• facebook
  • whatsapp
  • telegram

అలంకారాలు

మాదిరి ప్రశ్నలు


1. ‘నురువులు పరగంగ గంగ’ లోని అలంకారం? 
1) యమకం                        2) ఛేకానుప్రాసాలంకారం
3) లాటానుప్రాసాలంకారం       4) అంత్యానుప్రాసాలంకారం
2. విరులలో నునుతావి తెరలు లేచినయట్లు ఆడెనమ్మా శివుడు. ఈ వాక్య భాగంలోని అలంకారం? 
1) ఉపమాలంకారం           2) ఉత్ప్రేక్షాలంకారం    
3) స్వభావోక్తి అలంకారం     4) రూపకాలంకారం
3. ‘నెమ్మిదన పింఛమ్ము నెమ్మి విప్పిన యట్లు’ అనేది ఏ అలంకారానికి ఉదాహరణ? 
1) వృత్యనుప్రాసాలంకారం     2) లాటానుప్రాసాలంకారం
3) యమకం                     4) ఛేకానుప్రాసాలంకారం
4. అభినుతేందు చంద్రికాంభోధి యఖిలంబు, నీట నిట్టలముగ నిట్టవొడిచె - దీనిలోని అలంకారం?     
1) శ్లేషాలంకారం             2) అర్థాంతరన్యాసాలంకారం
3) ఉత్ప్రేక్షాలంకారం         4) రూపకాలంకారం
5. అనుచున్‌ జేవుఱు మీఱు కన్నుగవతో, నాప్పందితోష్ఠంబుతో, ఘనహుంకారముతో నటద్భ్రుకుటితో గర్జిల్లు నా భోన్‌సలేశుని జూడన్‌. ఈ పద్యభాగంలో ఉన్న అలంకారం ఏది? 
1) స్వభావోక్తి అలంకారం      2) ఉపమాలంకారం
3) రూపకాలంకారం            4) అతిశయోక్తి అలంకారం
6. ‘మండే ఎండ నిప్పుల కొలిమా అన్నట్లున్నది’ లోని అలంకారం? 
1) ఉపమాలంకారం   2) ఉత్ప్రేక్షాలంకారం    3) ఉల్లేఖాలంకారం     4) శ్లేషాలంకారం
7. వాక్యాలకు బింబ, ప్రతిబింబత్వం చెప్పడంలోని అలంకారం?
1) వ్యాజస్తుతి     2) దృష్టాంతాలంకారం    3) రూపకాలంకారం      4) ఉపమాలంకారం
8. వాడు తాటిచెట్టంత పొడవున్నాడు?
1) అతిశయోక్తి అలంకారం    2) ఉపమాలంకారం  3) ఉత్ప్రేక్షాలంకారం    4) రూపంకాలంకారం
9. భాగవతమున భక్తి 
భారతంలో యుక్తి 
రామాయణమున రక్తి లోని అలంకారం 
1) ముక్తపదగ్రస్తాలంకారం   2) యమకం   3) అంత్యానుప్రాసాలంకారం    4) ఛేకానుప్రాసాలంకారం
10. గొప్పవారితో ఉన్న సామాన్యులను గౌరవిస్తారు. పూవులతో పాటు దారాన్ని కూడా సిగనెక్కిస్తారు కదా! ఇందులోని అలంకారం ఏది? 
1) దృష్టాంతాలంకారం         2) అతియోశయోక్తి అలంకారం 
3) స్వభావోక్తి అలంకారం      4) అర్థాంతరన్యాసాలంకారం
11. ‘చిటపట చినుకులు టపటప మని పడుతున్న వేళ’ లోని అలంకారాన్ని గుర్తించండి. 
1) ఛేకానుప్రాసాలంకారం    2) వృత్యనుప్రాసాలంకారం 
3) యమకం                  4) అంత్యానుప్రాసాలంకారం
12. ఊహ ప్రధానంగా ఉండే అలంకారం? 
1) అర్థాంతరన్యాసాలంకారం         2) రూపకాలంకారం 
3) ఛేకానుప్రాసాలంకారం             4) ఉత్ప్రేక్షాలంకారం
13. నరసింహుని చూడు చూడ్కులు చూడ్కులు. ఈ వాక్యంలోని అలంకారం? 
1) ఛేకానుప్రాసాలంకారం         2) లాటానుప్రాసాలంకారం 
3) రూపకాలంకారం               4) ఉత్ప్రేక్షాలంకారం
14. నానార్థాలు ప్రధానంగా ఉండే అలంకారం? 
1) లాటానుప్రాసాలంకారం     2) ఉపమాలంకారం 
3) శ్లేషాలంకారం                 4) దృష్టాంతాలంకారం
15. ‘కుటుంబానికి తండ్రే హిమగిరి శిఖరం’ లోని అలంకారం? 
1) రూపకాలంకారం     2) ఉత్ప్రేక్షాలంకారం      3) అర్థాంతరన్యాసాలంకారం     4) ఉల్లేఖాలంకారం
16. ‘మా పొలంలో బంగారం పండింది’. ఈ వాక్యంలోని అలంకారం? 
1) ఉపమాలంకారం      2) రూపకాలంకారం    3) అతిశయోక్తి అలంకారం       4) దృష్టాంతాలంకారం
17. దృష్టాంతాలంకారంలో ఏది ప్రధానం? 
