మాదిరి ప్రశ్నలు
1. నిర్దిష్టమైన ఆకారం, ఘనపరిమాణం ఉండే పదార్థాలు
జ: వాయు పదార్థాలు
2. నిర్దిష్ట ఘనపరిమాణం ఉండి ఆకారం లేని పదార్థాలు
జ: ద్రవ పదార్థాలు
3. నిర్దిష్ట ఘనపరిమాణం, ఆకారం లేని పదార్థాలు
జ: వాయు పదార్థాలు
4. కిందివాటిలో మూడు స్థితుల్లో లభించే పదార్థం ఏది?
A) కిరోసిన్ B) పాలు C) పెట్రోలు D) నీరు
జ: D (నీరు)
5. ఏ పాత్రలో ఉంటే ఆ పాత్ర స్వరూపాన్ని పొందేవి
జ: ద్రవ పదార్థాలు
6. పాత్ర ఘనపరిమాణం ఎంత ఉన్నా వ్యాకోచించి దాన్ని పూర్తిగా ఆక్రమించే పదార్థాలు
జ: వాయు పదార్థాలు
7. వాయువుల ధర్మాలన్నింటిలోనూ మాపనం చేయడానికి వీలైన ముఖ్య ధర్మాలు
A) ఘనపరిమాణం B) పీడనం C) ద్రవ్యరాశి D) అన్నీ
జ: D (అన్నీ)
8. ఘనపదార్థం ద్రవస్థితిలోకి మారకుండానే నేరుగా వాయుస్థితిలోకి మారడాన్ని ఏమంటారు?
జ: ఉత్పతనం
9. కిందివాటిలో సంపీడ్యం చెందేది
A) ఇనుము B) నీరు C) గాలి D) కర్రముక్క
జ: C (గాలి)
10. కిందివాటిలో వ్యాపనం చెందేది
A) రాగి B) పాదరసం C) బ్రోమిన్ D) మైనం
జ: C (బ్రోమిన్ )
11. వాహనాల్లో ఇంధనంగా ఉపయోగించే వాయువు
జ: సీఎన్‌జీ
12. గృహాల్లో వంటకు వినియోగించే వాయువు
జ: ఎల్‌పీజీ
13. కిందివాటిలో అత్యధిక వ్యాపన వేగం ఉండే వాయువు ఏది?
A) CO2 B) HCl C) NH3 D) H2
జ: D (H2)
14. కిందివాటిలో ఏ పదార్థ కణాల మధ్య ఖాళీ స్థలం తక్కువగా ఉంటుంది?
A) ఘన పదార్థాలు B) ద్రవ పదార్థాలు C) వాయు పదార్థాలు D) అన్నీ
జ: A (ఘన పదార్థాలు)
15. సీఎన్‌జీ (CNG) ఏ స్థితిలో ఉంటుంది?
జ: వాయుస్థితి
16. ఒక వాయువుపై పీడనాన్ని పెంచితే దాని ఘనపరిమాణం
జ: తగ్గుతుంది
17. నాఫ్తలిన్, హారతి కర్పూరాన్ని గాలిలో ఉంచితే కొన్ని రోజులకు అవి ఏ స్థితిలోకి మారతాయి?
A) ఘనస్థితి B) ద్రవస్థితి C) వాయుస్థితి D) ఏదీకాదు
జ: D (ఏదీకాదు)
18. ద్రవాల్లో వ్యాపనం చెందే పదార్థాలు
A) ఘన పదార్థాలు B) ద్రవ పదార్థాలు C) వాయు పదార్థాలు D) అన్నీ
జ: D (అన్నీ)
19. కిందివాటిలో వాయుధర్మం
A) వాయువు ఖాళీ స్థలాన్ని ఆక్రమిస్తుంది. B) వాయువు అన్ని దిశల్లోనూ వ్యాపిస్తుంది.
C) వాయువు పీడనాన్ని కలగజేస్తుంది. D) అన్నీ
జ: D (అన్నీ)
20. వాతావరణ పీడనాన్ని మాపనం చేయడానికి ఉపయోగించే పరికరం ఏది?
