* అణువులోని రెండు పరమాణువుల మధ్య లేదా రెండు అయాన్ల మధ్య ఉండే ఆకర్షణ బలాన్ని ‘రసాయన బంధం’ అంటారు.
* రసాయన బంధం ద్వారా అణువులోని రెండు పరమాణువులు బంధితమై ఉంటాయి.
రకాలు: * అయానిక బంధం
* సమయోజనీయ బంధం
* సమన్వయ సమయోజనీయ బంధం
* లోహ బంధం
* హైడ్రోజన్ బంధం
* వాండర్‌వాల్ బలాలు
అయానిక బంధం (Ionic Bond)
* ధనావేశ, రుణావేశ అయాన్ల మధ్య స్థిరవిద్యుత్ ఆకర్షణ బలాల వల్ల ఏర్పడిన బంధాన్ని ‘అయానిక బంధం’ లేదా ‘ఎలక్ట్రోవేలంట్ బంధం’ అని అంటారు.
ఉదా: 1, 2వ గ్రూప్ లోహ మూలకాలు 16, 17వ గ్రూప్ అలోహ మూలకాలతో కలిసి, వాటి మధ్య అయానిక బంధాలను ఏర్పరుస్తాయి.
* అయానిక బంధం కలిగిన పదార్థాలను ‘అయానిక పదార్థాలు’ అంటారు.
* 1, 2వ గ్రూప్ మూలకాలు అత్యల్ప అయనీకరణ శక్తిని కలిగి ఉంటాయి. దీంతో ఇవి ఎలక్ట్రాన్‌లను కోల్పోయి ధనావేశ అయాన్లను ఏర్పరుస్తాయి.
ఉదా: సోడియం పరమాణువు (Na) ఒక ఎలక్ట్రాన్‌ను కోల్పోయి సోడియం అయాన్ (Na+) ను ఏర్పరుస్తుంది.
* 16, 17వ గ్రూప్ మూలకాలు ఎలక్ట్రాన్‌లను స్వీకరించి రుణావేశ అయాన్లను ఏర్పరుస్తాయి.
ఉదా: క్లోరిన్ పరమాణువు (Cl)ఒక ఎలక్ట్రాన్‌ను స్వీకరించి క్లోరైడ్ అయాన్ (Cl-) ను ఏర్పరుస్తుంది.
అయానిక పదార్థాల సాధారణ ధర్మాలు:
* ఇవి చాలా వరకు ఘన స్థితిలో ఉంటాయి.
* ఇవి అధిక బాష్పీభవన స్థానం, ద్రవీభవన స్థానాలను కలిగి ఉంటాయి.
* అయానిక పదార్థాలు ధృవ ద్రావణులైన నీరు లాంటి ద్రావణాల్లో కరుగుతాయి. బెంజీన్, క్లోరోఫాం, టొలీన్ లాంటి అధృవ ద్రావణాల్లో ఇవి చాలా తక్కువగా కరుగుతాయి.
* జల ద్రావణాలు, గలన స్థితిలో అయానిక పదార్థాలు విద్యుత్, ఉష్ణవాహకాలు.
* అయానిక పదార్థాలు సాదృశ్యాన్ని ప్రదర్శించవు.
బంధ దైర్ఘ్యం లేదా బంధ దూరం (Bond Length)
* ఒక అణువులో బంధాలు ఏర్పర్చుకున్న రెండు పరమాణు కేంద్రకాల మధ్య సమతాస్థితి దూరాన్ని బంధ దైర్ఘ్యం లేదా బంధ దూరం అంటారు.
* రెండు ఒకే పరమాణువుల మధ్య సమయోజనీయ బంధం ఏర్పడితే, వాటి కేంద్రకాల మధ్య దూరంలో సగాన్ని సమయోజనీయ వ్యాసార్ధం అంటారు.
అష్టక నియమం
* పరమాణువులు ఎలక్ట్రాన్‌లను కోల్పోవడం, స్వీకరించడం లేదా పంచుకోవడం ద్వారా వాటి బాహ్య కర్పరంలో ఎనిమిది ఎలక్ట్రాన్‌లను ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. దీన్నే ‘అష్టక నియయం’ అంటారు.
* జడవాయువులు లేదా ఉత్కృష్ట వాయువులు వాటి పరమాణువుల బాహ్యకర్పరాల్లో ఎనిమిది ఎలక్ట్రాన్‌లను కలిగి ఉంటాయి. అంటే స్థిరమైన అష్టక విన్యాసాన్ని(ns2np6) కలిగి ఉంటాయి.
* ఆవర్తన పట్టికలోని ఉత్కృష్ట వాయువులు మినహా మిగిలిన మూలకాల పరమాణువులు ఒకదానితో మరొకటి కలిసి ప్రత్యేక ధర్మాలు కలిగిన అణువులను ఏర్పరుస్తాయి.
సమయెజనీయ బంధం (Covalent Bond)
* రెండు పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ జతను పంచుకోవడం వల్ల ఏర్పడే బంధాన్ని ‘సమయెజనీయ బంధం’ అంటారు. ఒక సమయెజనీయ బంధాన్ని ఏర్పర్చే ప్రతి పరమాణువు పంచుకునే ఎలక్ట్రాన్ జతలో ఒక ఎలక్ట్రాన్‌ను అందించాలి.
