• facebook
  • whatsapp
  • telegram

ప్రకటనలు- తీర్మానాలు


సూచనలు (ప్ర.1 - 4): కింద ఒక ప్రకటన, రెండు తీర్మానాలు ఉన్నాయి. దత్తాంశ నిర్ధారణ ఆధారంగా సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.


1 ) i, II అనుసరించవు      2 ) , ii అనుసరిస్తాయి


3 ) iii మాత్రమే అనుసరిస్తుంది


4 )  i  మాత్రమే అనుసరిస్తుంది


1. ప్రకటన: భారతదేశ ఆర్థిక వ్యవస్థ అడవులపైనే ఆధారపడి ఉంది.


తీర్మానాలు: i. భారతదేశ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు అడవులను పరిరక్షించుకుంటే చాలు.


ii. భారతదేశ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు చెట్లను రక్షించాలి.


సాధన: భారతదేశ ఆర్థిక వ్యవస్థ అడవులపైనే ఆధారపడి ఉంది. కానీ, కేవలం అడవులపైనే ఆధారపడి ఉందని దాని అర్థం కాదు. కాబట్టి ii ప్రకటనను బలపరుస్తుంది. తీర్మానం ii సరైంది.


సమాధానం: 3


2. ప్రవచనం: ధైర్యవంతులను అదృష్టం వరిస్తుంది.


తీర్మానాలు: i. విజయ సాధనకు రిస్క్‌ తీసుకోవడం అవసరం.


ii. పిరికివారు వారి చావుకి ముందు అనేకసార్లు మరణిస్తారు.


సాధన: విజయ సాధనలో కష్టపడటం (రిస్క్‌ తీసుకోవడం) తప్పనిసరి. అప్పుడే విజయం మనల్ని వరిస్తుంది. కాబట్టి నిర్ధారణ i సరైంది. తీర్మానం ii ప్రవచనంతో పొంతన లేనిది. ఇది సరైంది కాదు.


సమాధానం: 4


3. ప్రకటన: చెన్నై, ముంబయి నగరాల మధ్య రోడ్డుమార్గంలో 800 కి.మీ. దూరం ఉంటుంది. సముద్రమార్గం ద్వారా ఆ దూరం 200 కి.మీ. తగ్గింది. దీంతో ఇంధన ఖర్చులు రూ.8 కోట్లు తగ్గాయి.


తీర్మానాలు: i.  రోడ్డు మార్గం ద్వారా అయ్యే ప్రయాణ ఖర్చు కంటే సముద్ర మార్గం ద్వారా అయ్యే ఖర్చు చాలా తక్కువ.


ii. ఇంధనం అధికమొత్తంలో పొదుపు అవుతుంది.


సాధన: ఇంధన ఖర్చు తగ్గినట్లు మాత్రమే ప్రకటన తెలియజేస్తోంది. ప్రయాణ ఖర్చుల ప్రస్తావన ప్రకటనలో లేదు. కాబట్టి తీర్మానం ii మాత్రమే సరైంది.


సమాధానం: 3


4. ప్రకటన: ఎడారుల్లో ఒంటె ద్వారా కాకుండా వేరేవిధంగా ఒక చోట నుంచి మరో ప్రదేశానికి వెళ్లడం అసాధ్యం.


తీర్మానాలు: i. ఎడారుల్లో ఒంటెలు సమృద్ధిగా ఉంటాయి.


ii. ఎడారుల్లో ఒంటె ద్వారా రవాణా సులభతర పద్ధతి.


సాధన: ఎడారుల్లో కాలినడకన, మోటారు వాహనాల్లో ప్రయాణించలేం. ఒంటెపై ప్రయాణించడం సులువైన పద్ధతి. కాబట్టి తీర్మానం ii ప్రకటన ప్రకారం సరైంది. తీర్మానం i తో ప్రకటనకు సంబంధం లేదు.


సమాధానం: 3


సూచనలు (ప్ర.7 - 9): కింద రెండు ప్రకటనలు, రెండు తీర్మానాలు ఇచ్చారు. దత్తాంశ నిర్ధారణ ఆధారంగా సరైన ఐచ్ఛికాన్ని నిర్ణయించండి.


7. ప్రకటన: ఉదయం పూట చేసే నడక హానికరం.


తీర్మానాలు: i. ఆరోగ్యవంతులైన ప్రజలు ఉదయం సమయంలో నడకకు వెళ్తారు.


ii. సాయంత్రం చేసే నడక హానికరం.


1) i మాత్రమే అనుసరిస్తుంది. 


2) ii మాత్రమే అనుసరిస్తుంది.

3) i, ii అనుసరిస్తాయి.     


4) i, ii అనుసరించవు.


సాధన: ఇచ్చిన ప్రకటన తప్పు. ఉదయం సమయంలో నడక ఎంతో ప్రయోజనకరం. కాబట్టి తీర్మానం-i సరైంది. సాయంత్రం పూట నడక హానికరమని మనం తీర్మానించలేం.


సమాధానం: 1


8. ప్రకటన: తల్లిదండ్రులు వారి పిల్లలకు ఉన్నతస్థాయి విద్యను అందించేందుకు ఎంత ఖర్చునైనా భరిస్తారు.


తీర్మానాలు: i. తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు మంచి స్కూలు ద్వారా ఉన్నత విద్య అందించి, వారు సంపూర్ణ అభివృద్ధిని పొందాలనే స్థిర అభిరుచిని కలిగి ఉంటారు.


ii. ఈ రోజుల్లో తల్లిదండ్రులందరూ బాగా డబ్బున్నవారే.


