• facebook
  • whatsapp
  • telegram

వృత్త లేదా పైచిత్రాలు

ముఖ్యాంశాలు:

* ఒక వృత్తంలో కేంద్రం చుట్టూ ఏర్పడే కోణాల మొత్తం 360o.

* ఒక వృత్తంలో రెండు వ్యాసార్ధాలతోను, వాటి మధ్య ఉన్న చాపరేఖతో ఆవరించిన ప్రాంతాన్ని సెక్టారు (త్రిజ్యాంతరం) అంటారు.

* సెక్టారు కోణాన్ని కేంద్రీయ కోణం అంటారు.

* దత్తాంశంలో ఇచ్చిన సరుకు విలువను 100% గా పరిగణిస్తారు.

* 100% = 360oగా సూచిస్తారు.   కాబట్టి 10% = 36o  ,   1% = 3.6o

* ఇచ్చిన మొత్తం సరుకును లేదా దత్తాంశాన్ని విభజించి పై లేదా వృత్తాకార చిత్రంలో సెక్టారులుగా చూపిస్తారు.

మోడల్ - 1

*  కింది పై చిత్రం ఒక ప్రదేశం వార్షిక వ్యవసాయ ఉత్పత్తిని తెలియజేస్తుంది. చిత్రాన్ని పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. గోధుమలు 100o, పంచదార 80o, బియ్యం 40o, మిగిలింది 140o


1. మొత్తం ఉత్పత్తి 8100 టన్నులైతే బియ్యం ఉత్పత్తి ఎంత?

2. పంచదార ఉత్పత్తి 2400 టన్నులైతే గోధుమ ఉత్పత్తి ఎంత?

3. గోధుమ ఉత్పత్తి, బియ్యం ఉత్పత్తి కంటే ఎంత శాతం అధికం?

సాధన:

a) గోధుమలు = 1000  కాబట్టి  

మొత్తం ఉత్పత్తి 810o టన్నులు

కాబట్టి 360o = 810o
100= ?
100=  × 8100 = 2250  టన్నులు
b) చక్కెర =  80o

=   × 100 =   = 22 %
మొత్తం ఉత్పత్తి = 8100 టన్నులు
360o = 8100 టన్నులు
80o = ?

c) బియ్యం= 400 కాబట్టి   × 100 = 11

%

మొత్తం ఉత్పత్తి = 8100 టన్నులు
360= 8100  టన్నులు
40= ?

40o =   × 8100 = 900 టన్నులు
d) మిగిలింది = 140o
కాబట్టి   × 100 =  = 38 %
మొత్తం ఉత్పత్తి =  8100 టన్నులు
360o = 8100 
140= ? 
∴ 140=   × 8100 = 3150 టన్నులు

1. జ:  C నుంచి బియ్యం ఉత్పత్తి 900 టన్నులు
2. జ: పంచదార ఉత్పత్తి 2400 టన్నులైతే
         80% = 2400 టన్నులు
గోధుమ ఉత్పత్తి =  

  ×  2400 = 3000   టన్నులు
3. జ:  గోధుమలు = 100o బియ్యం ఉత్పత్తి = 40o
అధికం = 60o
∴ 40o మీద అధికం = 60o 
∴ 100o = ? =   × 60% = 150%

మోడల్ - 2

* ఒక బోర్డు పరీక్షలో 540 మార్కులు సాధించిన ఒక విద్యార్థి వివిధ సబ్జెక్టుల్లో సాధించిన వివరాలు ఈ చిత్రంలో ఉన్నాయి. చిత్రాన్ని పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి.

1. ఏ సబ్జెక్టులో విద్యార్థి 108 మార్కులు సాధించాడు?
2. ఏ పరీక్షలో 16  % మార్కులు సాధించాడు?
3. హిందీ, గణితం, మొత్తం మార్కులు, ఇంగ్లిష్, సైన్సు, సోషల్ మొత్తం మార్కులకు వ్యత్యాసం ఎంత?

