• facebook
  • whatsapp
  • telegram

ఆవరణశాస్త్రం, పర్యావరణం

ముఖ్యాంశాలు

* ప్రొడ్యూసర్స్‌/ ఉత్పత్తిదారులు: ఇవి స్వయం పోషకాలు. అకర్బన పదార్థాల నుంచి ఆహారాన్ని లేదా కర్బన పదార్థాలను సూర్యరశ్మి సమక్షంలో తయారు చేస్తాయి. ఇవి కార్బన్‌ డైఆక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. 

ఉదా: మొక్కలు

* శాకాహారులు: ఇవి పోషణ కోసం ముఖ్యంగా ఉత్పత్తిదారులు లేదా మొక్కలపై ఆధారపడతాయి.

ఉదా: మేకలు, గొర్రెలు. 

* మాంసాహారులు: ఇవి జంతువుల మాంసంపై ఆధారపడి జీవిస్తాయి. 

ఉదా: సింహాలు, పులులు.

*సర్వభక్షకులు: ఇవి పోషణ కోసం మొక్కలు, జంతువులను ఉపయోగించుకుంటాయి.

ఉదా: మానవుడు.

* డీకంపోజర్స్‌ (reducers or mineralizers): ఇవి ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచడానికి దోహదపడతాయి. 

ఉదా: బ్యాక్టీరియా, ఫంగై.


1. ఆవరణశాస్త్రం (ఎకాలజీ) అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది ఎవరు?

1) ఆర్‌. మిశ్రా       2) ఎర్నెస్ట్‌ హెకెల్‌           3) ఏజీ టాన్స్‌లే       4) రైటర్‌

జ: 2


2. జీవులకు, భౌతిక వాతావరణానికి మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?

1) ఎకాలజీ        2) ఆంథ్రోపాలజీ         3) సోషియాలజీ       4) ఫిజియాలజీ 

జ: 1


3. ఎకాలజీ అనే పదాన్ని అత్యంత ప్రామాణికంగా, శాస్త్రీయంగా ఉపయోగించిన వ్యక్తి? 

1) రైటర్‌         2) యూజీన్‌ ఓడం      3) ఏజీ టాన్స్‌లే        4) రాబర్ట్‌ హుక్‌ 

జ: 1


4. కింది ఎవరిని భారత ఆవరణశాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు?

1) రామ్‌దేవ్‌ మిశ్రా       2) యూజీన్‌ ఓడం      3) ఏజీ టాన్స్‌లే       4) ఎర్నెస్ట్‌ హెకెల్‌

జ​​​​​​​: 1


5. మనదేశంలో ఎవరి కృషి ఫలితంగా ఆవరణశాస్త్ర విభాగంలో మొదటిసారిగా పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ విద్యను ప్రవేశపెట్టారు? (1972లో నేషనల్‌ కమిటీ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్లానింగ్‌ అండ్‌ కోఆర్డినేషన్‌ సంస్థ స్థాపనలో; పర్యావరణ - అటవీ మంత్రిత్వ శాఖ ఏర్పాటులోనూ ఈయన కీలకపాత్ర పోషించారు)

1) మాధవ్‌ గాడ్గిల్‌      2) రామన్‌ సుకుమార్‌     3) సుందర్‌లాల్‌ బహుగుణ     4) రామ్‌దేవ్‌ మిశ్రా 

జ​​​​​​​: 4


6. మనదేశంలో పర్యావరణ - అటవీ మంత్రిత్వ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1980       2) 1982        3) 1987       4) 1985 

జ​​​​​​​: 4


7. మొక్కలను మూడు ఆవరణశాస్త్ర విభాగాలుగా (hydrophytes, mesophytes, xerophytes) వర్గీకరించింది ఎవరు?

1) యూజీన్‌ ఓడం     2) యూజీన్‌ వార్మింగ్‌      3) ఏజీ టాన్స్‌లే     4) ఎర్నెస్ట్‌ హెకెల్‌

జ​​​​​​​: 2


8. ప్రపంచ ఆవరణశాస్త్ర పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? 

