• facebook
  • whatsapp
  • telegram

కార్బన్‌ - దాని సమ్మేళనాలు

1. కింది అంశాల్లో సరైనవి ఏవి?

i) కాఅర్బన్‌ ఒక అలోహం

ii) కార్బన్‌ ఆధునిక ఆవర్తన పట్టికలో 14వ గ్రూపునకు చెందిన మూలకం.

iii) కార్బన్‌ తన బాహ్య కర్పరంలో నాలుగు ఎలక్ట్రాన్‌లను కలిగి ఉంటుంది.

జ: అన్నీ

2. వేర్వేరు మూలకాలతో కార్బన్‌ ఎన్ని ఏక సంయోజనీయ బంధాలను ఏర్పరుస్తుంది?

జ: 4

3. కిందివాటిలో మీథేన్‌ వాయువు రసాయన ఫార్ములా....

జ: CH4

4. ఒక మూలకం రెండు, అంత కంటే ఎక్కువ భౌతిక రూపాల్లో ఉంటూ, రసాయనిక ధర్మాల్లో దాదాపు సారూప్యతను కలిగి ఉండే ధర్మాన్ని ఏమంటారు?

జ: రూపాంతరత

5. కిందివాటిలో కార్బన్‌ అస్పటిక రూపాంతరాలకు ఉదాహరణలు ఏవి?

i) బొగ్గు       ii) వజ్రం      iii) కోక్‌    

iv) గ్రాఫైట్‌     v) నల్లటి మసి    vi) బక్‌మిన్‌స్టర్‌ఫుల్లరిన్‌

జ: బొగ్గు, కోక్‌, గ్రాఫైట్‌

6. కిందివాటిలో కార్బన్‌ స్పటిక రూపాంతరం ఏది?

1) వజ్రం         2) గ్రాఫైట్‌       

3) బక్‌మిన్‌స్టర్‌ఫుల్లరిన్‌    4) పైవన్నీ

జ: పైవన్నీ


7. సహజసిద్ధంగా లభించే పదార్థాల్లో అతి గట్టిగా ఉండేది ఏది?

జ: వజ్రం

8. కింది అంశాల్లో సరైనవి ఏవి?

i) గ్రాఫైట్‌ను కందెనలుగా ఉపయోగిస్తారు.

ii) గ్రాఫైట్‌ను పెన్సిల్‌ లెడ్‌గా ఉపయోగిస్తారు.

1) i మాత్రమే    2) ii      3) i, ii         4) ఏదీకాదు

జ: గ్రాఫైట్‌ను కందెనలుగా ఉపయోగిస్తారు.​​​​​, గ్రాఫైట్‌ను కందెనలుగా ఉపయోగిస్తారు.

9. గోళాకారంలో ఉండే ఫుల్లరిన్‌లను ఏమంటారు?

జ: బక్కీ బాల్స్‌​​​​​​

10. కిందివాటిలో గ్రాఫిన్‌కు సంబంధించి సరికానిది ఏది?

i) రాగి కంటే మంచి విద్యుత్‌ వాహకం

ii) స్టీల్‌ కంటే బలమైంది, తేలికైంది.

iii) గ్రాఫైట్‌ నుంచి తయారు చేస్తారు.

iv) విద్యుత్‌ వాహకతను ప్రదర్శించదు.

జ: విద్యుత్‌ వాహకతను ప్రదర్శించదు.

11. కిందివాటిలో అత్యధిక శృంఖల ధర్మాన్ని ప్రదర్శించే మూలకం?

జ: కార్బన్‌

12. కింది ఏ ధర్మం వల్ల కార్బన్‌ అసంఖ్యాకమైన సమ్మేళనాలను ఏర్పరుస్తోంది?

జ: శృంఖల సామర్థ్యం

13. ద్విబంధం, త్రిబంధాలను కలిగి ఉండే కర్బన సమ్మేళనాలను ఏమంటారు?

జ: అసంతృప్త హైడ్రోకార్బన్‌లు

14. కార్బన్‌ల మధ్య ఏక బంధాలున్న హైడ్రోకార్బన్‌లను ఏమంటారు?

జ:  సంతృప్త హైడ్రోకార్బన్‌లు

15. మూడు కర్బన పరమాణువులను కలిగి ఉన్న ఆల్కేన్‌ ఖిగీశితిది నామం ఏమిటి?

జ:  ప్రొపేన్‌

16. ఆల్కేన్‌లు కింది ఏ చర్యల్లో పాల్గొంటాయి?

జ: ప్రతిక్షేపణ

17. ఒకే అణుఫార్ములా కలిగి, వేర్వేరు ధర్మాలను ప్రదర్శించే వివిధ సమ్మేళనాలను ఏమంటారు?

జ: సాదృశకాలు

18. ప్రయోగశాలలో మొదటగా తయారు చేసిన కర్బన సమ్మేళనం ఏది?

జ: యూరియా

19. మూలకాల రారాజు అని దేన్ని అంటారు?

జ: కార్బన్‌

20. కిందివాటిలో బ్లాక్‌లెడ్‌ ్బతీః్చ‘ఁః’్ట్శ అని పిలిచే కార్బన్‌ రూపాంతరం ఏది?

జ: గ్రాఫైట్‌

21. బక్‌మిన్‌స్టర్‌ఫుల్లరిన్‌ అనే కార్బన్‌ రూపాంతరం ఫార్ములా?

