• facebook
  • whatsapp
  • telegram

నక్షత్రాలు - సౌర కుటుంబం

¤ అనేక వేల కోట్ల నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటారు. సూర్యుడు అనే నక్షత్రం పాలపుంత లేదా ఆకాశగంగ అనే గెలాక్సీకి చెందింది.
¤ వేలకోట్ల గెలాక్సీలను కలిపి విశ్వం అంటారు.
¤ విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగాన్ని కాస్మాలజీ అంటారు.
¤ భూమిపై నిట్టనిలువుగా ఉన్న వస్తువుకు ఏర్పడే నీడల్లో అతి తక్కువ పొడవు ఉన్న నీడ ఉత్తర, దక్షిణ దిశల్లో ఏర్పడుతుంది.
¤ ప్రాంతీయ మధ్యాహ్న వేళలోనే వస్తువుకు అతి తక్కువ పొడవు ఉన్న నీడ ఏర్పడుతుంది.
¤ ప్రాంతీయ మధ్యాహ్న వేళనే లోకల్ నూన్ టైం అంటారు.
¤ సూర్యోదయం రోజురోజుకు దక్షిణ దిక్కుగా కదులుతున్నట్లు అనిపిస్తే దాన్ని దక్షిణాయనం అంటారు.
¤ రోజు రోజుకు ఉత్తర దిక్కుకు కదులుతున్నట్లు అనిపిస్తే దాన్ని ఉత్తరాయణం అటారు.
¤ మన రాష్ట్రంలోని ఏకైక నీడ గడియారం తూర్పు గోదావరి జిల్లాలోని అన్నవరంలో సత్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉంది.
¤ చంద్రుడి ఆకారం ప్రతిరోజు మారుతూ ఉంటుంది. ఈ మార్పులను చంద్ర కళలు అంటారు.
¤ ఒక ప్రదేశంలో కనిపించిన చంద్రుడు మళ్లీ అదే ప్రదేశంలో కనిపించడానికి ఒకరోజు కంటే దాదాపు 50 నిమిషాల ఎక్కువ సమయం పడుతుంది. ఇదే చంద్రకళలు ఏర్పడటానికి కారణం.
¤ అమావాస్య రోజున సూర్యుడు, చంద్రుడు భూమికి ఒకేవైపు ఉంటారు.
¤ పౌర్ణమి రోజున సూర్యుడు, చంద్రుడు భూమికి చెరోవైపు ఉంటారు.
¤ 1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై కాలుపెట్టాడు.
¤ చంద్రుడి ఉపరితలం దుమ్మూ-ధూళితో ఎలాంటి జీవం లేకుండా ఉంది. అక్కడ అనేక లోయలు, పర్వతాలు ఉన్నాయి.
¤ 2008, అక్టోబరు 22న భారతదేశం చంద్రుడి గురించి పరిశోధనలకు చంద్రయాన్-I ను ప్రయోగించింది.

 

చంద్రయాన్ ముఖ్య విధులు:
i) చంద్రుడిపై నీటి జాడ వెతకడం
ii) చంద్రుడిపై పదార్థ మూలకాలను తెలుసుకోవడం
iii) హీలియం-3ని వెతకడం
iv) చంద్రుడి త్రిమితీయ (3D) అట్లాస్‌ను తయారు చేయడం
v) సౌర వ్యవస్థ ఆవిర్భావానికి ఆధారాలు వెతకడం.

 

సూర్యగ్రహణం
¤ చంద్రుడి నీడ భూమిపై పడటం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
¤ ఇది అమావాస్య రోజున ఏర్పడుతుంది.
సూర్యగ్రహణం నాలుగు రకాలు:
   1. సంపూర్ణ సూర్యగ్రహణం
   2. పాక్షిక సూర్యగ్రహణం
   3. వలయాకార సూర్యగ్రహణం
   4. మిశ్రమ సూర్య గ్రహణం: వలయాకార గ్రహణం సంపూర్ణ గ్రహణంగా మారడం. ఇది అరుదుగా సంభవిస్తుంది.

