• facebook
  • whatsapp
  • telegram

అంతరిక్ష విజ్ఞానశాస్త్రం

1. అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ఉపగ్రహాల ప్రయోగం కోసం ఏర్పాటుచేసిన లాంచ్‌ప్యాడ్‌లలో సరైన వాటిని గుర్తించండి. 

ఎ) బైకనూరు: రష్యా 

బి) కౌరు: ఫ్రెంచ్‌ గయానా 

సి) తియా గ్యాంగ్‌: చైనా 

డి) కేప్‌ కెనరవల్‌: ఫ్లోరిడా (యూఎస్‌) 

1) ఎ, డి       2) బి, సి 

3) బి, సి, డి       4) పైవన్నీ

2. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ టెక్నాలజీని ఎక్కడ ఏర్పాటు చేశారు? (ఇది ఆసియాలోనే మొదటిది.) 

1) హైదరాబాద్‌       2) తిరువనంతపురం 

3) ముంబయి       4) కలకత్తా 

3. భారతదేశ అంతరిక్ష పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?

1) డాక్టర్‌ విక్రమ్‌ సారాభాయ్‌ 

2) జవహర్‌లాల్‌ నెహ్రూ 

3) హోమీ జహంగీర్‌ బాబా 

4) మహాత్మా గాంధీ 

4. భారతదేశంలో మొదటిసారిగా తయారైన లాంచ్‌ వెహికల్‌ (వాహక నౌక) ఏది? 

1) SLV-3       2) ASLV  

3) GSLV        4) PSLV

5. ఆంట్రిక్స్‌ కార్పొరేషన్‌ గురించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) భారతీయ అంతరిక్ష విభాగం ఆధ్వర్యంలో ఇస్రో వాణిజ్య విభాగంగా 1992లో ఆంట్రిక్స్‌ కార్పొరేషన్‌ ఏర్పాటైంది.

బి) భారత అంతరిక్ష కార్యక్రమం, దాని ఉత్పత్తులను వాణిజ్యపరంగా ప్రోత్సహించడం ఈ కార్పొరేషన్‌ ముఖ్య ఉద్దేశం. 

సి) ఆంట్రిక్స్‌ కార్పొరేషన్‌ 200708లో మినీ రత్న హోదాను పొందింది.

డి) ప్రపంచంలోని అనేక దేశాలకు ఇది అంతరిక్ష రంగంలో విశిష్టమైన సేవలు అందిస్తోంది.

1) ఎ, సి       2) బి, డి 

3) ఎ, డి       4) పైవన్నీ

6. కిందివాటిలో ఏది సత్యం?

ఎ) ఒక ఉపగ్రహం భూమి చుట్టూ నిరంతతరం కక్ష్యలో పరిభ్రమించడానికి ఇంధనం అవసరం. 

బి) ఉపగ్రహం భూ కక్ష్యలో పరిభ్రమించడానికి భూమి గురుత్వాకర్షణ శక్తి అభికేంద్ర బలం (Centripetal Force) గా ఉపయోగపడుతుంది.

1) ఎ మాత్రమే         2) బి మాత్రమే

3) రెండూ సరైనవే   4) ఏదీకాదు

7. NNRMS గురించి కిందివాటిలో సరైనవి?

ఎ) NNRMS అంటే నేషనల్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం

బి) సంప్రదాయ పద్ధతులకు రిమోట్‌ సెన్సింగ్‌ సమాచారాన్ని జోడించి, దేశంలోని సహజ వనరులను అవసరానికి తగ్గట్టు పద్ధతిగా ఉపయోగించుకునే సౌలభ్యాన్ని ఈ వ్యవస్థ కల్పిస్తుంది. 

సి) సహజ వనరుల వినియోగంలో సుస్థిర అభివృద్ధిని సాధించటం NNRMS ముఖ్య ఉద్దేశం. 

1) ఎ, బి       2) బి, సి 

3) ఎ, సి       4) పైవన్నీ

8. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ (IIRS) ఎక్కడ ఉంది? 

1) బెంగుళూరు       2) హైదరాబాద్‌ 

3) పుణె        4) డెహ్రాడూన్‌

9. తుంబా ఈక్వటోరియల్‌ లాంచింగ్‌ స్టేషన్‌ గురించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) దీన్ని భారతదేశ భూభాగానికి దక్షిణాన ఉన్న తుంబాలో (తిరువనంతపురం) ఏర్పాటు చేశారు. 

బి) ఈ ప్రాంతం భూమధ్య రేఖకు అతి దగ్గరగా ఉంది. ఇక్కడ భూ అయస్కాంత క్షేత్ర ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

సి) దీన్ని 1963, నవంబరు 21న ఏర్పాటు చేశారు.

డి) ఇది భారతదేశ మొట్టమొదటి రాకెట్‌ లాంచింగ్‌ స్టేషన్‌. 

1) ఎ, సి       2) బి, డి  

3) ఎ, బి, సి       4) పైవన్నీ

10. ఇస్రో ప్రస్తుత ఛైర్మన్‌ ఎవరు? (ఈయన 2022, జనవరిలో నియమితులయ్యారు.)