సాధన:
a) 360o = 100%  ఆంగ్లం = 63o  కాబట్టి 63o = ?
--> 63o  =  =  =  17.5%
b) గణితం 90o  కాబట్టి 90o = ?
90=  

 × 100 = 25%
c) హిందీ 60o  కాబట్టి 60o = ?
60=  × 100 =   = 16 %
d) సైన్సు 75o  కాబట్టి 75o = ?
75=  × 100 = = 20 %
e) సోషల్ 72o  కాబట్టి 72o = ?
72=   × 100 = 20%
మొత్తం మార్కులు = 540

1. జ: సోషల్‌లో 108 మార్కులు సాధించాడు.
2. జ:  హిందీలో 16  % మార్కులు సాధించాడు.
3. జ:  హిందీ + గణితం = 90 +135 = 225 మార్కులు
ఇంగ్లిష్ + సైన్సు + సోషల్ = 94.5 + 112.5 + 108 = 315 మార్కులు
∴ వ్యత్యాసం = 315 - 225 = 90 మార్కులు.

 మోడల్ - 3

* ఒక కుటుంబం ఆహారం, దుస్తులు, అద్దె, ఇతర ఖర్చులు, పొదుపులపై ఖర్చుపెట్టిన మొత్తాలను కింది వృత్తాకార చిత్రం సూచిస్తుంది. ఆహారం 108o, అద్దె 72o, దుస్తులు 72o, ఇతర ఖర్చులు 72o. అయితే పొదుపెంత? ఆ కుటుంబం వార్షికాదాయం రూ.60,000/- అయితే వారి ఆహారం, అద్దె, దుస్తులు, ఇతర ఖర్చుల మొత్తమెంత? వాటి వివరాలను శాతాల్లో కూడా తెలపండి.


సాధన:
కుటుంబ సంవత్సర ఆదాయం = రూ. 60,000/-
a) ఆహారానికి 108o
360o = 60,000
108o = ?
108o =   × 60,000
= రూ.18,000
∴ ఆహారానికి అయ్యే ఖర్చు =  రూ.18,000/-
360o = 100%  

   × 100 = 30%
108% = ?
∴ ఆహారానికి అయ్యే ఖర్చు  = 30%

b) అద్దెకు 720 

3600 = 60,000

72o = ?
72o =   × 60,000 = రూ.12,000
అద్దెకు అయ్యే ఖర్చు = రూ.12000
360o = 100%  

   × 100 = 20%
72% = ?
∴ అద్దెకు అయ్యే ఖర్చు శాతం = 20%
c) దుస్తులకు 72o కాబట్టి అయ్యే ఖర్చు రూ.12,000/- ఖర్చు శాతం 20%
d) ఇతర ఖర్చులకు 72o కాబట్టి అయ్యే ఖర్చు రూ.12,000/- ఖర్చు శాతం 20%
e) పొదుపు = మొత్తం సొమ్ము - (ఆహారం + అద్దె + దుస్తులు + ఇతర ఖర్చుల మొత్తం) = రూ.60,000 - (18,000 + 12,000 + 12,000 + 12000) = రూ 6000/-
పొదుపు శాతం =  × 100 = 10%

మోడల్ - 4

* కింది వృత్తాకార చిత్రాల్లో ఒక పారిశ్రామిక సంస్థ ఉద్యోగుల వివరాలు, ఆ సంస్థ సంవత్సరాంతర ఖర్చుల వివరాలు ఉన్నాయి. ఇచ్చిన చిత్రాలను పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
మొత్తం ఖర్చు = రూ.12 కోట్లు మొత్తం ఉద్యోగులు = 1200 మంది.

1. అకౌంట్స్ విభాగం నుంచి అయ్యే ఖర్చు మొత్తం ఎంత?
2. మార్కెటింగ్ విభాగానికి చెందిన ఉద్యోగుల జీతం నిమిత్తం అయ్యే ఖర్చు మొత్తం ఎంత?
3. కంప్యూటర్ విభాగానికి చెందిన ఉద్యోగుల టెలిఫోన్ ఖర్చు ఎంత?
4. ఆరోగ్యం విభాగానికి చెందిన ఒక్కొక్క ఉద్యోగిపై అయ్యే ఖర్చు ఎంత?


1. జ: అకౌంట్స్ విభాగం నుంచి అయ్యే ఖర్చు
= రూ.12 కోట్లలో 14%
= రూ.14/100 × 12 కోట్లు = రూ. 1.68 కోట్లు


2. జ:  కంపెనీలో మొత్తం ఉద్యోగుల జీతం = రూ.12 కోట్లలో 30%
= రూ.  × 12,00,00,000 =  రూ. 3,60,00,000
కాబట్టి మార్కెటింగ్ ఉద్యోగుల జీతం నిమిత్తం అయ్యే ఖర్చు
= రూ.36,000000 ×   = రూ.61,20,000 


3. జ:  కంప్యూటర్ విభాగానికి చెందిన ఉద్యోగుల టెలిఫోన్ ఖర్చు
= రూ.  ×× 12 కోట్లు
= రూ.