జ: బారోమీటర్
21. సాధారణ పరిస్థితుల్లో సముద్రమట్టం వద్ద వాతావరణ పీడనం ఎంత ఉంటుంది?
జ: 76 సెం.మీ.
22. ఒక అట్మాస్ఫియర్ విలువ
A) 760 మి.మీ. B) 76 సెం.మీ. C) 1 టార్ D) అన్నీ
జ: D (అన్నీ)
23. ఒక సెం.మీ.3 విలువ
జ: 1 మి.లీ.
24. వివిధ వాయువులు కలగజేసే పీడనాన్ని మాపనం చేయడానికి ఉపయోగించే సాధనం ఏది?
జ: మానోమీటర్
25. వాయు ఘనపరిమాణం, దాని పీడనానికి మధ్య ఉండే సంబంధాన్ని తెలియజేసే నియమం ఏది?
జ: బాయిల్ నియమం
26. PV = k (స్థిరాంకం) అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
జ: బాయిల్
27. స్థిర ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట ద్రవ్యరాశి గల వాయువు ఆక్రమించే ఘనపరిమాణం, పీడనాల లబ్ధం ఎల్లప్పుడూ ఏ విధంగా ఉంటుంది?
జ: స్థిరం
28. బాయిల్ నియమాన్ని గ్రాఫ్ రూపంలో గీసినప్పుడు, స్థిర ఉష్ణోగ్రత వద్ద గీసే వక్రరేఖలను ఏమంటారు?
జ: సమోష్ణోగ్రత వక్రాలు
29. వాయువులు అధికంగా సంపీడనానికి లోనవుతాయని నిరూపించిన నియమం ఏది?
జ: బాయిల్ నియమం
30. వాయువులు ఏ సందర్భంలో బాయిల్ నియమాన్ని పాటించవు?
జ: అధిక పీడనం
31. బాయిల్ నియమం ప్రకారం సాంద్రత, పీడనానికి మధ్య సంబంధాన్ని సూచించే సమీకరణం ఏది?
జ:
32. స్థిర ఉష్ణోగ్రత వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయువు పీడనం దాని సాంద్రతకు ఏ విధంగా ఉంటుంది?
జ: అనులోమానుపాతంలో
33. అన్ని ఉష్ణోగ్రత పీడనాల వద్ద బాయిల్ నియమాన్ని పాటించే వాయువు
జ: ఆదర్శ వాయువు
34. నిర్దిష్ట ద్రవ్యరాశి గల వాయువు 760 మి.మీ. పీడనం వద్ద 250 మి.లీ. ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది. అదే ఉష్ణోగ్రత వద్ద 1520 మి.మీ. పీడనం వద్ద వాయువు ఆక్రమించే ఘనపరిమాణాన్ని కనుక్కోండి.
జ: 125 మి.లీ.
35. నిర్దిష్ట ద్రవ్యరాశి గల ఒక వాయువు సాధారణ పీడనాన్ని (1.0 అట్మాస్ఫియర్) ఉపయోగించినప్పుడు 2.0 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమించింది. అదే ఉష్ణోగ్రత వద్ద 5.0 అట్మాస్ఫియర్ల పీడనంతో వాయువు ఎంత ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది?
జ: 0.4 లీ.
36. స్థిర పీడనం వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయువు ఘనపరిమాణం ఉష్ణోగ్రత పెరిగితే పెరుగుతుందని, తగ్గిస్తే తగ్గుతుందని నిరూపించిన శాస్త్రవేత్తలు?
జ: చార్లెస్, గెలూసాక్
37. = k (స్థిరాంకం) అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు?
జ: చార్లెస్
38. చార్లెస్ నియమం ప్రకారం toC వద్ద వాయు ఘనపరిమాణం (Vt)కు సమీకరణం
జ:
39. సెల్సియస్‌మానంలో 0 oC కెల్విన్ మానంలో ఎన్ని కెల్విన్‌లకు సమానం
జ: 273 K
40. 10 oC ఎన్ని కెల్విన్‌లకు సమానం?