 

చంద్రగ్రహణం:
¤ భూమి నీడ చంద్రుడిపై పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
¤ ఇది పౌర్ణమి రోజున సంభవిస్తుంది.
ఇది మూడు రకాలు:
    1. సంపూర్ణ చంద్రగ్రహణం
    2. పాక్షిక చంద్రగ్రహణం
    3. ప్రచ్ఛాయ/ ఉపచ్ఛాయ చంద్రగ్రహణం
¤ భూమి నీడ అంచుల్లో ఉండే పలుచని నీడ ప్రాంతం చంద్రుడిపై పడటం వల్ల ప్రచ్ఛాయ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
¤ సంపూర్ణ సూర్యగ్రహణం 1980, ఫిబ్రవరి 16న ఏర్పడింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో కొన్ని ప్రదేశాల్లో కనిపించింది.
¤ భూమి స్థానంతో పోలిస్తే స్థానభ్రంశం చెందకుండా స్థిరంగా ఉండే నక్షత్రాన్ని ధృవ నక్షత్రం అంటారు.
¤ ధృవ నక్షత్రాన్ని ఆంగ్లంలో పోలారిస్ అంటారు. ఇది భూమి ఉత్తర ధృవానికి ఎదురుగా ఉంది.
¤ ధృవ నక్షత్రాన్ని సప్తర్షి మండలం సహాయంతో తెలుసుకోవచ్చు. ఈ సప్తర్షి మండలం (Great Bear) నాగలి లేదా గాలిపటం ఆకారంలో ఉంటుంది.
¤ సప్తర్షి మండలం చలికాలంలో సూర్యోదయానికి కొద్ది గంటల ముందు ఆకాశంలో ఉదయిస్తుంది. (ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల నుంచి చూడొచ్చు)
¤ శర్మిష్ట రాశిలో ఆరు నక్షత్రాలు ఉంటాయి. ఇది 'm' ఆకారంలో ఉంటుంది.
¤ ధృవ నక్షత్రం చుట్టూ మిగిలిన నక్షత్రాలన్నీ ఒక చుట్టు తిరిగిరావడానికి 24 గంటల సమయం పడుతుంది.
¤ ధృవ నక్షత్రం భూభ్రమణాక్షంపై ఉంది కాబట్టి స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

 

సౌర కుటుంబం:
సూర్యుడు, దాని చుట్టూ తిరిగే అంతరిక్ష వస్తువులను అన్నింటినీ కలిపి సౌర కుటుంబం అని అంటారు. దీనిలో గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, ఆస్టరాయిడ్‌లు లాంటివి ఉంటాయి.

 

సూర్యుడు:
¤ మనకు దగ్గరలో ఉండే నక్షత్రం సూర్యుడు. ఇది అత్యంత ఉష్ణం, కాంతిని నిరంతరం వెదజల్లుతుంది.
¤ భూమిపై ఉన్న వివిధ గ్రహాలపై శక్తిరూపాలకు సూర్యుడు ప్రధాన వనరు.

 

గ్రహాలు:
¤ ఇవి నక్షత్రాల్లా కనిపిస్తాయి. కానీ వీటికి స్వయం ప్రకాశక శక్తి ఉండదు.
¤ ఇవి తమపై పడిన కాంతిని పరావర్తనం చేస్తాయి.
¤ ప్రతి గ్రహం సూర్యుడి చుట్టూ ప్రత్యేక మార్గంలో పరిభ్రమిస్తుంది. దీన్ని కక్ష్య అంటారు.
¤ ఒక గ్రహం సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టేకాలం పరిభ్రమణ కాలం అంటారు.
¤ సూర్యుడు నుంచి గ్రహాలకు ఉండే దూరం పెరుగుతున్న కొద్ది వాటి పరిభ్రమణ కాలం పెరుగుతుంది.
¤ గ్రహాలు తమ చుట్టూ తాము తిరగడాన్ని 'భ్రమణ కాలం' అంటారు.
¤ ఏ అంతరిక్ష వస్తువైనా మరొకదాని చుట్టూ తిరుగుతూ ఉంటే దాన్ని ఉపగ్రహం అంటారు.
¤ చంద్రుడు భూమికి ఉపగ్రహం. మానవ నిర్మిత ఉపగ్రహాలను 'కృత్రిమ ఉపగ్రహాలు' అంటారు.