 ×× 120 మిలియన్‌లు
= రూ.1.152 మిలియన్‌లు
= రూ.11.52 లక్షలు

4. జ: ఆరోగ్య విభాగంపై అయ్యే మొత్తం ఖర్చు = రూ. 12 కోట్లలో 13% 
=× 12 కోట్లు = రూ.1.56  కోట్లు = 15600000
ఒక్కొక్క ఉద్యోగిపై అయ్యే ఖర్చు = రూ.15600000/ 1200 = రూ.13000

 మోడల్ - 5

కింది సమాచారం చదివి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
A, B, C, D, E, F అనే వివిధ కోర్సుల్లో విద్యార్థుల శాతం, వారిలో బాలికల శాతం కింది వృత్తాకార చిత్రంలో చూపించారు.
మొత్తం విద్యార్థులు = 1200 మంది (బాలికలు 800 మంది, బాలురు 400 మంది)


1. కోర్సు D లో చేరిన బాలుర, బాలికల నిష్పత్తి ఎంత?
2. ఏయే కోర్సుల్లో బాలుర సంఖ్య సమానం?
3. కోర్సు E లో బాలుర కంటే బాలికలు ఎంత శాతం అధికం?
4. ఏ కోర్సులో బాలుర సంఖ్య తక్కువ?
5. C కోర్సులోని బాలికల సంఖ్య?

సాధన:
1. జ: కోర్సు D లో బాలికల సంఖ్య = 800 లో 30%
= ×800=240
కోర్సు D లోని మొత్తం విద్యార్థుల సంఖ్య = 1200లో
35% =

× 1200 = 420
కాబట్టి బాలుర సంఖ్య = 420 - 240 = 180 మంది
... బాలుర, బాలికల నిష్పత్తి = 180 : 420 = 3 : 4
2. జ: ఒకొక్క కోర్సులో బాలుర సంఖ్య
కోర్సు E లో బాలుర సంఖ్య = 1200 లో 12% - 800 లో 14% = 144 - 112 = 32
కోర్సు F లో బాలుర సంఖ్య = 1200 లో 13% - 800లో 14% = 156 - 112 = 44
కోర్సు A లో బాలుర సంఖ్య = 1200 లో 20% - 800లో 30% = 240 - 240 =0
కోర్సు D లో బాలుర సంఖ్య = 1200 లో 35% - 800 లో 30% = 420 - 240 = 180
కోర్సు C లో బాలుర సంఖ్య = 1200 లో 5% - 800 లో 2% = 60 - 16 = 44
C, Fలలో బాలుర సంఖ్య సమానం
3. జ:  కోర్సు E లో బాలికల సంఖ్య = 800 లో 14%
= × 800 = 112
కోర్సు E లో బాలుర సంఖ్య = 32
కావలసిన శాతం =  × 100 = 28.57%
4. జ: కోర్సు A
5. జ:  C కోర్సులోని బాలికల సంఖ్య = 800లో  2%
 × 800=16%

మోడల్ - 6

* ఒక వృత్తాన్ని కొన్ని సెక్టార్లుగా విభజించి, వాటిలో సమాచారాన్ని సూచించే చిత్రాలను ‘వృత్తరేఖా చిత్రాలు’ అంటారు. (లేదా) ఇచ్చిన సమాచారాన్ని, వృత్తాన్ని సెక్టార్లుగా విభజించి, దృశ్య రూపంలో ప్రదర్శించడాన్ని వృత్తరేఖా చిత్రం/ పై చిత్రం అంటారు.

ప్రతి సెక్టార్‌ కేంద్రం వద్ద చేసే కోణం (సెక్టార్‌ వైశాల్యం) అది సూచించే అంశ విలువకు అనులోమానుపాతంలో ఉంటుంది.

ఉదా: ఒక కుటుంబం నెలవారీ ఆదాయం-ఖర్చు వివరాలు కింది విధంగా ఉన్నాయి.

పై పట్టికలోని దత్తాంశాన్ని వృత్తరేఖా చిత్రం ద్వారా ప్రదర్శించడానికి, వృత్తాన్ని 5 సెక్టార్లుగా విభజించాలి.