1) కస్తూరి రంగన్‌      2) మాధవన్‌ అయ్యర్‌ 

3) యు.ఆర్‌. రావు     4) ఎస్‌.సోమనాథ్‌ 

11. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏ కక్ష్యలో ఏర్పాటు చేశారు? 

1) లో ఎర్త్‌ ఆర్బిట్‌ 

2) మీడియం ఎర్త్‌ ఆర్బిట్‌ 

3) పోలార్‌ ఆర్బిట్‌ 

4) సన్‌సింక్రొనస్‌ ఆర్బిట్‌

12. అంతరిక్షంలోకి ప్రయోగించిన తొలి ప్రభుత్వేతర అమెచ్యూర్‌ రేడియో శాటిలైట్‌?

1) Sputnik 1       2) Explorer 1

3) Oscar 1       4) PEHUENSAT 1 

13. కిందివాటిలో భారత్‌ త్వరలో ప్రయోగించనున్న రెండో అంతరిక్ష పరిశోధనా టెలిస్కోప్‌ ఏది?

1) Astrosat

2) XPosat x ray polarimetry satellite

3) Hubble telescope   4) ఏదీకాదు 

14. మిలటరీ ఉపగ్రహమైన NOOR-2 ఏ దేశానికి చెందింది? (దీన్ని 2022, మార్చి 8వ ప్రయోగించారు.)

1) యూఏఈ        2) పాకిస్థాన్‌ 

3) ఆఫ్గనిస్థాన్‌       4) ఇరాన్‌

15. ప్రపంచంలోనే మొదటిసారిగా ఏ స్పేస్‌ ఏజెన్సీ కలపతో చేసిన WISA woodsat  ఉపగ్రహాన్ని 2021లో తయారు  చేసింది? 

1) నాసా    2) యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ  

3) ఇస్రో    4) ROSCOSMOS 

16. గగన్‌యాన్‌ మిషన్‌ కోసం తయారు చేసిన వికాస్‌ ఇంజిన్‌ను ఎక్కడ పరీక్షించారు? (ఈ పరీక్ష విజయవంతమైంది. అంతరిక్షంలోకి మనుషులను తీసుకెళ్లేందుకు ఇస్రో ఈ గగన్‌యాన్‌ మిషన్‌ను చేపట్టింది.)

1) షార్‌ శ్రీహరికోట 

2) ఆంట్రిక్స్‌ కార్పొరేషన్, బెంగుళూరు 

3) ఎల్‌పీఎస్‌సీ, మహేంద్రగిరి

4) ఎస్‌ఏసీ, అహ్మదాబాద్‌ 

17. Inspiration-4 గురించి కిందివాటిలో సరైనవి ఏవి? 

ఎ) అంతరిక్ష యాత్రికుల కోసం మొదటిసారిగా స్పేస్‌ ఎక్స్‌ ఏర్పాటుచేసిన అంతరిక్ష యాత్ర 

బి) దీన్ని 2021, సెప్టెంబరు 16 నుంచి 18 వరకు చేపట్టారు. 

సి) Crew Dragon capsule ద్వారా Inspiration-4 ను కక్ష్యలోకి పంపారు.

1) ఎ, సి    2) బి, సి    3) ఎ, బి    4) పైవన్నీ

18. నేషనల్‌ టెక్నాలజీ డే గురించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) పోఖ్రాన్‌లో విజయవంతమైన అణు పరీక్షలకు గుర్తుగా ‘నేషనల్‌ టెక్నాలజీ డే’ను నిర్వహిస్తున్నారు.

బి) ఈ ‘డే’ను మొదటిసారి 1999, మే 11న అప్పటి ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి హయాంలో జరిపారు. 

సి) దేశంలో సాధించిన శాస్త్ర సాంకేతిక రంగ విజయాలను ఈ దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకుంటారు.

డి) 2022 థీమ్‌: శాస్త్ర సాంకేతిక సమీకృత విధానాల ద్వారా సుస్థిరమైన భవిష్యత్తును నెలకొల్పడం (Integrated approach in science and technology for a sustainable future) 

1) ఎ, సి       2) ఎ, బి 

3) బి, డి       4) పైవన్నీ

19. కిందివాటిలో air breathing propulsion tehnology వ్యవస్థను కలిగిన ఇంజిన్లు ఏవి? (ఇవి వాతావరణంలోని ఆక్సిజన్‌ను ఉపయోగించుకుని రాకెట్ల ఇంధన వినియోగాన్ని తగ్గించేలా చేస్తాయి.)

1) Ramjet          2) Scramjet  

3) DMRJ-Dual Mode Ramjet

4) పైవన్నీ  

20. కిందివాటిలో విద్యార్థులు తయారు చేయని ఉపగ్రహం ఏది?

1) StudSat       2) EDUsat

3) ANUSAT       4) Pratham 

21. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) అంగారక గ్రహంపై పరిశోధనలు చేస్తున్న నాలుగో స్పేస్‌ ఏజెన్సీగా ఇస్రో ఉంది. మొదటి మూడు స్థానాల్లో వరునగా అమెరికా, రష్యా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీలు ఉన్నాయి.

