• facebook
  • whatsapp
  • telegram

ఈ-గవర్నెన్స్‌

దేశంలోని ప్రజలకు సత్వర, మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ-గవర్నెన్స్‌కు ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి.
* e - ఆఫీస్‌: కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఆధునికీకరణలో భాగంగా ఐసీటీ (ICT) అనుసంధానంతో ఈ - ఆఫీస్‌ను రూపొందించారు. దీని ద్వారా ఉద్యోగులకు పనిభారం తగ్గి, ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందుతాయి.


*  IVFRT  (Immigration Visa and Foreigners Registration and Tracking):  భారత్‌కు వచ్చే విదేశీయులు, ఎన్‌ఆర్‌ఐలకు IVFRT ద్వారా మెరుగైన సేవలు అందుతాయి. విదేశీయుల కార్యకలాపాలను గమనించవచ్చు.


* ప్రత్యక్ష నగదు బదిలీ (Direct Cash Transfer)/ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (Direct Benefit Transfer): ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచి, ఆర్థిక అసమానతలను తొలగించడం నగదు బదిలీ కార్యక్రమం ఉద్దేశం. ఇందులో ఆధార్‌ అనుసంధానం ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఉపాధి కల్పన కోసం అమలు చేస్తున్న మహాత్మాగాంధీ నేషనల్‌ రూరల్‌ ఎంప్లాయిమెంట్‌ గ్యారెంటీ (MGNREGA), సామాజిక భద్రతను కల్పించేందుకు అందిస్తున్న వృద్ధాప్య, దివ్యాంగుల పింఛన్‌లు మొదలైనవి దీనికి ఉదాహరణలు.


 e-Suvidha:  ఈ పోర్టల్‌ ద్వారా రూ.50 కోట్లకు పైన, రూ.1000 కోట్లకు దిగువన ఉన్న ప్రాజెక్టులను సమీక్షించవచ్చు.
* ఈ-పాలన విషయంలో మన దేశం పురోగమనంలో ఉన్నప్పటికీ ప్రజాచైతన్యం, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్‌ అక్షరాస్యత దీని అమల్లో కీలకం కానున్నాయి.
*  హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ లభ్యత, దేశవ్యాప్తంగా విస్తరించే మొబైల్‌ టెకాల్నజీలైన 4జీ, 5జీ సేవలపై ఈ - గవర్నెన్స్‌ విజయం ఆధారపడి ఉంది. 
 

ఆంధ్రప్రదేశ్‌లో ఈ - గవర్నెన్స్‌ సేవలు
ఈ - ప్రగతి 
* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ - ప్రగతి ద్వారా ఈ - గవర్నెన్స్‌ సేవలను అందిస్తున్నారు.
* myap.e-pragati.in  పోర్టల్‌ ద్వారా వివిధ రకాల సేవలు పొందొచ్చు.
* ఇది అన్ని ప్రభుత్వ సేవలను అందించే ఏకైక ఆన్‌లైన్‌ పోర్టల్‌. ఆంధ్రప్రదేశ్‌ పౌరులకు మెరుగైన, పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించాలనేది దీని ఉద్దేశం. 
* ప్రజా సంక్షేమ కార్యక్రమాలైన పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ (PDS), ఆయా వర్గాలకు అందించే ఫించన్‌లు (Social Security Pensions), ప్రకృతి వైపరీత్యాల సమయంలో హెచ్చరికల జారీ  (Forecasting and Early Warning system) కోసం దీన్ని వినియోగిస్తున్నారు.
* ఐటీ సేవలు, ఈ- పాలన అందించడంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.
* ఈ - ప్రగతి సేవలు ICT పరికరాలైన డేటా అనలిటిక్స్‌ (Data Analytics), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (Internet of Things), మిషన్‌ లెర్నింగ్‌  (Machine Learning), బ్లాక్‌ చైయిన్‌  (Block Chain) సాంకేతికతతో అనుసంధానమై ఉన్నాయి.
* 2017 సంవత్సరాన్ని ‘ఈ - ప్రగతి ఏడాది’గా (Year of e - pragathi) పిలుస్తారు.
* ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి - మేకపాటి గౌతమ్‌రెడ్డి 
 

ప్రజావాణి (Prajavani) 
* ప్రజావాణి  (An effort to empower) కార్యక్రమం ద్వారా సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి సమస్యలకు పరిష్కారాలు పొందొచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం ద్వారా దీన్ని నిర్వహిస్తున్నారు. 
* ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య జరిగే పరస్పర చర్యలను ఆన్‌లైన్‌ వేదిక ద్వారా తెలుపుతుంది.
* ప్రజావాణి ద్వారా తమ సమస్యలకు సంబంధించిన పరిష్కారాలు ఏ దశలో ఉన్నాయో ప్రజలు తెలుసుకోవచ్చు. 
* జిల్లా కలెక్టర్‌ వివిధ ప్రభుత్వ యంత్రాంగాల పనితీరును సమీక్షించవచ్చు.
* ఇసుక పంపిణీ (Online Booking System for Sand Purchase): ఆంధ్రప్రదేశ్‌లోని వినియోగదారులు  www.sandbyshg.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకుంటే ఇసుకను వారి ఇంటికే పంపిస్తారు. ఇసుక పంపిణీ స్టేటస్, రసీదులు సంక్షిప్త సమాచారం ్బ(్ఝ(్శ రూపంలో వస్తాయి.  


