1. కిందివాటిలో ఆమ్ల స్వభావాన్ని కలిగింది?
1) ఆస్పిరిన్ 2) కాస్టిక్ సోడా
3) కాస్టిక్ పొటాష్ 4) క్లోరోక్విన్
జ: ఆస్పిరిన్
2. ఖనిజ ఆమ్లాలు మంచి ......
జ: విద్యుత్ వాహకాలు
3. కిందివాటిలో బలహీన ఆమ్లానికి ఉదాహరణ?
జ: ఎసిటిక్ ఆమ్లం
4. కిందివాటిలో కర్బన ఆమ్లం ఏది?
1) నైట్రిక్ ఆమ్లం 2) ఎసిటిక్ ఆమ్లం
3) ఫార్మిక్ ఆమ్లం 4) 2, 3
జ: 2, 3
5. ఆమ్లాలను నీటిలో కరిగిస్తే, విడుదలయ్యే అయాన్ ఏది?
జ: ప్రోటాన్
6. నిమ్మపండు, నారింజ, బత్తాయి మొదలైన ఫలాల్లో ప్రధానంగా లభించే ఆమ్లం ఏది?
జ: సిట్రిక్ ఆమ్లం
7. ఒక ఎలక్ట్రాన్ జంటను స్వీకరించే రసాయన పదార్థాన్ని ఏమంటారు?
జ: ఆమ్లం
8. ఆమ్లాలు నీలి లిట్మస్ కాగితాన్ని ఏ రంగులోకి మారుస్తాయి?
జ: ఎరుపు
9. DAP ఎరువు రసాయన నామం?
జ: డై అమ్మోనియం ఫాస్ఫేట్
10. కింది అంశాలను జతపరచండి.
ఆమ్లం రసాయన ఫార్ములా
a) నైట్రిక్ ఆమ్లం i) H2SO4
b) సల్ఫ్యూరిక్ ఆమ్లం ii) H3PO4
c) ఫాస్ఫారిక్ ఆమ్లం iii) HNO3
జ: a-iii, b-i, c-ii
11. కింది అంశాలను జతపరచండి.
జాబితా - I జాబితా - II
a) ట్రైనైట్రోటోలీన్ (TNT) i) నిమ్మ ఉప్పు
b) హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం ii) ఎచ్చింగ్
c) సిట్రిక్ ఆమ్లం iii) పేలుడు పదార్థం
జ: a-iii, b-ii, c-i
12. ఆమ్లం అనే పదం ‘ఎసిడస్’ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ‘ఎసిడస్’ అంటే?
జ: పులుపు
13. కింది ఏ సూచికను క్షార ద్రావణాలు గులాబీ రంగులోకి మారుస్తాయి?
జ: ఫినాఫ్తలీన్
14. ఆమ్లం + క్షారం

జ: లవణం, నీరు
15. కడుపులో ఎసిడిటీని తగ్గించడానికి కింది ఏ క్షారాన్ని ఉపయోగిస్తారు?
1) సోడియం హైడ్రాక్సైడ్ 2) పొటాషియం హైడ్రాక్సైడ్
3) మెగ్నీషియం హైడ్రాక్సైడ్ 4) అమ్మోనియం హైడ్రాక్సైడ్
16. కింది అంశాలను జతపరచండి.
క్షారం ప్రత్యామ్నాయ నామం
a) మిల్క్ ఆఫ్ లైమ్ i) పొటాషియం హైడ్రాక్సైడ్
b) మిల్క్ ఆఫ్ ii) సోడియం
మెగ్నీషియా హైడ్రాక్సైడ్
c) కాస్టిక్‌సోడా iii) మెగ్నీషియం హైడ్రాక్సైడ్
d) కాస్టిక్ పొటాష్ iv) కాల్షియం హైడ్రాక్సైడ్
జ: a-iv, b-iii, c-ii, d-i
17. కిందివాటిలో సహజ సూచిక ఏది?
1) ఎర్ర క్యాబేజి రసం 2) పసుపు నీరు
3) 1, 2 4) మిథైల్ ఆరెంజ్
జ: 1, 2
18. సాధారణ ఉప్పును శుద్ధిచేసే ప్రక్రియలో ఉపయోగించే ఆమ్లం?
జ: హైడ్రోక్లోరిక్ ఆమ్లం
19. ఆహార పదార్థాలను నిల్వచేయడానికి ఉపయోగించే ఆమ్లం?
జ: బెంజోయిక్ ఆమ్లం
20. ప్రతిపాదన (A): తగరపు పూత లేని ఇత్తడి, రాగి పాత్రల్లో పచ్చళ్లు, పుల్లటి ఆహార పదార్థాలను నిల్వ ఉంచకూడదు.
కారణం (R): ఆహార పదార్థాల్లోని ఆమ్లాలు లోహపు పాత్రలతో చర్య జరిపి ఆహారాన్ని కలుషితం చేస్తాయి.
జ: A, R రెండూ నిజం, Aకు R సరైన వివరణ.
21. ప్లాటినం లోహాన్ని కరిగించే సామర్థ్యం దేనికి ఉంది?
జ: ద్రవరాజం, ఆక్వారీజియా
22. నూడిల్స్ తయారీలో పుల్లటి రుచి కోసం ఉపయోగించే వెనిగర్‌లో ఉండే ఆమ్లం?
జ: ఎసిటిక్ ఆమ్లం
23. ‘విలీన ఆమ్లం’ లేదా ‘సజల ఆమ్లం’ అంటే?
జ: అధిక నీటి శాతాన్ని కలిగింది.
24. ఎర్రచీమలు, తేనెటీగలు కుట్టినప్పుడు వాటి కొండి నుంచి విడుదలయ్యే ఆమ్లం ఏది?
