• facebook
  • whatsapp
  • telegram

జీవాణువులు

* ఎంజైమ్‌లు, న్యూక్లియిక్‌ ఆమ్లాలు మొదలైనవి కూడా జీవాణువులే.


* కార్బోహైడ్రేట్లను శక్తివనరులు, శక్తి జనకాలు లేదా శక్తి ఉత్పాదకాలు అంటారు.


* కార్బోహైడ్రేట్లను బహు సంఖ్యలో హైడాక్స్రీ (- OH ప్రమేయ సమూహాలున్న ఆల్డిహైడ్‌లు లేదా కీటోన్‌లుగా నిర్వచించవచ్చు.

కార్బోహైడ్రేట్లకు ఉదాహరణలు


* గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గాలాక్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్, స్టార్చ్, సెల్యూలోజ్, గ్లైకోజన్‌ మొదలైనవి.


* తియ్యదనం ఉన్న కార్బోహైడ్రేట్‌లను చక్కెరలు (Sugars) అంటారు.


* కార్బోహైడ్రేట్లను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి;


1. మోనోశాకరైడ్‌లు


2. ఓలిగోశాకరైడ్‌లు


3. పాలీశాకరైడ్‌లు


* ఫెయిలింగ్‌ కారకాన్ని లేదా టోలెన్స్‌ కారకాన్ని క్షయకరణం చెందించగల కార్బోహైడ్రేట్లను ‘క్షయకరణ చక్కెరలు’ అని పిలుస్తారు.
ఉదా: అన్ని మోనోశాకరైడ్‌లు, మాల్టోజ్, లాక్టోజ్‌


* మొక్కల్లో ప్రధానంగా నిల్వ ఉండే కార్బోహైడ్రేట్‌ - స్టార్చ్‌

* స్టార్చ్‌లో ఎమైలోస్, ఎమైలోపెక్టిన్‌ అనే రెండు అనుఘటకాలు ఉంటాయి.

* మొక్కల్లో అత్యధికంగా లభించే కర్బన పదార్థం - సెల్యూలోజ్‌.

* మొక్కల కణకవచాల నిర్మాణంలో ప్రధాన అనుఘటకం - సెల్యూలోజ్‌

గ్రేప్‌ షుగర్‌ - గ్లూకోజ్‌

ఫ్రూట్‌ షుగర్‌ - ఫ్రక్టోజ్‌

కేన్‌  షుగర్‌ - సుక్రోజ్‌

మిల్క్‌ షుగర్‌ - లాక్టోజ్‌

మాల్ట్‌ షుగర్‌ - మాల్టోజ్‌

జంతు స్టార్చ్‌ - గ్లైకోజన్‌


* ప్రోటీన్లు దేహ నిర్మాణాలు. జీవుల నిర్మాణానికి, నిర్వహణకు, శరీరం ఎదుగుదలకు, ఎంజైమ్‌లు, హార్మోన్‌ల తయారీకి ప్రోటీన్లు ఎంతో అవసరం.

* చిక్కుళ్లు, పప్పులు, బఠానీలు, మాంసం, పాలు, పుట్టగొడుగులు మొదలైనవి ప్రోటీన్లకు మూలపదార్థాలు.


* ప్రోటీన్లన్నీ అమైనో ఆమ్లాల పాలిమర్‌లు. అంటే, ప్రోటీన్లు అమైనో ఆమ్లాలతో నిర్మితమవుతాయి.


* అమైనో ఆమ్లాల్లో అమైనో (-NH2), కార్బాక్సిల్‌ (- COOH) ప్రమేయ సమూహాలు ఉంటాయి.


* ప్రోటీన్లలోని అమైనో ఆమ్లాలు పెప్టైడ్‌ బంధాలతో బంధితమై ఉంటాయి.


* శరీరంలో తయారయ్యే అమైనో ఆమ్లాలను ‘అనావశ్యక అమైనో ఆమ్లాలు’ అంటారు. వీటిని ఆహారం ద్వారా శరీరానికి అందించాల్సిన అవసరం ఉండదు.
ఉదా: గ్లైసీన్, ఎలనైన్, గ్లుటమిక్‌ ఆమ్లం, ఆస్పార్టిక్‌ ఆమ్లం, సెరైన్, సిస్టీన్, టైరోసిన్, ప్రోలీన్‌ మొదలైనవి.


* ఆహారం ద్వారా తప్పనిసరిగా శరీరానికి అందించాల్సిన అమైనో ఆమ్లాలను ‘ఆవశ్యక అమైనో ఆమ్లాలు’ అంటారు.

ఉదా: వేలైన్, లూసీన్, ఐసోలూసీన్, ఆర్జినైన్, లైసీన్, హిస్టిడిన్, ట్రిప్టోఫాన్‌ మొదలైనవి.