1) యూజీన్‌ ఓడం      2) రైటర్‌       3) మహేశ్వరి        4) ఎర్నెస్ట్‌ హెకెల్‌  

జ​​​​​​​: 1


9. కింది వాటిలో సరైనవి ఏవి?

ఎ) హీలియోఫైట్‌ మొక్కలు సూర్యరశ్మి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి

బి) హలోఫైట్‌ మొక్కలు లవణీయత అధికంగా ఉండే సముద్ర ప్రాంతాల్లో పెరుగుతాయి. 

సి) సయోఫైట్‌ మొక్కలు నీడ ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. 

1) ఎ, సి         2) బి, సి      3) ఎ, బి        4) పైవన్నీ

జ​​​​​​​: 4


10. ఆవరణ వ్యవస్థ (Ecosystem) అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది? 

1) ఏజీ టాన్స్‌లే        2) యూజీన్‌ ఓడం     3) రాబర్ట్‌ కాన్‌స్టంజా      4) రామ్‌దేవ్‌ మిశ్రా 

జ​​​​​​​: 1


11. కింది వాటిలో సరైనవి ఏవి? 

ఎ) మీసోఫైట్స్‌ - భూమిపై నివసించే మొక్కలు

బి) హైడ్రోఫైట్స్‌ - నీటిలో నివసించే మొక్కలు 

సి) జీరోఫైట్స్‌ - ఎడారి లేదా అతి తక్కువ నీరు లభ్యమయ్యే ప్రాంతాల్లో నివసించే మొక్కలు 

1) ఎ, బి          2) బి, సి             3) ఎ, సి           4) పైవన్నీ

జ​​​​​​​: 4


12. ఆవరణ వ్యవస్థ ముఖ్యంగా కింది వీటితో నిర్మితమై ఉంటుంది? 

1) జీవ విభాగాలు (biotic components)

2) నిర్జీవ విభాగాలు (Abiotic components) 

3) జీవ, నిర్జీవ విభాగాల కలయికతో ఏర్పడుతుంది

4) ఏదీకాదు 

జ​​​​​​​: 3


13. బురద నేలలు లేదా చిత్తడి నేలలు ఉన్న ప్రాంతాల్లో నివసించే మొక్కలను ఏమంటారు? 

1) మడఅడవులు (Mangroves)           2) మీసోఫైట్స్‌      

3) హైడ్రోఫైట్స్‌             4) సయోఫైట్స్‌ (Sciophytes)

జ​​​​​​​: 1


14. రామ్‌సర్‌ కన్జర్వేషన్‌ మార్గ‌ద‌ర్శ‌కాల‌ ప్రకారం, 2022 ఆగస్టు 15 నాటికి మనదేశంలో గుర్తించిన చిత్తడి నేలల సంఖ్య? 

1) 75       2) 49      3) 37      4) 24 

జ​​​​​​​: 1


15. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు? 

1) జనవరి 2      2) ఫిబ్రవరి 2        3) మార్చి 2      4) ఏప్రిల్‌ 2 

జ​​​​​​​: 2


16. పశ్చిమ కనుమల పర్యావరణ అధ్యయనం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ? 

1) మాధవ్‌ గాడ్గిల్‌ కమిటీ      2) నరసింహం కమిటీ 

3) రంగరాజన్‌ కమిటీ         4) మేధా పాట్కర్‌ కమిటీ 

జ​​​​​​​: 1


17. ఆవరణ వ్యవస్థలో ప్రాథమిక ప్రమాణం? 

1) ఆవరణ వ్యవస్థ      2) సమూహం     3) జనాభా       4) జీవి 

జ​​​​​​​: 4


18. ఆవరణశాస్త్రం సాధారణంగా నాలుగు స్థాయులను కలిగి ఉంటుంది. అయితే అవి కింది ఏ వరుస క్రమంలో ఉంటాయి?

