• facebook
  • whatsapp
  • telegram

వరదలు 

1. గంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో వరదలను నియంత్రించడానికి భారత ప్రభుత్వం గంగా ఫ్లడ్ కంట్రోల్ కమిషన్‌ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది?
జ: 1972


2. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధీనంలో పనిచేసే 'నేషనల్ వాటర్ అకాడమీ' (NWA)ను ఏ నగరంలో నెలకొల్పారు?
జ: పుణే


3. వరదల వల్ల రోడ్లు, రైల్వే లైన్లకు కలిగే నష్టాన్ని తనిఖీ చేయడానికి ఏ సంస్థలు పనిచేస్తున్నాయి? 
జ: బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ , నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ,  స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ


4. వరద హెచ్చరిక, నదీ ప్రవాహం ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి అపాయకరమైన స్థాయి కంటే తక్కువగా ఉంటే  ఆ ప్రవాహాన్ని ఏమంటారు?
జ: తక్కువస్థాయి వరద


5. 2008లో బీహార్‌లోని ఏ నదికి వరదలు రావడం వల్ల 527 మంది మరణించారు? 
జ: కోసి


6. భారతదేశంలో ఎంత శాతం భూ భాగం వరద ముప్పునకు గురయ్యే అవకాశం ఉంది?
జ: 8%

7. భారతదేశంలో ఏ నెలల మధ్యకాలంలో వరదలు వచ్చే అవకాశం ఎక్కువ?
జ: జూన్-సెప్టెంబరు


8. భారతదేశంలో ఏ సంవత్సరంలో సంభవించిన వరదల ఫలితంగా అత్యధికంగా 11,316 మంది మరణించారు?
జ: 1977


9. మన దేశంలో వరదలు తరచుగా ఏ నదీ పరీవాహక ప్రాంతాల్లో వస్తుంటాయి?
జ: గంగా-బ్రహ్మపుత్ర


10. ఏదైనా ప్రాంతంలో వరదలు రావడానికి కారణం- 
జ: అధిక వర్షపాతం, తుపాన్లు , జలాశయాలకు గండ్లు పడటం , కొండచరియలు విరిగిపడటం, నదులు ప్రవాహ దిశను మార్చుకోవడం


11. హైదరాబాద్, ముంబయి లాంటి నగరాల్లో వరదలు రావడానికి కారణమేమిటి?
జ: డ్రైనేజీలు ఘనపదార్థాలతో పూడుకుపోవడం


12. బ్రహ్మపుత్రా నదీ ప్రాంతంలో ఉండే ఏ రాష్ట్రాల్లో అక్కడి నదుల వల్ల ఎక్కువగా వరదలు వస్తున్నాయి?
జ: అసోం, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్


13. జార్ఖండ్, బీహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ నది, దాని ఉపనదుల వల్ల వరదలు సంభవిస్తున్నాయి?
జ: గంగానది


14. మధ్య భారతదేశం, దక్కన్ ప్రాంతంలోని ఏ నదుల వల్ల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వరదలు సంభవిస్తున్నాయి?
జ: గోదావరి, కృష్ణా, కావేరి

15. తరచూ వరదలు సంభవించే ప్రాంతాల్లో వరదలకు ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 
జవాబు: 1) దగ్గరలో ఉన్న పునరావాస కేంద్రాన్ని గుర్తించాలి  2) మంచినీరు, ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవాలి  3) ముఖ్యమైన కాగితాలను నీటిలో తడవకుండా భద్రపరచాలి


16. వరద సంభవించిన తర్వాత ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? 
జవాబు: 1) సురక్షితమైన నీటినే తాగాలి  2) ఆహార పదార్థాలను నీటిలో తడవకుండా చూడాలి  3) కలరా, డయేరియా లాంటి వ్యాధులు సోకకుండా జాగ్రత్తపడాలి


17. వరద వల్ల నేల క్రమక్షయం జరిగి జలాశయాల్లో, పంటపొలాల్లో పూడిక పెరుగుతుంది. ఇసుక మేటలు వేస్తుంది. దీన్ని ఏవిధంగా నివారించవచ్చు?
జవాబు: అటవీ, కొండ ప్రాంతాల్లో చెట్లు నాటడం