* కొవ్వులు లేదా లిపిడ్‌లను ‘శక్తి నిల్వలు’ అంటారు.


* కొవ్వులు ఎస్టర్‌ బంధాలను కలిగి ఉంటాయి.


* జీవ ఉత్ప్రేరకాలను ఎంజైమ్‌లు అంటారు.


* ఎంజైమ్‌లు క్రియాధార, చర్యా నిర్దిష్టాలు.


* మాల్టేజ్, జైమేజ్, లైపేజ్, ట్రిప్సిన్, పెప్సిన్‌ మొదలైనవి ఎంజైమ్‌లకు ఉదాహరణలు.


* జీవుల పెరుగుదలకు, ఆరోగ్యానికి చిన్న పరిమాణాల్లో ఆహారం ద్వారా తీసుకోవాల్సిన కర్బన పదార్థాలను విటమిన్లు అంటారు.


* విటమిన్లు లోపిస్తే అనేక వ్యాధులు వస్తాయి.


* ఖనిజ లవణాలు దేహానికి అవసరమయ్యే అకర్బన పదార్థాలు.


* ఖనిజ మూలకాలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.


1. స్థూల మూలకాలు (Macro Elements)


2. సూక్ష్మ మూలకాలు (Micro Elements)


* రోజువారీ ఆహారంలో ఎక్కువ మొత్తంలో అవసరమయ్యేవి స్థూల మూలకాలు.


ఉదా: కాల్షియం (Ca), పాస్ఫరస్‌ (P), మెగ్నీషియం (Mg), సోడియం (Na), పొటాషియం (K) మొదలైనవి.


* రోజువారీ ఆహారంలో తక్కువ మోతాదులో అవసరమయ్యేవి సూక్ష్మ పోషకాలు.

ఉదా: జింక్‌(Zn) , మాంగనీస్‌ (Mn), ఐరన్‌ (Fe), అయోడిన్‌ (I), కాపర్‌ (Cu), ఫ్లోరిన్‌ (F) మొదలైనవి.


* న్యూక్లియిక్‌ ఆమ్లాలు న్యూక్లియోటైడ్‌లతో నిర్మితమైన పాలిమర్‌లు.


* న్యూక్లియోటైడ్‌ అణువులు ఒక క్షారం, ఒక పెంటోజ్‌ చక్కెర, ఫాస్ఫేట్‌ సమూహాలతో ఏర్పడతాయి.


* డీఆక్సీరైబో న్యూక్లియిక్‌ ఆమ్లం (DNA), రైబోన్యూక్లియిక్‌ ఆమ్లం (RNA) అనేవి రెండు రకాల న్యూక్లియిక్‌ ఆమ్లాలు.


* వారసత్వపు లక్షణాలు పెద్దల నుంచి పిల్లలకు రావడానికి న్యూక్లియిక్‌ ఆమ్లాలు కారణం.


* DNAలో 2-డీఆక్సీరైబోజ్, RNAలో రైబోజ్‌ అనే చక్కెర ఉంటాయి.


* హార్మోన్లు అంతరకణ సందేశాలను అందించి, జీవప్రక్రియల సమతౌల్యతను పాటించేందుకు ఉపయోగపడతాయి.

ఉదా: ఇన్సులిన్, టెస్టోస్టిరాన్, ప్రొజెస్టిరాన్, కార్టిసోల్, ఆక్సీటోసిన్‌ మొదలైనవి.

* జీవులు ఏర్పడేందుకు, వాటి మనుగడకు అవసరమయ్యే అనేక రకాల సంశ్లిష్ట అణువులను జీవాణువులు అంటారు. ఇవి జీవప్రక్రియల్లో ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి.

* జీవులకు ముఖ్యంగా రెండు రకాల పోషక పదార్థాలు అవసరం. 

i. స్థూల పోషకాలు 

ii. సూక్ష్మ పోషకాలు


* శరీరానికి ఎక్కువ మొత్తంలో అవసరమయ్యేవి స్థూల పోషకాలు.
ఉదా: పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్లు), మాంసకృత్తులు (ప్రోటీన్లు), కొవ్వులు (లిపిడ్‌లు) మొదలైనవి.


* శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమయ్యేవి సూక్ష్మ పోషకాలు.

