• facebook
  • whatsapp
  • telegram

చాల్కోజన్‌లు, వాటి సమ్మేళనాలు

1. కిందివాటిలో 16వ గ్రూప్‌కి చెందిన మూలకాలు ఏవి?

1) సల్ఫర్‌        2) ఆక్సిజన్‌          3) సెలీనియం        4) పైవన్నీ

జ: 4

2. కిందివాటిలో ఆక్సిజన్‌ కుటుంబానికి చెందిన మూలకాలు ఏవి?  

1) టెల్లూరియం       2) పొలోనియం         3) 1, 2         4) జెర్మేనియం

జ: 3


3. ఆవర్తన పట్టికలోని ఏ గ్రూప్‌ మూలకాలను చాల్కోజన్‌లు అంటారు?

1) 14వ          2) 2వ          3) 1వ            4) 16వ 

జ: 4

4. భూపటలంలో అత్యంత సమృద్ధిగా లభించే మూలకం ఏది?

1) సల్ఫర్‌         2) ఇనుము         3) అల్యూమినియం         4) ఆక్సిజన్‌

జ: 4


5. కిందివాటిలో సల్ఫేట్‌ ఖనిజ రూపం ఏది?

1) జిప్సం          2) బారైట్‌          3) 1, 2           4) రాతిఉప్పు

జ: 3


6. కిందివాటిలో సల్ఫైడ్‌ ఖనిజ రూపం ఏది?

1) కాపర్‌ పైరైట్స్‌         2) గెలీనా         3) జింక్‌ బ్లెండ్‌          4) పైవన్నీ

జ: 4


7. వాతావరణంలో ఆక్సిజన్‌ ఘనపరిమాణాత్మక శాతం?

1) 78             2) 20.95           3) 0.03           4) 26.15

జ: 2


8. కిందివాటిలో సరైనవి ఏవి?

i) 16వ గ్రూప్‌ మూలకాల సాధారణ ఎలక్ట్రాన్‌ విన్యాసం ns2np4

ii) 16వ గ్రూప్‌ మూలకాల సాధారణ ఆక్సీకరణ స్థితి - 2

1) i మాత్రమే          2) ii మాత్రమే      3) i, ii          4) ఏదీకాదు

జ: 3


9. కిందివాటిలో అలోహాలు ఏవి?

1) సల్ఫర్‌           2) ఆక్సిజన్‌        3) 1, 2           4) సోడియం

జ: 3


10. 16వ గ్రూప్‌ మూలకాల్లో అర్ధలోహం ఏది?

1) ఆక్సిజన్‌             2) సల్ఫర్‌       3) టెల్లూరియం        4) ఏదీకాదు

జ: 3


11. కింది అంశాలను జతపరచండి.

జాబితా -I            జాబితా - II

i) బారైట్‌              a) PbS

ii) గెలీనా              b) ZnS

iii) జింక్‌ బ్లెండ్‌       c) BaSO4

1) i-a, ii-c, iii-b         2) i-b, ii-c, iii-a    

3) i-c, ii-b, iii-a         4) i-b, ii-a, iii-c

జ: 3


12. మూలకాలన్నింటిలో ఫ్లోరిన్‌ తర్వాత అత్యధిక రుణవిద్యుదాత్మకత కలిగిన మూలకం ఏది?

1) సల్ఫర్‌        2) కార్బన్‌        3) క్లోరిన్‌        4) ఆక్సిజన్‌

జ: 4


13. కింది అంశాలను జతపరచండి.

      మూలకం               అణువు

       i) ఆక్సిజన్‌            a) P4

      ii) సల్ఫర్‌               b) O2

      iii) ఫాస్ఫరస్‌           c) S8

  1) i-a, ii-c, iii-b        2) i-b, ii-c, iii-a   

  3) i-c, ii-b, iii-a       4) i-b, ii-a, iii-c

జ: 2

14. కిందివాటిలో ఆక్సిజన్‌ రూపాంతరం ఏది?

1) ఓజోన్‌         2) డైఆక్సిజన్‌        3) 1, 2        4) సాధారణ ఆక్సైడ్‌

జ: 1


15. పొటాషియం క్లోరేట్‌ను వేడిచేస్తే వెలువడే వాయువు?

1) ఆక్సిజన్‌      2) ఓజోన్‌        3) సల్ఫర్‌ డైఆక్సైడ్‌       4) కార్బన్‌ డైఆక్సైడ్‌ 

జ: 1


16. కిందివాటిలో ద్విబంధం కలిగిన వాయువు ఏది?