1) జాతి, జనాభా, జీవ మండలం, జీవులు

2) జీవులు, జనాభా, జీవ మండలం, జాతి

3) జీవులు, జనాభా, సమూహం, జీవ మండలం 

4) జీవులు, సమూహం, జాతి, జనాభా 

జ​​​​​​​: 3


19. భారతదేశంలో ముఖ్యమైన జీవ మండలాలు ఏవి?

1) ఉష్ణమండల వర్ష అరణ్యాలు (tropical rainforest)

2) ఆకురాల్చే అడవులు (deciduous forests)

3) ఎడారులు, సముద్ర తీర ప్రాంతాలు (deserts, seacoast)

4) పైవన్నీ 

జ​​​​​​​: 4


20. భూమిపై ఉన్న అన్ని ఆవరణ వ్యవస్థలకు కావాల్సిన శక్తి దేని ద్వారా సమకూరుతుంది? 

1) సూర్యుడు       2) కిరణజన్యసంయోగక్రియ

3) ఎడినోసిన్‌ ట్రై ఫాస్ఫేట్‌ - ATP          4) నికోటినమైడ్‌ ఎడినోసిన్‌ డైఫాస్ఫేట్‌ - NADP

జ​​​​​​​: 1


21. సాధారణంగా రుతువులపై కింది వేటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది? 

1) భూమి సూర్యుడి చుట్టూ తిరిగే భ్రమణం

2) రేడియేషన్‌ ప్రక్రియ ద్వారా భూ ఉపరితలంపై ప్రసరించే సూర్యరశ్మి 

3) భూమధ్యరేఖ వద్ద భూమి కొద్దిగా ఒంపు తిరిగి ఉండటం

4) పైవన్నీ 

జ​​​​​​​: 4


22. ఒక ప్రాంతంలోని ఒకే జాతికి చెందిన మొత్తం జీవుల సంఖ్యను ఏమంటారు? 

1) జనాభా పరిమాణం     2) జన సాంద్రత      3) డెమోగ్రఫీ      4) పాపులేషన్‌ డైనమిక్స్‌ 

జ​​​​​​​: 1


23. సైబీరియా, అతిశీతల ఉత్తరార్ధ గోళం నుంచి ఏటా ఎక్కువ సంఖ్యలో వలస పక్షులు  "Keoladeo National Park"కు వస్తాయి. ఇది ఎక్కడ ఉంది? 

1) కొల్లేరు        2) సుందర్బన్స్‌ (పశ్చిమ్‌ బంగా) 

3) భరత్‌పూర్‌ (రాజస్థాన్‌)             4) పిచ్చావరం (తమిళనాడు) 

జ​​​​​​​: 3


24. ప్రపంచానికి ఊపిరితిత్తులుగా కింది వేటిని పేర్కొంటారు?

1) మొక్కలు         2) ఫైటోప్లాంక్టన్‌         3) 1, 2       4) ఏదీకాదు

జ​​​​​​​: 3


25. భూమిపై నివసించే జీవులకు అనుకూల వాతావరణాన్ని కల్పించే భూఉపరితల పైపొరను ఏమని పిలుస్తారు?

1) అట్మాస్ఫియర్‌     2) లిథోస్ఫియర్‌       3) హైడ్రోస్ఫియర్‌     4) స్ట్రాటోస్ఫియర్‌  

జ​​​​​​​: 2


26. కింది వాటిలో దేన్ని అత్యంత భారీ ఆవరణ వ్యవస్థగా (Giant ecosystem) పేర్కొంటారు?

1) సముద్రాలు     2) ఆకాశం       3) భూమి     4) అంతరిక్షం  

జ​​​​​​​: 3


27. ఆవరణ వ్యవస్థలో హోమియోస్టాసిస్‌ (Homeostasis) అనే పదం దేనికి సంబంధించింది?