* రెండు పరమాణువులు, వాటి మధ్య ఒక ఎలక్ట్రాన్ జతను పంచుకుంటే వాటి మధ్య ‘ఏక సమయెజనీయ బంధం’ ఏర్పడుతుంది.
* రెండు పరమాణువులు, వాటి మధ్య రెండు ఎలక్ట్రాన్ జంటలను పంచుకుంటే, వాటి మధ్య ‘ద్విబంధం’ ఏర్పడుతుంది.
ఉదా: ఆక్సిజన్(O2) : O = O
కార్బన్ డైఆక్సైడ్ (CO2): O = C = O
* రెండు పరమాణువులు, వాటి మధ్య మూడు ఎలక్ట్రాన్ జతలను పంచుకుంటే వాటి మధ్య ‘త్రిక బంధం’ ఏర్పడుతుంది.
ఉదా: నైట్రోజన్ (N2) : N = N
హైడ్రోజన్ సయనైడ్ (HCN): H - C = N
(కార్బన్, నైట్రోజన్‌ల మధ్య త్రికబంధం)
సమయోజనీయ పదార్థాల సాధారణ ధర్మాలు:
* ఇవి ఘన, ద్రవ, వాయు స్థితుల్లో ఉంటాయి.
* సమయోజనీయ పదార్థాలు తక్కువ ద్రవీభవన, బాష్పీభవన స్థానాలను కలిగి ఉంటాయి.
* ఇవి సాధారణంగా ధృవ ద్రావణాల్లో కరగవు. అధృవ ద్రావణాల్లో తేలిగ్గా కరుగుతాయి.
* సమయోజనీయ పదార్థాలు సాధారణంగా విద్యుత్ వాహకతను ప్రదర్శించవు.
మాదిరి ప్రశ్నలు
1. కిందివాటిలో రసాయన బంధంలో పాల్గొనని మూలకాలు ఏవి?
1) క్షార లోహాలు 2) క్షారమృత్తిక లోహాలు
3) హాలోజన్‌లు 4) జడవాయువులు
జ: జడవాయువులు
2. వజ్రంలోని కార్బన్ పరమాణువుల మధ్య ఉన్న బంధం ఏది?
1) హైడ్రోజన్ బంధం 2) అయానిక బంధం
3) సమయోజనీయ బంధం 4) 2, 3
జ: సమయోజనీయ బంధం
3. హైడ్రోజన్ క్లోరైడ్ (HCL) అణువులోని బంధం ఏ రకానికి చెందింది?
1) అయానిక బంధం 2) సమన్వయ సమయోజనీయ బంధం
3) ధృవాత్మక సమయోజనీయ బంధం 4) 1, 2
జ: ధృవాత్మక సమయోజనీయ బంధం
4. కింది అంశాలను జతపరచండి.
అణువు ఆకృతి
a) కార్బన్ డైఆక్సైడ్ i) పిరమిడల్
b) అమ్మోనియా ii) కోణీయం
c) నీరు iii) రేఖీయం
1) a-iii, b-ii, c-i 2) a-ii, b-i, c-iii
3) a-iii, b-i, c-ii 4) a-i, b-iii, c-ii
జ: a-iii, b-i, c-ii
5. సోడియం క్లోరైడ్ (NaCl) అణువు ఏర్పడటంలో ఇమిడి ఉన్న బంధం ఏది?
1) అయానిక బంధం 2) సమయోజనీయ బంధం
3) హైడ్రోజన్ బంధం 4) వాండర్ వాల్ బంధం
జ: అయానిక బంధం
6. నియాన్ ఎలక్ట్రాన్ విన్యాసం 1s22s22p6 అయితే, దానిలోని వేలన్సీ ఎలక్ట్రాన్‌ల సంఖ్య ఎంత?
1) 4 2) 2 3) 8 4) 10
జ: 8
7. కిందివాటిలో అష్టక విన్యాసాన్ని ప్రదర్శించనిది ఏది?
1) ఆర్గాన్ 2) నియాన్ 3) ఆక్సిజన్ 4) 1, 2
జ: ఆక్సిజన్
8. కింది ఏ గ్రూప్ మూలకాలు ఎలక్ట్రాన్‌లను కోల్పోయి ధనావేశ అయాన్లను ఏర్పరుస్తాయి?
1) 1వ 2) 2వ 3) 17వ 4) 1, 2
జ: 1, 2
9. కింది ఏ గ్రూప్ మూలకాలు ఎలక్ట్రాన్‌లను స్వీకరించి రుణావేశ అయాన్లను ఏర్పరుస్తాయి?
1) 16వ 2) 17వ 2) 1వ 4) 1, 2
జ: 1, 2
10. కిందివాటిలో అయానిక పదార్థాలు ఏవి?
i) సాధారణ ఉప్పు ii) నీరు iii) కర్పూరం
iv) ఆల్కహల్ v) మెగ్నీషియం క్లోరైడ్ vi) ఇనుము
1) ii, iii, iv 2) i, v, vi 3) ii, iv, vi 4) i, v
జ: i, v
11. కిందివాటిలో అయానిక పదార్థాల సాధారణ ధర్మాలకు సంబంధించి సరైనవి ఏవి?