* మీ - సేవ (Mee seva) 
* ప్రజలు  www.esevaonline.com  వెబ్‌సైట్‌ ద్వారా వివిధ సేవలు పొందొచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేయొచ్చు. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ట్రాక్‌ చేయొచ్చు.


యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌  ప్రాజెక్ట్‌  (UID)

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా దేశంలోని ప్రజలందరికీ  UIDAI - Unique Identification Authority of India  ద్వారా ఒక విశిష్టమైన కోడ్‌ను 12 అంకెల ఆధార్‌ నంబరు రూపంలో కేటాయిస్తారు. ఆధార్‌ ద్వారా దేశపౌరులు పలు రకాల సేవలు పొందొచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని పొందేందుకు ఆధార్‌ ఉపయోగపడుతుంది. ప్రభుత్వ విధివిధానాలు పౌరులను ఎంత మేరకు ప్రభావితం చేశాయో దీని ద్వారా అంచనా వేయొచ్చు.
* UIDAI  ప్రస్తుత సీఈఓ - సౌరభ్‌ గార్గ్‌  
 

 ఎం - గవర్నెన్స్‌ (M-Governance)

మొబైల్‌ ఫోన్ల ద్వారా (Apps) ప్రభుత్వం పౌరులకు అందించే మరింత మెరుగైన, వేగవంతమైన, సౌలభ్యకరమైన ఈ - గవర్నెన్స్‌ సేవలనే ఎం - గవర్నెన్స్‌ సేవలుగా పిలుస్తారు.
* ఎం - గవర్నెన్స్‌లో వైర్‌లెస్‌ ద్వారా మొబైల్‌ ఫోన్లలో సేవలను అందిస్తారు. 
* ఎం - గవర్నెన్స్‌ యాప్‌ల వినియోగం, సేవల ద్వారా ఈ- పాలన మారుమూల ప్రాంతాలకు సైతం సులభంగా చేరుతుంది.
* ఈ - గవర్నెన్స్‌కు అప్‌గ్రేడ్‌ వర్షన్‌గా ఎం - గవర్నెన్స్‌ను పేర్కొంటారు. 


వివిధ రాష్ట్రాల్లో అమలు తీరు 

లోక్‌వాణి ప్రాజెక్ట్‌
* దీన్ని ఉత్తర్‌ ప్రదేశ్‌లో అమలు చేస్తున్నారు.
* లోక్‌వాణి అనేది ఒక సింగిల్‌ విండో, స్వయం ఆధారిత ఈ - గవర్నెన్స్‌ సేవ  (Self sustainable single window e-governance).
* దీని ద్వారా రాష్ట్రంలో అత్యవసర సేవలు (Essential Services), భూరికార్డులు, ఫిర్యాదుల పరిష్కారం లాంటి సేవలను అందిస్తున్నారు.


భూమి ప్రాజెక్ట్‌: ఈ ప్రాజెక్ట్‌ ద్వారా కర్ణాటకలో భూ రికార్డుల నిర్వహణతోపాటు, గ్రామీణ ప్రాంతాలకు అవసరమైన సేవలు అందిస్తున్నారు.


జ్ఞానదూత్‌: * ఇది మధ్యప్రదేశ్‌లో అమలవుతున్న G2C ఈ-గవర్నెన్స్‌.
* దీనిద్వారా గ్రామీణ ప్రాంతాలు, జిల్లా ప్రజలకు కావాల్సిన ప్రజాసేవలను జిల్లా యంత్రాంగం నుంచి అందిస్తారు.   


ప్రాజెక్ట్‌ ఫ్రెండ్స్‌  (Project Friends) 
* ఇది పన్ను చెల్లింపుల కోసం కేరళ రాష్ట్రం ఏర్పాటు చేసిన ఈ - గవర్నెన్స్‌.
* FRIENDS - Fast Reliable Instant Efficient Network for Disbursement of Services. 
* జిల్లా కేంద్రాల్లోని ఫ్రెండ్స్‌ జనసేవా కేంద్రాలు ఈ సేవలను అందిస్తాయి.
 

