• facebook
  • whatsapp
  • telegram

రుసుము

* కొనుగోలుదారులను ఆకర్షించేందుకు వర్తకులు ప్రకటన ధరపై కొంత తగ్గించి అమ్ముతారు. దీన్నే రుసుము లేదా ముదరా అంటారు.  ప్రకటన ధర/ ముద్రిత ధర కంటే ఒక వస్తువును తక్కువకు అమ్మితే, ఆ తగ్గింపు విలువను రాయితీ అంటారు.

రాయితీ = ప్రకటన వెల - అమ్మిన వెల


       
మాదిరి ప్రశ్నలు


1. ఒక వ్యక్తి వస్తువును 20% రాయితీతో రూ.240 లకు కొనుగోలు చేశాడు. అయితే ఆ వస్తువు ప్రకటన ధర ఎంత?

1) రూ.250       2) రూ.350       3) రూ.300       4) రూ.400



2. సుభాష్‌ ఒక గడియారాన్ని దాని ప్రకటన ధరపై  30% రాయితీతో కొనుగోలు చేశాడు. రాయితీ లేకపోతే రూ.82.50 అదనంగా చెల్లించాల్సి  ఉంటుంది. అయితే సుభాష్‌ గడియారాన్ని ఎంతకు కొన్నాడు?  

1) రూ.182.50        2) రూ.172.50       3) రూ.185.50       4) రూ.192.50


3. ఒక వస్తువుపై ప్రకటించిన రెండు రాయితీలు  వరుసగా 20%, 25%. అయితే ఈ రాయితీలకు సమానమైన రాయితీ ఎంత?

1) 40%      2) 35%      3) 45%      4) 45.5%


 


4. ఒక వస్తువుపై రెండు రాయితీలు వరుసగా 15%, 10% ఇస్తే, ఈ రాయితీలకు సమానమైన ఏకైక రాయితీ ఎంత?

1) 25%     2) 24%      3) 23.5%      4) 26%


           


5. ఒక వస్తువు ప్రకటన ధర రూ.500,  దాన్ని  20%, 10% వరుస రాయితీలతో అమ్మితే, ఆ వస్తువు అమ్మిన ధర ఎంత?

1) రూ.340     2) రూ.350      3) రూ.345      4) రూ.360


               


6. ఒక వ్యాపారి ఒక వస్తువును 20% రాయితీతో అమ్మాడు. ఒకేసారి నగదు చెల్లిస్తే 30% రాయితీ ఇచ్చాడు. వినియోగదారుడు ఆ వస్తువును రూ.2240 చెల్లించి కొనుగోలు చేస్తే ఆ వస్తువు ప్రకటన వెల ఎంత?

1) రూ.4050      2) రూ.4000       3) రూ.3500       4) రూ.4500


               


7. ఒక వ్యాపారి ఒక వస్తువుపై రెండు రకాల రాయితీలు ప్రకటించాడు. అవి A. 3%, 7%     B. 2%, 8%  పై వాటిలో వినియోగదారుడికి ఏది లాభదాయకంగా ఉంటుంది? 

1) A       2) B       3) A, B      4) ఏదీకాదు

సాధన: 3 x 7 > 2 x 8 

21 > 16

పై రెండింటిలో దేని లబ్ధం కనిష్ఠంగా ఉంటుందో ఆ రకం వినియోగదారుడికి లాభదాయకంగా ఉంటుంది.

                                                                                                                     సమాధానం: 4


8. ఒక వస్తువు ప్రకటన ధర రూ.900. వస్తువుపై ప్రకటించిన వరుస రాయితీలు 10%,   10% బదులుగా ఆ వ్యాపారి వస్తువుపై 20% రాయితీ ప్రకటిస్తే అతను పొందే లాభం లేదా నష్టం ఎంత?

1) రూ.9 నష్టం     2) రూ.7 నష్టం      3) రూ.9 లాభం      4) రూ.7 లాభం

సాధన: కేస్‌-1: 


                             
             

9. ఒక వస్తువు ప్రకటన ధరపైౖ ఒక వ్యాపారి రెండు రకాల వరుస రాయితీలు ప్రకటించాడు. అవి మొదటిరకం 30%, 20%, రెండో రకం 40%, 25%. ప్రకటన ధరపై పై రెండు రకాల రాయితీల మధ్య వ్యత్యాసం రూ.33 అయితే ఆ వస్తువు ప్రకటన వెల ఎంత?

1) రూ.400     2) రూ.350       3) రూ.300     4) రూ.450

సాధన: కేస్‌-1: 

10. ఒక వస్తువు ప్రకటన వెల రూ.1050, రెండు వరుస రాయితీల అనంతరం వినియోగదారుడు ఆ వస్తువుకు రూ.798 చెల్లించాడు. వాటిలో మొదటి రాయితీ 20% అయితే రెండో రాయితీ ఎంత?

1) 10%     2) 5%     3) 15%          4) 20%

              
రెండో రాయితీ = 5% (100% - 95%)          సమాధానం: 2


11. ఒక ఫ్యాన్‌ ముద్రిత వెల రూ.1500, ప్రకటించిన రాయితీ 20%. వినియోగదారుడు ఆ ఫ్యాన్‌ను రూ.1104లకు కొనుగోలు చేస్తే వినియోగదారుడు పొందిన అదనపు రాయితీ ఎంత?

1) 7%       2) 8%     3) 10%        4) 11%


12. ఒక వస్తువు ధర రూ.25. రెండు సమాన రాయితీల అనంతరం ఆ వస్తువు విలువ రూ.20.25 అయితే ఒక్కొక్క ముదరా ఎంత?

1) 5%       2) 7%       3) 8%       4) 10%


             
13. ఒక వస్తువు ధరను 30% పెంచి, దానిపై 10% చొప్పున రెండు వరుస రాయితీలు ప్రకటిస్తే ఆ వస్తువు ధరలోని మార్పు ఎంత?

1) 10% పెరుగుదల    2) 5.3% పెరుగుదల     3) 3% తగ్గుదల      4) 5.3% తగ్గుదల


 
     
14. ఒక వ్యాపారి ఒక వస్తువు ప్రకటిత వెలపై 10% రాయితీ ఇస్తే 10% లాభం వస్తుంది. ఆ వస్తువు కొన్న వెల రూ.9000 అయితే దాని ప్రకటన వెల ఎంత?

1) రూ.10000      2) రూ.12500      3) రూ.11500      4) రూ.11000 

  


15. ఒక వ్యాపారి వస్తువులపై తాను కొన్న వెల కంటే 25% ఎక్కువగా ప్రకటించి దానిపై 15% రాయితీ ఇచ్చాడు. ఈ లావాదేవీలో అతనికి వచ్చిన లాభ శాతం ఎంత?



16. ఒక టెలివిజన్‌ ప్రకటన ధర రూ.24,000 ఒక దుకాణదారుడు 20% రుసుము ఇచ్చి 20% లాభాన్ని పొందాడు. రుసుము ఇవ్వకపోతే ఈ లావాదేవీలో అతనికి వచ్చిన లాభశాతం ఎంత?

1) 50%     2) 30%     3) 40%      4) 25% 

Posted Date : 29-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