ఎ) అయానిక పదార్థాలు అధిక ద్రవీభవన స్థానాలను కలిగి ఉంటాయి.
బి) అయానిక పదార్థాలు బెంజీన్ లాంటి అధృవ ద్రావణాల్లో కరుగుతాయి.
సి) ఇవి గలన స్థితిలో మాత్రమే విద్యుత్, ఉష్ణవాహకాలు.
1) ఎ, బి 2) బి, సి 3) ఎ, సి 4) ఎ మాత్రమే
జ: ఎ మాత్రమే
* ఆవర్తన పట్టికలోని ఉత్కృష్ట వాయువులు మినహా మిగతా మూలకాలన్నీ ప్రకృతిలో ఏక పరమాణుక అణువులుగా స్వేచ్ఛగా ఉండవు. పరమాణువులు ఒకదానితో మరొకటి కలిసి ప్రత్యేక ధర్మాలు కలిగిన ‘అణువు’ను ఏర్పరుస్తాయి.
* అణువులోని రెండు పరమాణువులు లేదా రెండు అయాన్ల మధ్య ఉండే ఆకర్షణ బలాలను ‘రసాయన బంధం’ అంటారు. అంటే ఈ బంధం అణువులోని రెండు పరమాణువులను బంధిస్తుంది.
* పరమాణువుల్లోని బాహ్య కర్పరాల్లో ఉండే (బాహ్య కక్ష్య) ఎలక్ట్రాన్‌లను ‘వేలన్సీ ఎలక్ట్రాన్’లు అంటారు. రసాయన బంధం ఏర్పడటంలో వేలన్సీ ఎలక్ట్రాన్‌లు పాల్గొంటాయి. లోపలి కర్పరాల్లోని ఎలక్ట్రాన్‌లు సాధారణంగా రసాయన బంధాల్లో పాల్గొనవు.
* మనకు ఇప్పటి వరకు తెలిసిన మూలకాలు 115.
* హంప్రి దవే 250 లోహపు ఫలకాలతో ఒక బ్యాటరీని నిర్మించాడు. దీని నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను లవణ ద్రావాణాల విద్యుత్ విశ్లేణ ప్రక్రియ ద్వారా పొటాషియం, సోడియంను రాబట్టాడు.
* హీలియం తప్ప మిగిలిన అన్ని జడవాయువుల వేలన్సీ కర్పరంలో 8 మూలకాలు ఉంటాయి.
* మూలక పరమాణవు, దానిలోని వేలన్సీ ఎలక్ట్రాన్‌లను పటం రూపంలో చూపించే పద్ధతిని 'లూయిస్ గుర్తు' లేదా 'ఎలక్ట్రాన్ చుక్కల నిర్మాణం' అంటారు.
* బాహ్య కక్ష్యలోని ఎలక్ట్రాన్‌ను '.' లేదా '×' గుర్తుతో సూచిస్తారు.
అష్టక నియమం (Octet rule)
* పరమాణువులు ఎలక్ట్రాన్‌లను కోల్పోవడం, స్వీకరించడం లేదా పంచుకోవడం ద్వారా వాటి బాహ్య కర్పరంలో ఎనిమిది ఎలక్ట్రాన్‌లను ఉంచుకుంటాయి. దీన్నే అష్టక నియమం అంటారు. ఉత్కృష్ట వాయువులు వాటి పరమాణువుల్లోని బాహ్య కర్పరాల్లో ఎనిమిది ఎలక్ట్రాన్‌లను కలిగి ఉంటాయి. అంటే స్థిరమైన ns2np6 (అష్టక) విన్యాసాన్ని కలిగి ఉంటాయి.
వేలన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం
* ఈ సిద్ధాంతాన్ని కోసెల్, లూయి శాస్త్రవేత్తలు 1916లో ప్రతిపాదించారు.
* దీని ఉద్దేశం ఎలక్ట్రాన్‌ల ఆధారంగా వేలన్సీని నిర్వచించడం.
* జడవాయువుల రసాయన జడత్వం ఆధారంగా వేలన్సీకి ఒక తార్కిక వివరణ ఇచ్చారు.
* ఎలక్ట్రాన్‌లను కోల్పోయిన మూలక అయాన్‌ను 'కాటయాన్', ఎలక్ట్రాన్‌లను స్వీకరించిన మూలక అయాన్‌ను 'ఆనయాన్' అని అంటారు.
* IA, IIA, IIIA గ్రూపు మూలకాలు కాటయాన్‌లను ఏర్పరుస్తాయి.
ఉదా: Na+, Mg+, Al+
* VIA, VIIA గ్రూపు మూలకాలు ఆనయాన్‌లను ఏర్పరుస్తాయి.
ఉదా: O-2, Cl-1
* VIIIA గ్రూపు మూలకాలు ఎలాంటి అయాన్‌లను ఏర్పరచవు.
* ఒక లోహ పరమాణువు దాని వేలన్సీ నుంచి కోల్పోయే ఎలక్ట్రాన్‌ల సంఖ్య దాని గ్రూపు సంఖ్యకు సమానం.
ఉదా: Na వేలన్సీ - 1
Mg వేలన్సీ - 2 ఇవి వాటి గ్రూపు సంఖ్యకు సమానం.
