• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర ఎన్నికల సంఘం

1. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన వివరణ రాజ్యాంగంలో ఎక్కడ ఉంది?

1) 15వ భాగం, ఆర్టికల్‌ 324 నుంచి 344 వరకు

2) 15వ భాగం, ఆర్టికల్‌ 324 నుంచి 329 వరకు

3) 16వ భాగం, ఆర్టికల్‌ 324 నుంచి 331 వరకు

4) 17వ భాగం, ఆర్టికల్‌ 324 నుంచి 333 వరకు

జ: 2


2. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) 1950, జనవరి 25 నుంచి 1989, అక్టోబరు 15 వరకు ఏకసభ్య ఎన్నికల కమిషన్‌గా కొనసాగింది.

బి) 1989, అక్టోబరు 16న త్రిసభ్య ఎన్నికల కమిషన్‌గా మారింది.

సి) 1990లో ఏకసభ్య ఎన్నికల కమిషన్‌గా మారింది.

డి) 1993లో త్రిసభ్య ఎన్నికల కమిషన్‌గా మారింది.

1) ఎ, బి, సి       2) ఎ, సి, డి       3) ఎ, బి, డి      4) పైవన్నీ

జ: 4


3. వివిధ ప్రధానుల కాలంలో కేంద్ర ఎన్నికల సంఘంలో చేపట్టిన మార్పులకు సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) రాజీవ్‌గాంధీ కాలంలో త్రిసభ్య ఎన్నికల కమిషన్‌గా మారింది.

బి) వి.పి.సింగ్‌ హయాంలో ఏకసభ్య ఎన్నికల కమిషన్‌గా మారింది.

సి) పి.వి.నరసింహారావు కాలంలో త్రిసభ్య ఎన్నికల కమిషన్‌గా మారింది.

డి) ఇందిరాగాంధీ హయాంలో త్రిసభ్య ఎన్నికల కమిషన్‌గా మారింది.

1) ఎ, బి, సి        2) ఎ, సి, డి         3) ఎ, బి, డి      4) పైవన్నీ

జ: 1


4. కిందివాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి.

1) కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రధాన, ఇతర కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు.

2) కేంద్ర ఎన్నికల కమిషనర్‌ తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.

3) కేంద్ర ఎన్నికల కమిషనర్‌ జీతభత్యాలను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.

4) కేంద్ర ఎన్నికల కమిషనర్‌ జీతభత్యాలను రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయిస్తుంది.

జ: 4


5. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని గుర్తించండి.

1) పదవి చేపట్టిన రోజు నుంచి అయిదేళ్లు లేదా 65 ఏళ్ల వయసు నిండే వరకు

2) పదవి చేపట్టిన రోజు నుంచి ఆరేళ్లు లేదా 65 ఏళ్ల వయసు నిండే వరకు

3) పదవి చేపట్టిన రోజు నుంచి అయిదేళ్లు లేదా 62 ఏళ్ల వయసు నిండే వరకు 

4) పదవి చేపట్టిన రోజు నుంచి ఆరేళ్లు లేదా 62 ఏళ్ల వయసు నిండే వరకు

జ: 2


6. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) 1950, జనవరి 25న ఏర్పడింది.

బి) అధికారిక నివాస భవనం - నిర్వాచన్‌ సదన్‌

సి) పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహిస్తుంది.

డి) స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తుంది.

1) ఎ, బి, సి      2) ఎ, బి, డి         3) ఎ, సి, డి      4) పైవన్నీ

జ: 1


7. 2011, జనవరి 25 నుంచి నిర్వహిస్తున్న ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’ నినాదం.....

1) Proud to be Indian - Ready to Vote

2) Proud to be Citizen - Ready to Vote

3) Proud to be Voter - Ready to Vote

4) Proud to be Man - Ready to Vote

జ: 3


8. ఈవీఎం (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌)కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) దీన్ని 1980లో ఎం.డి.హనీఫ్‌ రూపొందించారు.

బి) 1982లో కేరళలోని నార్త్‌ పారవూర్‌ నియోజకవర్గ ఉపఎన్నికలో తొలిసారి ఉపయోగించారు.

సి) 1999లో గోవా శాసనసభ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో వినియోగించారు.

డి) 2004లో 14వ లోక్‌సభ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో ఉపయోగించారు.

1) ఎ, బి, డి        2) ఎ, సి, డి          3) ఎ, బి, సి      4) పైవన్నీ

జ​​​​​​​: 4


9. 1993లో తొలిసారిగా ‘ఓటర్‌ ఐడెంటిటీ కార్డ్‌’ని ప్రవేశపెట్టిన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎవరు?

