• facebook
  • whatsapp
  • telegram

ఆవరణశాస్త్రం, పర్యావరణం

ముఖ్యాంశాలు

* బయోఎక్యుములేషన్‌ ప్రక్రియ ద్వారా ఆవరణ వ్యవస్థలో ఉన్న ఆహారపు గొలుసులో కాలుష్య కారకాల ప్రవేశం ఎలా జరుగుతుందో, వాటి గాఢత మొదటి ట్రాఫిక్‌ స్థాయిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవచ్చు.

* భారతదేశంలో అతిపెద్ద జూలాజికల్‌ పార్క్‌ శ్రీ వెంకటేశ్వర జూలాజికల్‌ పార్క్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్‌. 

* నీటిలోని కర్బన పదార్థాలను విచ్ఛిన్నం చేసేందుకు ఏరోబిక్‌ సూక్ష్మజీవులు ఉపయోగించే ఆక్సిజన్‌ను బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (BOD) అంటారు.

* నదివాయి (Estuary) అంటే నది సముద్రంలో కలిసే ప్రాంతం అని అర్థం. ఈ ప్రాంతాలను అత్యంత ఉత్పాదకత కలిగిన ప్రదేశాలుగా పిలుస్తారు. 

* జీవులు, నిర్జీవుల మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని అధ్యయనం చేయడమే ఆవరణశాస్త్రం.

1. జీవావరణ క్రియాత్మక, నిర్మాణాత్మక ప్రమాణాన్ని ఏమంటారు?

1) ఆవరణ వ్యవస్థ      2) జీవ మండలం      3) సమూహం      4) ఆహార గొలుసు 

జ: 1


2. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా పర్యావరణ సంబంధిత సమాచారాన్ని సేకరించి, అవసరమైనప్పుడు దాన్ని వివిధ వర్గాలకు అందించడానికి రూపొందించిన వెబ్‌సైట్‌ లేదా అప్లికేషన్‌ ఏది?

1) BHUVAN                                2) SAKAAR
3) UMANG (Unified Mobile Application for New-age Governance)
4) ENVIS (Environmental Information System)

జ​​​​​​​: 4


3. ఆవరణవ్యవస్థను ఆరోగ్యమైంది, సుస్థిరమైందిగా ఎప్పుడు నిర్వచిస్తారు?

1) ఆవరణవ్యవస్థలోని జీవ, నిర్జీవ అనుఘటకాలన్నీ ఒకదానితో మరొకటి సమతౌల్యంతో ఉన్నప్పుడు

2) వివిధ ఆవరణ వ్యవస్థలకు చెందిన అనుఘటకాలు, స్వజాతి జీవుల మధ్య పునరుత్పత్తి సామర్థ్యం ఉన్నప్పుడు

3) 1, 2                              4) ఏదీకాదు

జ​​​​​​​: 3


4. ఆవరణవ్యవస్థ వేటితో నిర్మితమై ఉంటుంది? 

1) జీవ కారకాలు          2) నిర్జీవ కారకాలు           3) భౌతిక వాతావరణం      4) పైవన్నీ 

జ​​​​​​​: 4


5. ఒక ప్రాంతంలో వివిధ జాతుల నివాసానికి, పునరుత్పత్తికి, మనుగడకు అనుకూలమైన ప్రదేశాన్ని ఏమంటారు?

1) ఆవాసం        2) జీవ మండలం       3) ఎకలాజికల్‌ పిరమిడ్‌             4) ఏదీకాదు

జ​​​​​​​: 1


6. పూర్తి క్రియాత్మకంగా ఉన్న ఆవరణ వ్యవస్థలో కింది ఏవి భాగంగా ఉంటాయి?

1) శక్తి ప్రవాహం (energy flow)

2) న్యూట్రియంట్‌ సైక్లింగ్‌ (బయో, జియో, కెమికల్‌ సైకిల్స్‌) 

3) ఎకలాజికల్‌ సక్సెషన్‌          4) పైవన్నీ  

జ​​​​​​​: 4


7. ఆవరణవ్యవస్థలో ఒక జాతి క్రియాత్మక స్థానాన్ని లేదా ఒక జాతి జీవుల ప్రత్యేక క్రియాత్మక నివాసాన్ని ఏమంటారు?

