• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర కార్యనిర్వాహకశాఖ - రాష్ట్రపతి

1. రాజ్యాంగంలో భారత రాష్ట్రపతి గురించి ఎక్కడ వివరించారు?

జ: 5వ భాగం, ఆర్టికల్‌ 52 నుంచి 62                

2. రాష్ట్రపతికి సంబంధించి కిందివాటిలో సరికానిది ఏది?

జ:  రాష్ట్రపతి ఎన్నికను పార్లమెంట్‌ నిర్వహిస్తుంది

3. రాష్ట్రపతి పదవికి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

a) భారత రాష్ట్రపతి దేశానికి ‘వాస్తవ అధిపతి’ (De facto)గా వ్యవహరిస్తారు.

b) రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలి.

c) రాష్ట్రపతి ఎన్నిక పద్ధతిని ఐర్లాండ్‌ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు.

d) దేశ పరిపాలనను రాష్ట్రపతి పేరుమీదుగా నిర్వహించే పద్ధతిని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు.

జ: c, d

4. రాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతిని గుర్తించండి.

జ:  నైష్పత్తిక ప్రాతినిధ్య ఏక ఓటు బదిలీ విధానం ద్వారా రహస్య ఓటింగ్‌.

5. భారత రాష్ట్రపతి పదవిని ఏ దేశ ‘రాజ మకుటం’ పదవితో పోలుస్తారు?

జ:  బ్రిటన్‌ 

6. కిందివారిలో రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజ్‌ (ఎన్నికల నియోజకగణం)లో ఓటర్లు కానిది ఎవరు?

జ: రాష్ట్ర శాసన మండలికి ఎన్నికైన సభ్యులు

7. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతికి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

a) గెలుపొందే అభ్యర్థి నిర్ణీత కోటా ఓట్లను అంటే 50% కంటే ఎక్కువ ఓట్లను పొందాలి.

b) ప్రాధాన్యతను అనుసరించి ఓటర్లు ఓటు వేస్తారు.

c) ఓటర్ల ఓట్లకు విలువను లెక్కిస్తారు.

జ: a, b, c
 

8. రాష్ట్రపతి ఎన్నికలో పార్లమెంట్‌ సభ్యులు, రాష్ట్రాల శాసనసభ్యుల ఓటు విలువను ఏ సంవత్సర జనాభా లెక్కల ఆధారంగా గణిస్తారు?

జ: 1971 

9. రాష్ట్రపతి ఎన్నికలో రిటర్నింగ్‌ అధికారిగా ఎవరు వ్యవహరిస్తారు?

జ:  ఒకసారి లోక్‌సభ సెక్రటరీ జనరల్,  మరొకసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్‌

10. రాష్ట్రపతి పదవికి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

a) రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పిస్తారు.

b) రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.

c) రాష్ట్రపతి పదవిని చేపట్టిన తేదీ నుంచి అయిదేళ్లు పదవిలో కొనసాగుతారు.

d) రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే ఏడాదిలోపు ఎన్నిక నిర్వహించాలి.

జ: a, b, c

11. రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది?

జ:  ఆర్టికల్‌ 61    

12. రాష్ట్రపతి జీతభత్యాలకు సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

a) రాష్ట్రపతి జీతభత్యాలను పార్లమెంట్‌ నిర్ణయిస్తుంది.

b) భారత సంఘటిత నిధి నుంచి జీతాన్ని చెల్లిస్తారు.

c) ప్రస్తుతం రాష్ట్రపతి జీతం నెలకు రూ.5 లక్షలు

d) వీరి జీతభత్యాలపై ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది.

జ: a, b, c, d
 

13. పార్లమెంట్‌లో ‘మహాభియోగ తీర్మానం’ ద్వారా రాష్ట్రపతిని తొలగించాలంటే ఎంత మెజారిటీ అవసరం?

జ:  2/3వ వంతు      

14. రాష్ట్రపతి పదవికి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

a) రాష్ట్రపతి పదవీకాలంలో చేపట్టిన పనులకు పదవీ విరమణ తర్వాత ఏ న్యాయస్థానానికి బాధ్యులు కాదు.

b) పదవిలో ఉన్న కాలంలో క్రిమినల్‌ కేసులు నమోదు చేయకూడదు.

c) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.

d) రాష్ట్రపతిపై సివిల్‌ కేసులు నమోదు చేయకూడదు.