వృత్త కేంద్రం వద్ద మొత్తం కోణం 360o

మాదిరి సమస్యలు

1. కింది వృత్తరేఖా చిత్రంలో విద్యార్థులు పాఠశాలకు ఏయే రవాణా మార్గాల ద్వారా వస్తారనే అంశాలు పేర్కొన్నారు. వీటి ఆధారంగా ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

I. పాఠశాలకు కాలినడకన వచ్చే విద్యార్థులకు సంబంధించి కేంద్రం వద్ద చేసే కోణం......

1) 144o  2) 48o  3) 36o  4) 72o

II. పాఠశాలకు వచ్చే విద్యార్థుల్లో మోటారు బైకు మీద వచ్చే వారి శాతం?

III. పాఠశాలకు కారులో వచ్చే విద్యార్థుల సంఖ్య 10 అయితే, బస్సులో వచ్చే వారు ఎంత మంది?

1) 60   2) 50   3) 70   4) 75

IV. కాలినడకన పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య 180 అయితే, పాఠశాల మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత?

1) 540  2) 480  3) 450  4) 420

 సాధన: 

I. వృత్తంలో కేంద్రం వద్ద చేసే కోణం = 360o

బస్సు + కారు + మోటారు బైకు + నడక  = 360o

120o + 24o + 72o + x = 360o

216o + x = 360o

x = 360- 216= 144o

                                 సమాధానం: 1

II. మోటారు బైకు మీద పాఠశాలకు వచ్చే 

III. కారులో వచ్చే విద్యార్థులకు సంబంధించిన కోణం = 24o

బస్సులో వచ్చే విద్యార్థులకు సంబంధించిన కోణం = 120o

24o కోణం = 10 మంది విద్యార్థులు

120o కోణం = ?

x 10 = 50  

                         సమాధానం: 2

IV. నడక = 144o, మొత్తం = 360o,

 144o కోణం = 180 విద్యార్థులు

360o కోణం = ? 

2. కింది వృత్తరేఖా చిత్రం ఒక కుటుంబం నెలకు ఆహారం, అద్దె, దుస్తులు, విద్య, పెట్రోల్, ఇతర అవసరాలకు సంబంధించి చేసే ఖర్చులను సూచిస్తుంది. రేఖా చిత్రం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు తెలపండి.

I. కుటుంబం ఆహారానికి చేసిన ఖర్చు రూ.9000 అయితే, విద్యకు చేసిన ఖర్చు?

1) రూ.5000    2) రూ.5200   3) రూ.5400    4) రూ.6000

II. కుటుంబం పెట్రోల్‌కు చేసిన ఖర్చుకు సంబంధించి కేంద్రం వద్ద చేసే కోణం విలువ....

1) 48       2) 42o          3) 50o      4) 54o

III. కుటుంబం ఆహారంపై రూ.9000 ఖర్చు చేసింది. అద్దె, విద్య కోసం అయిన ఖర్చును మినహాయించి, మిగిలిన వాటిపై ఆ కుటుంబం చేసిన ఖర్చు మొత్తం ఎంత?

1) రూ.18,600    2) రూ.17,600       3) రూ.15,600    4) రూ.22,600

IV. కుటుంబం పెట్రోల్‌పై చేసిన ఖర్చు రూ.6000 అయితే, దుస్తులపై చేసిన ఖర్చు ఎంత?

1) రూ.5000    2) రూ.4800      3) రూ.4500    4) రూ.5400

V. కుటుంబం ఇంటి అద్దె, దుస్తులు, పెట్రోల్‌పై చేసిన మొత్తం ఖర్చు శాతం, ఆహారంపై చేసిన ఖర్చు శాతం కంటే ఎంత మొత్తం ఎక్కువ?

1) 15%      2) 16%        3) 17%          4) 18%

సాధన: 

I. ఆహారానికి చేసిన ఖర్చు = రూ.9000

 ఆహారానికి చేసిన ఖర్చు శాతం = 30%

 విద్య కోసం చేసిన ఖర్చు శాతం = 18%

 విద్యకు సంబంధించిన ఖర్చు 

II. పెట్రోల్‌పై చేసిన ఖర్చు శాతం = 15%

  పెట్రోల్‌ ఖర్చుకు సంబంధించి కేంద్రం వద్ద 


III. ఆహారంపై చేసిన ఖర్చు శాతం = 30%

  ఆహారంపై చేసిన ఖర్చు = రూ.9000

  కుటుంబం మొత్తం ఖర్చు = రూ. x

  రూ. xలో 30% = రూ.9000

Posted Date : 11-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