1) బింబదృతి భావం     2) ప్రతిబింబ భావం     3) సాదృశ్య భావం     4) అనన్య భావం
18. నల్లపిల్లి మెల్లగా ఇల్లు చొచ్చి చల్లని పాలు గ్రోలింది - ఇందులోని అలంకారం? 
1) వృత్యనుప్రాసాలంకారం      2) ఛేకానుప్రాసాలంకారం     3) అంత్యానుప్రాసాలంకారం   4) లాటానుప్రాసాలంకారం
19. భాస్కర శతకంలో ఉండే అలంకారం? 
1) ఉత్ప్రేక్షాలంకారం     2) ఉల్లేఖాలంకారం     3) దృష్టాంతాలంకారం     4) రూపకాలంకారం
20. విశేష సామాన్యాలు ఉండే అలంకారం? 
1) ఉపమాలంకారం         2) అర్థాంతరన్యాసాలంకారం 
3) రూపకాలంకారం         4) అతిశయోక్తి అలంకారం
21. ‘నందనందనుడు ఆనందంగా నర్తించెను’ లోని అలంకారం? 
1) ఛేకానుప్రాసాలంకారం    2) లాటానుప్రాసాలంకారం 
3) యమకాలంకారం         4) ముక్తపదగ్రస్తాలంకారం
22. ‘మానవా నీ ప్రయత్నం మానవా’ లోని అలంకారం? 
1) వృత్యనుప్రాసాలంకారం       2) యమకాలంకారం 
3) ఛేకానుప్రాసాలంకారం        4) అతిశయోక్తి అలంకారం
23. ఒక తల త్రుంచిన శివుడు నింద్యుడు గాని జీవులకు దుఁఖముననుభవించునట్లు చేసిన బ్రహ్మ నింద్యుడుగాడు. ఈ వాక్యంలోని అలంకారం? 
1) వ్యాజనిందాలంకారం     2) దీపకాలంకారం      3) దృష్టాంతాలంకారం     4) సందేహాలంకారం
24. ‘సజ్జనుల మనసు కొండల వలె కఠినము, పువ్వువలె కోమలము’. ఈ వాక్యంలోని అలంకారం? 
1) అర్థాంతరన్యాసాలంకారం     2) అనన్వయాలంకారం 
3) వ్యతిరేకాలంకారం              4) నిందాస్తుతి అలంకారం
25. తాపముచే సూర్యుడు ప్రతాపముచే రాజు ప్రకాశించుచున్నారు. ఇందులో ఉండే అలంకారం?  
1) వ్యాజనిందాలంకారం    2) అతిశయోక్తి అలంకారం 
3) విషమాలంకారం         4) దీపకాలంకారం 
26. గోరంతలను కొండంతలు చేసి చెప్పడం ఏ అలంకారంలో ఉంటుంది? 
1) అతిశయోక్తి అలంకారం         2) ఉత్ప్రేక్షాలంకారం 
3) ఉల్లేఖాలంకారం         4) రూపకాలంకారం
27. ‘కుముదినీ రాగ రసబద్ధ గుళిక యనగ’. ఈ వాక్యంలోని అలంకారం? 
1) ఉపమాలంకారం     2) రూపకాలంకారం     3) ఉత్ప్రేక్షాలంకారం     4) దీపకాలంకారం 
28. ‘హరిని భజియించు హస్తములు హస్తములు’. ఇది ఏ అలంకారానికి ఉదాహరణ? 
1) వృత్యనుప్రాసాలంకారం         2) ఛేకానుప్రాసాలంకారం 
3) అతిశయోక్తి అలంకారం         4) లాటానుప్రాసాలంకారం
29. కిందివాటిలో రూపకాలంకారాన్ని గుర్తించండి. 
1) మా చెల్లెలు తాటి చెట్టంత పొడవు ఉంది.    2) మౌనిక తేనె పలుకులు అందరికీ ఇష్టమే.
3) మా అన్న చేసే వంట నలభీమపాకం.        4) నీవేల వచ్చెదవు.
30. ‘సైనిక నికాయము కాయము మరిచి పోరు చున్నది’ లోని అలంకారం? 
1) యమకాలంకారం              2) ముక్తపదగ్రస్తాలంకారం 
3) అర్థాంతరన్యాసాలంకారం     4) ఛేకానుప్రాసాలంకారం
31. ‘భంగి’ అనేది? 
1) ఉపమానం    2) ఉపమేయం   3) ఉపమావాచకం    4) సమాన ధర్మం 
32. తాత్పర్య భేదం ఏ అలంకారంలో ఉంటుంది? 
1) వృత్యనుప్రాసాలంకారం      2) లాటానుప్రాసాలంకారం 
3) ఛేకానుప్రాసాలంకారం       4) యమకాలంకారం


సమాధానాలు

1-2; 2-1; 3-3; 4-4; 5-1; 6-2; 7-2; 8-1; 9-3; 10-4; 11-2; 12-4; 13-2; 14-3; 15-1; 16-3; 17-1; 18-1; 19-3; 20-2; 21-1; 22-4; 23-1; 24-3; 25-4; 26-1; 27-3; 28-4; 29-2; 30-1; 31-3; 32-2.

రచయిత: సూరె శ్రీనివాసులు 

Posted Date : 01-02-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