 

బుధుడు:
¤ సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం, 'అతిచిన్న గ్రహం'.
¤ దీనికి ఉపగ్రహాలు లేవు.
¤ దీని పరిభ్రమణ కాలం 88 రోజులు.

 

శుక్రుడు:
¤ భూమికి దగ్గరగా ఉన్న గ్రహం, ఆకాశంలో కనిపించే గ్రహాల్లో ప్రకాశమంతమైంది.
¤ దీన్ని వేగుచుక్క, సాయంకాల చుక్క అని పిలుస్తారు.
¤ ఇది అపసవ్యదిశ (తూర్పు నుంచి పడమరకు)లో తిరుగుతుంది.
¤ దీనికి ఉపగ్రహాలు లేవు.
¤ దీని పరిభ్రమణ కాలం 225 రోజులు.

 

భూమి:
¤ సౌరకుటుంబంలోని గ్రహాలన్నింటిలోకి జీవరాశిని కలిగి ఉన్న గ్రహం.
¤ అంతరిక్షం నుంచి చూసినప్పుడు నీలి - ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. దీనికి కారణం నేల, చెట్లు, నీటి వల్ల కాంతి వక్రీభవనం.
¤ దీనికి ఉన్న ఏకైక ఉపగ్రహం - చంద్రుడు.
¤ దీని పరిభ్రమణ కాలం 365 రోజులు.

 

కుజుడు/ అంగారకుడు:
¤ భూకక్ష్యకు బయటి వైపు ఉన్న మొదటి గ్రహం.
¤ కొద్దిగా ఎరుపు రంగులో ఉండటం వల్ల దీనిని అరుణ గ్రహం అని పిలుస్తారు.
¤ దీనికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య: 2
¤ దీని పరిభ్రమణ కాలం: 687 రోజులు

 

గురుడు/ బృహస్పతి:
¤ సౌర కుటుంబంలోకెల్లా అతిపెద్ద గ్రహం.
¤ భూమి కంటే 1300 రెట్లు పెద్దది. దీని ద్రవ్యరాశి భూ ద్రవ్యరాశికి 318 రెట్లు ఎక్కువ.
¤ ఇది తనచుట్టూ తాను అతివేగంగా తిరుగుతుంది.
¤ దీనికి ఉన్న ఉపగ్రహాలు సంఖ్య: 50
¤ దీని పరిభ్రమణ కాలం: 12 సంవత్సరాలు; అతిపెద్ద ఉపగ్రహం: గనిమెడ

 

శని:
¤ ఇది పసుపు వర్ణంలో కనిపిస్తుంది.
¤ దీని చుట్టూ వలయాలు ఉంటాయి.
¤ దీనికి ఉన్న ఉపగ్రహాల సంఖ్య: 53
¤ దీని పరిభ్రమణ కాలం: 29.5 సంవత్సరాలు; దీని ఉపగ్రహం టైటాన్ భూమిని పోలి ఉంటుంది.

 

యురేనస్:
¤ దీన్ని టెలిస్కోప్ సాయంతో మాత్రమే చూడగలం.
¤ ఇది శుక్రగ్రహం మాదిరి తూర్పు నుంచి పడమరకు పరిభ్రమిస్తుంది.
¤ దీని అక్షం అత్యధికంగా వంగి ఉంటుంది.
¤ దీని ఉపగ్రహాల సంఖ్య: 27; పరిభ్రమణ కాలం 84 ఏళ్లు.