18. వరదల వల్ల కలిగే నష్టం-
జవాబు:   1) నేల క్రమక్షయానికి గురవుతుంది, సారాన్ని కోల్పోతుంది  2) రోడ్లు, భవనాలు, రైల్వేట్రాక్‌లు దెబ్బతింటాయి  3) ఆస్తి, ప్రాణ నష్టాలు

19. వరద రావడాన్ని ముందుగానే హెచ్చరించే కేంద్రాలు భారతదేశంలో ఏ నది, దాని ఉపనదుల పరీవాహక ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి? 
జవాబు: గంగానది


20. వరదల నివారణకు చేపట్టాల్సిన చర్యలేవి? 
జవాబు: 1) వరదనీటిని కాల్వల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించడం  2) నేల క్రమక్షయానికి గురికాకుండా చూడటం  3) పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థను బాగుపరచడం


21. భారతదేశంలో 11వ పంచవర్ష ప్రణాళికా కాలంలో అదనంగా ఎన్ని మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో రక్షణ చర్యలు చేపట్టారు?
జవాబు: 21.8


22. 'నేషనల్ ఫ్లడ్ కంట్రోల్ ప్రోగ్రామ్‌'ను ఎప్పుడు ప్రారంభించారు? 
జవాబు: 1954


23. భారతదేశంలో వరదల గురించి ముందస్తు సమాచారం అందించే సంస్థ 'సెంట్రల్ వాటర్ కమిషన్'. దీని ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? 
జవాబు: ఢిల్లీ
 

24. ఏ సంస్థలు వివిధ నదీ పరీవాహక ప్రాంతాల నుంచి నీరు, వాతావరణ సంబంధ సమాచారాన్ని గ్రహించి హెచ్చరిక కేంద్రాలకు అందిస్తున్నాయి?
జవాబు: సెంట్రల్ వాటర్ కమిషన్, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్‌మెంట్ 


25. ఆంధ్రప్రదేశ్‌లో ఏ నదీ పరీవాహక ప్రాంతంలో ముందస్తు హెచ్చరికా కేంద్రాలు అధికంగా ఉన్నాయి? 
జవాబు: గోదావరి


26. భారతదేశంలో వరదల నియంత్రణ, నివారణ, సహాయ చర్యల కోసం కృషి చేస్తున్న సంస్థలు-
జవాబు:  1) సెంట్రల్ వాటర్ కమిషన్  2) ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్‌మెంట్  3) నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ 


27. పదకొండో పంచవర్ష ప్రణాళికా కాలంలో 'ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్' చేపట్టారు. దీన్ని ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు?
జవాబు: జలవనరుల  


28. కాల్వలు పూడిక తీయడం; నేల క్రమక్షయానికి, సముద్రం కోతకు గురికాకుండా చూడటం లాంటి వరద నియంత్రణా చర్యలను చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఏ పథకంలో భాగంగా నిధులు సమకూరుస్తోంది? 
జవాబు: ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్


29. పశ్చిమబెంగాల్‌లోని గంగానది పరీవాహక ప్రాంతం, ఫరక్కా బ్యారేజి ఎగువ, దిగువ ప్రాంతాల్లో జరుగుతున్న నేల క్రమక్షయంపై అధ్యయనం చేసి, రిపోర్టు సమర్పించిన కమిటీ ఏది? 
జవాబు: ప్రీతమ్‌సింగ్ కమిటీ


30. నరేష్‌చంద్ర కమిటీ దేనికి సంబంధించింది? 
జవాబు: ఈశాన్య రాష్ట్రాల్లో వరదల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు 


31. భారతదేశంలో నదుల్లో పూడికకు సంబంధించిన సమస్యను అధ్యయనం చేయడానికి జలవనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఏది? 
జవాబు: బి.కె. మిట్టల్ కమిటీ


32. ఎం.కె.శర్మ సమర్పించిన రిపోర్ట్ దేనికి సంబంధించింది?
జవాబు: ఉత్తర బెంగాల్‌లో వరద, నేల క్రమక్షయం

Posted Date : 07-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