• facebook
  • whatsapp
  • telegram

ఆదేశిక సూత్రాలు

1. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదని సుప్రీంకోర్టు ఏ కేసులో తెలిపింది?
జ: గోలక్‌నాథ్ కేసు
 

2. రాజ్యాంగ మౌలిక స్వభావం గురించి సుప్రీం కోర్టు ఏ కేసులో ప్రస్తావించింది?
జ: కేశవానంద భారతి కేసు
 

3. '31 C' ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జోడించారు?
జ: 25
 

4. స్త్రీలకు ప్రసూతి వైద్య సదుపాయాలు కల్పించాలని చెబుతోన్న అధికరణం ఏది?
జ: 42
 

5. 73వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది?
జ: పంచాయతీరాజ్ వ్యవస్థ
 

6. ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న 40వ అధికరణం దేనికి ఉదాహరణగా చెప్పొచ్చు?
జ: గాంధేయవాద నియమం
 

7. నిరుద్యోగులు, వృద్ధులు, అంగవైకల్యం ఉన్నవారిని ప్రభుత్వం ఆదుకోవడానికి ప్రయత్నించాలని ఏ అధికరణం చెబుతోంది?
జ: 41
 

8. కార్మికుల కనీస వేతన చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
జ: 1948
 

9. కుటీర పరిశ్రమలు ఏ జాబితాకు చెందినవి?
జ: రాష్ట్ర జాబితా
 

10. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు వేసిన మహిళ?
జ: షయారా బానో

11. మన రాజ్యాంగ నిర్మాతలు ఏ దేశం నుంచి స్ఫూర్తి పొంది ఆదేశిక సూత్రాలు/ నిర్దేశిక నియమాలను రాజ్యాంగంలో చేర్చారు?

జ:  ఐర్లాండ్‌


12. ఆదేశిక సూత్రాల వివరణ రాజ్యాంగంలో ఎక్కడ ఉంది?

జ: నాలుగో భాగం, ఆర్టికల్స్‌ 36 - 51

13. ఆదేశిక సూత్రాలకు సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) ఇవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ విధానాలకు మార్గదర్శకంగా ఉంటాయి. 

బి) వీటికి న్యాయస్థానాల రక్షణ లేదు.

సి) ఇవి ఆర్థిక ప్రజాస్వామ్య స్థాపనకు తోడ్పడతాయి. 

డి) వీటి అమలుకు న్యాయస్థానాలు ‘రిట్స్‌’ (Writs) జారీ చేస్తాయి.

జ:  ఎ, బి, సి       

14. ఎం.పి.శర్మ అనే రాజనీతిజ్ఞుడు వర్గీకరించిన ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరికానిది ఏది? 

జ: సంక్షేమ నియమాలు - ఆర్టికల్స్‌ 37, 38, 43, 44, 45

15. శ్రేయోరాజ్య స్థాపనలో నిమగ్నమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశిక సూత్రాలు ‘కరదీపికలు’గా ఉపకరిస్తాయని వ్యాఖ్యానించింది ఎవరు? 

జ: ఎం.సి.సెతల్వాడ్‌    

16. ఆదేశిక సూత్రాల్లోని వివిధ ఆర్టికల్స్‌కు సంబంధించి సరైనవి ఏవి? 

ఎ) ఆర్టికల్‌ 38 - పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించాలి.

బి) ఆర్టికల్‌ 39 - జాతీయ సంపదను వికేంద్రీకరించాలి.

సి) ఆర్టికల్‌ 40 - గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలి.

డి) ఆర్టికల్‌ 41 - గోవధను నిషేధించాలి.

జ: ఎ, బి, సి      

17. ఆదేశిక సూత్రాల్లోని ఏ ఆర్టికల్‌ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ‘ఉచిత న్యాయ సహాయం’ అందించాలని నిర్దేశిస్తుంది?

జ:  ఆర్టికల్‌ 39 (A)

18. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పింఛన్‌ సదుపాయాన్ని కల్పించాలని ఆదేశిక సూత్రాల్లోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది?

జ: ఆర్టికల్‌ 41    

19. 42వ రాజ్యాంగ సవరణ చట్టం - 1976 ద్వారా ఆదేశిక సూత్రాలకు నూతనంగా చేర్చిన ఆర్టికల్‌ ఏది?

1) ఆర్టికల్స్‌ 39 (A), 43 (A)

2) ఆర్టికల్స్‌ 48 (A), 39 (F)

3) ఆర్టికల్స్‌ 38 (A), 38 (B)

4) 1, 2

జ: 1, 2

20. ఆదేశిక సూత్రాల్లోని ఆయా ఆర్టికల్స్‌లో పేర్కొన్న అంశాలకు సంబంధించి సరికానిది ఏది?