* అలోహ మూలకం దాని పరమాణువు నుంచి గ్రహించే సంఖ్యనే దాని వేలన్సీ అంటారు. ఇది కూడా దాని గ్రూపు సంఖ్యకు సమానం
ఉదా: క్లోరిన్ వేలన్సీ (8 - 7) = 1
అయానిక బంధం:
* కోసెల్ కింది అంశాల ఆధారంగా అయానిక బంధాన్ని వివరించారు.
1) రెండు వేర్వేరు మూలకాలకు చెందిన పరమాణువుల మధ్య ఒక పరమాణువు నుంచి మరొక పరమాణువుకు ఎలక్ట్రాన్ల మార్పిడి వల్ల అయానిక బంధం ఏర్పడుతుంది.
2) ఆవర్తన పట్టికకు ఎడమవైపున ఎక్కువ చర్యాశీలత ఉన్న లోహాలు, కుడివైపున ఎక్కువ చర్యాశీలత ఉన్న అలోహాలు ఉంటాయి.
3) జడవాయువులు తక్కువ చర్యాశీలతను, ఎక్కువ స్థిరాత్వాన్ని పొందుతాయి.
4) బాహ్య కక్ష్యలో 1, 2 లేదా 3 ఎలక్ట్రాన్లు ఉన్న లోహ పరమాణువులు చివరి కక్ష్యలో ఎనిమిది ఎలక్ట్రాన్లు కలిగి, జడవాయువు స్థిర విన్యాసాన్ని పొందడానికి ఆ ఎలక్ట్రాన్‌లను కోల్పోయి కాటయాన్‌లుగా మారతాయి.
5) 5, 6, 7 వేలన్సీ ఎలక్ట్రాన్లను కలిగిన అలోహాలు వాటి చివరి కక్ష్యలో 8 ఎలక్ట్రాన్లను పొందడానికి ఎలక్ట్రాన్లను గ్రహించి ఆనయాన్‌లను ఏర్పరుస్తారు.
* రెండు ఆవేశపూరిత అయాన్ల మధ్య ఏర్పడే బంధాన్ని 'అయానిక' బంధం అంటారు.
* ఆనయాన్‌ల మధ్య పనిచేసే బలాలు స్థిరవిద్యుత్ బలాలు. కాబట్టి ఈ బంధాన్ని 'స్థిరవిద్యుత్ బంధం' (Electrostatic bond) అంటారు.
* వేలన్సీ భావనను ఎలక్ట్రాన్‌ల పరంగా వివరించారు. కాబట్టి దీన్ని 'ఎలక్ట్రోవాలెంట్' బంధం అంటారు.
Na Na+ + e-
1e- + Cl Cl-1
* అయానిక బంధం ద్వారా ఏర్పడే పదార్థాలు
NaCl, MgCl2, Na2O (డైసోడియం మోనాక్సైడ్), AlCl3.
* ఒక నిర్దిష్ట ఆవేశంగా అయాన్ చుట్టూ ఎన్ని వ్యతిరేక ఆవేశం ఉన్న అయాన్లు అమరి ఉన్నాయో తెలిపే సంఖ్యను అయాన్ 'సమన్వయ సంఖ్య' అంటారు.
ఉదా: NaCl లో Na+ సమన్వయ సంఖ్య - 6.
Cl- సమన్వయ సంఖ్య - 6.
* సాధారణంగా లోహ మూలకాలు బాహ్యకక్ష్య నుంచి ఎలక్ట్రాన్లను కోల్పోయి అష్టక విన్యాసాన్ని పొందడానికి ప్రయత్నిస్తాయి. ఈ ధర్మాన్ని లోహధర్మం లేదా ధన విద్యుదాత్మకత అంటారు.
* ధన విద్యుదాత్మకత ఉన్న మూలకాలు కాటయాన్‌లను ఏర్పరుస్తాయి.
* కాటయాన్‌గా, ఆనయాన్‌గా మారే స్వభావం నాలుగు అంశాలపై ఆధారపడుతుంది.
1) పరమాణు పరిమాణం
2) అయనీకరణ శక్మం
3) ఎలక్ట్రాన్ ఎఫినిటీ
4) రుణ విద్యుదాత్మకత
* తక్కువ అయనీకరణ శక్మం, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎక్కువ పరమాణు పరిమాణం ఉన్న మూలకాలు కాటయాన్‌లను ఏర్పరుస్తాయి.
* అధిక అయనీకరణ శక్మం, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, తక్కువ పరమాణు పరిమాణం ఉన్న మూలకాలు ఆనయాన్‌లను ఏర్పరుస్తాయి.
సంయోజనీయ బంధం
* 1916లో జి.ఎన్. లూయిస్ పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్‌ల మార్పిడి జరగకుండానే అష్టక విన్యాసం పొందుతాయని వివరించాడు.
* వేలన్సీ ఎలక్ట్రాన్లను ఒకటిగా లేదా అంతకంటే ఎక్కువ పరమాణువులతో పంచుకోవడం వల్ల సంయోజనీయ బంధం ఏర్పడుతుంది. ఇందులో ఎలక్ట్రాన్ జంటను పరస్పరం సమష్టిగా పంచుకుంటాయి.
