కీ లాంటి మత్తుపానీయాల తయారీలో           డి) అన్నీ
జ‌: (డి) అన్నీ

 

13. సాధారణంగా 'ఫినైల్' పేరుతో ఫ్లోర్‌క్లీనర్‌గా ఉపయోగించేది ఫినాల్. ఈ ఫినాల్ రసాయన ఫార్ములా ఏది?
జ‌: C6H5-OH

 

14. కిందివాటిలో దేన్ని 'గాసోలిన్' అని కూడా పిలుస్తారు?
ఎ) డీజిల్                బి) కిరోసిన్             సి) పెట్రోల్          డి) LPG
జ‌: (సి) పెట్రోల్

 

15. కిందివాటిలో విస్ఫోటకారిణిగా ఉపయోగించే పదార్థం ఏది?
ఎ) PVC                 బి) MIC             సి) TNT              డి)CFC
జ‌:   (సి) TNT 

 

16. వెనిగర్‌కు ఆమ్ల స్వభావం ఉండటానికి అందులోని ఏ పదార్థం కారణం?
జ‌: ఎసిటిక్ ఆమ్లం

 

17. గన్‌పౌడర్ తయారీలో KNO3, , చార్‌కోల్‌తోపాటు ఉండే ఇతర మూలకం ఏది?
జ‌: సల్ఫర్

 

18. కిందివాటిలో దేని ఫార్ములాలో రెండు రకాల మూలకాలు ఉంటాయి?
ఎ) గ్లూకోజ్            బి) ఎసిటిక్ ఆమ్లం             సి) ఇథిలీన్          డి) యూరియా
జ‌:   (సి) ఇథిలీన

 

19. చక్కెర ద్రావణ కిణ్వన ప్రక్రియలో వెలువడే వాయువు ఏది?
జ‌: CO2

 

20. కిందివాటిలో ఏది కార్బొహైడ్రేట్‌కు సంబంధించింది కాదు?
ఎ) గ్లూకోజ్             బి) సుక్రోజ్             సి) గ్లైసిన్           డి) స్టార్చ్
జ‌: (సి) గ్లైసిన్

 

21. 'మిల్క్ షుగర్' అని దేన్ని పిలుస్తారు?
జ‌: లాక్టోజ్

 

22. 'బీట్‌షుగర్' రసాయన ఫార్ములా ఏది?
జ‌: C12H22O11

 

23. కిందివాటిలో DNAలో ఉండే చక్కెర ఏది?
ఎ) గ్లూకోజ్             బి) సుక్రోజ్            సి) ఫ్రక్టోజ్            డి) డీఆక్సీరైబోజ్
జ‌: (డి) డీఆక్సీరైబోజ్

 

24. యానిమల్ స్టార్చ్ అని దేన్ని పిలుస్తారు?
జ‌: గ్లైకోజన్

 

25. కిందివాటిలో కృత్రిమ రబ్బర్ కానిది ఏది?
ఎ) బ్యూనా రబ్బర్                      బి) బ్యూనా-S-రబ్బర్   సి) పాలీఐసోప్రీన్     డి) నియోప్రీన్
జ‌:   ( సి) పాలీఐసోప్రీన్             

 

26. కిందివాటిలో దేన్నుంచి టెఫ్లాన్ అనే పాలిమర్‌ను తయారుచేస్తారు?
ఎ) ఇథిలీన్             బి) వినైల్ క్లోరైడ్       సి) స్టైరిన్           డి) టెట్రాఫ్లోరోఇథిలీన్
జ‌:   (డి) టెట్రాఫ్లోరోఇథిలీన్

 

27. ఫార్మలీన్ ద్రావణంలో ఉండే కర్బన రసాయన పదార్థం ఏది?
జ‌: ఫార్మాల్డిహైడ్

 

28. 'ల్యాంప్ ఆయిల్' (Lamp oil) అని దేన్ని అంటారు?
జ‌: కిరసనాయిల్

 

29. అత్యధిక సంఖ్యలో సమ్మేళనాలను ఏర్పరిచే మూలకం ఏది?
జ‌: కార్బన్

 

30. ఎసిటైల్ శాలిసిక్ ఆమ్లాలను సాధారణంగా ఎలా ఉపయోగిస్తారు?
జ‌: బాధ నివారణి

 

 

రచయిత: వాసం శ్రీనివాస్
 

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