 

నెప్ట్యూన్:
¤ ఇది సూర్యుడికి అత్యంత దూరంలో ఉంటుంది.
¤ దీని ఉపగ్రహాల సంఖ్య: 13
¤ దీని పరిభ్రమణకాలం: 165 సంవత్సరాలు

 

గ్రహాలు రెండు రకాలు
     1. అంతర గ్రహాలు (బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు)
     2. బాహ్య గ్రహాలు (బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్)
¤ సూర్యుడి వ్యాసం: 13,92,000 కి.మీ., భూమి వ్యాసం 12,756 కి.మీ.; చంద్రుడి వ్యాసం 3,474 కి.మీ.
¤ భూమికి, చంద్రుడికి మధ్యదూరం: 3,84,399 కి.మీ.
¤ భూమికి, సూర్యుడికి మధ్యదూరం 15 కోట్ల కి.మీ.
¤ 2006 ఆగస్టు 25న ఫ్లూటోను గ్రహం కాదు అని నిర్ణయించారు. కారణం (Clear the Neighbourhood) అనే నియమాన్ని ఉల్లంఘించడం.
¤ క్లియర్ ద నైబర్‌హుడ్ అంటే తోటి గ్రహాల కక్ష్యలకు ఆటంకం కలిగించరాదు.

 

ఆస్టరాయిడ్స్:
¤ చిన్న చిన్న గ్రహ శకలాలను ఆస్టరాయిడ్స్ అంటారు.
¤ ఇవి కుజుడు, బృహస్పతి గ్రహాల మధ్య ఉంటాయి.
¤ వీటిని టెలీస్కోప్ సహాయంతో మాత్రమే చూడగలం.

 

తోకచుక్కలు:
¤ ఇవి సూర్యుడి చుట్టూ అతి దీర్ఘవృత్తకార కక్ష్యల్లో పరిభ్రమిస్తుంటాయి.
¤ వీటి పరిభ్రమణ కాలం చాలా ఎక్కువ.
¤ తోకచుక్క సూర్యుడిని సమీపిస్తున్న కొద్ది దాని తోక పొడవు పెరుగుతుంది. దీని తోక ఎల్లపుడూ సూర్యుడికి వ్యతిరేక దిశలో ఉంటుంది.
¤ హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. 1986లో కనిపించింది. తర్వాత 2062లో కనిపిస్తుంది.
¤ షుమేకర్ - లేవి IX అనే తోకచుక్క 1994లో బృహస్పతిని ఢీకొంది.

 

ఉల్కలు - ఉల్కాపాతాలు:
¤ అంతరిక్షం నుంచి జారిపడే ఖనిజాలను ఉల్కలు అంటారు.
¤ ఇవి భూవాతావరణంలోకి ఎక్కువ వేగంతో ప్రవేశిస్తాయి.
¤ ఇవి గాలిలో ఉండే ఘర్షణ వల్ల బాగా వేడెక్కి మండుతాయి.
¤ ఇవి భూమిని చేరి పెద్ద గొయ్యిని ఏర్పరుస్తాయి. దీన్ని 'ఉల్కాపాతం' అంటారు.
¤ సౌరకుటుంబం ఏయే పదార్థాలతో ఏర్పడిందో తెలుసుకోవడానికి ఉల్కాపాతం ఉపయోగపడుతుంది.

 

కృత్రిమ ఉపగ్రహాలు:
¤ మానవ నిర్మిత ఉపగ్రహాలను కృత్రిమ ఉపగ్రహాలు అంటారు.
¤ భారత్ మొదటగా ప్రయోగించిన ఉపగ్రహం 'ఆర్యభట్ట'.
¤ ఇన్‌శాట్, ఐఆర్ఎస్, కల్పన - I, ఎడ్యుశాట్ లాంటివి భారత్ ప్రయోగించిన ఉపగ్రహాలు.
¤ వాతావరణ అధ్యయనానికి, రేడియో, టెలివిజన్ ప్రసారాలకు; టెలీకమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్ (నిర్ణీత దూరంలో ఉండి సమాచారం సేకరించడం), వైమానిక, సైనిక కార్యకలాపాలకు ఉపగ్రహాలను ఉపయోగిస్తారు.