1) Niche      2) Habit       3) Habitat       4) Ecotone

జ​​​​​​​: 1


8. రెండు వైవిధ్య ఆవరణ వ్యవస్థల మధ్య ఏర్పడే మిశ్రమ ప్రదేశాన్ని లేదా రెండు ఆవరణ వ్యవస్థలు కలిసి ఉండే ప్రదేశాన్ని ఏమంటారు?

1) ఎకోటోన్‌     2) ఎకోసిస్టమ్‌       3) కమ్యూనిటీ       4) ఎకలాజికల్‌ సక్సెషన్‌

జ​​​​​​​: 1


9. ఎకోటోన్‌ ప్రాంతంలో ఉన్న జాతులు సమీప ప్రదేశంలోని జాతుల కంటే మరింత బలంగా, ఎక్కువగా పెరగడాన్ని ఏ ప్రభావంగా పిలుస్తారు?

1) అంచు ప్రభావం        2) ఆవాస ప్రభావం        3) వాతావరణ ప్రభావం         4) జాతి ప్రభావం 

జ​​​​​​​: 1


10. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) స్వయం పోషకాలు - పచ్చటి మొక్కలు, ఫైటోప్లాంక్‌టన్స్‌ 

బి) పరపోషకాలు - జంతువులు, క్రూర జంతువులు, మానవుడు 

సి) పూతికాహారులు - బ్యాక్టీరియా, శిలీంద్రాలు

1) ఎ, బి        2) బి, సి        3) ఎ, సి         4) పైవన్నీ

జ​​​​​​​: 4


11. శక్తి ప్రవాహం గురించి కిందివాటిలో సరైనవి?

ఎ) ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం సాధారణంగా సౌరశక్తి నుంచి మొదలవుతుంది.

బి) జీవుల్లో జీవక్రియల నిర్వహణకు శక్తి ప్రవాహం మూలాధారమైంది 

సి) సాధారణంగా శక్తి ప్రవాహం కింది స్థాయిలో ఉన్న ఉత్పత్తిదారుల నుంచి ఉన్నత స్థాయి వినియోగదారుల వరకూ ఏక దిశలో ఉంటుంది.

డి) శక్తి ప్రవాహం ఎప్పుడూ తిరోగమన దిశలో ప్రయాణించదు. 

1) ఎ, బి        2) బి, సి         3) సి, డి         4) పైవన్నీ

జ​​​​​​​: 4


12. ఆవరణ వ్యవస్థలో జీవులు పోషణ కోసం (ఒక ట్రాఫిక్‌ స్థాయిలో ఉన్న జీవులు) మరొక ట్రాఫిక్‌ స్థాయిలో ఉన్న జీవులపై ఆధారపడతాయి. ఇది ఒక గొలుసు రూపంలో ఏర్పడటాన్ని ఏ విధంగా పేర్కొంటారు?

1) ఫుడ్‌ చైన్‌ లేదా ఆహార గొలుసు         2) ఎకలాజికల్‌ పిరమిడ్‌ 

3) పోషకాల వలయం        4) ఆహార వలయం 

జ​​​​​​​: 1


13. ఆవరణ వ్యవస్థలో వివిధ ఆహార గొలుసుల మధ్య పరస్పరం ఏర్పడే ఆహార సంబంధ వలయాన్ని ఏమంటారు?

1) ట్రాఫిక్‌ లెవల్‌       2) ఫుడ్‌ చైన్‌         3) ఫుడ్‌ వెబ్‌    4) న్యూట్రియంట్‌ సైక్లింగ్‌ 

జ​​​​​​​: 3


14. జీవులు కార్బన్‌ డైఆక్సైడ్‌ను, అకర్బన పదార్థాలను ఉపయోగించుకుని తమకు కావాల్సిన శక్తిని రసాయన సంయోగ క్రియ (Chemosynthesis) ద్వారా సమకూర్చుకుంటాయి. వీటిని ఏమంటారు?

1) కెమోట్రోఫ్స్‌      2) ఆటోట్రోఫ్స్‌       3) సప్రోఫైట్స్‌       4) హెర్బివోర్స్‌

జ​​​​​​​: 1


15. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే నత్రజనిని మానవుడు కృత్రిమంగా అధిక మొత్తంలో తయారు చేయడం వల్ల సమతౌల్యత దెబ్బతిని కాలుష్యకారకంగా మారుతుంది.

