• facebook
  • whatsapp
  • telegram

రక్త సంబంధాలు

పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే వివిధ పోటీపరీక్షల్లో జనరల్ స్టడీస్‌కు చెందిన 'విశ్లేషణా సామర్థ్యం' విభాగం నుంచి 'రక్తసంబంధాలు' అనే అంశంపై ప్రశ్నలు వస్తాయి. ఈ అంశానికి చెందిన ఒక విభాగం 'పజిల్స్‌తో కూడిన రక్తసంబంధాలు'. అభ్యర్థులు ఈ సమస్యలను సులువుగా సాధించాలంటే... మానవసంబంధాలపై పరిజ్ఞానం అవసరం. ప్రశ్నలో ఇచ్చిన సంబంధాలను మన వ్యక్తిగత సంబంధీకులుగా ఊహించుకోవాలి. అంతేకాకుండా సమస్యలోని సంబంధాలను చిత్ర రూపంలో లేదా ఇచ్చిన దత్తాంశాన్ని క్రమపద్ధతిలో నిర్మించడం వల్ల సమస్యను సులువుగా సాధించగలరు.

గమనిక: రక్తసంబంధాలపై అడిగే ప్రశ్నలు ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ఉంటాయి. అభ్యర్థులు ఏదో ఒక భాషను మాత్రమే అనుసరించాలి. ఉదాహరణకు మనం పిన్ని లేదా పెద్దమ్మ కూతురిని అక్క/ చెల్లిగా, కుమారుడిని అన్న/ తమ్ముడిగా తెలుగులో సంబోధిస్తే, ఇంగ్లిష్‌లో 'కజిన్' అని ఒక్క పదంతోనే పిలుస్తారు.

ప్రాథమిక అంశాలు
* రక్తసంబంధాలకు చెందిన చిత్రాలు గీయడంలో ఉపయోగించే ముఖ్యమైన

1. ఒక కుటుంబంలో Q, P, R, S, T అనే అయిదుగురు వ్యక్తులు ఉన్నారు....
I. P, S లు పెళ్లయిన జంట.
II. S పురుషుడు కాదు.
III. T అనే వ్యక్తి P కుమారుడు, Q కుమారుడు P.
IV. T సోదరి R. అయితే S, Q కు ఏమవుతుంది?
ఎ) మనుమరాలు బి) కోడలు సి) కుమార్తె డి) తల్లి
సమాధానం: బి
వివరణ:
I. నుంచి P, S లు పెళ్లయిన జంట, కాబట్టి వారిని కింది విధంగా సూచించవచ్చు.

II. నుంచి S పురుషుడు కాదు. అంటే S స్త్రీ కాబట్టి

III. నుంచి T అనే వ్యక్తి P కుమారుడు, Q కుమారుడు P. ఈ సంబంధాన్ని కింది విధంగా సూచించవచ్చు.

IV. నుంచి T సోదరి R కాబట్టి, మొత్తం కుటుంబ చిత్రాన్ని కింది విధంగా సూచించవచ్చు.

పక్క చిత్రం ఆధారంగా, S, Q కుమారుడి భార్య, కాబట్టి S, Q కు కోడలు అవుతుంది.

2. A, B కు సోదరి. C, B కు తల్లి. D, C కు తండ్రి. E, D కు తల్లి. అయితే A, D కు ఏమవుతారు?
ఎ) మనుమరాలు బి) కుమార్తె సి) అత్త డి) తండ్రి
సమాధానం: ఎ
వివరణ: ఇచ్చిన దత్తాంశం ఆధారంగా మొత్తం కుటుంబ చిత్రాన్ని ఈ విధంగా సూచించవచ్చు.


3. P, Q, R, S, T, U అనే పిల్లలు ఫుట్‌బాల్ ఆడుతున్నారు. వారిలో P, T లు సోదరులు. T సోదరి U. P పినతండ్రి ఒకేఒక కుమారుడు R. Q, S లు R తండ్రి ఒకేఒక సోదరుడి కుమార్తెలు. అయితే R, U కు ఏమవుతారు?
ఎ) సోదరి బి) సోదరుడు సి) కుమారుడు డి) మామయ్య
సమాధానం: బి

వివరణ: ఇచ్చిన దత్తాంశం ఆధారంగా మొత్తం కుటుంబ చిత్రాన్ని పై విధంగా రూపొందించవచ్చు.
పై చిత్రం ఆధారంగా R, U కు సోదరుడు అవుతాడు.

4. P కుమారుడు Q. Q కుమార్తె X. X మేనత్త R. R కుమారుడు L. అయితే L, P కు ఏమవుతారు?
ఎ) మనుమడు బి) మనుమరాలు సి) కుమార్తె డి) మేనకోడలు
సమాధానం: ఎ

వివరణ: ఇచ్చిన దత్తాంశం ఆధారంగా కుటుంబ చిత్రాన్ని ఈ విధంగా రూపొందించవచ్చు.
పై చిత్రం ఆధారంగా L, P కు మనుమడు అవుతాడు.