1) ఆక్సిజన్‌ (O2)      2) నైట్రోజన్‌ (N2)      3) హైడ్రోజన్‌ (H2)        4) ఫ్లోరిన్‌ (F2)

జ: 1


17. కిందివాటిలో క్రౌన్‌ విన్యాసం ప్ర‌ద‌ర్శించే అణువు ఏది?

1) O2          2) O3       3) P4         4) S8

జ: 4


18. కిందివాటిలో సరైంది ఏది?

i) రాంబిక్‌ సల్ఫర్, మోనోక్లినిక్‌ సల్ఫర్‌లు సల్ఫర్‌ స్ఫటిక రూపాంతరాలు.

ii) ప్లాస్టిక్‌ సల్ఫర్‌ అనేది సల్ఫర్‌ అస్ఫటిక రూపాంతరం.

1) i మాత్రమే        2) ii మాత్రమే      3) i, ii        4) ఏదీకాదు

జ: 3


19. కిందివాటిలో ఆమ్ల ఆక్సైడ్‌కు ఉదాహరణ?

1) కార్బన్‌ డైఆక్సైడ్‌      2) సల్ఫర్‌ డైఆక్సైడ్‌     3) సల్ఫర్‌ ట్రైఆక్సైడ్‌       4) పైవన్నీ

జ: 4


20. కిందివాటిలో క్షార ఆక్సైడ్‌ ఏది?

1) పొటాషియం ఆక్సైడ్‌    2) కాల్షియం ఆక్సైడ్‌    3) 1, 2       4) జింక్‌ ఆక్సైడ్‌ 

జ: 3


21. నైట్రస్‌ ఆక్సైడ్, నైట్రిక్‌ ఆక్సైడ్‌లు ఏ రకానికి చెందినవి?

1) ఆమ్ల ఆక్సైడ్‌        2) క్షార ఆక్సైడ్‌       3) తటస్థ ఆక్సైడ్‌    4) ద్విస్వభావ ఆక్సైడ్‌

జ: 3


22. ఆమ్లం, క్షారంతో చర్యజరిపే ఆక్సైడ్‌ను ఏమంటారు?

1) తటస్థ ఆక్సైడ్‌     2) ద్విస్వభావ ఆక్సైడ్‌       3) క్షార ఆక్సైడ్‌       4) పైవన్నీ 

జ: 2


23. చల్లటి శుద్ధ నీటిలో కరిగిఉన్న ఆక్సిజన్‌ గాఢత ఎంత?

1) 2 - 4.5 ppm    2) 4 - 5.5 ppm    3) 6.5 - 9 ppm    4) 5 - 6 ppm

జ: 3


24. కిందివాటిలో సరైనవి ఏవి?

i) పదార్థాల దహనక్రియకు ఆక్సిజన్‌ అవసరం.

ii) కిరణజన్యసంయోగక్రియ ద్వారా మొక్కలు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి.

iii) శుద్ధ నీటిలో జీవరసాయన ఆక్సిజన్‌ అవసరం విలువ 5 ppm కంటే తక్కువగా ఉంటుంది.

1) i, ii     2) ii, iii     3) i, iii     4) పైవన్నీ

జ: 4


25. కింది ఏ మిశ్రమాన్ని గ్యాస్‌ వెల్డింగ్‌లో ఉపయోగిస్తారు?

1) నైట్రోజన్, ఎసిటిలీన్‌   2) ఆక్సిజన్, ఎసిటిలీన్‌   3) హైడ్రోజన్, ఎసిటిలీన్‌      4) ఏదీకాదు

జ: 2


26. ఓజోన్‌ వాతావరణంలోని ఏ పొరలో ఉంటుంది?

1) మీసో ఆవరణం    2) స్ట్రాటో ఆవరణం      3) ట్రోపో ఆవరణం     4) ఏదీకాదు

జ: 2


27. ఓజోన్‌ ఒక.....

1) క్రిమి సంహారిణి        2) ఆక్సీకరణి     3) 1, 2        4) శీతలీకరణ కారకం

జ: 3


28. రాంబిక్‌ సల్ఫర్, మోనోక్లినిక్‌ సల్ఫర్‌గా మారే పరివర్తన ఉష్ణోగ్రత ఎంత?

