• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్ అవతరణ - విశాలాంధ్ర ఉద్యమం

 

1. నిజాం రాజ్య పాలన అంతం కావడానికి ముందే విశాలాంధ్ర ఉద్యమాన్ని ప్రచారం చేసిన పార్టీ?
జ: కమ్యూనిస్టు పార్టీ
 

2. హైదరాబాదుపై పోలీసు చర్య (ఆపరేషన్ పోలో) నిర్వహించిన నెల?
జ: సెప్టెంబరు
 

3. 1951 బెంగళూరు భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో విశాలాంధ్రను ప్రస్తావించిన‌వారు?
జ: అయ్యదేవర కాళేశ్వర రావు

4. విశాలాంధ్రలో ప్రజారాజ్యం గ్రంథ రచయిత ఎవరు?
జ: పుచ్చలపల్లి సుందరయ్య
 

5. "తెలంగాణతో కూడిన ఆంధ్ర రాష్ట్ర అవతరణనే తమ ధ్యేయం" అని ప్రకటించిన పార్టీ
జ: ఆంధ్ర కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ
 

6. తెలుగు మాట్లాడే ప్రజలందరూ కలిసిపోయే అవకాశం ఉందని 1937లోనే చెప్పిన‌వారు?
జ: మామిడిపూడి వెంకట రంగయ్య

7. 1949లో విశాలాంధ్ర మహాసభను ఎవరు ఏర్పాటు చేశారు?
జ: అయ్యదేవర కాళేశ్వర రావు
 

8. విశాలాంధ్ర మహాసభ తొలి సమావేశం ఏ ప్రాంతంలో జరిగింది?
జ: వరంగల్
 

9. విశాలాంధ్ర ద్వితీయ సమావేశాలు జరిగిన ప్రాంతం
జ: హైదరాబాదు
 

10. విశాలాంధ్ర మహాసభ తొలి సమావేశాలు ఎప్పుడు జరిగాయి?
జ: 1950
 

11. విశాలాంధ్ర మహాసభ ద్వితీయ సమావేశాలు ఎప్పుడు జరిగాయి?
జ: 1954
 

12. విశాలాంధ్ర ఏర్పాటు ఎంతో అవసరం అని 1942లో చెప్పింది ఎవరు?
జ: శ్రీ విజయ
 

13. రెండో విశాలాంధ్ర మహాసభలో విశాలాంధ్ర వాదాన్ని బలపరిచింది ఎవరు?
జ: రామానంద తీర్థ
 

14. "ప్రత్యేక తెలంగాణ బలహీనమవుతుంది, విశాలాంధ్ర రిపబ్లిక్ సమైక్యానికి దోహదపడుతుంది" అని రెండో విశాలాంధ్ర మహాసభలో పలికిన వ్యక్తి?
జ: రామానందతీర్థ

15. విశాలాంధ్ర ఉద్యమాన్ని ప్రచారం చేసిన తెలంగాణ పత్రిక 
     1) ఆంధ్రజనత         2) తెలుగుదేశం         3) కాకతీయ         4) అన్నీ
జ: 4(అన్నీ)
 

16. రాష్ట్రాల పునర్విభజన సంఘాన్ని నియమిస్తున్నట్లు జవహర్‌లాల్ నెహ్రూ లోక్‌సభలో ఎప్పుడు ప్రకటించారు?
జ: 1953, డిసెంబరు 22
 

17. రాష్ట్రాల పునర్విభజన సంఘం అధ్యక్షుడు ఎవరు?
జ: సయ్యద్ ఫజుల్ అలీ
 

18. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వాయిదా వేయాలని సూచించిన కమిటీ ఏది?
జ: జె.వి.పి. కమిటీ
 

19. 1948 హైదరాబాద్ పోలీస్ చర్యనాటి సైన్యాధిపతి ఎవరు?
జ: జె.ఎన్. చౌదరి
 

20. 1949లో హైదరాబాద్ పౌర ప్రభుత్వానికి నాయకుడు ఎవరు?
జ: ఎం.కె. వెల్లోడి
 

21. 1952 సాధారణ ఎన్నికల్లో హైదరాబాద్ ముఖ్యమంత్రిగా ఎన్నికైంది ఎవరు?
జ: బూర్గుల రామకృష్ణా రావు

22. 1949లో విశాలాంధ్ర మహాసభను అయ్యదేవర కాళేశ్వర రావు ఎక్కడ ప్రారంభించారు?
జ: విజయవాడ
 

23. 1949లో హైదరాబాద్‌ను సందర్శించి "బహుభాషా రాష్ట్రంగా కొనసాగడమే మంచిది" అని పలికిన‌వారు?
జ: సి. రాజగోపాలాచారి

24. విశాలాంధ్రలో తమ పార్టీ అధికారం పొందే అవకాశం అధికమని భావించి విశాలాంధ్రను కోరిన పార్టీ
జ: కమ్యూనిస్టు పార్టీ
 

25. 1953 నాటి హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎవరు?
జ: కె.వి. రంగారెడ్డి
 

26. కిందివారిలో రాష్ట్రాల పునర్విభజన సంఘంతో సంబంధం లేని వ్యక్తి ఎవరు?
        1) జవహర్‌లాల్ నెహ్రూ         2) కె.ఎం. ఫణిక్కర్         3) హెచ్.ఎన్. కుంజ్రూ         4) పన్నాలాల్
జ: 4(పన్నాలాల్)
 

27. రాష్ట్రాల పునర్విభజన సంఘం తన నివేదికను ఎప్పుడు ఇచ్చింది?
జ: 1955, సెప్టెంబరు 30
 

28. 1953లో విశాలాంధ్ర ఉద్యమాన్ని ఆంధ్రుల సామ్రాజ్య వాదంగా విమర్శించింది ఎవరు?
జ: జవహర్‌లాల్ నెహ్రూ

29. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని బలపరచిన హైదరాబాద్ ప్రజాసోషలిస్టు పార్టీ నాయకుడు?
జ: మహదేవ్ సింగ్
 

30. "వాదనంతా విశాలాంధ్రకు అనుకూలంగా, తీర్పు మాత్రం ప్రత్యేక తెలంగాణను అనుకూలంగా ఉంది" అని రాష్ట్రాల పునర్విభజన కమిటీ నివేదికను విమర్శించింది ఎవరు?
జ: తెన్నేటి విశ్వనాథం

Posted Date : 03-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