జ: 283 K
41. 300 K ను సెల్సియస్‌లోకి మారిస్తే
జ: 27 oC
42. స్థిర పీడనం వద్ద నిర్దిష్ట ద్రవ్యరాశి గల ఒక వాయువు 0oC వద్ద ఉండే ఘనపరిమాణం ప్రతి 1oC ఉష్ణోగ్రత తగ్గుదలకు ఎన్నిరెట్లు తగ్గుతుంది?
జ:
43. కిందివాటిలో చార్లెస్ నియమాన్ని సూచించే సమీకరణం
జ:
44. పరమశూన్య ఉష్ణోగ్రత విలువ
జ: 0 K, - 273.15oC
45. పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద వాయువుల ఘనపరిమాణం
జ: శూన్యం
46. స్థిర పీడనం వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయువు ఘనపరిమాణం పరమఉష్ణోగ్రతకు ఏ విధంగా ఉంటుంది?
జ: అనులోమానుపాతం
47. గణితాత్మకంగా చార్లెస్ నియమాన్ని ఏ విధంగా సూచిస్తారు?
జ: V = k2T
48. చార్లెస్ నియమం
జ: స్థిర పీడనం వద్ద వాయువు ఘనపరిమాణం ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది.
49. సాధారణ ఉష్ణోగ్రత, పీడనాల (NTP) వద్ద ఉండే వాయువు ఏ ఉష్ణోగ్రత వద్ద రెట్టింపు ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది?
జ: 273 oC
50. వాయుపీడనం, ఉష్ణోగ్రతల మధ్య సంబంధాన్ని సూచించే నియమం
జ: గెలూసాక్ నియమం
51. వేసవి కాలంలో వాహనాల టైర్లలోని గాలి పీడనం అనూహ్యంగా పెరిగి అవి పగిలిపోవడానికి కారణమయ్యే నియమం
జ: గెలూసాక్ నియమం
52. శీతాకాలంలో వాహనాల టైర్ల పీడనం తగ్గడానికి కారణమయ్యే నియమం
జ: గెలూసాక్ నియమం
53. స్థిర ఘనపరిమాణం వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయువు పీడనం పరమ ఉష్ణోగ్రతకు ఏ విధంగా ఉంటుంది?
జ: అనులోమానుపాతం
54. గెలూసాక్ నియమాన్ని గణితాత్మకంగా ఏ విధంగా సూచిస్తారు?
జ:
55. స్థిర మోలార్ ఘనపరిమాణం గల వాయువు పీడన - ఉష్ణోగ్రత రేఖలను ఏమంటారు?
జ: ఐసోకోర్‌లు
56. వాయు ఘనపరిమాణం ద్రవ్యరాశుల మధ్య సంబంధాన్ని సూచించే నియమాన్ని ప్రతిపాదించినవారు
జ: అవగాడ్రో
57. ఒక మోల్ వాయువులో ఉండే అణువుల సంఖ్య
జ: 6.022 × 1023
58. స్థిర ఉష్ణోగ్రత, పీడనాల వద్ద వాయు ఘనపరిమాణానికి, దానిలోని అణువుల సంఖ్యకు మధ్య ఉండే సంబంధం
జ: అనులోమానుపాతం
59. అవగాడ్రో నియమం గణితపరంగా
జ: V = k4n
60. 1 bar విలువ ఎంత?
జ: 105 పాస్కల్
61. STP వద్ద ఒక ఆదర్శవాయువు మోలార్ ఘనపరిమాణం
జ: 22.7109 L mol-1
62. ఆదర్శవాయు సమీకరణం

63. ప్రమాణ ఉష్ణోగ్రత, పీడనాల వద్ద ఒక మోల్ ఆదర్శవాయువు ఆక్రమించే ఘనపరిమాణం
జ: 22.71 లీ.
