• facebook
  • whatsapp
  • telegram

భారత ఆర్థిక సర్వే 2021-22

కేంద్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్‌ కంటే ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతుంది. 2021-22 ఆర్థిక సర్వేలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇందులో భారతదేశ ఆదాయం, తలసరి ఆదాయానికి సంబంధించిన సమాచారాన్ని పేర్కొన్నారు.

​​​​​భారతదేశ తలసరి ఆదాయం

సంవత్సరం ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయం స్థిర ధరల్లో తలసరి ఆదాయం
2018 - 19 రూ.1,25,883 రూ.92,241
2019 - 20 రూ.1,34,186 రూ.94,566
2020 - 21 రూ.1,28,829 రూ.86,659
2021 - 22 రూ.1,50,326 రూ.93,973

భారతదేశ జీడీపీ

సంవత్సరం జీడీపీ ప్రస్తుత ధరల్లో (రూ.కోట్లలో) జీడీపీ స్థిర ధరల్లో (రూ.కోట్లలో)
2019 - 20 2,03,51,013 1,45,69,268
2020 - 21 1,97,45,670 1,35,12,740
2021 - 22 2,32,14,703 1,47,53,535

దేశంలో పొదుపు, పెట్టుబడి, స్థిర మూలధన కల్పన రేట్లు

సంవత్సరం స్థూలదేశీయ పొదుపు రేటు స్థూలదేశీయ పెట్టుబడి రేటు
2017 - 18 32.1% 31.0%
2018 - 19 30.6% 32.1%
2019 - 20 31.4% 30.7%

స్థూలదేశీయ స్థిర మూలధన కల్పన రేటు

201718లో 28.2%, 201819లో 29.2%, 201920లో 28.8%.

భారతదేశంలో రాష్ట్రాల వారీగా తలసరి ఆదాయ వివరాలు (2019-20లో)

అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాలు

1. గోవా - రూ.4,35,959  

2. సిక్కిం - రూ.4,03,376 

3. హరియాణ - రూ.2,47,628 

అత్యల్ప తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రాలు

1. బిహార్‌ - రూ.45,071  

2. ఉత్తర్‌ ప్రదేశ్‌ - రూ.65,704

3. ఝార్ఖండ్‌ - రూ.77,739

* అత్యధిక తలసరి ఆదాయం కలిగిన కేంద్రపాలిత ప్రాంతం - న్యూదిల్లీ (రూ.3,76,221్శ

* అత్యల్ప తలసరి ఆదాయం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం - జమ్మూకశ్మీర్‌ (రూ.1,02,789్శ

భారత్‌లో అత్యధిక పంట ఉత్పత్తి చేస్తున్న వివిధ రాష్ట్రాలు (2020-21)

వరి: పశ్చిమ్‌ బంగా - 16.65 మిలియన్‌ టన్నులు, ఉత్తర్‌ ప్రదేశ్‌ - 15.66 మి.ట., పంజాబ్‌ - 12.18 మి.ట.

గోధుమ: ఉత్తర్‌ ప్రదేశ్‌ - 35.50 మి.ట., మధ్యప్రదేశ్‌ - 17.62 మి.ట, పంజాబ్‌ - 17.14 మి.ట.

మొక్కజొన్న: కర్ణాటక - 5.18 మి.ట., మధ్యప్రదేశ్‌ - 3.58 మి.ట., మహారాష్ట్ర - 3.44 మి.ట.

మొత్తం పప్పుధాన్యాలు: మధ్యప్రదేశ్‌ - 5.30 మి.ట., రాజస్థాన్‌ - 4.31 మి.ట., మహారాష్ట్ర - 4.30 మి.ట.

మొత్తం ఆహారధాన్యాలు: ఉత్తర్‌ ప్రదేశ్‌ - 58.32 మి.ట., మధ్యప్రదేశ్‌ - 31.96 మి.ట. పంజాబ్‌ - 29.77 మి.ట.