1) i మాత్రమే అనుసరిస్తుంది. 


2) ii మాత్రమే అనుసరిస్తుంది.


3) i, ii అనుసరిస్తాయి.   4) i,ii అనుసరించవు.


సాధన: ప్రకటన ప్రకారం, తీర్మానం-i సరైంది. ప్రకటనలో ఎక్కడా డబ్బున్నవారు, డబ్బులేని వారు అని వివరించలేదు. తీర్మానం-ii సరైంది కాదు.


సమాధానం:


9. ప్రకటన: పరీక్షల్లో ఫెయిల్‌ అవ్వడానికి కారణం స్కూల్‌కి రెగ్యులర్‌గా హాజరవ్వకపోవడమే. కొంతమంది రెగ్యులర్‌ స్టూడెంట్స్‌ కూడా ఫెయిల్‌ అయ్యారు.


తీర్మానాలు:


i. రెగ్యులర్‌గా స్కూల్‌కి హాజరైన వారంతా పాస్‌ అవుతారు.


ii. ఫెయిలైన వారంతా రెగ్యులర్‌గా స్కూల్‌కి హాజరైనవారే.


1) i మాత్రమే అనుసరిస్తుంది.      


2) ii మాత్రమే అనుసరిస్తుంది.


3) i, ii అనుసరిస్తాయి.     


4) i, ii అనుసరించవు.


సాధన: 


ప్రకటన ప్రకారం తీర్మానాలు-i, ii 


తప్పు. రెగ్యులర్‌ స్టూడెంట్స్‌ కూడా ఫెయిల్‌ అయినట్లు ప్రకటనలో ఇచ్చారు.ఫెయిల్‌ అవ్వడానికి కారణం రెగ్యులర్‌గా హాజరుకాకపోవడమే అని కూడా చెప్పారు.    


సమాధానం: 4


రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రకటనలు, తీర్మానాలు ఇచ్చినప్పుడు..


సూచనలు (ప్ర.5 - 6): కింది ప్రకటనలు, తీర్మానాల ఆధారంగా సరైన సమాధానాన్ని ఎంచుకోండి.


5. ప్రకటన:


1. ప్రవీణ్‌ కుటుంబంలోని సభ్యులందరూ నిజాయితీపరులే.


2. ప్రవీణ్‌ కుటుంబంలోని కొందరు నిరుద్యోగులు.


3. కొంతమంది ఉద్యోగస్తులు నిజాయితీపరులు కాదు.


4. కొంతమంది నిజాయితీపరులు నిరుద్యోగులు.


తీర్మానాలు:


i. ప్రవీణ్‌ కుటుంబంలోని సభ్యులందరూ ఉద్యోగస్తులే.


ii. ప్రవీణ్‌ కుటుంబంలోని ఉద్యోగస్తులందరూ నిజాయితీపరులే.


iii. ప్రవీణ్‌ కుటుంబంలోని నిజాయితీపరులందరూ నిరుద్యోగులే.

iv. ప్రవీణ్‌ కుటుంబంలోని ఉద్యోగస్తులందరూ నిజాయితీ లేనివారే.


1 ) i, ii, iii మాత్రమే సరైనవి.  2 ) ii మాత్రమే సరైంది. 


3 )iii మాత్రమే సరైంది.      4 ) ii మాత్రమే సరైంది.


5 ) అన్నీ సరైనవే.


సాధన: ప్రవీణ్‌ కుటుంబంలోని సభ్యులంతా నిజాయితీపరులే. కాబట్టి, ప్రవీణ్‌ కుటుంబంలోని ఉద్యోగస్తులందరూ నిజాయితీపరులే. తీర్మానం-ii సరైంది, తీర్మానం-i తప్పు.


ప్రవీణ్‌ కుటుంబంలోని కొందరు నిరుద్యోగులు. తీర్మానాలు - iii, iv ప్రకటన ప్రకారం సరైనవి కావు.


సమాధానం: 4


6. ప్రకటన:


1. కొంతమంది గణితశాస్త్త్ర్రంలో సబ్జెక్టుపరంగా బలహీనులు.


2. గణితశాస్త్త్ర్రంలో బలహీనులంతా సంగీత విద్వాంసులు.


తీర్మానాలు:


i. కొంతమంది సంగీత విద్వాంసులు గణితశాస్త్త్ర్రంలో బలహీనులు.


ii. సంగీత విద్వాంసులంతా గణితశాస్త్త్ర్రంలో బలహీనులే.


iii. గణితశాస్త్త్ర్రంలో అందరూ బలహీనులే.


1) i, ii. మాత్రమే సరైనవి.     2) i, ii మాత్రమే సరైనవి.


3) i మాత్రమే సరైంది             4) అన్నీ సరైనవే.


5) ఏదీకాదు.


సాధన: గణితశాస్త్త్ర్రంలో బలహీనులంతా సంగీత విద్వాంసులే. కానీ సంగీత విద్వాంసులంతా గణితశాస్త్త్ర్రంలో బలహీనులు కారు. కొంతమంది సంగీత విద్వాంసులు మాత్రమే గణితశాస్త్రంలో బలహీనులు. కాబట్టి, తీర్మానం-i సరైంది. తీర్మానం-ii, 


తీర్మానం iii తప్పు. 

సమాధానం: 3


రచయిత

బూసర గణేష్

Posted Date : 27-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