బి) నత్రజని వలయాన్ని ఈ అధిక నత్రజని దెబ్బతీస్తోంది.

సి) నత్రజని కాలుష్యం వల్ల ఆమ్ల వర్షాలు, యూట్రోఫికేషన్‌ లాంటివి సంభవిస్తాయి.

1) ఎ, బి         2) ఎ, సి          3) బి, సి         4) పైవన్నీ

జ​​​​​​​: 4


16. కిందివాటిలో డెట్రిటస్‌ ఫుడ్‌ చైన్‌ ఏది?

1) మొక్కలు   గొంగళి పురుగు  బల్లి  పాము

2) ఫైటోప్లాంక్టన్‌  జూ ప్లాంక్టన్‌  ఫిష్‌  పెలికన్‌

3) గడ్డి  కుందేలు  గద్ద

4) చెత్త  వానపాము  కోడి  గద్ద

జ​​​​​​​: 4


17. ఆవరణ వ్యవస్థలో ట్రాఫిక్‌ స్థాయులను చిత్ర రూపంలో చూపించడాన్ని ఏమంటారు?

1) ఫుడ్‌ చైన్‌       2) ఫుడ్‌ వెబ్‌       3) ఎకలాజికల్‌ పిరమిడ్‌          4) ఎకలాజికల్‌ సక్సెషన్‌

జ​​​​​​​: 3


18. ఆవరణ వ్యవస్థలో వివిధ ట్రాఫిక్‌ స్థాయుల్లో జీవులకు ఉన్న పరస్పర సంబంధాన్ని గుర్తించడానికి కావాల్సిన ముఖ్యమైన భావనలు?

1) ఫుడ్‌ చైన్‌        2) ఫుడ్‌ వెబ్‌        3) ఎకలాజికల్‌ పిరమిడ్‌        4) పైవన్నీ

జ​​​​​​​: 4


19. పంటలకు వాడే రసాయనాల వల్ల వాటి చుట్టూ ఉన్న సరస్సులు, చెరువుల్లోని జలచరాలకు పోషకాలు ఎక్కువై అమితంగా వృద్ధి చెంది, ఆక్సిజన్‌ లభించక మరణించే స్థితిని ఏమంటారు?

1) బయోమాగ్నిఫికేషన్‌       2) బమోరెమిడిషన్‌

3) యూట్రోఫికేషన్‌         4) బయోఎసిమిలేషన్‌

జ​​​​​​​: 3


20. ఆవరణ వ్యవస్థలో ఒక ట్రాఫిక్‌ స్థాయి నుంచి మరొక ట్రాఫిక్‌ స్థాయికి కాలుష్య కారకాలు ఆహార గొలుసు ద్వారా  ప్రయాణించడాన్ని ఏమంటారు?

1) బయోమాగ్నిఫికేషన్‌     2) బమోరెమిడిషన్‌

3) యూట్రోఫికేషన్‌                4) బయోఎసిమిలేషన్‌

జ​​​​​​​: 1


21. ఆవరణ కాలపరిమితిని బట్టి ఆవరణ వ్యవస్థ, వివిధ ప్రాంతాల్లోని వృక్షసంపదలో వచ్చే దిశాపరమైన మార్పులను ఏమంటారు?

1) ఎకలాజికల్‌ సక్సెషన్‌       2) ఎవల్యూషన్‌        3) డీఫారెస్ట్రేషన్‌       4) ఏదీకాదు

జ​​​​​​​: 1


22. వివిధ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు, ఆదివాసీలు అందించే వృక్ష సంబంధ విజ్ఞానశాస్త్రాన్ని ఏమంటారు?

1) ఎకనామిక్‌బోటనీ       2) ఎథ్నోబోటనీ        3) ఎకాలజీ        4) ఆంత్రొపాలజీ

జ​​​​​​​: 2


23. చిత్తడి ప్రాంతాల్లో ఉండే ఏ మొక్కల్లో శ్వాసక్రియ జరిపే వేర్లు (Pneumatophores) ఉంటాయి?