1) జె.ఎం.లింగ్డో        2) టి.ఎన్‌.శేషన్‌       3) కె.వి.కె.సుందరం      4) టి.ఎస్‌.కృష్ణమూర్తి

జ​​​​​​​: 2


10. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) 1996 - ఎన్నికల పరిశీలకులనునియమించడం ప్రారంభమైంది.

బి) 1997 - ఒక వ్యక్తి ఏకకాలంలో రెండు నియోజకవర్గాలకు మించి పోటీచేయకూడదని నిర్ణయించారు.

సి) 1999  పోస్టల్‌ బ్యాలెట్‌ను ప్రవేశపెట్టారు.

డి) 2003 - ప్రాక్సీ ఓటును ప్రవేశపెట్టారు.

1) ఎ, బి, సి       2) ఎ, సి, డి           3) ఎ, బి, డి       4) పైవన్నీ

జ​​​​​​​: 4


11. ఎవరిని ఉద్దేశించి ప్రాక్సీ ఓటును ప్రవేశపెట్టారు?

1) ఎన్నికల నిర్వహణ సిబ్బంది      2) విదేశాల్లో ఉండే ప్రవాస భారతీయులు 

3) రక్షణ దళాలు       4) రాజకీయ నాయకులు

జ​​​​​​​: 3


12. ఒక ఈవీఎంలో గరిష్ఠంగా ఎన్ని ఓట్లు నమోదవుతాయి?

1) 3,840       2) 2,826        3) 3,326     4) 4,200

జ​​​​​​​: 1


13. NOTA కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) NOTA అంటే None Of The Above

బి) ఈవీఎంలో NOTA చిహ్నం దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది.

సి) 2013లో దిల్లీ శాసనసభ ఎన్నికల్లో మొదటిసారి NOTA ని ఉపయోగించారు.

డి) 2014లో 16వ లోక్‌సభ ఎన్నికల్లో NOTA ని పూర్తిగా వినియోగించారు.

1) ఎ, సి, డి         2) ఎ, బి, డి        3) ఎ, బి, సి         4) పైవన్నీ

జ​​​​​​​: 4


14. VVPAT అంటే?

1) Voter Verifiable Paper Audit Trail

2) Voter Vender Paper Account Trail

3) Voter Verification Paper Account Trail

4) Voter Very Para Account Treat

జ​​​​​​​: 1

15. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలతో కూడిన అఫిడవిట్‌ను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాలని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది?

1) డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ ఇన్‌ ఇండియా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

2) ప్రకాశ్‌కదమ్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

3) పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

4) నాజ్‌ ఫౌండేషన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

జ​​​​​​​: 1


16. ఎన్నికల్లో ఓటర్ల వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది?

1) సంతానం కమిటీ    2) అలోక్‌వర్మ కమిటీ    3) తార్కుండే కమిటీ     4) చంద్రసేన్‌ కమిటీ

జ​​​​​​​: 3


17. ఎన్నికల సంస్కరణలపై అధ్యయనం కోసం వి.పి.సింగ్‌ ప్రభుత్వకాలంలో ఏర్పాటైన కమిటీని గుర్తించండి.

1) దినేష్‌ గోస్వామి కమిటీ     2) రంగరాజన్‌ కమిటీ 

3) వి.ఎస్‌.రమాదేవి కమిటీ            4) జె.ఎం.మిశ్రా కమిటీ

జ​​​​​​​: 1


18. 15వ లా కమిషన్‌ ఎన్నికల సంస్కరణలపై చేసిన సిఫార్సులకు సంబంధించి సరైనవి?

ఎ) ఎన్నికల్లో పోటీ చేసే ఆషామాషీ అభ్యర్థులను నిరోధించడానికి ధరావత్తు మొత్తాన్ని పెంచాలి.

బి) సంస్థాగత ఎన్నికల్లో మహిళలకు 30 శాతం స్థానాలను కేటాయించాలి.

సి) ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిని నిర్దేశించాలి.

డి) ఎన్నికల్లో పోటీచేసే ఇండిపెండెంట్‌ అభ్యర్థి మరణిస్తే ఎన్నికను వాయిదా వేయాల్సిన అవసరం లేదు.

1) ఎ, బి, సి       2) ఎ, సి, డి         3) ఎ, బి, డి       4) పైవన్నీ

జ​​​​​​​: 3


19. భారత ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం పోలింగ్‌ తేదీకి ఎన్ని గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలి?