1) స్వయం నియంత్రిత వ్యవస్థ       2) ఉత్పత్తిని ప్రభావితం చేసే వ్యవస్థ     

3) సమతాస్థితిని సూచించే వ్యవస్థ      4) పెరుగుదలను సూచించే వ్యవస్థ  

జ​​​​​​​: 3


28. ఆవరణ వ్యవస్థలో మానవ చొరవతో ఏ రకమైన అసమతౌల్యం నెలకొంటుంది?

1) వివిధ జాతుల మధ్య ఉండాల్సిన సహజ పోటీతత్వం కొరవడుతుంది

2) ఆవరణ వ్యవస్థలో అతి సాధారణంగా ఉండే పరాన్నజీవులు అంతమవుతాయి

3) వినియోగదారులుగా ఉన్న జాతుల మధ్య పరస్పర సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

4) పైవన్నీ సరైనవే

జ​​​​​​​: 4


29. జంతువుల్లో ఏర్పడిన రోగనిరోధక వ్యవస్థకు ముఖ్య కారణం ఏమిటి?

1) జంతువులకు వాటి ఆవాసాలకు మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉండటం 

2) జంతువులకు వాటిని వేటాడే పెద్ద జంతువులకు ఉన్న సహజీవనం 

3) జంతువులను వేటాడే పెద్ద జంతువుల కారణంగా చిన్న జంతువులు అంతరించిపోతున్న దశకు చేరటం.

4) పరాన్నజీవులకు, వ్యాధి కలిగించే జీవులకు మధ్య ఉన్న పరస్పర పోటీ, ఒత్తిడి

జ​​​​​​​: 4


30. కేరళ రాష్ట్రంలో మంచులో నివసించే చిరుతలు (snow leopards) కనిపించకపోవడానికి ముఖ్య కారణం.....

1) సూర్యకాంతి        2) నీరు     3) నేల        4) ఉష్ణోగ్రత 

జ​​​​​​​: 4


31. నిర్దిష్ట శీతోష్ణస్థితిలో ప్రాంతీయ ఎకలాజికల్‌ యూనిట్‌ అని దేన్ని పిలుస్తారు?

1) బయోటిక్‌ కమ్యూనిటీ    2) ల్యాండ్‌ స్కేప్‌      3) ఎకోసిస్టమ్‌     4) బయోమ్‌

జ​​​​​​​: 4


32. జీవులు తమ చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా భౌతిక, రసాయనిక చర్యలకు అనుగుణంగా సమతౌల్యాన్ని పాటించడాన్ని ఏమంటారు? 

1) అక్లిమోషన్‌        2) అడాప్టేషన్‌        3) హోమియోస్టాసిస్‌      4) అడ్జస్ట్‌మెంట్‌ 

జ​​​​​​​: 3


33. నీటిపై తేలియాడే కణజాల వ్యవస్థ, తేలియాడే ఆకులను కలిగి ఉండే మొక్కలను కింది వాటిలో ఏ కోవకు చెందిన వాటిగా చెప్పవచ్చు?

1) హైడ్రోఫైట్స్‌      2) మీసోఫైట్స్‌        3) జీరోఫైట్స్‌      4) ఎపిఫైట్స్‌

జ​​​​​​​: 1


34. భూమిపై జీవించి ఉన్న మొక్కలు, జంతువులు, ఇతర జీవులు ఏ ఆవరణ వ్యవస్థలో ఉన్నాయి?

1) బయోస్ఫియర్‌       2) హైడ్రోస్ఫియర్‌      3) అట్మాస్ఫియర్‌       4) ట్రోపోస్ఫియర్‌

జ​​​​​​​: 1


35. భూమిపై 70 శాతానికి పైగా ఆవరించి ఉన్న పెద్ద ఆవరణ వ్యవస్థ ఏది?

1) ఫారెస్ట్‌ ఎకోసిస్టమ్‌   2) ఆక్వాటిక్‌ ఎకోసిస్టమ్‌

3) గ్రాస్‌లాండ్‌ ఎకోసిస్టమ్‌        4) గ్రాజింగ్‌ ఫుడ్‌ చైన్‌

జ​​​​​​​: 2

Posted Date : 17-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