ఉదా: ఫ్లోరిన్, ఆక్సిజన్, మీథేన్, అమ్మోనియా, నీటి అణువుల ఏర్పాటు.
* సంయోగం చెందే పరమాణువుల మధ్య రెండు ఎలక్ట్రాన్ జంటలు పంచుకోబడితే 'ద్విబంధం', మూడు ఎలక్ట్రాన్ జంటలు పంచుకోబడితే 'త్రిబంధం' అని అంటారు.
* ఒక మూలకం సంయోజనీయ బంధాలను ఏర్పరిచే సంఖ్యను 'సంయోజనీయత' అంటారు.
* సంయోజనీయ బంధంతో కలిపిన రెండు పరమాణు కేంద్రకాల మధ్య సమతాస్థితి వద్ద ఉండే దూరాన్ని 'బంధ దూరం' లేదా బందదైర్ఘ్యం అంటారు. దీన్ని నానో మీటర్ (nm) లేదా ఆంగ్‌స్ట్రాం యూనిట్ (A°) తో కొలుస్తారు.
* BeCl2 లో Cl-Be-Cl బంధకోణం 180o.
* BF3 లో బంధకోణం 120o. మీథేన్‌లో బంధకోణం 109o 28'.
* అమ్మోనియా (NH3)లో 107o 18', నీటి అణువు (H2O)లో 104o 31' గా బంధకోణాలు ఉంటాయి.
* అణువుల ఆకృతులను వేలన్సీ ఎలక్ట్రాన్ సిద్ధాంతం వివరించలేకపోయింది.
* మూడు లేదా అంతకంటే ఎక్కువ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడిన అణువుల్లో అన్ని పరమాణువులు ఒక కేంద్రక పరమాణువుతో సంయోజనీయ బంధంతో బంధింపబడి ఉన్నప్పుడు వాటి మధ్య బంధ కోణాలను వివరించడానికి VESPRT సిద్ధాంతాన్ని రూపొందించారు.
* VSEPRT అంటే Valance - Shell - Electorn - Pair - Repulsion - Theory.
* VSEPRTని 1940లో సిట్జవిక్, పావెల్‌లు ప్రతిపాదించారు.
* 1957లో దీన్ని గిలెస్పీ, నైహామ్ శాస్త్రవేత్తలు మరింతగా అభివృద్ధి పరిచారు.
* BeCl2, CO2 ఆకృతి రేఖీయం.
* NH3 (అమ్మోనియా) ఆకృతి త్రికోణీయ ద్విపిరమిడ్.
* వెస్పర్ట్ సిద్ధాంతం బంధశక్తులను వివరించడంలో విఫలమైంది.
* వేలన్సీ బంధ సిద్ధాంతాన్ని లైనస్ పౌలింగ్ ప్రతిపాదించారు.
* రెండు ఆర్బిటాళ్ల అంత్యాలు అతిపాతం చెందడం వల్ల లేదా పరమాణు కేంద్రకాలు కలిసే అక్షీయ రేఖ వెంబడి ఆర్బిటాళ్ల అతిపాతం వల్ల సిగ్మా బంధం (σ) ఏర్పడుతుంది.
* ఆర్బిటాళ్ల పార్శ్వ భాగాల అతిపాతం వల్ల పైబంధం (π) ఏర్పడుతుంది.
* π బంధం కంటే σ బంధం బలమైంది, స్వతంత్రమైంది.
* O2 అణువు ఏర్పాటులో 1σ, 1π బంధాలు ఏర్పడతాయి (ద్విబంధం).
* N2 అణువు ఏర్పాటులో 1σ, 2π బంధాలు ఏర్పడతాయి (త్రికబంధం).
* 'లైనస్ పౌలింగ్' పరమాణు ఆర్బిటాళ్ల సంకరీకరణం అనే దృగ్విషయాన్ని ప్రతిపాదించాడు.
* పరమాణు ఆర్బిటాళ్లను పునర్‌వ్యవస్థీకరించడం ద్వారా అదే సంఖ్యలో బంధశక్తి, ఆకారం లాంటి ధర్మాలున్న సర్వసమాన ఆర్బిటాళ్లను ఏర్పరిచే దృగ్విషయాన్ని 'సంకరీకరణం' అంటారు.
* BeCl2 లో sp సంకరీకరణం
* BF3 లో sp2 సంకరీకరణం
* అమ్మోనియాలో sp3 సంకరీకరణం ఉంటుంది.
* అయానిక పదార్థాలు ధృవ ద్రావణాల్లో కరుగుతాయి. అధృవ ద్రావణాల్లో కరగవు.
* సంయోజనీయ పదార్థాలు అధృవ ద్రావణాల్లో కరుగుతాయి. నీరు లాంటి ధృవ ద్రావణాల్లో కరగవు.
సమన్వయ సమయోజనీయ బంధం
* ఒక పరమాణువు వ్యతిరేక స్పిన్‌లు ఉన్న ఎలక్ట్రాన్ జంటను దానం చేస్తే, రెండో పరమాణువు దాన్ని స్వీకరించినప్పుడు ఏర్పడే బంధాన్ని ‘సమన్వయ సమయోజనీయ బంధం’ అంటారు.