జ: ఆర్టికల్‌ 44  గోవధను నిషేధించాలి.



21. భారతీయులందరికీ ‘ఉమ్మడి పౌరస్మృతి’ (Common Civil Code) ని అమలు చేయాలని ఆదేశిక సూత్రాల్లోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది?

జ:  ఆర్టికల్‌ 44    

22. మనదేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్న రాష్ట్రం ఏది?

జ: గోవా    

23. బాలలు స్వేచ్ఛాయుత, గౌరవప్రదమైన వాతావరణంలో అభివృద్ధి చెందడానికి అవసరమైన సదుపాయాలను కల్పించాలని ఆదేశిక సూత్రాల్లోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది?

జ: ఆర్టికల్‌ 39 (F)

24. కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయాలని ఆదేశిక సూత్రాల్లోని ఏ ఆర్టికల్‌ తెలుపుతుంది?

జ: ఆర్టికల్‌ 50

25. ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్‌ 39 (A) అమలు కోసం మనదేశంలో 1987లో కింద పేర్కొన్న దేన్ని ఏర్పాటు చేశారు?

1) Legal Services Authority Act
2) Legal Assurance Agreem Act
3) National Institute of Legal Services
4) Subordinate Position Act

జ: Legal Services Authority Act

26. ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు భారత ప్రభుత్వాన్ని ఆదేశించింది?

జ: సరళా ముద్గల్‌ VS  యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

27. పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది?

జ:  ఆర్టికల్‌ 43 (A)

28. ప్రతీ భారతీయుడు ‘ప్రపంచ శాంతి’ కోసం కృషి చేయాలని ఆదేశిక సూత్రాల్లోని ఏ ఆర్టికల్‌ తెలుపుతుంది?

జ:  ఆర్టికల్‌ 51

29. ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్‌ 43 (B)ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు? (సహకార సంస్థలను నెలకొల్పేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ ఆర్టికల్‌ పేర్కొంటుంది.)

జ:  97వ రాజ్యాంగ సవరణ చట్టం - 2012        

30. పర్యావరణ పరిరక్షణ కోసం అడవులను పెంచాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది?

జ:  ఆర్టికల్‌ 48 (A) 


31. ఆదేశిక సూత్రాల్లోని వివిధ ఆర్టికల్స్‌లో పేర్కొన్న అంశాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. 

ఎ) ఆర్టికల్‌ 45 - సార్వత్రిక ప్రాథమిక విద్యాసాధనకు కృషి.

బి) ఆర్టికల్‌ 42 - కార్మికులకు న్యాయమైన పనిగంటలు కల్పించడం.

సి) ఆర్టికల్‌ 49 - పురాతన కట్టడాలు, శిల్ప సంపద, సంస్కృతి పరిరక్షణ.

డి) ఆర్టికల్‌ 46 - మత్తు పదార్థాల నిషేధం.

జ:  ఎ, బి, సి     


32. విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వర్గాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ తెలుపుతుంది?

జ:  ఆర్టికల్‌ 46

33. ఆదేశిక సూత్రాల అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం బోనస్‌ చెల్లింపు చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది?

జ:  1965 

34. ఆదేశిక సూత్రాల అమలు కోసం భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సంబంధించి సరైనవి ఏవి? 

ఎ) సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం - 1978     

బి) వన్యప్రాణుల సంరక్షణ చట్టం - 1972

సి) సమాజ అభివృద్ధి కార్యక్రమం - 1974      

డి) అడవుల సంరక్షణ చట్టం - 1980

జ:  ఎ, బి, డి 


35. ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్‌ 45ను సవరించి 6 ఏళ్లలోపు ఉన్న బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు?

జ:  86వ రాజ్యాంగ సవరణ చట్టం - 2002     


36. ఆదేశిక సూత్రాల స్వాభావిక లక్షణాన్ని గుర్తించండి.

1) సమాజ సమష్టి ప్రయోజనాల కోసం ఉద్దేశించినవి. 

2) శ్రేయోరాజ్య భావనను, సంక్షేమ స్వభావాన్ని తెలియజేస్తాయి.

3) వీటి అమలు కోసం ప్రభుత్వం తప్పనిసరిగా చట్టాలు చేయాల్సి ఉంటుంది.    

4) పైవన్నీ 

జ: పైవన్నీ   


 

Posted Date : 10-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