జ: a, b, c

15. రాష్ట్రపతిని తొలగించే ‘మహాభియోగ తీర్మానాన్ని’  (Impeachment motion) లోక్‌సభ/ రాజ్యసభలో ప్రవేశ పెట్టాలంటే సంబంధిత సభలో ఉన్న సభ్యుల్లో ఎంతమంది సంతకాలు చేయాలి?

జ: 1/4వ వంతు      

16. 1971లో కింది ఏ రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ తర్వాత ఉపసంహరించుకున్నారు?

జ:  వి.వి.గిరి   

17. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు ఏకకాలంలో ఖాళీ ఏర్పడితే తాత్కాలిక రాష్ట్రపతిగా ఎవరు వ్యవహరిస్తారు?

జ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 

18. రాష్ట్రపతి పదవి గురించి వివరించే రాజ్యాంగ ఆర్టికల్స్‌కు సంబంధించి సరికానిది?

జ:  ఆర్టికల్‌ 54  రాష్ట్రపతి రాజీనామా వివరణ

19. 70వ రాజ్యాంగ సవరణ చట్టం - 1992 ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజ్‌లో ఎవరిని ఓటర్లుగా చేర్చారు?

జ:  దిల్లీ, పాండిచ్చేరి శాసనసభ్యులు 

20. 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలో వివిధ రాష్ట్రాల శాసనసభ్యుల ఓటు విలువకు సంబంధించి సరికానిది ఏది?

జ: తమిళనాడు  144

21. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజ్‌లో ఓటర్లు కానిది ఎవరు?

1) రాష్ట్రాల శాసనమండలికి గవర్నర్‌ ద్వారా నామినేట్‌ అయ్యే సభ్యులు

2) రాజ్యసభకు రాష్ట్రపతి ద్వారా నామినేట్‌ అయ్యే సభ్యులు

3) 1, 2 

4) రాజ్యసభకు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికయ్యే సభ్యులు

జ:  1, 2 


గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు


1. భారత రాష్ట్రపతిని తొలగించే పద్ధతి ఏది? (AP, Grama Sachivalayam 2019)

జ:  మహాభియోగ తీర్మానం 


2. భారతదేశంలో ప్రతి పనిని ఎవరి పేరుతో చేస్తారు? (AP, Gr-II 2019)

జ:  రాష్ట్రపతి 


3. భారత రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజక గణంలో సభ్యులు కానివారు ఎవరు? (AP, Sub Inspecter, Prelims 2018)

a) పుదుచ్చేరి విధానసభకు ఎన్నికైన సభ్యులు

b) జమ్మూ-కశ్మీర్‌ విధానసభకు ఎన్నికైన సభ్యులు

c) రాజ్యసభకు నియమితులైన సభ్యులు

d) ఒక రాష్ట్ర విధానమండలికి ఎన్నికైన సభ్యులు

జ: c, d


4. కిందివారిలో భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటరు కానివారు ఎవరు? (AP, Sub Inspecter, Mains 2018)

a) భారత ఉపరాష్ట్రపతి

b) జమ్మూ-కశ్మీర్‌ విధానసభకు ఎన్నికైన సభ్యుడు

c) ఒక రాష్ట్ర విధాన పరిషత్‌కు ఎన్నికైన సభ్యుడు

d) రాజ్యసభకు నియమితులైన సభ్యుడు

జ: a, c, d


5. ఏ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విధానసభ సభ్యులు భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటుహక్కును కలిగి ఉంటారు?  

(AP, Sub Inspecter, Prelims 2016)

జ: దిల్లీ, పుదుచ్చేరి


6. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు? (AP, Sub Inspecter communications 2013)

జ:  సుప్రీంకోర్టు   


7. పదవి నుంచి వైదొలగాలనుకున్న భారత రాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి? 

 (APPSC, Degree College Lecturers 2012)
   
జ: భారతదేశ ఉపరాష్ట్రపతి  


8. భారతదేశ రాష్ట్రపతిని ఏ కారణంతో అభిశంసించవచ్చు? (APPSC, Gr-II 1993)

జ:  రాజ్యాంగ ఉల్లంఘన    


9. రాష్ట్రపతితో ప్రమాణస్వీకారం చేయించేది ఎవరు? (APPSC, AEE’S 2009)

జ:  భారతదేశ ప్రధాన న్యాయమూర్తి   


10. రాష్ట్రపతి పదవిని చేపట్టేందుకు గరిష్ఠ వయసు ఎంతకు మించకూడదు? (APPSC, AEE’S 2007)

జ:  గరిష్ఠ వయసు ఏమీలేదు
 

Posted Date : 14-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