* దీన్నే ‘దాత - స్వీకర్త బంధం’ లేదా ‘డేటివ్ బంధం’ అని కూడా అంటారు.
* ఒక పరమాణువులోని ఒంటరి ఎలక్ట్రాన్ జత కలిగిన ఆర్బిటాల్, రెండో పరమాణువులోని ఖాళీ ఆర్బిటాల్‌తో అతిపాతం చెందినప్పుడు సమన్వయ సమయోజనీయ బంధం ఏర్పడుతుంది.
హైడ్రోజన్ బంధం
* అధిక రుణవిద్యుదాత్మకత కలిగిన మూలకాల రెండు పరమాణువుల మధ్యలో హైడ్రోజన్ పరమాణువు ఉంటే, అది ఒక పరమాణువుతో ధ్రువ సమయోజనీయ బంధాన్ని, రెండోదానితో బలహీనమైన స్థిర విద్యుత్ బంధాన్ని ఏర్పరుస్తుంది. ఈ బలహీన స్థిర విద్యుత్ బంధాన్ని ‘హైడ్రోజన్ బంధం’ అంటారు.
* దీన్ని చుక్కల గీతతో (........) సూచిస్తారు.
* అధిక రుణవిద్యుదాత్మకత కలిగిన ఫ్లోరిన్, నైట్రోజన్, ఆక్సిజన్ మూలకాలు హైడ్రోజన్ బంధాలను ఏర్పరుస్తాయి.
* హైడ్రోజన్ బంధాలు రెండు రకాలు. అవి:
1. అంతరణుక హైడ్రోజన్ బంధాలు
2. అణు అంతర హైడ్రోజన్ బంధాలు
అంతరణుక హైడ్రోజన్ బంధం: ఇది రెండు వేర్వేరు అణువుల మధ్య ఏర్పడుతుంది.
ఉదా: నీటి అణువుల మధ్య, ఆల్కహాల్ అణువుల మధ్య లేదా నీరు, ఆల్కహాల్ అణువుల మధ్య అంతరణుక హైడ్రోజన్ బంధాలు ఏర్పడతాయి.
అణు అంతర హైడ్రోజన్ బంధం: ఇది ఒకే అణువులోని రెండు ప్రమేయ సమూహాల మధ్య ఏర్పడుతుంది.
* హైడ్రోజన్ బంధం వల్ల పదార్థాల భౌతిక ధర్మాలైన ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు, ద్రావణీయత మొదలైనవి ప్రభావితమవుతాయి.
* నీటి అణువుల మధ్య అంతరణుక హైడ్రోజన్ బంధాలు ఉంటాయి. అందుకే నీరు ద్రవ స్థితిలో ఉంటుంది.
* అంతరణుక హైడ్రోజన్ బంధం వల్ల నీటికి బాష్పీభవన స్థానం, తలతన్యత, ద్విధ్రువ భ్రామకం, విశిష్టోష్ణం మొదలైనవి అధికంగా ఉంటాయి.
లోహ బంధం
* లోహ పరమాణువులు సులభంగా ఎలక్ట్రాన్‌లను కోల్పోతాయి. ఈ ఎలక్ట్రాన్‌లు ఒక స్థానానికే పరిమితం కాకుండా లోహమంతా స్వేచ్ఛగా దిశారహితంగా తిరుగుతాయి. ఇలాంటి ఎలక్ట్రాన్ మేఘానికి, ధనావేశ లోహ అయాన్‌లకు మధ్య ఉన్న స్థిర విద్యుత్ ఆకర్షణ బలాన్ని ‘లోహ బంధం’ అంటారు.
* లోహాలు అధిక ఉష్ణ, విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తాయి. వీటిలోని స్వేచ్ఛా ఎలక్ట్రాన్‌లే వాటి ఉష్ణ, విద్యుత్ వాహకతకు కారణం.
* లోహ బంధం దిశారహితం. లోహ పరమాణువు ఉపరితలంపై బలం ప్రయోగించినప్పుడు లోహం ఒక పొరలోని పరమాణువులు లేదా అయాన్‌లు ఆ స్థానం నుంచి వేరే చోటుకు కదిలించవచ్చు. ఈ ధర్మం వల్ల లోహాలను తీగలు (తాంతవత), రేకులుగా (ఆఘాతవర్థనీయత) చేయొచ్చు.
రసాయన చర్యలు - సమీకరణాలు
* బొగ్గును మండించడం, శరీరంలో ఆహారం జీర్ణమవడం, ఇనుము తుప్పు పట్టడం; శ్వాస క్రియ, కిరణజన్య సంయోగక్రియ; పాలు పెరుగుగా మారడం, పొడి సున్నానికి నీటిని కలపడం, టపాసులను పేల్చడం లాంటివన్నీ రసాయన మార్పులు.
ఒక రసాయన చర్య జరిగినప్పుడు కింది మార్పులు ఏర్పడతాయి
i) తొలి పదార్థాలు వాటి గుణాత్మక ధర్మాలను కోల్పోతాయి.
ii) రసాయన చర్యలు ఉష్ణమోచక, ఉష్ణగ్రాహక చర్యలు.
iii) కరగని అవక్షేపాన్ని ఏర్పరుస్తూ చర్య జరపవచ్చు.
iv) కొన్ని సందర్భాల్లో వాయువు విడుదల కావచ్చు.