1) మాంగ్రూవ్స్‌        2) హైడ్రోఫైట్స్‌        3) Xerophytes             4) హీలియోఫైట్స్‌

జ​​​​​​​: 1


24. ఆవరణ వ్యవస్థల్లో శక్తి ప్రవాహం గురించి మొదటిసారి ప్రతిపాదించింది?

1) ఫ్రెడరిక్‌ లిండ్‌మాన్‌         2) ఓడమ్‌        3) మిశ్రా        4) హెకెల్‌  

జ​​​​​​​: 1


25. యూట్రోఫికేషన్‌ ప్రక్రియలో జలాశయాల్లోని చేపలు చనిపోవటానికి కారణం?

1) ఆహారం లభించకపోవడం        2) సూర్యరశ్మి లభించకపోవడం

3) వాతావరణం అనుకూలించకపోవడం        4) ఆక్సిజన్‌ లభించకపోవడం 

జ​​​​​​​: 4


26. కిందివాటిలో సల్ఫర్‌ డైఆక్సైడ్‌ కాలుష్యాన్ని గుర్తించే జీవ ఇండికేటర్‌గా దేన్ని భావిస్తారు? 

1) లైకెన్స్‌       2) బ్యాక్టీరియా        3) సముద్ర ఇసుక       4) బ్లూ గ్రీన్‌ ఆల్గే

జ​​​​​​​: 1


27. భారతదేశంలో ఉన్న జాతీయ  పార్కుల ముఖ్య ఉద్దేశం?

1) వృక్ష సంపదను పరిరక్షించడం        2) జంతు సంపదను పరిరక్షించడం

3) వన్యమృగాలను పరిరక్షించడం            4) 1, 2

జ​​​​​​​: 4


28. వాతావరణంలో మీథేన్‌ వాయువు విడుదలకు ముఖ్య కారణం?

1) వరి పొలాలు      2) గోధుమ పొలాలు       3) ఉద్యాన పంటలు       4) వెదురు ఉత్పత్తి

జ​​​​​​​: 1


29. కిందివాటిలో సరైనవి?

ఎ) Autecology: ఆవరణ వ్యవస్థలోని ఒక ప్రజాతి లేదా జాతి గురించిన అధ్యయనం.

బి) Synecology: ఆవరణ వ్యవస్థలో సమూహ జనాభాలో వివిధ జాతులు లేదా ప్రజాతుల అధ్యయన శాస్త్రం.

1) ఎ         2)  బి         3) ఎ, బి        4) ఏదీకాదు

జ​​​​​​​: 3


30. కిందివాటిలో బయోమాగ్నిఫికేషన్‌ ప్రక్రియకు సంబంధం ఉన్న పదార్థం.....

1) DDT       2) కార్బన్‌ డైఆక్సైడ్‌        3) సల్ఫర్‌ డైఆక్సైడ్‌      4) నైట్రోజన్‌ డైఆక్సైడ్‌

జ​​​​​​​: 1


31. మినిమాటా వ్యాధి కింది ఏ కాలుష్య కారకం వల్ల వస్తుంది?  

1) కాడ్మియం       2) ఆర్సెనిక్‌         3) మెర్క్యూరీ         4) లెడ్‌

జ​​​​​​​: 3


32. కింది క్రిమిసంహారిణుల్లో జీవసంబంధం కానిది?

1) మలాథియాన్‌      2) పైరెథ్రమ్‌      3) అజాడిరక్టిన్‌    4) bt టాక్సిన్‌

జ​​​​​​​: 1


33. వన్యప్రాణి పరిరక్షణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

1) 1975      2) 1980      3) 1972       4) 1981

జ​​​​​​​: 3


34. ఆవరణ వ్యవస్థలో మానవుడు....

1) ఉత్పత్తిదారుడు       2) వినియోగదారుడు     3) పూతికాహారి      4) ఏదీకాదు

జ​​​​​​​: 2


35. శాకాహారులు (herbivores) శక్తి ప్రవాహంలో ఏ ట్రాఫిక్‌ స్థాయికి చెందుతాయి?    

1) మొదటి      2) రెండో         3) మూడో      4) నాలుగో

జ​​​​​​​: 2

Posted Date : 20-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