1) 12      2) 24       3) 36       4) 48

జ​​​​​​​: 4


20. VVPAT ని మొదటిసారి ఏ ఎన్నికల్లో వినియోగించారు?

1) మహారాష్ట్ర - విదర్భ నియోజకవర్గం      2) నాగాలాండ్‌ - నోక్సస్‌ నియోజకవర్గం 

3) మధ్యప్రదేశ్‌ - ఇండోర్‌ నియోజకవర్గం    4) తమిళనాడు - తిరుత్తై నియోజకవర్గం

జ​​​​​​​: 2


గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు


1. ఎన్నికల సంఘం ఒక ... (టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ II, 2016)

1) స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ

2) ప్రాతినిధ్య సంస్థ

3) చట్టపరమైన సంస్థ

4) శాశ్వత కేంద్రప్రభుత్వ సంస్థ

జ​​​​​​​: 1


2. ఎన్నికల సంఘం విధులకు సంబంధించి కిందివాటిలో  సరైనవి? (టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ II, 2016)

ఎ) ఎలక్టోరల్‌ రూల్స్‌ను రూపొందించడం

బి) రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు ఎన్నికలు నిర్వహించడం

సి) లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించడం

డి) పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించడం

1) ఎ, సి, డి     2) ఎ, బి, డి       3) బి, సి, డి     4) ఎ, బి, సి

జ​​​​​​​: 2


3. భారతదేశ మొదటి ప్రధాన ఎన్నికల అధికారి? (ఏపీ పంచాయతీ సెక్రటరీస్, 2014)

1) కె.వి.కె.సుందరం       2) టి.స్వామినాథన్‌

3) సుకుమార్‌ సేన్‌            4) ఆర్‌.కె.త్రివేది

జ​​​​​​​: 3


4. భారత ఎన్నికల సంఘానికి సంబంధించి కిందివాటిలో సరికానిది? (ఏపీపీఎస్సీ గ్రూప్‌ II, 2017) 

1) ఎన్నికల సంఘం సభ్యులకు ప్రధాన ఎన్నికల అధికారితో సమానమైన అధికారాలు ఉండవు.

2) ఎన్నికలకు సంబంధించిన అన్ని వివాదాలను ఎన్నికల సంఘమే నిర్ణయించదు.

3) భారత ఎన్నికల సంఘానికి రాజ్యాంగ హోదా ఉంది.

4) అన్ని సందర్భాల్లో ఓటర్ల జాబితాను సిద్ధంగా ఉంచడం ఎన్నికల సంఘం బాధ్యత.

జ​​​​​​​: 1


5. భారత రాజ్యాంగంలోని ఎన్నో ఆర్టికల్‌ ఎన్నికల సంఘాన్ని కలిగి ఉండే వెసులుబాటు కల్పిస్తుంది? (సబ్‌-ఇన్‌స్పెక్టర్స్, 2012)

1) ఆర్టికల్‌ 320     2) ఆర్టికల్‌ 324     3) ఆర్టికల్‌ 326     4) ఆర్టికల్‌ 330

జ​​​​​​​: 2


6. ఎన్నికల సంస్కరణల అంశాన్ని కింది ఏ కమిటీ ప్రస్తావించింది? (సబ్‌-ఇన్‌స్పెక్టర్స్‌ 2012)

ఎ) తార్కుండే కమిటీ 

బి) గోస్వామి కమిటీ 

సి) సంతానం కమిటీ 

డి) సచార్‌ కమిటీ

1) ఎ, బి          2) ఎ, సి         3) ఎ, డి         4) సి, డి

జ​​​​​​​: 1


7. ఎన్నికల సంఘానికి సంబంధించి కింది వాటిలో సరైంది? (టీఎస్‌ సబ్‌-ఇన్‌స్పెక్టర్స్, 2019)

ఎ) భారత ప్రధానమంత్రి ఫిబ్రవరి 2019లో సునీల్‌ చంద్రను ఎన్నికల కమిషనర్‌గా నియమించారు.

బి) భారత రాజ్యాంగ ప్రకరణ 324 క్లాజ్‌ 2 కింద ఎన్నికల కమిషనర్‌ను నియమిస్తారు.

1) ఎ, బి         2) ఏదీకాదు        3) ఎ మాత్రమే         4) బి మాత్రమే

జ​​​​​​​: 4


8. భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?  (ఏపీ కానిస్టేబుల్స్, 2018)

1) జనవరి 26        2) జనవరి 25        3) ఆగస్టు 15        4) నవంబరు 26

జ​​​​​​​: 2​​​​​​​

Posted Date : 26-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