* ఒక రసాయన చర్యలో ఏ పదార్థాలు రసాయన మార్పుకు గురవుతాయో వాటిని 'క్రియాజనకాలు' అంటారు.
* రసాయన చర్యలో కొత్తగా ఏర్పడిన పదార్థాలను 'క్రియాజన్యాలు' అంటారు.
* ఒక రసాయన చర్యను అతి సూక్ష్మ రూపంలో లేదా సంకేతాలతో తెలియజేస్తే దాన్ని 'రసాయన సమీకరణం' అంటారు.
ఉదా: CaOను నీటికి కలపడం వల్ల Ca(OH)2 ఏర్పడుతుంది
CaO + H2O Ca(OH)2
* ఏ రసాయన సమీకరణంలోనైతే క్రియాజనకాల వైపు ఉన్న మూలక పరమాణువుల సంఖ్య క్రియాజన్యాల వైపు ఉన్న మూలక పరమాణువుల సంఖ్యకు సమానంగా ఉంటుందో అలాంటి సమీకరణాన్ని 'తుల్య రసాయన సమీకరణం' అంటారు.
Fe2O3 + 2 Al 2 Fe + Al2O3
రసాయన సమీకరణంలో క్రియాజనకాలు, క్రియాజన్యాలు కిందివాటిపై ఆధారపడతాయి
i) భౌతిక స్థితి
ii) ఉష్ణోగ్రతలో మార్పులు
iii) ఏదైనా వాయువు వెలువడటం
iv) ఏదైనా అవక్షేపం ఏర్పడటం
* పదార్థం నీటిలో కరిగి ఉన్నట్లయితే వాటిని 'జల ద్రావణాలు' అంటారు.
* వేడిచేయడాన్ని Δ గుర్తుతో సూచిస్తారు.
* ఉష్ణాన్ని విడుదలచేసే రసాయన చర్యలను 'ఉష్ణమోచక చర్యలు' అంటారు.
C + O2 CO2 + ఉష్ణం
* ఉష్ణాన్ని గ్రహించే చర్యలను 'ఉష్ణగ్రాహక చర్యలు' అంటారు.
N2 + O2 2 NO - ఉష్ణం
* రసాయన సమీకరణం క్రియాజకాల, క్రియాజన్యాల సాపేక్ష ద్రవ్యరాశుల గురించి తెలియజేస్తుంది.
రసాయన సమీకరణం నుంచి కింది సంబంధాలు తెలుసుకోవచ్చు
A) ద్రవ్యరాశి - ద్రవ్యరాశి సంబంధం
B) ద్రవ్యరాశి - ఘపరిమాణ సంబంధం
C) ఘనపరిమాణ - ఘనపరిమాణ సంబంధం
D) ద్రవ్యరాశి, ఘనపరిమాణం, అణువుల మధ్య సంబంధం
ఉదా: 8 గ్రాముల కాల్షియం కార్బొనేట్‌ను వేడిచేస్తే విడుదలయ్యే CO2 ద్రవ్యరాశి ఎంత?
CaCO3

100 56 44
100 గ్రా. CaCO3 44 గ్రా. CO2 ను ఇస్తుంది.
8 గ్రా. CaCO3 ఇచ్చే CO2 =

* STP వద్ద 230 గ్రాముల సోడియం అధిక నీటితో చర్య పొందినప్పుడు విడుదలైన హైడ్రోజన్ ద్రవ్యరాశి, ఘనపరిమాణాన్ని లెక్కించండి.
2 Na + 2 H2 O

46 36 80 2
46 గ్రా. సోడియం 2 గ్రా.హైడ్రోజన్‌ను ఇస్తుంది.
230 గ్రా. సోడియం

* స్థిర ఉష్ణోగ్రత పీడనాల వద్ద ఒక గ్రామ్ మోలార్ ద్రవ్యరాశి ఏదైనా వాయువు 22.4 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది. దీన్నే 'గ్రామ్ మోలార్ ఘనపరిమాణం' అంటారు.
రసాయన చర్యలు - రకాలు
1. రసాయన సంయోగం
2. రసాయన వియోగం
3. రసాయన స్థానభ్రంశం
4. రసాయన ద్వంద్వ వియోగం
రసాయన సంయోగం
* ఒక రసాయన చర్యలో రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజనకాలు చర్యజరిపి ఒక క్రియాజన్యాన్ని ఏర్పరిచినట్లయితే దాన్ని 'రసాయన సంయోగం' అంటారు.
C + O2

* పొడిసున్నానికి నీటిని కలిపి తడిసున్నం తయారు చేయడం.
C + O2

రసాయన వియోగం:
* ఒక రసాయన చర్యలో ఒక క్రియాజనకం రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజన్యాలుగా విడిపోడాన్ని 'రసాయన వియోగం' అంటారు.
CaCO3- CaO + CO2
* ఇది ఒక ఉష్ణవియోగ చర్య. వేడిచేయడం ద్వారా పదార్థాలు వియోగం చెందినట్లయితే వాటిని ఉష్ణవియోగ చర్యలు అంటారు.