జ: ఫార్మిక్ ఆమ్లం
25. యాంటీసెప్టిక్ గుణం కలిగిన బోరిక్ ఆమ్లం రసాయన ఫార్ములా.....
జ: H3BO3
26. కిందివాటిలో కార్బాక్సిలిక్ ఆమ్లానికి ఉదాహరణ?
1) ఆస్పిరిన్ 2) ఐబుప్రొఫెన్
3) 1, 2 4) ఫినాల్
జ: 1, 2
27. అధిక విద్యుత్ వాహకతను ప్రదర్శించేవి?
జ: బలమైన ఆమ్లాలు, బలమైన క్షారాలు
28. లోహ ఆక్సైడ్‌లు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి?
జ: క్షార స్వభావం
29. కిందివాటిలో సరికానిది ఏది?
1) అల్యూమినియం హైడ్రాక్సైడ్ - యాంటాసిడ్
2) కాల్షియం ఆక్సైడ్ - నిర్జలీకరణి
3) ద్రవ అమ్మోనియా - శీతలీకరణి
4) కాల్షియం హైడ్రాక్సైడ్ - సబ్బుల తయారీ
జ: కాల్షియం హైడ్రాక్సైడ్ - సబ్బుల తయారీ
30. ఆమ్లం, క్షారంతో చర్యజరిపి లవణం, నీటిని ఏర్పరిచే ప్రక్రియను ఏమంటారు?
జ: తటస్థీకరణం
31. కిందివాటిలో క్షారం కానిది?
జ: సోడియం క్లోరైడ్
32. ‘వంట సోడా’ రసాయన ఫార్ములా.......
జ: NaHCO3
33. కింది అంశాలను జతపరచండి.
pH విలువ ద్రావణ స్వభావం
a) 7 i) ఆమ్ల ద్రావణం
b) > 7 ii) తటస్థ ద్రావణం
c) < 7 iii) క్షార ద్రావణం
జ: a-ii, b-iii, c-i
34. ‘పాలరాయి’ రసాయన నామం ఏమిటి?
జ: కాల్షియం కార్బొనేట్
35. నత్రజని ఎరువుల తయారీలో దేన్ని ఉపయోగిస్తారు?
జ: అమ్మోనియా
36. కింది వాటిలో సరైంది?
1) జిప్సం - ఎరువులు
2) సోడియం కార్బొనేట్ - వంటసోడా
3) కాల్షియం కార్బొనేట్ - టపాసులు
4) బోరాక్స్ - ద్రవబ్లీచ్
37. కిందివాటిలో బోరాక్స్ ఉపయోగాలు ఏవి?
జ: శిలీంద్రనాశిని, కీటకనాశిని, యాంటీసెప్టిక్
38. సోడానీరు pH విలువ ఎంత?
జ: 2.4
39. పాల pH విలువ ఎంత?
జ: 6.6 - 6.8
40. వర్షపు నీటి pH విలువ దేని కంటే తక్కువగా ఉంటే ‘ఆమ్లవర్షం’ అంటారు?
జ: 5.6
41. ద్రావణానికి కొంత ఆమ్లం లేదా క్షారాన్ని కలిపితే pH విలువలో మార్పును నిరోధించే వాటిని ఏమంటారు?
జ: బఫర్ ద్రావణాలు
42. రక్తం pH విలువను స్థిరంగా ఉంచే బఫర్ ద్రావణం దేని మిశ్రమం?
జ: కార్బోనిక్ ఆమ్లం + బైకార్బొనేట్ అయాన్
43. లోహాలతో ఆమ్లం చర్య జరిపినప్పుడు విడుదలయ్యే వాయువు ఏది?
జ: హైడ్రోజన్
44. కింది అంశాలను జతపరచండి.
ఆమ్లం ఉపయోగం
a) గంధకీకామ్లం i) పేలుడు పదార్థాలు
b) నత్రికామ్లం ii) జఠర రసం
c) హైడ్రోక్లోరిక్ iii) లెడ్ నిక్షేప
ఆమ్లం బ్యాటరీలు
జ: a-iii, b-i, c-ii
45. నొప్పి నివారిణిగా పనిచేసే ఆస్పిరిన్ మందు రసాయన నామం ఏమిటి?
జ: సాలిసిలిక్ ఆమ్లం
46. దంతాలపై ఉండే దృఢమైన పింగాణీ పొర దేనితో తయారవుతుంది?
జ: కాల్షియం ఫాస్ఫేట్
47. కిందివాటిలో ఖనిజ ఆమ్లం కానిది ఏది?
1) సల్ఫ్యూరిక్ ఆమ్లం 2) సిట్రిక్ ఆమ్లం
3) ఎసిటిక్ ఆమ్లం 4) 2, 3
జ: 2, 3
48. కిందివాటిలో ఆమ్ల ఆక్సైడ్ ఏది?
1) కార్బన్ డైఆక్సైడ్ 2) సల్ఫర్ డైఆక్సైడ్
3) 1, 2 4) కాల్షియం ఆక్సైడ్
49. కాల్షియం హైడ్రాక్సైడ్ రసాయన ఫార్ములా?
జ: Ca(OH)2
50. pH స్కేలును ప్రతిపాదించిన శాస్త్రవేత్త?
జ: సొరెన్‌సెన్
51. కిందివాటిలో pH విలువ 7 కంటే తక్కువున్న ద్రావణం ఏది?
1) సోడానీరు 2) సబ్బునీరు
3) బట్టల సోడా ద్రావణం
4) సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం
జ: సోడానీరు
52. నిమ్మరసం pH విలువ?
జ: 2.2 - 2.4