ఈ - మిత్ర
గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ సేవలను అందించే లక్ష్యంతో రాజస్థాన్‌ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టును రూపొందించారు.
 

MCA - 21 
* ఇది కార్పొరేట్‌ దిగ్గజాలను కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖతో  అనుసంధానించే ఈ - గవర్నెన్స్‌. 


ఖజానే ప్రాజెక్ట్‌  (Khajane)
* ట్రెజరీ వ్యవస్థలోని లోపాలను సవరించడం, కంప్యూటరైజ్డ్‌ ట్రెజరీ రూపకల్పన కోసం దీన్ని కర్ణాటకలో ఏర్పాటు  చేశారు. ఇది బి2బి ప్రాజెక్టు.
* దీనిద్వారా ప్రభుత్వ బడ్జెట్, ఆర్థిక లావాదేవీలు, టెండర్లను ట్రాక్‌ చేస్తారు.
 

తెలంగాణలో ఈ - గవర్నెన్స్‌ 

* టీ - హబ్‌: తెలంగాణలో టీ-హబ్‌ పోర్టల్‌ ద్వారా నూతన ఆవిష్కరణలు, నవకల్పనలను ప్రోత్సహిస్తున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ సంస్థలు, పెట్టుబడిదారులు; ప్రభుత్వ ఏజెన్సీలు అందించే నెక్ట్స్‌ జనరేషన్‌ ఉత్పత్తులకు, కొత్త బిజినెస్‌ మోడళ్లకు కావాల్సిన సహకారాన్ని, అవి సాకారమయ్యే వాతావరణాన్ని టీ - హబ్‌ కల్పిస్తుంది.
* ప్రస్తుతం తెలంగాణ ఐటీశాఖ మంత్రిగా కె.తారకరామారావు వ్యవహరిస్తున్నారు.


మీ - సేవ: తెలంగాణలో ప్రస్తుతం మీ - సేవ ద్వారా 550కి పైగా సేవలను, 40కి విభాగాలను అనుసంధానించారు. ప్రస్తుతం 4500 మీ - సేవా కేంద్రాలు పౌరసేవలు అందిస్తున్నాయి. 2017లో మీ - సేవ మొబైల్‌ యాప్‌ సేవలను ప్రారంభించారు. గుడ్‌ గవర్నెన్స్‌లో భాగంగా జాతీయ ఈ గవర్నెన్స్‌ ప్రణాళిక కింద దీన్ని అమలు చేస్తున్నారు.
 

*  తెలంగాణ రాష్ట్ర పోర్టల్‌: తెలంగాణ రాష్ట్ర విశేషాలు, సంస్కృతి, ప్రభుత్వ పథకాల అమలు తీరు, ఆర్థిక వ్యవహారాలను ఇందులో పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే జీవోలు ఇందులో అందుబాటులో ఉంటాయి.
 

 e - Procurement: * వివిధ రకాల వస్తువులను ఆన్‌లైన్‌ ద్వారా సేకరించి వాటికి గిట్టుబాటు ధర కల్పించడం దీని ఉద్దేశం.


*  T - SWAN (Telangana State Wide Area Network):  ఇందులో భాగంగా మండల, జిల్లా కేంద్రాలను బ్రాడ్‌ బ్యాండ్‌ కనెక్టివిటీ ద్వారా అనుసంధాస్తారు. 34 Mbps ఇంటర్నెట్‌ కనెక్షన్, 20 Mbps ఇంట్రానెట్‌ సౌకర్యాలను కల్పిస్తారు.


* తెలంగాణ రాష్ట్ర వీడియో కాన్ఫెరెన్స్‌ సేవలు  (TS n- State Wide Video Conferencing):  పరస్పర సమన్వయం, సహకారంతో ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ ప్రభుత్వ విభాగాధిపతులు ప్రజలకు మెరుగైన పాలనను అందించడం దీని ఉద్దేశం.


* SoFTNET n- TnSAT: ఇందులో  T-SAT  విద్య,  T-SAT  నిపుణ ఛానెళ్ల ద్వారా అకడమిక్‌ తరగతుల పాఠ్యాంశాలు, పోటీ పరీక్షార్థులకు అవసరమైన శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నారు.  T-SAT  ఛానెల్‌కు ప్రస్తుతం 5 లక్షలకుపైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
 

e - Return, VAT Return:  ఈ - ఫైలింగ్‌ ద్వారా ఇన్‌కమ్‌ట్యాక్స్, జుతిగి రిటర్న్‌లను పారదర్శకంగా, త్వరితగతిన సమర్పించవచ్చు. కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆన్‌లైన్‌ విభాగంలో సంబంధిత పన్నులను చెల్లించవచ్చు.

Posted Date : 31-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