5. Q తండ్రి B. B కు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు. R సోదరుడు Q. P కుమార్తె R. P మనుమరాలు A. A తండ్రి S. అయితే S, Q కు ఏమవుతాడు?
ఎ) కుమారుడు బి) అల్లుడు సి) సోదరుడు డి) బావ
సమాధానం: డి

వివరణ: ఇచ్చిన దత్తాంశం ఆధారంగా, Q తండ్రి B. B కు ఇద్దరు పిల్లలు, R సోదరుడు Q. ఈ సంబంధాలను తెలిపే చిత్రాన్ని ఈ విధంగా రూపొందించవచ్చు.
చిత్రం నుంచి P, B లు భార్యాభర్తలు. P మనుమరాలు A. A తండ్రి S. కాబట్టి మొత్తం కుటుంబ చిత్రాన్ని ఈ విధంగా రూపొందించవచ్చు.
పై చిత్రం నుంచి S, Q కు బావ అవుతాడు.

6. A, Q, Y, Z లు వేర్వేరు వ్యక్తులు. Q తండ్రి Z. Y కుమార్తె A. Z కుమారుడు Y. Y కుమారుడు P. P సోదరుడు B అయితే .....
ఎ) B, Y లు సోదరులు బి) B సోదరి A సి) B మామయ్య Z డి) Q, Y లు సోదరులు
సమాధానం: బి

వివరణ: పై దత్తాంశం ఆధారంగా కుటుంబ చిత్రాన్ని కింది విధంగా రూపొందించవచ్చు.
పై చిత్రం ఆధారంగా B సోదరి A అనేది సరైంది.

7. K సోదరుడు D, సోదరి M. T అనే వ్యక్తి R తండ్రి, M సోదరుడు R. K తల్లి F. అయితే T, F లకు కనీసం ఎంతమంది కుమారులు ఉంటారు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) చెప్పలేం
సమాధానం: 

వివరణ: ఇచ్చిన దత్తాంశం ఆధారంగా కుటుంబ చిత్రాన్ని కింది విధంగా రూపొందించవచ్చు.
పై చిత్రం నుంచి R, M, K, D లు T, F ల పిల్లలు. ఇచ్చిన దత్తాంశం ఆధారంగా K లింగాన్ని నిర్దిష్టంగా పేర్కొనలేదు. D, R లు T, F మగ సంతానం. కాబట్టి T, F లు కనీసం ఇద్దరు మగ సంతానాన్ని కలిగి ఉంటారు.

మాదిరి ప్రశ్నలు 
 

1. హరిత రవితో ‘‘అతడు నా చెల్లి సోదరుడి తండ్రి ఏకైక కుమారుడు’’ అన్నది. అయితే హరితకు ఆ వ్యక్తి ఏమవుతాడు?

1) తండ్రి     2) సోదరుడు       3) బాబాయి     4) పినతండ్రి కొడుకు

సాధన: హరిత చెల్లెలి సోదరుడి తండ్రి, హరితకు తండ్రే. కాబట్టి ఆ వ్యక్తి హరిత సోదరుడు.

                                                               సమాధానం: 2


2. ‘‘రూపశ్రీ తల్లి మా అమ్మకు ఏకైక కూతురు’’ అని రాము చెప్పాడు. అయితే  రూపశ్రీకి రాము ఏమవుతాడు?

1) తాతయ్య      2) తండ్రి         3) మామయ్య     4) సోదరుడు

సాధన: రాము తల్లి, రూపశ్రీ అమ్మమ్మ ఒక్కరే. రూపశ్రీకి రాము మామయ్య (మేనమామ) అవుతాడు.     

                                                               సమాధానం: 3


3. రాజు ఒక మహిళకు వేరొక వ్యక్తిని చూపిస్తూ ‘‘అతడి తల్లి నీ తండ్రి ఏకైక కుమార్తె’’ అన్నాడు. అయితే ఆ స్త్రీ, ఆ వ్యక్తికి ఏమవుతారు?

1) భార్య      2) తల్లి     3) కూతురు      4) సోదరి

సాధన: అతడి తల్లి నీ తండ్రి ఏకైక కుమార్తె అంటే ఆ మహిళ తండ్రికి ఏకైక కుమార్తె ఆ మహిళే అవుతుంది.

= ఆ వ్యక్తి, స్త్రీ తల్లీకొడుకులు

                                                             సమాధానం: 2


4. వాసు ఒక ఫొటో చూపిస్తూ ‘‘అతడు నా సోదరుడి తండ్రి ఒకే కూతురి కొడుకు’’ అన్నాడు. అయితే వాసు, ఆ ఫొటోలో ఉన్న వ్యక్తికి ఏమవుతాడు?

1) మేనల్లుడు      2) మేనమామ         3) తండ్రి     4) సోదరుడు

సాధన: వాసు తండ్రి కూతురు - వాసుకు సోదరి

   సోదరి కుమారుడు - మేనల్లుడు

= వాసు ఫొటోలోని వ్యక్తికి ‘మేనమామ’ అవుతాడు.     

