• facebook
  • whatsapp
  • telegram

దిశలు

  వివిధ పోటీ పరీక్షల్లో దిశలు అంశం నుంచి ప్రశ్నలు వస్తుంటాయి. ఇందులో అభ్యర్థి పరిశీలనా జ్ఞానాన్ని అంచనా వేస్తారు. ఈ విభాగంలో ప్రశ్నలను సాధించాలంటే పరీక్షార్థికి దిక్కులు, మూలలు, దిశల మధ్య కోణాలపై అవగాహన ఉండాలి.

మూలలు: ఇవి నాలుగు ఉంటాయి.

ఈశాన్యం N - E: తూర్పు, ఉత్తరం మధ్య ఉండే మూల.

ఆగ్నేయం S - E: తూర్పు, దక్షిణం మధ్య మూల.

నైరుతి S - W: పడమర, దక్షిణం మధ్య మూల.

వాయవ్యం N - W: పడమర, ఉత్తరం మధ్య మూల.

మాదిరి సమస్యలు

1. శిల్ప ఒక దిక్కులో 6 కి.మీ. నడిచాక, ఎడమ వైపు తిరిగి మరో 8 కి.మీ. ప్రయాణించింది. అయితే ప్రస్తుతం శిల్ప ఉన్న స్థానానికి, మొదట బయలుదేరిన స్థానానికి మధ్య దూరం ఎంత?

1) 12 కి.మీ.     2) 14 కి.మీ. 

3) 10 కి.మీ.     4) 9 కి.మీ.

సాధన: పైథాగరస్‌ సిద్ధాంతం ప్రకారం,

అమ్మాయి ప్రయాణించిన దూరం = 10 కి.మీ.

సమాధానం: 3

2. ఒక వ్యక్తి కింవి విధంగా నడిచాడు

i) తూర్పు దిశలో 60 మీ. 

ii) తర్వాత దక్షిణం దిశలో 80 మీ.

iii) ఆపై పడమర దిక్కుగా 120 మీ.

iv) తదుపరి ఉత్తర దిశలో 30 మీ.

v) అనంతరం తూర్పు దిశలో 60 మీ. 

  అయితే అతడు నడక ప్రారంభించిన బిందువు నుంచి నడక పూర్తి చేసిన బిందువుల మధ్య దూరం ఎంత?

1) 30 మీ.       2) 50 మీ. 

3) 60 మీ.      4) 120 మీ.

సాధన:

సమాధానం: 2


3. ఒక వ్యక్తి కింది విధంగా నడిచాడు.

i) 50 మీ. తూర్పువైపు 

ii) తర్వాత 50 మీ. దక్షిణంవైపు

iii) అక్కడి నుంచి 120 మీ. పడమరవైపు 

iv) తదుపరి 25 మీ. ఉత్తరంవైపు

v) చివరగా 70 మీ. తూర్పువైపు

  అయితే మొదటి బిందువు నుంచి చివరి బిందువుకు మధ్య దూరం ఎంత?

1) 25 మీ.     2) 30 మీ. 

3) 40 మీ.     4) 50 మీ.

సాధన:

సమాధానం: 1

4. Mకు దక్షిణంగా, Qకు తూర్పువైపున N ఉంది. అయితే Q దృష్ట్యా M దిశ....

1) ఆగ్నేయం     2) ఈశాన్యం

3) వాయవ్యం     4) నైరుతి

సాధన:

సమాధానం: 2

5. హరిత దక్షిణంవైపు 12 కి.మీ. నడిచి, తర్వాత ఎడమవైపు తిరిగి 12 కి.మీ. ప్రయాణించింది. అక్కడి నుంచి కుడివైపు 7 కి.మీ. నడిచి, మళ్లీ కుడివైపు తిరిగి 12 కి.మీ. వెళ్లింది. అయితే ఆమె బయలుదేరిన స్థానం నుంచి ప్రస్తుతం ఎంత దూరంలో ఉంది?

1) 17 కి.మీ.     2) 21 కి.మీ. 

3) 15 కి.మీ.      4) 19 కి.మీ.

సాధన:

సమాధానం: 4


6. రూపశ్రీ ఇంటి ముఖ ద్వారం ఉత్తరం వైపు ఉంది. ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చి తిన్నగా 10 మీ. నడిచి, ఎడమవైపునకు తిరిగి 25 మీ. వెళ్లింది. ఆమె అక్కడి నుంచి కుడివైపునకు తిరిగి 5 మీ. నడిచింది. తర్వాత మళ్లీ కుడివైపు తిరిగి 25 మీ. నడిచింది. ఆమె బయలుదేరిన స్థలం నుంచి గమ్యస్థానానికి ఉన్న దూరం ఎంత?

1) 5 మీ.     2) 10 మీ. 

3) 15 మీ.     4) 20 మీ.

సాధన:

సమాధానం: 3


7. A, B, C, D, E, F, G, Hలు వరుసక్రమంలో ఒక గుండ్రటి బల్ల చుట్టూ సమాన దూరంలో కూర్చున్నారు. వారి స్థానాలు సవ్యదిశలో ఉన్నాయి. బి ఉత్తరం వైపు కూర్చుంటే దీ కూర్చున్న దిశ....

1) తూర్పు     2) ఆగ్నేయం 

3) దక్షిణం      4) నైరుతి

సాధన:

సమాధానం: 4

Posted Date : 23-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