1) 95.5oC      2) 85.5oC      3) 75.5oC      4) 105.5oC

జ: 1


29. సల్ఫర్‌ రూపాంతరాల్లో అత్యంత స్థిరమైంది ఏది?

1) రాంబిక్‌ సల్ఫర్‌     2) మోనోక్లినిక్‌ సల్ఫర్‌    3) ప్లాస్టిక్‌ సల్ఫర్‌       4) ఏదీకాదు 

జ: 1


30. కింది ఏ వాయువు కుళ్లిన కోడిగుడ్డు వాసనను కలిగి ఉంటుంది?

1) CO2          2) SO3       3) H2S         4) O3

జ: 3


31. O2, O3 మధ్య సంబంధం ఏమిటి?

1) ఐసోటోప్‌లు       2) ఐసోమర్‌లు     3) రూపాంతరాలు       4) ఐసోబార్‌లు

జ: 3


32. కిందివాటిలో సరికాని జత?

i) గ్రీన్‌ విట్రియోల్‌ - FeSO4.7H2O

ii) బ్లూ విట్రియోల్‌ - CuSO4.5H2O

iii) ఆయిల్‌ ఆఫ్‌ విట్రియోల్‌ - HNO3

iv) వైట్‌ విట్రియోల్‌ - CaSO4.2H2O

1) i, ii       2) ii, iii      3) iii, iv      4) i, iv

జ: 3


33. దహన దోహదకారి అని కింది ఏ వాయువును పిలుస్తారు?

1) హైడ్రోజన్‌       2) నైట్రోజన్‌     3) ఆక్సిజన్‌        4) హీలియం 

జ: 3


34. చాంబర్స్‌ ఆమ్లం రసాయన ఫార్ములా?

1) H2S2O4       2) H2SO4       3) H2S2O8           4) H2SO3

జ: 2


35. కారోస్‌ ఆమ్లం రసాయన ఫార్ములా ఏమిటి?

1) H2S2O7       2) H2SO5       3) H2SO4           4) H2SO3

జ: 2


36. పెరాక్సీ డైసల్ఫ్యూరిక్‌ ఆమ్లాన్ని ఏమంటారు?

1) చాంబర్స్‌ ఆమ్లం      2) మార్షల్‌ ఆమ్లం     3) కారోస్‌ ఆమ్లం      4) పామిటిక్‌ ఆమ్లం  

జ: 2


37. ఆక్సిజన్‌ను మొదటిసారి కనుక్కున్న శాస్త్రవేత్త?

1) రూథర్‌ఫర్డ్‌           2) లెవోయిజర్‌     3) కార్ల్‌ డబ్ల్యూ షీలే         4) సోరెట్‌ 

జ: 3


38. సోడియం థియోసల్ఫేట్‌ లేదా హైపో రసాయన ఫార్ములా?

1) Na2SO4            2) Na2S2O2.5H2O      3) Na2SO3      4) NaCl.2H2O

జ: 2


39. కింది అంశాలను జతపరచండి.

రసాయనం                        ఉపయోగం

i) సల్ఫర్‌                     a) ఆహార పదార్థాల  సంరక్షకాలు 

ii) సల్ఫర్‌ డైఆక్సైడ్‌        b) నిర్జలీకరణి   

iii) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం     c) రబ్బర్‌ వల్కనీకరణం

1) i-a, ii-c, iii-b             2) i-c, ii-b, iii-a
3) i-b, ii-c, iii-a             4) i-c, ii-a, iii-b

జ: 4


40. కిందివాటిలో సరైంది ఏది?

i) సల్ఫర్‌ను గన్‌ పౌడర్‌తో తయారుచేస్తారు.

ii) సల్ఫ్యూరిక్‌ ఆమ్లాన్ని స్వర్శా విధానం ద్వారా తయారుచేస్తారు.

1) i మాత్రమే       2) ii మాత్రమే     3) i, ii        4) ఏదీకాదు

జ: 3


41. కిందివాటిలో హైపో ఉపయోగం ఏమిటి?

1) యాంటీక్లోర్‌     2) యాంటీసెప్టిక్‌       3) 1, 2       4) యాంటీబయాటిక్‌ 

జ: 3


42. కింది 16వ గ్రూప్‌ మూలకాల్లో రేడియోధార్మికతను ప్ర‌ద‌ర్శించేది ఏది?

1) ఆక్సిజన్‌      2) టెల్లూరియం     3) పొలోనియం        4) సల్ఫర్‌

జ: 3

Posted Date : 13-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