                                                                సమాధానం: 2


5. A, B, C, D, E, F అనే ఆరుగురు వ్యక్తులున్న ఒక కుటుంబంలో కింది సంబంధాలు ఉన్నాయి.

i)కుటుంబంలో ఆడవారి సంఖ్య మగవారి సంఖ్యకు సమానం

ii) A, Eలు F కుమారులు

iii) A కుమారుడు B

iv) ఒక బాలుడు, ఒక బాలికకు తల్లి 'D'

v)  ప్రస్తుతానికి కుటుంబంలో వివాహమైన జంట ఒకటి ఉంది.

అయితే కిందివాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి.

1) A, B, Cలు మహిళలు

2) D భర్త A 

3) F మనవరాలు D

4) E, Fలు D సంతానం

సాధన: లెక్క ప్రకారం, కుటుంబంలో ఆడవారి సంఖ్య = మగవారి సంఖ్య

A, Eలు F కుమారులు, అంటే A, E మగవారు.

* A కుమారుడు B

ఒక బాలుడు (B), బాలిక ఇద్దరికీ తల్లి 'D' కాబట్టి D, Aలు భార్యాభర్తలు అవుతారు

= D భర్త A 

                                              సమాధానం: 2


6. D అనే వ్యక్తి Gని చూపిస్తూ ‘‘ఆయన ఒక్కగానొక్క సోదరుడు నా కూతురు తండ్రికి తండ్రి’’ అని చెప్పాడు. అయితే Dకి G తో ఉన్న బంధుత్వం ఏమిటి?

1) తాత          2)  తండ్రి        3)బావ         4) బాబాయి
సాధన: ‘నా కూతురు తండ్రికి తండ్రి అంటే, నా తండ్రే’. నా తండ్రి సోదరుడు నాకు ‘బాబాయి’ అవుతాడు.

                                             సమాధానం: 4


7. కింది సమాచారం ఆధారంగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

P + Q అంటే Q తండ్రి P

P - Qఅంటే Q సోదరుడు P

P x Qఅంటే Q సోదరి P

P ÷ Q అంటే Q తల్లి P

i.   A + B ÷ C × D సమాసంలో 'D'కి A ఏమవుతాడు?

1) తండ్రి      2) బాబాయి         3)  అత్తయ్య     4) తాతయ్య


ii. A − B + C × D అయితే C కి A ఏమవుతారు?

1) బావ         2) మామయ్య     3) సోదరుడి కుమార్తె   4) తండ్రి

సాధన: i) A + B ÷ C × D

D సోదరి C, C తల్లి B, B తండ్రి A  కాబట్టి Dకి A తాతయ్య అవుతాడు.

                                                  సమాధానం: 4


ii)  A − B + C × D


 

C తండ్రి  B, B సోదరుడు A, Aకి C సోదరుడి కుమార్తె అవుతుంది.

                                                         సమాధానం: 3


8. A సోదరుడి తండ్రి భార్యకు 'P' తల్లి అవుతుంది. అయితే A కి Pతో ఉన్న బంధుత్వం ఏమిటి?

1) అమ్మ సోదరి     2) మరదలు        3) నాయనమ్మ      4) అమ్మమ్మ

సాధన: A సోదరుడి తండ్రి, Aకి కూడా తండ్రే. తండ్రి భార్య అంటే అమ్మ. A తల్లికి తల్లి P కాబట్టి Aకి P అమ్మమ్మ అవుతుంది.    

                                                        సమాధానం: 4


9. రమ్య ఒక పురుషుడిని పరిచయం చేస్తూ ‘‘ఈయన భార్య మా నాన్న ఏకైక కుమార్తె’’ అని చెప్పింది. అయితే, రమ్యకు ఆ పురుషుడితో ఉన్న బంధుత్వం ఏమిటి?

1) సోదరుడు      2) బాబాయి        3) మేనమామ      4) భర్త

సాధన: రమ్య నాన్న ఏకైక కుమార్తె అంటే రమ్యే. రమ్య భర్తే ఆ పురుషుడు.

                                                   సమాధానం: 4


10. రాముతో మహేష్‌ ‘‘నిన్న నేను మా నాయనమ్మ కుమార్తె ఏకైక సోదరుడ్ని చెస్‌లో ఓడించాను’’ అని అన్నాడు. అయితే మహేష్‌ ఓడించిన వ్యక్తి అతడికి ఏమవుతాడు?

1) కొడుకు      2) తండ్రి     3) సోదరుడు      4)మామయ్య

సాధన: మహేష్‌ నాయనమ్మ కుమార్తె సోదరుడు అంటే, అతడి తండ్రే. 

                                                సమాధానం: 2


11. B తండ్రి A, A కూతురు C. అయితే B, C మధ్య సంబంధం ఏమిటి?

1)  తండ్రి - కూతురు          2) భర్త - భార్య     

3) అన్న - చెల్లెలు             4) మామయ్య - మేనల్లుడు

సాధన: B, Cలకు తండ్రి A.

= B, Cలు అన్న - చెల్లెలు అవుతారు.

                                                 సమాధానం: 3

Posted Date : 30-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