బి) స్వదేశీ క్రయోజెనిక్‌ టెక్నాలజీ రూపకల్పనలో భారత్‌ ఆరో దేశంగా ఉంది. యూఎస్, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ, రష్యా, చైనా, జపాన్‌లు మొదటి అయిదు స్థానాల్లో నిలిచాయి.

సి) అంతరిక్షంలోకి మనుషులను పంపేందుకు రూపొందించిన మిషన్‌ (గగన్‌యాన్‌)లో నాలుగో స్థానంలో ఉంది.  యూఎస్, రష్యా, చైనాలు వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. 

1) ఎ, సి       2) బి, సి 

3) ఎ, బి       4) పైవన్నీ

22. VAJRA (Visiting Advanced Joint Research)ప్రాజెక్ట్‌ ఉద్దేశం?

1) సైబర్‌ క్రైమ్‌ల నివారణ

2) ఆధునాతన వాహక నౌకల తయారీ

3) విదేశాల్లో నివసించే భారత విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు నిర్దేశిత సమయంలో భారత్‌కు వచ్చి విజిటింగ్‌ ఫ్యాకల్టీగా విద్యాసంస్థలు, పరిశోధన సంస్థల్లో సేవలు అందించడానికి రూపొందించారు.

4) రక్షణ రంగ పరిశోధనల కోసం 

23. కింది ఏ దేశాలు స్పేస్‌లో అంతరిక్ష కేంద్రాలను స్వతంత్రంగా నిర్వహిస్తున్నాయి?

1) అమెరికా       2) రష్యా 

3) చైనా       4) పైవన్నీ 

24. కింది వాటిని జతపరచండి 

దేశం          స్పేస్‌ ఏజెన్సీ పేరు

i) అమెరికా    a) యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ

ii) రష్యా        b) కెనడియన్‌ స్పేస్‌ ఏజెన్సీ

iii) జపాన్‌     c) ళివీళీదివీళీలీతిళీ 

iv) యూరప్‌      d) రితిశ్రీతి  

v) కెనడా       e) వితిళీతి

1) i-e, ii-c, iii-d, iv-a, v-b

2) i-c, ii-e, iii-d, iv-b, v-a

3)  i-a, ii-c, iii-e, iv-a, v-b

4)  i-c, ii-e, iii-a, iv-d, v-b

25. ఇస్రో శ్రీహరికోటను అత్యధిక రాకెట్లను ప్రయోగించే ‘ఐడియల్‌ లాంచ్‌ ప్యాడ్‌’లా ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణాలు కిందివాటిలో ఏవి?

1) ఇది జనావాసాలకు దూరంగా ఉండి, సముద్రానికి అతి దగ్గరగా ఉంటుంది. ఈ ద్వీపం బంగాళాఖాతం నుంచి పులికాట్‌ సరస్సును వేరు చేస్తూ, రాకెట్‌ ప్రయోగాలకు అనువైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది.

2) ఇది జల, వాయు, భూ రవాణా మార్గాలకు దగ్గరగా ఉంది.

3) శ్రీహరికోట ప్రాంతం భూమధ్యరేఖకు దగ్గరగా ఉండటం వల్ల రాకెట్‌ ప్రయోగానికి కావాల్సిన వేగాన్ని సమకూరుస్తూ, ఇంధనాన్ని ఆదా చేస్తుంది.

4) పైవన్నీ 

26. శుక్ర గ్రహ పరిశీలన కోసం ఇస్రో భవిష్యత్తులో ఉపయోగించే మిషన్‌? (ఇది సూర్యుడికి దూరంగా ఉన్నా అత్యంత అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది.)

1) మంగళయాన్‌       2) చంద్రయాన్‌

3) శుక్రయాన్‌        4) ఆదిత్య 1

27. కిందివాటిలో సరైన జతలను గుర్తించండి.

ఎ) అంతరిక్షంలో మొదటి మానవుడు - యూరీ అలస్కావిచ్‌ గగారిన్‌

బి) అమెరికాకు చెందిన మొదటి ఆస్ట్రోనాట్‌ - అలెన్‌ షెఫర్డ్‌ 

సి) అంతరిక్షంలో మొదటి మహిళ - వాలెంటినా తెరిష్కోవా

డి) చంద్రుడిపై అడుగుపెట్టిన మొదటి మానవుడు     - నీల్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌ 

1) ఎ, డి       2) బి, సి 

3) బి, డి       4) పైవన్నీ

28. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ (జాతీయ అంతరిక్ష విభాగం) ఎప్పుడు ఏర్పాటైంది?

1) 1971       2) 1972 

3) 1973       4) 1974

సమాధానాలు

1 - 4  2 - 2  3 - 1  4 - 1   5 - 4  6 - 2  7 - 4  8 - 4   9 - 4  10 - 4  11 - 1  12 - 3  13 - 2  14 - 4  15 - 2  16 - 3  17 - 4  18 - 4  19 - 4  20 - 2   21 - 4    22 - 3    23 - 4    24 - 1    25 - 4    26 - 3    27 - 4    28 - 2

Posted Date : 13-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