 

నక్షత్ర రాశులు - రాశి చక్రం:
¤ నక్షత్ర వీధుల్లోని నక్షత్రాలను చిన్న చిన్న గుంపులుగా విభజించవచ్చు. ఈ చిన్న గుంపులను నక్షత్ర రాశులు అంటారు. వీటినే తారాగణం అని కూడా అంటారు.
¤ నక్షత్ర రాశులను వాటి ఆకారాలను బట్టి పన్నెండు పేర్లతో అనాదిగా పిలుస్తున్నారు. ఈ పన్నెండు రాశులను కలిపి 'రాశి చక్రం' అంటారు.
రాశులు - కనిపించే తేదీలు
    1. మేషం - మేక - మార్చి 21 - ఏప్రిల్ 19
    2. వృషభం - ఎద్దు - ఏప్రిల్ 20 - మే 20
    3. మిథునం - కవలలు - మే 21 - జూన్ 21
    4. కర్కాటకం - ఎండ్రకాయ - జూన్ 22 - జులై 22
    5. సింహం - సింహం - జులై 23 - ఆగస్టు 22
    6. కన్య - కన్య - ఆగస్టు 23 - సెప్టెంబరు 22
    7. తుల - త్రాసు - సెప్టెంబరు 23 - అక్టోబరు 23
    8. వృశ్చికం - తేలు - అక్టోబరు 24 - నవంబరు 21
    9. ధనస్సు - విల్లు - నవంబరు 22 - డిసెంబరు 21
    10. మకరం - మొసలి - డిసెంబరు 22 - జనవరి 21
    11. కుంభం - కుండ - జనవరి 22 - ఫిబ్రవరి 18
    12. మీనం - చేప - ఫిబ్రవరి 19 - మార్చి 20

 