మొత్తం నూనెగింజలు: రాజస్థాన్‌ - 7.94 మి.ట., మహారాష్ట్ర - 6.69 మి.ట., మధ్యప్రదేశ్‌ - 6.68 మి.ట.

స్థిరధరల వద్ద వివిధ రంగాల వృద్ధిరేట్ల వివరాలు

సం.  వ్యవసాయ పారిశ్రామిక సేవా
2019 - 20 4.3% (-)1.2% 7.2%
2020 - 21 3.6% (-)7.0% (-)8.4%
2021 - 22 3.9% 11.8% 8.2%

వివిధ రంగాల వాటాల వివరాలు

రంగం 2019 - 20 2020 - 21 2021 - 22
వ్యవసాయ 18.4%  20.2% 18.8%
పారిశ్రామిక 26.7% 25.9% 28.2%
సేవా 55.0% 53.9% 53.0%
మొత్తం 100% 100% 100%
       

భారత జీడీపీ వృద్ధి రేట్ల వివరాలు 

201920లో 4.0%, 202021లో (-) 7.3%, 202122లో 9.2%. 

పన్ను ఆదాయం జీడీపీలో శాతం పరంగా

సంవత్సరం స్థూల పన్ను నికర పన్ను
2017 - 18 11.2% 7.3%
2018 - 19 11.0% 6.9%
2019 - 20 9.9% 6.7%
2020 - 21 10.3% 7.2%
2021 - 22 9.9% 6.9%

భారత్‌లో ద్రవ్యలోటు వివరాలు 

201718లో 3.5%, 201819లో 3.4%, 201920లో 4.6%, 202021లో 9.2%, 202122లో 6.8%. 

భారతదేశ రుణాల వివరాలు 

సం. స్వదేశీ రుణం (రూ.లక్షల కోట్లలో) విదేశీ రుణం (రూ.లక్షల కోట్లలో)
2018 - 19  70.75 4.74
2019 - 20 80.20 5.44
2020 - 21 99.09 6.15

 

 
ఇతర ముఖ్యాంశాలు
* పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతుల్లో మొదటిస్థానంలో ఉన్నాయి.

*  భారత్‌ నుంచి జరిగే ఎగుమతుల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం అమెరికా.

*  మన దిగుమతుల్లో ప్రథమ స్థానంలో క్రూడ్‌ ఆయిల్‌ ఉంది.

*  దిగుమతుల్లో మొదటి స్థానంలో చైనా ఉంది.

* కరెంట్‌ ఖాతా లోటు జీడీపీలో 3.0%.

*  అత్యధిక ఎఫ్‌డీఐలు సింగపూర్‌ (25.9%), అమెరికా (14.9%), మారిషస్‌ (13.9%), నెదర్లాండ్స్‌ (6.9%) నుంచి వచ్చాయి.

* అత్యధిక ఎఫ్‌డీఐలు వచ్చిన రంగాలు: కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌-హార్డ్‌వేర్‌ (22.9%), ఆటోమొబైల్‌ పరిశ్రమ (15.8%), సేవారంగం-విత్తం, బ్యాంకింగ్, బీమా (10.1%), వర్తకం (6.6%).

* ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌ (ఐఎఫ్‌ఎస్‌ఆర్‌) 2021 ప్రకారం భారత్‌లో 21.71% అడవులు ఉన్నాయి. 

ఏపీ ఆర్థిక సర్వే 2021-22

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2021-22 ఏడాదికి సోషియో ఎకనమిక్‌ సర్వేను విడుదల చేసింది. ఇందులో రాష్ట్ర వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగం, రాష్ట్ర జీఎస్‌డీపీ, రాష్ట్ర విత్త వివరాలు, విద్యా, ఆరోగ్యం, పేదరికం, నిరుద్యోగ వివరాలను పొందుపరిచారు.