2 Pb(NO3)2 2 PbO + 4 NO2 + O2
2 H2O 2 H2 + O2
2 AgBr

పై చర్యలు కాంతి సమక్షంలో జరుగుతాయి. వీటిని 'కాంతి రసాయన చర్యలు' అంటారు. ఈ చర్యలను 'ఉష్ణగ్రాహక చర్యలు' అని కూడా అంటారు.
రసాయన స్థానభ్రంశం:
* రసాయన చర్యలో సమ్మేళనంలోని ఒక మూలకం మరొక మూలకాన్ని స్థానభ్రంశం చెందించి దాని స్థానంలో అది వస్తుంది. దీన్ని రసాయన స్థానభ్రంశం అంటారు.
ఉదా: Zn + 2 HCl ZnCl2 + H2
Fe + CuSO4 FeSO4 + Cu
Zn + 2 AgNO3 Zn(NO3)2 + 2 Ag
Pb + CuCl2

రసాయన ద్వంద్వ వియోగం:
* ఒక రసాయన చర్యలో రెండు క్రియాజనకాలు ధన, రుణ ప్రాతిపదికలుగా మార్పు చెందితే అలాంటి చర్యను 'రసాయన ద్వంద్వ వియోగం' అంటారు.
Na2SO4 + BaCl2

NaOH + HCl

NaCl + AgNO3

ఆక్సీకరణం, క్షయకరణం
* ఒక రసాయన చర్యలో ఆక్సిజన్‌ను కలపడం, హైడ్రోజన్‌ను తీసివేయడం ద్వారా జరిగే చర్యలను 'ఆక్సీకరణ చర్యలు' అంటారు.
* ఒక రసాయన చర్యలో ఆక్సిజన్‌ను తీసివేయడం, హైడ్రోజన్‌ను కలపడం ద్వారా జరిగే చర్యలను 'క్షయకరణ చర్యలు' అంటారు.
* ఆక్సీకరణం, క్షయకరణం ఒకేచర్యలో జరిగితే వాటిని 'రెడాక్స్ చర్యలు' అంటారు.
2 Cu + O2

CuO + H2

నిత్యజీవిత అనువర్తనాలు:
* టపాసులు పేలడం ఆక్సీకరణ చర్య. దీనిలో మెగ్నిషీయం ఆక్సీకరణం చెందడం వల్ల మిరుమిట్లు గొలిపే కాంతి విడుదలవుతుంది.
* యాపిల్ కోసిన కొంతసేపటి తర్వాత అది గోధుమ రంగులోకి, నిమ్మకాయ ఎరుపు రంగులోకి; ఇనుపు వస్తువులు కొత్తవి తెల్లగా, కాలం గడిచేకొద్దీ గోధుమ రంగులోకి మారుతాయి. వీటన్నింటికీ కారణం ఆక్సీకరణం.
* యాపిల్‌లోని పాలిఫినాల్ ఆక్సిడేజ్ లేదా టైరోసినేజ్ అనే ఎంజైమ్ ఆక్సిజన్‌తో చర్య జరిపి దాన్ని గోధుమ రంగులోకి మారుస్తుంది.
* ఇనుము తుప్పు పట్టడం ఆక్సీకరణ చర్య.
* వెండి వస్తువులపై నల్లని పూత, రాగి వస్తువులపై ఆకుపచ్చ పూత ఏర్పడటానికి కారణం క్షయకరణం.
4 Ag + 2 H2S + O2 2 AgS + 2 H2O (నలుపు)
2 Cu + O2 2 CuO
* తేమ ఉన్న క్లోరిన్ వాయువులు రంగు వస్తువులను విరంజనం చెందించి, రంగును కోల్పోయేలా చేస్తాయి.
Cl2 + H2O@ HOCl + HCl
HOCl HCl + (O) ఇది క్షయకరణ చర్య.
* కొన్నిసార్లు వర్షాకాలంలో విద్యుత్ స్తంభం నుంచి వచ్చే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. దీనికి కారణం విద్యుత్ తీగపై లోహఆక్సైడ్ పూత ఏర్పడటమే. ఈ లోహఆక్సైడ్ విద్యుత్ నిరోధంగా పనిచేస్తుంది.
ముక్కిపోవడం:
*నూనెలు / కొవ్వులు ఎక్కువ కాలం నిల్వచేయడం ద్వారా ఆక్సీకరణం చెంది వాటి రుచి, వాసన మారిపోతాయి. దీన్నే 'ముక్కిపోవడం' అంటారు. ముక్కిపోవడం ఒక ఆక్సీకరణ చర్య.
* ఆహారం పాడవకుండా ఉండాలంటే విటమిన్ C, E లను కలపాలి.
* నూనెలు/కొవ్వులు నిల్వ ఉంచడానికి యాంటీ ఆక్సిడెంట్‌లను కలుపుతారు.
* ఆక్సీకరణాన్ని తగ్గించేందుకు గాలిచొరబడని డబ్బాలో నిల్వ చేస్తారు.
* చిప్స్ తయారీదారులు చిప్స్ ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ప్యాకెట్‌లో 'నైట్రోజన్ వాయువు'ను నింపుతారు. ఇది ఆక్సీకరణాన్ని నిరోధిస్తుంది.