ఉదా: విటమిన్లు, ఖనిజ లవణాలు

మాదిరి ప్రశ్నలు

1. కింది వాటిని జతపరచండి.
జాబితా - I        జాబితా - II
a. పాలలోని ఆమ్లం      i)  లాక్టోజ్‌
b. పాలలోని చక్కెర      ii) కాల్షియం, పొటాషియం
c. పాలలోని పోషక       iii) లాక్టిక్‌ ఆమ్లం   మూలకాలు    

1) a - ii, b - i, c - iii          2) a - iii, b - ii, c - i
3) a - i, b - iii, c - ii         4) a - iii, b - i, c - ii

2. మనం నిత్యం ఉపయోగించే పంచదార రసాయన నామం ఏమిటి?
1) గ్లూకోజ్‌        2) ఫ్రక్టోజ్‌    
3) సుక్రోజ్‌       4) లాక్టోజ్‌

3. కింది వాటిలో పిండి పదార్థాలకు సంబంధించి సరైంది?
i) పిండి పదార్థాల్లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్‌ అనే మూలకాలు ఉంటాయి.
ii) ఈ పదార్థాలను అయోడిన్‌తో పరీక్ష చేసి గుర్తించవచ్చు.
iii) మొక్కలు పిండి పదార్థాలను కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారు చేసుకుంటాయి.
iv) వీటిని శక్తి నిల్వలు అంటారు.
1) i, ii     మాత్రమే      2) ii, iii  మాత్రమే
3) iii, iv మాత్రమే       4) పైవన్నీ

4. జంతువులు .... రూపంలో, మొక్కలు ... రూపంలో కార్బోహైడ్రేట్‌లను నిల్వ చేసుకుంటాయి.
1) గ్లైకోజన్, స్టార్చ్‌       2) స్టార్చ్, గ్లైకోజన్‌
3) గ్లూకోజ్, స్టార్చ్‌       4) స్టార్చ్, ఫ్రక్టోజ్‌

5. కింది వాటిలో క్షయకరణం చెందించలేని చక్కెరకు ఉదాహరణ?

1) సుక్రోజ్‌             2) స్టార్చ్‌    
3) సెల్యూలోజ్‌          4) పైవన్నీ

6. కింది వాటిని జతపరచండి.
జాబితా - I     జాబితా - II
a. గ్రేప్‌ షుగర్‌         i) ఫ్రక్టోజ్‌
b. ఫ్రూట్‌ షుగర్‌      ii) సుక్రోజ్‌
c కేన్‌ షుగర్‌           iii) గ్లూకోజ్‌
1) a - ii, b- i, c - iii           2) a - iii, b - i, c- ii
3) a - i, b - iii, c - ii         4) a - iii, b - ii, c - i

7. కింది వాటిలో సరికాని జత ఏది?
1) విటమిన్‌ - A     : రెటినాల్‌
2) విటమిన్‌ - B1 : థయమిన్‌
3) విటమిన్‌ - B3 : రైబోఫ్లావిన్‌
4) విటమిన్‌ - C    : ఆస్కార్బిక్‌ ఆమ్లం

8. విటమిన్‌ - తీ9 రసాయన నామం?
1) నియాసిన్‌          2) పెరిడాక్సిన్‌
3) ఫోలిక్‌ ఆమ్లం     4) కాల్సిఫెరాల్‌

9. కాల్సిఫెరాల్‌ ఏ విటమిన్‌ రసాయన నామం?
1) విటమిన్‌ - B12      2) విటమిన్‌ - C 
3) విటమిన్‌ - D        4) విటమిన్‌ - K

10. కింది వాటిలో విటమిన్‌ - B 1 లోపం కారణంగా కలిగే వ్యాధి?
1) పెల్లాగ్రా     2) బెరి - బెరి
3) స్కర్వీ       4) ఎనీమియా

11. కింది వాటిలో రక్తస్రావ వ్యతిరేక విటమిన్‌ ఏది?
1) విటమిన్‌ - D        2) విటమిన్‌ - K
3) విటమిన్‌ - C       4) విటమిన్‌ - E

12. కింది వాటిలో సరైన వాక్యం?
ఎ) ఎముకల పెరుగుదలకు, దంతాల ఆరోగ్యానికి విటమిన్‌ - దీ అవసరం
బి) విటమిన్‌ - దీ లోపంతో రికెట్స్‌ వ్యాధి కలుగుతుంది.
1) ఎ మాత్రమే     2) బి మాత్రమే
3) ఎ, బి        4) పైవన్నీ

13. తేనెలో అత్యధికంగా ఉండే కార్బోహైడ్రేట్‌ ఏది?
1) ఫ్రక్టోజ్‌       2) గ్లూకోజ్‌ 
3) స్టార్చ్‌        4) మాల్టోజ్‌

14. కింది వాటిలో విటమిన్‌ ఏది?

1) ఆస్కార్బిక్‌ ఆమ్లం  2) ఎసిటిక్‌ ఆమ్లం 

3) ఫోలిక్‌ ఆమ్లం       4) 1, 3

సమాధానాలు

14 23 34 41 54 62 73 83 93 102 112 123 131  144

రచయిత

డాక్టర్‌ పి. భానుప్రకాష్‌

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 

Posted Date : 29-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