• facebook
  • whatsapp
  • telegram

పదార్థాల స్థితి మార్పులు

1. వాయు స్థితి, ప్లాస్మా స్థితుల మధ్యస్థ దశను ఏమంటారు?

జ‌: మెసోఫేజ్‌

2. కిందివాటిలో సరైంది ఏది?

i) నక్షత్రాలు ప్లాస్మా స్థితిలో ఉంటాయి.

ii) ప్లాస్మా స్థితిలోని పదార్థం మంచి విద్యుత్‌ వాహకం.

జ‌:  i, ii     


3. కిందివాటిలో స్వేచ్ఛా ఎలక్ట్రాన్‌లను కలిగిన పదార్థ స్థితి ఏది?

1) ద్రవ స్థితి     2) ఘన స్థితి   3) వాయు స్థితి     4) ప్లాస్మా స్థితి

జ‌: ప్లాస్మా స్థితి


4. కింది ఏ ప్రక్రియ ద్వారా వాయు స్థితి నుంచి ప్లాస్మా స్థితిని పొందొచ్చు?

1) నిక్షేపణం      2) ఉత్పతనం      3) పునఃసంయోగం  4) అయనీకరణ

జ‌: అయనీకరణ


5. ఏ ఉష్ణోగ్రత, పీడనాల వద్ద నీరు ఘన, ద్రవ, వాయు స్థితుల్లో లభ్యమవుతుంది?

జ‌: 0.01oC, 611.66 పాస్కల్‌ 

6. ఘన పదార్థం ద్రవ స్థితిలోకి మారకుండా నేరుగా వాయు స్థితిలోకి మారే ప్రక్రియను ఏమంటారు?

జ‌: ఉత్పతనం    

7. కిందివాటిలో పదార్థ ఉపరితలానికి చెందిన దృగ్విషయం ఏది?

జ‌: ఇగరడం     


8. సాధారణ వాతావరణ పీడనం వద్ద స్వచ్ఛమైన నీటి ఘనీభవస్థానం?

1) 32oF     2) 273K   3) 0oC   4) పైవన్నీ

జ‌:  పైవన్నీ


9. కిందివాటిలో అధిక సంపీడ్యతను కలిగి ఉండేది?

1) నీరు     2) ఆల్కహాల్‌     3) వెండి     4) ఆక్సిజన్‌

జ‌: ఆక్సిజన్‌


10. కిందివాటిలో సరైనవి ఏవి?

i) శ్వాసక్రియలో ఆక్సిజన్‌ ఊపిరితిత్తుల నుంచి వ్యాపనం చెందుతుంది.

ii) ఘన, ద్రవ, వాయు పదార్థాలన్నీ ద్రవాల్లో వ్యాపనం చెందుతాయి.

iii)  వాయు పదార్థాల వ్యాపన రేటు ద్రవాలు, ఘనాల వ్యాపన రేటు కంటే ఎక్కువగా ఉంటుంది.

జ‌:  i, ii, iii
 

11. వాయువుల్లో వ్యాపన వేగం అధికంగా ఉండటానికి కారణం ఏమిటి?

i) చలన వేగం అధికంగా ఉండటం.

ii) కణాల మధ్య ఖాళీ స్థలం ఎక్కువగా ఉండటం.

జ‌:  i, ii     


12. కిందివాటిలో పదార్థ స్థితి మార్పునకు సంబంధించి సరైనవి ఏవి?

i)  పదార్థాన్ని ఒక స్థితి నుంచి మరొక స్థితిలోకి మార్చవచ్చు.

ii) పదార్థ స్థితి మార్పు పీడనంపై ఆధారపడి ఉంటుంది.

iii) పదార్థ స్థితి మార్పు ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది.

జ‌:   i, ii, iii


13. పదార్థాన్ని వాయు స్థితి నుంచి ద్రవ స్థితిలోకి మార్చాలంటే దేన్ని తగ్గించాలి?

జ‌:   ఉష్ణోగ్రత      

Posted Date : 31-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