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయరంగం


* సోషియో ఎకనమిక్‌ సర్వే ప్రకారం రాష్ట్రంలో నికర సాగుభూమి 201819లో 60.49 లక్షల హెక్టార్లు ఉండగా, 201920లో 60.49 లక్షల హెక్టార్లు, 202021లో 60.88 లక్షల హెక్టార్లు ఉంది.

* 202021లో నికర సాగు భూమి ఎక్కువగా ఉన్న జిల్లా కర్నూల్‌ కాగా, తక్కువగా ఉన్న జిల్లా విజయనగరం.

* 10వ వ్యవసాయ సెన్సెస్‌ రిపోర్ట్‌ 201516 ప్రకారం ఏపీలో సగటు కమతం 0.94 హెక్టార్లు. సగటు కమతం అధికంగా ఉన్న జిల్లా అనంతపురం (1.63 హెక్టార్లు), కాగా, తక్కువగా ఉన్న జిల్లా శ్రీకాకుళం (0.51 హెక్టార్లు).

* మొత్తం కమతాదార్ల సంఖ్య 85.24 లక్షలు.

* మొత్తం కమతాల విస్తీర్ణం 80.04 లక్షల హెక్టార్లు.

కమతాల వర్గీకరణ: కమతాలను అయిదు రకాలుగా వర్గీకరించారు. అవి:

1. ఉపాంత కమతం  1 హెక్టార్‌లోపు భూమి.

2. చిన్న కమతం  1 నుంచి 2 హెక్టార్ల వరకు

3. సెమీ మీడియం కమతం - 2 నుంచి 4 హెక్టార్ల వరకు

4. మీడియం కమతం - 4 నుంచి 10 హెక్టార్ల వరకు

5. పెద్ద కమతం  10 హెక్టార్ల కంటే ఎక్కువ

జిల్లాలవారీగా స్థూల సాగునీటి వివరాలు

కాలువల ద్వారా వ్యవసాయం ఎక్కువగా చేస్తున్న జిల్లాలు:

గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి

కాలువల ద్వారా వ్యవసాయం తక్కువగా చేస్తున్న జిల్లాలు:

చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్‌ కడప

సాగు కోసం చెరువులపై ఎక్కువగా ఆధార పడిన జిల్లాలు: 

నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం.

చెరువుల ద్వారా వ్యవసాయం తక్కువగా ఉన్న జిల్లాలు: 

గుంటూరు, అనంతపురం, వైఎస్సార్‌ కడప

బావుల ద్వారా వ్యవసాయం ఎక్కువగా చేస్తున్న జిల్లాలు:

పశ్చిమగోదావరి, అనంతపురం, చిత్తూరు

బావుల ద్వారా వ్యవసాయం తక్కువగా చేస్తున్న జిల్లాలు:

శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగం

* ఏపీలో ఖనిజాల ద్వారా అధికంగా రెవెన్యూ వచ్చే జిల్లా ప్రకాశం, తక్కువ రెవెన్యూ వచ్చే జిల్లా పశ్చిమగోదావరి.

* ఏపీలో 2021 నాటికి ఏపీ జెన్‌కో ద్వారా జరిగిన థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి 3410.00 మెగావాట్లు, జలవిద్యుచ్ఛక్తి 1797.60 మెగా వాట్లు.

* 202021లో ఏపీలో తలసరి విద్యుత్‌ వినియోగం 1198 కిలో వాట్స్‌గా ఉంది.

* 202122లో రాష్ట్రంలో మొత్తం 5907 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSME) ఉన్నాయి. MSMEలు ఎక్కువగా ఉన్న జిల్లా తూర్పుగోదావరి, తక్కువగా ఉన్న జిల్లా విజయనగరం.

* రాష్ట్రంలో 2020, మార్చి నాటికి పెద్ద తరహా, మెగా పరిశ్రమల సంఖ్య 281. పెద్ద తరహా, మెగా పరిశ్రమలు ఎక్కువగా ఉన్న జిల్లా చిత్తూరు ్బ49్శ. తక్కువగా ఉన్న జిల్లా శ్రీకాకుళం ్బ6్శ.