అంతరిక్ష యానం
¤ రాకెట్‌లకు పలాయన వేగం, ఉపగ్రహానికి సమకూర్చడానికి 'బహుళ ప్రయోగ వ్యవస్థ' (Multistage Launching System) అనే ప్రక్రియను ఉపయోగిస్తారు.
¤ ఈ అంచెల పద్ధతిని 1903లో 'ద్సియోల్కల్ స్కి' అనే రష్యన్ ఉపాధ్యాయుడు సూచించాడు.
¤ మొదటిసారిగా రష్యన్ శాస్త్రవేత్తలు 1957, అక్టోబరు 4న స్పుత్నిక్ - I అనే మానవరహిత అంతరిక్ష నౌకను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు.
¤ ఈ అంతరిక్ష నౌకను ఉపయోగించి విశ్వంలోని నక్షత్రాలు, సూర్యుడు, ఇతర విశ్వాంతరాలు, భూ వాతావరణం గురించి అధ్యయనం చేయడానికి ప్రయత్నించారు.
¤ 1957 నవంబరులో స్పుత్నిక్ - II అనే అంతరిక్ష నౌకలో ఒక కుక్క (లైకా)ను పంపారు.
¤ ఈ అంతరిక్ష నౌకలో కుక్కను పంపడం వల్ల అంతరిక్షంలో జంతువుల హృదయ స్పందన, ఉష్ణోగ్రత లాంటివి అధ్యయనం చేశారు.
¤ 1958, జనవరి 31లో అమెరికా ఎక్స్‌ప్లోరర్ - I ను అంతరిక్షంలోకి పంపి అంతరిక్షం వయసు, భూమి అయస్కాంత క్షేత్రాన్ని కనుక్కుంది.
¤ 1961, ఏప్రిల్ 12న రష్యా దేశస్థుడు కల్నల్ యూరీగగారిన్ 'వస్తోక్' అనే అంతరిక్ష నౌక ద్వారా భూమి చుట్టూ ఒకసారి 89.34 నిమిషాల్లో పరిభ్రమించాడు.
¤ యూరీగగారిన్ మొదటి అంతరిక్ష వ్యోమగామి. రష్యాలో ఆస్ట్రోనాట్‌ను కాస్మోనాట్ అని అంటారు.
¤ 1961, మే 5న 'మెర్క్యూరీ - 3' అనే అంతరిక్ష నౌకలో 'అలెన్ షెపార్డ్' అనే వ్యోమగామి కూడా అంతరిక్షయానం చేసి భూమి చుట్టూ 89.34 నిమిషాలు పరిభ్రమించాడు.
¤ 1962లో టెలిస్టార్ (Telstar) అనే సమాచార కృత్రిమ ఉపగ్రహం పంపారు.
¤ 1963, జూన్ 16న 'వస్తోల్ - 6' అనే అంతరిక్ష నౌకలో లెఫ్టినెంట్ కల్నల్ 'వాలెంటినా తెరిష్కోవా' అనే మహిళ ఇతర వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలో 2 రోజుల, 22 గంటల 42 నిమిషాల్లో భూమి చుట్టూ 48 సార్లు ప్రదక్షిణ చేసింది.
¤ 1982, ఆగస్టు 19 రష్యన్ మహిళ ''స్వెత్లానా సవిత్‌స్కయా" సోయూజ్ టి.7లో; 1983, జూన్ 18న అమెరికన్ మహిళ 'స్యాలిరైడ్‌'లు అంతరిక్షయానం చేశారు.
¤ 1965 మార్చిలో 'అలెక్సి లియోహున్' 'వస్తోల్ - II' అనే రోదసీ నౌకలో పయనించి అంతరిక్షంలో కొద్దిసేపు నడిచాడు.
¤ 1965, జూన్ 3 'Gemini - 7' అంతరిక్ష నౌక ద్వారా అమెరికన్ వ్యోమగామి ఎడ్వర్డ్ హెచ్.వైట్ అంతరిక్ష నౌక నుంచి బయటకు వచ్చి అంతరిక్షంలో స్వేచ్ఛగా 21 నిమిషాలు తేలియాడాడు.
¤ 1969, జులై 21న అమెరికన్ 'నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్', 'ఎడ్విన్ అల్డ్రిన్' అనే ఇద్దరు వ్యోమగాములు అపోలో - II అనే అంతరిక్ష వాహక నౌక ద్వారా మొదటిసారి చంద్రుడిపై కాలు మోపారు.
¤ 1971లో రష్యన్‌లు 'శాల్యూట్' (Salyut) అనే అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
¤ 1972లో అమెరికన్‌లు 'స్కైలాబ్' (Skylab) అనే అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇది విఫలమై 1979లో భూమిపై పడిపోయింది.
¤ 1975లో అమెరికాకు చెందిన 'లైకింగ్ - I', 'లైకింగ్ - II' అనే అంతరిక్ష నౌకల ద్వారా అంగారక గ్రహంపై జీవరాశి లేదని నిరూపించారు.
¤ 1984 ఏప్రిల్ 3న రష్యా సహకారంతో భారత పౌరుడు 'రాకేష్ శర్మ' సోయజ్ - T - 11 అనే రోదసీ నౌక ద్వారా అంతరిక్షయానం చేశాడు.
¤ రష్యన్‌లు 1986, ఫిబ్రవరి 20న ఒక కొత్త అంతరిక్ష ప్రయోగశాల 'మిర్' (Mir) ను 'బైకనూర్ కాస్మోడ్రాం' నుంచి ప్రయోగించి 1982లో ఏర్పరిచిన 'శాల్యూట్‌'తో కలిపారు. మిర్ అనేది 'మల్టీ మాడ్యులర్ స్టేషన్'. ఈ స్టేషన్ ఆరు స్పేస్ క్రాఫ్ట్‌లను ఒకేసారి తన వద్ద ఉంచుకోగలుగుతుంది.
¤ 1986, మార్చి 13న సోయాజ్ T - 15 పై ఇద్దరు రష్యన్ వ్యోమగాములు 'మిర్‌'తో అనుసంధానమయ్యారు. ఈ అనుసంధానాన్ని ప్రపంచమంతటా దూరదర్శన్‌లో అప్పుడు ప్రసారం చేశారు. ఇది ప్రపంచ చరిత్రలో అద్భుతమైన విషయం.
¤ 1986, మే 30న పదకొండు దేశాల బృందం 'యూరోపియన్ అంతరిక్ష సంస్థ' దూర సమాచార ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టింది.
¤ 1989 మార్చిలో అట్లాంటిస్‌ను 'శుక్ర గ్రహం' పైకి పంపారు.
¤ 1990 అక్టోబరులో 'హబుల్ అంతరిక్ష దూరదర్శిని' సహాయంతో శని, ఫ్లూటోకు సంబంధించిన ఎంతో విలువైన ఛాయా చిత్రాలను భూమిపైకి పంపారు.
¤ భారతదేశంలో 1970 - 80 దశాబ్దంలో అంతరిక్ష యుగం ప్రారంభమైంది.
¤ 1975, ఏప్రిల్ 19న 'ఆర్యభట్ట' అనే ఉపగ్రహాన్ని రష్యా సహకారంతో పంపారు.
¤ రష్యా సహకారంతో తుంబా (కేరళ), శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్)ల వద్ద రాకెట్ లాంచింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేశారు.
¤ ఆర్యభట్ట తర్వాత భాస్కర I, II రోహిణి, ఐఆర్ఎస్, ఆపెల్, ఇన్‌శాట్ 1A 1B 1C మొదలైనవాటిని పంపారు.
¤ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఉపగ్రహ వాహక నౌక PSLV (Polar Satellite Launching Vehicle) ను 1994, అక్టోబరు 15న శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించారు.

