• facebook
  • whatsapp
  • telegram

ఛందస్సు

మాదిరి ప్రశ్నలు

1. వృత్త పద్యాలు ప్రధానంగా ఏవి? 
1) ఉత్పలమాల, మత్తేభం   2) చంపకమాల, శార్దూలం  
3) మత్తేభం, శార్దూలం       4) పైవన్నీ 


2. జాతి పద్యాలు ఏవి? 
1) తేటగీతి, సీసం          2) ఆటవెలది, తేటగీతి      
3) కందం, ద్విపద         4) సీసం, ఆటవెలది


3. కంద పద్యంలో బేసి స్థానాల్లో ఏ గణం ఉపయోగించకూడదు? 
1) రగణం      2) భగణం      3) నల గణం      4) జగణం 


4. వృత్త పద్యాలు ఏ ఛందస్సు? 
1) మార్గ ఛందస్సు      2) దేశీ ఛందస్సు      3) మాత్ర ఛందస్సు      4) పైవన్నీ


5. సూర్యగణాలు ఎన్ని?  
1) 2      2) 4      3) 6      4) 8


6. ‘అన్నమయములైన వన్ని జీవమ్ములు’ అనేది ఏ పద్యానికి ఉదాహరణ? 
1) ద్విపద      2) తేటగీతి      3) ఆటవెలది      4) కందం 


7. ఉత్పలమాల పద్యానికి ప్రతి పాదానికి అక్షరాల సంఖ్య? 
1) 20      2) 19      3) 21      4) 10    


8. ‘పొదలి యొండొండ దివియును బువియు దిశలు’ అనేది ఏ పద్యానికి ఉదాహరణ? 
1) కందం      2) ఆటవెలది      3) సీసం      4) తేటగీతి 


9. ద్విత్వ సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు? 
1) లఘువు      2) గురువు      3) 1, 2      4) ఏదీకాదు


10. చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా ..... అనే పద్యపాదం దేన్ని సూచిస్తుంది? 
1) చంపకమాల      2) ఉత్పలమాల      3) శార్దూలం      4) మత్తేభం


11. అనుచుంజేవురు మీరు కన్నుగనతో నాస్పంది తోష్ఠంబుతో... అనే పద్య పాదం దేనికి ఉదాహరణ? 
1) ఉత్పలమాల     2) చంపకమాల     3) శార్దూలం     4) మత్తేభం 


12. అర్థానుస్వరంతో కూడినవన్నీ   
1) గురువు      2) లఘువు     3) ద్విత్వ      4) ఏదీకాదు


13. ఊరూరంజనులెల్ల భిక్షమిడరో యుండంగుహల్గల్గవో అనేది ఏ పద్య పాదం?
1) మత్తేభం      2) చంపకమాల      3) ఉత్పలమాల      4) శార్దూలం


14. జాతి, ఉపజాతి పద్యాలకు భేదం 
1) ప్రాస నియమం      2) యతి      3) ప్రాసయతి      4) అక్షరాల సంఖ్య 


15. ‘దెరయన నొప్ప సాంద్యనవదీధితి పశ్చిమ దిక్తటంబునన్‌’లో యతిమైత్రి ఉండే అక్షరం? 
1) దె - తి      2) దె - దీ      3) దె - ప      4) దె - వ


16. 2 - 4 పాదాల చివరి అక్షరం గురువై ఉండాలి అనే నియమాన్ని కలిగిన పద్యం? 
1) ద్విపద      2) సీసం      3) కందం      4) మంజరీ ద్విపద


17. హ్రస్వమైన అచ్చులను ఏమంటారు? 
1) లఘువులు      2) ఉపధలు      3) గురువులు      4) పొల్లులు


18. క్షితిజం అనే పదానికి గురు, లఘువులు గుర్తించండి.
1) UIU      2) IIU      3) UII     4) IUI 


19. ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు - అనే గణాలు గల పద్యం? 
1) ఆటవెలది      2) ద్విపద      3) తేటగీతి      4) సీసం


20. ‘ఇనునసమాన తేజు దివసేంద్రు గనుంగొను మాడ్కి జూడగా’ అనే పాదంలోని గణాలు? 
1) న - జ - భ - జ - జ - జ - ర     2) భ - ర - న - భ - భ - ర - వ 
3) మ - స - జ - స - త - త - గ   4) స - భ - ర - న - మ - య - వ


21. కిందివాటిలో చతుర్మాత్రా గణాలు గల పద్యం? 
1) తేటగీతి      2) ఆటవెలది      3) కందం      4) సీసం


22. ‘ధనము లేకుండెదెవరు మూడు తరములందు’ అనేది ఏ పద్య పాదం? 
1) ద్విపద      2) ఆటవెలది     3) సీసం      4) తేటగీతి


23. ఘోర వికార సన్నిహిత కోపముఖంబులు దీప్త విద్యుడు.... అనే పద్య పాదం దేనికి ఉదాహరణ? 
1) మత్తేభం      2) శార్దూలం      3) ఉత్పలమాల     4) చంపకమాల


24. కంద పద్యంలోని రెండు, నాలుగు పాదాల్లో ఎన్ని గణాలు ఉంటాయి? 
1) 4      2) 5      3) 3      4) 8


25. ఇంద్ర గణాలు ఎన్ని? 
1) 4      2) 6      3) 2      4) 8

సమాధానాలు
1-4; 2-3; 3-4; 4-1; 5-2; 6-3; 7-1; 8-4; 9-2; 10-1; 11-4; 12-2; 13-4; 14-1; 15-2; 16-3; 17-1; 18-2; 19-3; 20-1; 21-3; 22-4; 23-3; 24-2; 25-2.

రచయిత: సూరె శ్రీనివాసులు

Posted Date : 04-02-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