* రాష్ట్రానికి అధిక పెట్టుబడులు సాధించి, పరిశ్రమల స్థాపనకు వీలుగా ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి విధానం 202023ను రూపొందించింది.

* రాష్ట్రంలో లీళీలీనిల అభివృద్ధికి ‘వైఎస్సార్‌ నవోదయం’ పథకాన్ని ప్రారంభించింది.

ఆంధ్రప్రదేశ్‌ సేవారంగం

* 202021లో రవాణా ద్వారా రెవెన్యూ అధికంగా వచ్చిన జిల్లా - విశాఖపట్నం, కాగా తక్కువగా వచ్చిన జిల్లా - విజయనగరం.

* రాష్ట్రంలో ఉన్న మొత్తం పోస్టాఫీసులు - 10,595. అత్యధిక పోస్టాఫీసులు ఉన్న జిల్లా అనంతపురం (943). తక్కువ ఉన్న జిల్లా - శ్రీకాకుళం (648).

* రాష్ట్రంలో ఉన్న మొత్తం బ్యాంకు బ్రాంచులు - 7,515. అత్యధిక బ్యాంకు బ్రాంచులు కృష్ణా ్బ888్శ జిల్లాలో ఉంటే, అత్యల్పంగా విజయనగరం (294) లో ఉన్నాయి.

ప్రజా పంపిణీ వ్యవస్థ (2021 డిసెంబరు నాటికి)


* రాష్ట్రంలో మొత్తం రేషన్‌ షాపుల సంఖ్య 29,784. రేషన్‌ షాపులు ఎక్కువగా ఉన్న జిల్లా అనంతపురం (3,012), తక్కువ ఉన్న జిల్లా - విజయనగరం (1,407).

* రాష్ట్రంలో మొత్తం తెల్లరేషన్‌ కార్డుల సంఖ్య 1,35,77,939. తెల్లరేషన్‌ కార్డులు ఎక్కువగా తూర్పు గోదావరి జిల్లాలో ఉంటే, తక్కువ సంఖ్యలో విజయనగరంలో ఉన్నాయి.

* రాష్ట్రంలో మొత్తం అన్నపూర్ణ కార్డుల సంఖ్య 7,251. ఇవి ఎక్కువగా ఉన్న జిల్లా- తూర్పు గోదావరి, తక్కువ ఉన్న జిల్లా కృష్ణా.

* రాష్ట్రంలో ఉన్న మొత్తం అంత్యోదయ అన్నయోజన కార్డులు- 8,61,696. అంత్యోదయ అన్నయోజన కార్డులు ఎక్కువగా అనంతపురంలో ఉండగా, తక్కువ సంఖ్యలో ప్రకాశంలో ఉన్నాయి.

ఆహారధాన్యాల ఉత్పత్తి - విస్తీర్ణం

ఏడాది విస్తీర్ణం (లక్షల హెక్టార్లు) ఉత్పత్తి (లక్షల టన్నులు)
2017 - 18 42.06  167.22
2018 - 19 40.23 149.56
2019 - 20 41.45 175.12
2020 - 21 43.01 165.04
2021 - 22 41.44 169.57

రాష్ట్రంలో MSMEల పెట్టుబడి కింది విధంగా ఉంది. (2020 జూన్‌ 1 నుంచి)

 పరిశ్రమ పెట్టుబడి టర్నోవర్‌
సూక్ష్మ పరిశ్రమ (Micro) కోటి వరకు 5 కోట్ల వరకు
చిన్నతరహా పరిశ్రమ (Small) 10 కోట్ల వరకు 50 కోట్ల వరకు
మధ్యతరహా పరిశ్రమ (Middle) 50 కోట్ల వరకు 250 కోట్ల వరకు

                

Posted Date : 09-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