 

గురుత్వాకర్షణ
 

¤ న్యూటన్ భూమి చుట్టూ చంద్రుని గమనాన్ని సమవృత్తాకార చలనం అనే భావన ఉపయోగించి వివరించాడు.
¤ ఏదైనా వస్తువు స్థిర వడితో వృత్తాకార మార్గంలో చలిస్తూ ఉంటే దాన్ని సమవృత్తాకార చలనం అంటారు.
¤ సమవృత్తాకార చలనంలో కోణీయ వేగం స్థిరం.

¤ వృత్తాకార చలనంలో వస్తుత్వరణం దాని వేగానికి లంబంగా ఉంటుంది.
¤ వేగ దిశలో మాత్రమే మార్పు తీసుకువచ్చే త్వరణాన్ని అభికేంద్ర త్వరణం అంటారు.
¤ కేంద్రం వైపు పనిచేసే ఫలిత బలాన్ని అభికేంద్రబలం అంటారు.
¤ వస్తువు వేగ దిశను మాత్రమే మార్చగల ఫలితబలాన్ని అభికేంద్ర బలం అంటారు.

ఉదా: సౌరకుటుంబంలో సూర్యునికి, భూమికి మధ్య ఉన్న ఆకర్షణ బలం.

 

న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ సిద్ధాంతం
¤ న్యూటన్ ఆపిల్ చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు, ఆపిల్ చెట్టు పై నుంచి పడిందనే విషయం ద్వారా గురుత్వాకర్షణ అనే భావనను కనుక్కున్నారు.
¤ భూ కేంద్రం నుంచి చంద్రునికి మధ్య ఉన్న దూరం 3,84,440 కి.మీ.
¤ భూమి చుట్టూ ఒక భ్రమణం పూర్తి చేసేందుకు చంద్రునికి 27.3 రోజులు లేదా 2.35 × 10 సెకన్లు పడుతుంది.
¤ భూ ఉపరితలానికి దగ్గరగా ఉండే వస్తువుల్లో త్వరణం 981 సెం.మీ./సెకన్గా ఉంటుంది. దీన్ని గెలీలియో కునుక్కున్నారు.
¤ విశ్వంలో ప్రతి వస్తువు మరొక వస్తువును ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ బలం ఆ రెండు వస్తువుల ద్రవవ్యరాశుల లబ్దానికి అనులోమానుపాతంలో, వాటి మధ్య దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. దిన్నే విశ్వగురుత్వాకర్షణ నియమం అంటారు.