జ: C60

22. బక్‌మిన్‌స్టర్‌ఫుల్లరిన్‌ ఎన్ని కార్బన్‌ వలయాలను కలిగి ఉంది?

జ: 20 షట్కోణాకృతి, 12 పంచకోణాకృతి

23. కిందివాటిలో ఒకే మూలకాన్ని కలిగి ఉన్న పదార్థం ఏది?

జ: వజ్రం, ఫుల్లరిన్‌

24. కిందివాటిలో న్యూట్రాన్‌ల వేగాన్ని తగ్గించే మితకారిగా ఉపయోగించే కర్బన పదార్థం?

జ: గ్రాఫైట్‌

25. కిందివాటిలో అతి పురాతనమైన బొగ్గు రకం ఏది?

జ: ఆంత్రసైట్‌ బొగ్గు

26. కిందివాటిలో తక్కువ కార్బన్‌ శాతాన్ని కలిగిన బొగ్గు రకం ఏది? 

జ: లిగ్నైట్‌ బొగ్గు

27. కాయలు త్వరగా పక్వానికి వచ్చేలా కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తారు. అది విడుదల చేసే వాయువు ఏది?

జ: ఎసిటిలీన్‌

29. ‘పారాఫిన్‌లు’ అని ఏ హైడ్రోకార్బన్‌లను పిలుస్తారు?

జ: ఆల్కేన్‌లు

30. ద్రవీకృత పెట్రోలియం వాయువు (Petroleum Gas) వేటి మిశ్రమం?

జ: ప్రొపేన్‌ + బ్యూటేన్‌ 

31. కింది ఏ వాయువుల మిశ్రమాన్ని ‘గ్యాస్‌ వెల్డింగ్‌’లో ఉపయోగిస్తారు?

జ: ఎసిటిలీన్‌ + ఆక్సిజన్‌ 

33. ‘క్లోరోఫాం’ రసాయన ఫార్ములా ఏమిటి?

జ: CHCl3

34. కారు రేడియేటర్‌లో నీరు గడ్డ కట్టకుండా ఏ కర్బన పదార్థాన్ని నీటిలో కలుపుతారు?

జ: ఇథిలీన్‌ గ్లైకాల్‌

35. కిందివాటిలో ‘ఆల్కహాల్‌’ ప్రమేయ సమూహం ఏది?

జ: -OH

36. ఇథైల్‌ ఆల్కహాల్‌ రసాయన ఫార్ములా?

జ: C2H5OH

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు


1. గోబర్‌ గ్యాస్‌లోని ముఖ్యమైన వాయువు ఏది? (ఏపీపీఎస్సీ - 2012)

జ: మీథేన్‌

2. సంతృప్త హైడోకార్బన్లను దహనం చేస్తే సాధారణంగా లభించేవి ఏవి? (ఏపీపీఎస్సీ - 2017)

జ: బొగ్గుపులుసు వాయువు, నీరు, వేడి

3. కిందివాటిలో కందెనగా ఉపయోగించేది ఏది? (ఏపీపీఎస్సీ - 2020)

జ: గ్రాఫైట్‌

4. కిందివాటిలో గ్రీన్‌హౌస్‌ వాయువు ఏది? (ఏపీపీఎస్సీ - 2020)

జ: మీథేన్‌

5. కిందివాటిలో భోపాల్‌ దుర్ఘటనకు కారణమైన కర్బన పదార్థం ఏది?  (ఏపీపీఎస్సీ - 2020)

జ: మిథైల్‌ ఐసోసయనేట్‌

6. కిందివాటిలో కర్బన రహిత సమ్మేళనం ఏది?  (ఏపీపీఎస్సీ - 2020)

జ: ఇసుక

7. బయోగ్యాస్‌లోని ప్రధాన వాయువు? (ఏపీపీఎస్సీ - 2019)

జ: మీథేన్‌

8. నానో కణాల పరిమాణం ఎంత? (ఏపీపీఎస్సీ - 2019)

జ: 1100 mm 

9. కిందివాటిలో ‘మార్ష్‌ వాయువు’ అని దేన్ని అంటారు? (ఏపీ ఫారెస్ట్‌ సర్వీస్‌ - 2019)

జ: మీథేన్‌

10. ఎల్‌పీజీ లీకేజీని వాసన ద్వారా గుర్తించడానికి అందులో కలిపే వాయువు ఏది? (ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ - 2019)

జ: ఈథైల్‌ మెర్కాప్టన్‌

11. కిందివాటిలో కార్బన్‌ స్వచ్ఛమైన రూపం ఏది?     (యూపీఎస్సీ - 2018)

జ: చార్‌కోల్‌

12. పెన్సిల్‌ లెడ్‌ తయారీలో ఉపయోగించే మూలకం ఏది? (యూపీఎస్సీ - 2017)

జ: కార్బన్‌ (గ్రాఫైట్‌)

13. కిందివాటిలో మసిలేని జ్వాలతో మండే కర్బన పదార్థం ఏది?  (యూపీఎస్సీ - 2016)

జ: హెక్సేన్‌ 

14. కిందివాటిలో కార్బన్‌ రూపాంతరం కానిది? (యూపీఎస్సీ - 2016)

జ: గ్రాఫిన్‌

15. కాయలు సహజంగా పక్వానికి వచ్చేందుకు ఉపయోగపడే పదార్థం?  (యూపీఎస్సీ - 2017)

జ: ఇథిలీన్‌

Posted Date : 15-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