¤ అనుపాతస్థిరాంకం Gను విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకం అంటారు.
¤ G విలువ 6.67 × 10 N.m /kg (లేదా) nm kg
¤ ఒక కిలో ద్రవ్యరాశి ఉన్న రెండు వస్తువులు ఒక మీటరు దూరంలో వేరు చేసి ఉన్నపుడు వాటి మధ్య పనిచేసే గురుత్వాకర్షణ బలం Gకు సమానం.
¤ భూమి ఉపరితలానికి దగ్గరగా భూమి చుట్టూ వృత్తాకార మార్గంలో చలించే ఉపగ్రహం పూర్తి భ్రమణం చేయడానికి 1 గంట 24.7 నిమిషాలు పడుతుంది.
¤ స్వేచ్ఛాపతన వస్తువు త్వరణం దాని ద్రవ్యరాశిపై ఆధారపడదు.
¤ భూమి ఆకర్షణ బలం మాత్రమే పని చేసే వస్తువులు స్వేచ్ఛాపతన వస్తువులు. స్థిరాంకం

¤ వస్తువుకు భూమి ఆకర్షణ వల్ల కలిగే త్వరణాన్ని గురుత్వత్వరణం అంటారు.
¤ చంద్రునిపై గురుత్వత్వరణం 1.67 m/sec2
¤ సూర్యునిపై గురుత్వత్వరణం 27.4 m/sec2
¤ స్వేచ్ఛాపతన వస్తువు పథ సమీకరణాలు
v = u + at
s = ut +  1/2 at2
v2 - u2 = 2as
¤ వస్తువును నిట్టనిలువుగా పైకి విసిరినప్పుడు అది చివరి సెకన్‌లో ప్రయాణించే దూరం ఎంత?
 s =  1/2 gt2
=  1/2 × 10 × 1 = 5 m
¤ ఊర్థ్వ దిశలో చలించే వస్తువు చివరి సెకనులో ప్రయాణించే దూరం = అథో దిశలో మొదటి సెకనులో ప్రయాణించే దూరం.
¤ 'u' వడితో నిట్టనిలువుగా భూ ఉపరితలం నుంచి పైకి విసిరిన వస్తువు భూమిని తిరిగి చేరడానికి పట్టే
సమయం T =  2u/g అవుతుంది. దీన్నే గమనకాలం అంటారు.

 

భారం (Weight)
¤ వస్తువుపై పనిచేసే భూమ్యాకర్షణ బలాన్ని 'భారం' అని అంటారు.
¤ దీన్ని న్యూటన్లలో కొలుస్తారు.
¤ ఒక కేజీ ద్రవ్యరాశి ఉన్న వస్తువు భారం - 9.8 న్యూటన్లు
¤ 2 కేజీల ద్రవ్యరాశి ఉన్న వస్తువు భారం - 19.6 న్యూటన్లు
¤ 10 కేజీల ద్రవ్యరాశి ఉన్న వస్తువు భారం - 98 న్యూటన్లు
¤ భారం ప్రదేశాన్ని బట్టి మారుతుంది.
¤ ద్రవ్యరాశి విశ్వంలో ఎక్కడైనా స్థిరంగా ఉంటుంది.
¤ భారం W = mg అవుతుంది.

 

గురుత్వకేంద్రం
¤ ఒక వస్తువు భారం మొత్తం ఏ బిందువు ద్వారా పనిచేస్తుందో ఆ బిందువును గురుత్వకేంద్రం అంటారు.
¤ గురుత్వకేంద్ర స్థానం వస్తువు భారం ఏ విధంగా వితరణ చెంది ఉందో దానిపైన ఆధారపడి ఉంటుంది.

¤ గురుత్వకేంద్రం వద్ద ద్రవ్యరాశి ఉండనవసరం లేదు.

 

స్థిరత్వం
¤ ఒక వస్తువు స్థిరత్వం దాని గురుత్వకేంద్రంపై ఆధారపడి ఉంటుంది.
¤ వస్తువు గురుత్వకేంద్రం ఎత్తు తక్కువగానూ, ఆధార వైశాల్యం ఎక్కువగా ఉంటే వస్తు స్థిరత్వం అధికంగా ఉంటుంది.
¤ వస్తువు గురుత్వకేంద్రం నుంచి గీసిన క్షితిజ లంబం దాని ఆధార వైశాల్యం ద్వారా వెళ్లినప్పుడు వస్తు స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది.
¤ ఓడలు స్థిరత్వం అనే సూత్రం పై ఆధారపడి పనిచేస్తాయి.

 

రచయిత: పి. ఢిల్లీబాబు
 

Posted Date : 29-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