64. ఒక మోల్ వాయువుకు R విలువ ఎంత? (L atm K-1 mol-1 లలో)
జ: 8.20578 × 10-2
65. ఆదర్శవాయు సమీకరణాన్ని ఏ విధంగా వ్యవహరిస్తారు?
జ: స్థితి సమీకరణం
66. వాయువు విస్తరించి అందుబాటులో ఉన్న మొత్తం స్థలాన్ని ఆక్రమించే ధర్మాన్ని ఏమంటారు?
జ: వ్యాపనం
67. సువాసన ద్రవ్యాలు (అత్తర్లు) ఏ నియమం ఆధారంగా సువాసనను వెదజల్లుతాయి?
జ: గ్రాహం వాయు వ్యాపన నియమం
68. వాయువుల వ్యాపన వేగానికి, వాటి సాంద్రతకు మధ్య ఉండే సంబంధాన్ని వివరించిన శాస్త్రవేత్త
జ: గ్రాహం
69. 'స్థిర పీడనం, ఉష్ణోగ్రతల వద్ద నియమిత ద్రవ్యరాశి గల వాయువు వ్యాపనం రేటు దాని సాంద్రత వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది' అని తెలిపే నియమం
జ: గ్రాహం వాయు వ్యాపన నియమం
70. భూమి ఆకర్షణ ప్రభావం లేకుండా వాయువులు ఒక దాంతో ఒకటి కలిసి సజాతీయ మిశ్రమం ఏర్పడటాన్ని ఏమంటారు?
A) సాంద్రీకరణం B) బాష్పీభవనం C) వ్యాపనం D) ఏదీకాదు
జ: D (ఏదీకాదు)
71. కిందివాటిలో ఏ నియమం ఆధారంగా బొగ్గు గనుల్లో మీథేన్ వాయువును గుర్తించి అపాయాన్ని నివారించవచ్చు?
A) బాయిల్ నియమం B) గ్రాహం వాయు వ్యాపన నియమం
C) గెలూసాక్ నియమం D) చార్లెస్ నియమం
జ: B (గ్రాహం వాయు వ్యాపన నియమం)
72. మార్ష్‌గ్యాస్ అలారం (అన్సిల్ అలారం) ఏ నియమంపై ఆధారపడి పనిచేస్తుంది?
జ: గ్రాహం వాయు వ్యాపన నియమం
73. అణుశక్తి అంశిక కేంద్రకాల్లో 235 U F6, 238 U F6 లను ఏ ప్రక్రియ ద్వారా వేరు చేస్తారు?
జ: వ్యాపనం
74. ఏ వాయువుల వ్యాపనం వల్ల జలచరాలు, మొక్కలు నీటిలో జీవిస్తున్నాయి?
జ: CO2, O2
75. శ్వాసక్రియలో ఊపిరితిత్తుల నుంచి రక్తంలోకి వ్యాపనం చెందే వాయువు
జ: O2
76. మన శరీరంలో రక్తం నుంచి ఊపిరితిత్తుల్లోకి వ్యాపనం చెందే వాయువు
జ: కార్బన్ డై ఆక్సైడ్
77. సన్నటి రంధ్రం ద్వారా అధిక పీడనం వద్ద ఉన్న వాయువు వ్యాపనం చెందడాన్ని ఏమంటారు?
జ: నిస్సరణం
78. ఒకే ఘనపరిమాణం (V) ఉండే రెండు వాయువులు వ్యాపనం చెందడానికి పట్టే కాలాలు వరుసగా t1, t2; వ్యాపనం రేట్లు r1, r2 అయితే గ్రాహం వాయు వ్యాపన నియమం ప్రకారం
జ:
79. 'స్థిర ఉష్ణోగ్రత వద్ద ఇచ్చిన ఘనపరిమాణం గల పాత్రలో రసాయన చర్య జరపని వాయువుల మిశ్రమం కలగజేసే మొత్తం పీడనం ఆ మిశ్రమంలోని వాయువుల వ్యక్తిగత పాక్షిక పీడనాల మొత్తానికి సమానం' అని తెలిపే నియమం
జ: డాల్టన్ పాక్షిక పీడనాల నియమం
80. ఒక వాయువు పాక్షిక పీడనం మిశ్రమంలోని ............ కు అనులోమానపాతంలో ఉంటుంది.
జ: మోల్ భాగం
81. వాయు అణుచలన సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించింది ఎవరు?
జ: రాబర్ట్‌హుక్
82. వాయువుల్లోని అణువులు నిరంతరం ఏ విధంగా ప్రయాణిస్తాయి?
జ: క్రమరాహిత్య చలనంలో
83. వాయు అణువుల ప్రయాణం అస్తవ్యస్థ మార్గంలో జరుగుతుంది. ఈ విధమైన చలనాన్ని ఏమంటారు?
జ: బ్రౌనియన్ చలనం
84. వాయు అణువుల తాడనాలు
జ: స్థితిస్థాపక తాడనాలు
85. పరమశూన్య ఉష్ణోగ్రత వద్ద వాయు అణవుల గతిజశక్తి ఏ విధంగా ఉంటుంది?
జ: శూన్యం
86. కిందివాటిలో చలద్వాయు సమీకరణం
జ:
87. బాయిల్ నియమానికి చలద్వాయు సమీకరణం
జ: PV = K.T
88. వాయువులో అణువేగాల పంపిణీ దాని ఉష్ణోగ్రత, మోలార్ ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుందని ప్రతిపాదించిన శాస్త్రవేత్త
జ: మాక్స్‌వెల్, బోల్ట్జ్‌మన్
89. ఒక వాయువులో N అణువులు ఉండి, అణువుల వేగాలు u1, u2, u3, ..........., un గా ఉంటే వాయు అణువుల సగటు వేగం uav ను ఏవిధంగా సూచిస్తారు?
జ:
90. వాయువులోని అణువుల వేగాల వర్గాల సగటు వర్గమూలాన్ని ఏమంటారు?
జ: urms
91. ump : uav : urms ల నిష్పత్తి
జ: 1.000 : 1.128 : 1.224
92. గరిష్ఠ సంభావ్యతా వేగాన్ని (ump) లెక్కించడానికి ఉపయోగించే సమీకరణం
జ:
93. సగటు వేగాన్ని (uav) లెక్కించడానికి ఉపయోగించే సమీకరణం
జ:
94. RMS వేగాన్ని (urms) లెక్కించడానికి ఉపయోగించే సమీకరణం
జ:
95. ఉష్ణోగ్రత, అణుభారం తెలిసినప్పుడు RMS వేగాన్ని లెక్కించడానికి ఉపయోగించే సమీకరణం
జ:
96. పీడనం, ఘనపరిమాణం తెలిసినప్పుడు RMS వేగం ఎంత?
జ:
97. సాంద్రత తెలిసినప్పుడు RMS వేగం
జ:
98. ఒక మోల్ వాయువు గతిజశక్తి (KE) ఎంతకు సమానం?
జ:
99. 'n' మోల్‌ల వాయువుకు ఉండే గతిజశక్తి (Ek) =
జ:
100. ఒక అణువు గతిజశక్తి ఎంతకు సమానం?
జ:
101. బోల్ట్జ్‌మన్ స్థిరాంకం విలువ ఎంత?
జ: 1.38 × 10-16 erg K-1 mol-1 , 1.38 × 10-23 J /K-1 mol-1
102. వాయుస్థిరాంకం, అవగాడ్రో సంఖ్యల నిష్పత్తిని ఏమంటారు?
జ: బోల్ట్జ్‌మన్ స్థిరాంకం
103. ప్రతి వాయువు ఒక ఉష్ణోగ్రత వద్ద వ్యాకోచానికిలోనై చల్లగా మారుతుంది. ఆ ఉష్ణోగ్రత
జ: విలోమ ఉష్ణోగ్రత
104. ఎంత పీడనాన్ని ఉపయోగించయినా ఒక వాయువును ద్రవంగా మార్చగల అత్యధిక ఉష్ణోగ్రత?
జ: సందిగ్ధ ఉష్ణోగ్రత
105. SO2, CO2, NO2, ClO2లలో అత్యల్ప వ్యాపన రేటు ఉన్న వాయువు ఏది?
జ: ClO2
106. SO2, N2, O2, Cl2లలో ఏ వాయువుకు 25 oC వద్ద అత్యల్ప RMS వేగం ఉంటుంది?
జ: Cl2
107. వాయువులను మొదటగా ద్రవీకరించిన శాస్త్రవేత్త
జ: క్లౌడి
108. ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉన్న 4 గ్రాముల O2, 3 గ్రాముల H2 వాయువుల గతిజశక్తి నిష్పత్తిని లెక్కించండి.
జ: 1 : 12
109. ఒక సన్నటి రంధ్రం ద్వారా అమ్మోనియా వాయువు వ్యాపనం రేటు 0.5 lit. min-1. అదే పరిస్థితుల్లో క్లోరిన్ వాయువు వ్యాపనం రేటును కనుక్కోండి.
జ: 0.245 lit. min-1
110. 3.32 బార్ పీడనం వద్ద 4.0 మోల్‌ల వాయువు 5 dm3 ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తే ఆ వాయువు ఉష్ణోగ్రతను లెక్కించండి. (R = 0.083 bar dm3 K-1 mol-1)
జ: 50 K
111. ప్రతి సెకనుకు 1010 ధాన్యపు గింజలను పంచుకుంటూ వెళ్తే అవగాడ్రో సంఖ్య ధాన్యపు గింజలను పంచడానికి ఎంత కాలం పడుతుంది? (సంవత్సరాల్లో)
జ: 1.90956 × 106
112. 27 oC వద్ద 5 dm3 పాత్రలో ఉన్న 3.5 గ్రాముల డై నైట్రోజన్, 3.0 గ్రాముల డై హైడ్రోజన్, 8.0 గ్రాముల డై ఆక్సిజన్ వాయువుల మిశ్రమం కలిగించే మొత్తం పీడనాన్ని కనుక్కోండి.
జ: 9.3375 bar
113. 27 oC వద్ద O2 RMS వేగాన్ని కనుక్కోండి.
జ: 4.614 × 103 ms-1
114. 27 oC వద్ద SO2 వాయువు గరిష్ఠ సంభావ్యతా వేగాన్ని కనుక్కోండి.
జ: 2.79 × 102 ms-1
115. గాలిని 25 oC నుంచి 0 oC కు చల్లార్చినప్పుడు అణువుల rms వేగంలో కలిగే తగ్గుదలను లెక్కించండి.
జ: 4%
ఇంధన వాయువులు
మాదిరి ప్రశ్నలు
1. 'LPG' ఇంధనం పూర్తిపేరు?
1) Liquefied Petroleum Gas
2) Liquefied Paraffin Gas
3) Light Petroleum Gas
4) Light Paraffin Gas
2. కింది ఏ ముడి పదార్థం ద్వారా నాఫ్తలీన్ ఉండలను తయారు చేస్తారు?
1) కోక్ 2) కోల్‌తారు
3) సహజవాయువు 4) పైవన్నీ
3. కిందివాటిలో కార్బన్ అస్పటిక రూపాంతరాలు ఏవి?
i. వజ్రం ii. నేల బొగ్గు iii. కట్టెబొగ్గు
iv. గ్రాఫైట్ v. కోక్ vi. జంతు చార్‌కోల్
1) i, ii, iii, iv 2) i, iii, iv, vi
3) ii, iii, iv, vi 4) ii, iii, v, vi
4. మీథేన్ వాయువు రసాయన ఫార్ములా?
1) CH4 2) CH3OH
3) CO2 4) C2H6
5. ద్రవ బంగారం అని దేన్ని పిలుస్తారు?
1) బొగ్గు 2) పెట్రోలియం
3) నీరు 4) కోక్
6. బొగ్గులో ముఖ్య అనుఘటకం ఏది?
1) ఆక్సిజన్ 2) నీరు
3) నైట్రోజన్ 4) కార్బన్
7. కింది అంశాలను జతపరచండి.
జాబితా-A జాబితా-B
a. పెట్రోలియం i. నీరు
b. సహజ వనరు ii. ప్లాస్టిక్
c. పెట్రోరసాయన ఉత్పన్నం iii. ప్లాంక్‌టన్
1) a-iii, b-i, c-ii 2) a-iii, b-ii, c-i
3) a-ii, b-i, c-iii 4) a-i, b-iii, c-ii
8. కిందివాటిలో కాలుష్యపరంగా ఆదర్శ ఇంధనం ఏది?
1) డీజిల్ 2) కిరోసిన్
3) పెట్రోల్ 4) సహజవాయువు
9. పదార్థాన్ని గాలిలో (ఆక్సిజన్‌లో) మండించడాన్ని ఏమంటారు?
1) దహనం 2) ఫ్లోటింగ్
3) మందశీతలీకరణం 4) కార్బొనేషన్
10. భారతదేశంలో సహజవాయువు నిక్షేపాలను అన్వేషిస్తున్న సంస్థ?
1) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం
2) ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్
3) జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
4) పైవన్నీ
11. కిందివాటిలో అతి పురాతనమైన బొగ్గు రకం ఏది?
1) ఆంథ్రసైట్ 2) పీట్
3) లిగ్నైట్ 4) బిట్యుమినస్
12. కార్బన్, హైడ్రోజన్‌లను మాత్రమే కలిగి ఉన్న కర్బన సమ్మేళనాలను ఏమంటారు?
1) ఆల్కహాల్ 2) అమైన్
3) హైడ్రోకార్బన్ 4) కార్బాక్సిలిక్ ఆమ్లం
13. ‘వాటర్ గ్యాస్’ ప్రధానంగా ఏ వాయువుల మిశ్రమం?
1) కార్బన్ డైఆక్సైడ్ + హైడ్రోజన్
2) కార్బన్ మోనాక్సైడ్ + హైడ్రోజన్
3) కార్బన్ డైఆక్సైడ్ + నైట్రోజన్
4) కార్బన్ మోనాక్సైడ్ + ఆక్సిజన్
14. లిశిబి సిలిండర్ల నుంచి గ్యాస్ లీకేజీని గుర్తించడానికి అందులో కలిపే రసాయన పదార్థం ఏది?
1) ఇథైల్ మెర్కాప్టాన్
2) ఇథైల్ ఆల్కహాల్
3) ఇథైల్ క్లోరైడ్
4) పెట్రోలియం ఈథర్
15. సహజవాయువులో ప్రధాన అనుఘటకం ఏది?
1) మీథేన్ 2) పెంటేన్
3) హైడ్రోజన్ 4) బెంజీన్
16. కిందివాటిలో గోబర్‌గ్యాస్‌లోని ప్రధాన వాయువు ఏది?
1) కార్బన్ మోనాక్సైడ్ 2) మీథేన్
3) హెక్సేన్ 4) నాఫ్తలీన్
17. కింది ఇంధన వనరుల్లో కాలుష్య రహితమైనది ఏది?
1) జల విద్యుత్ 2) థర్మల్ విద్యుత్
3) అణు విద్యుత్ 4) 1, 3
18. కిందివాటిలో చౌకగా ఉత్పత్తయ్యే విద్యుత్ ఏది?
1) థర్మల్ విద్యుత్ 2) జల విద్యుత్
3) అణు విద్యుత్ 4) పైవన్నీ
19. కింది అంశాలను జతపరచండి.
ఇంధనం అనుఘటకం
a. బయోగ్యాస్ i. బ్యూటేన్
b. LPG ii. హైడ్రోజన్, మీథేన్, కార్బన్ మోనాక్సైడ్
c. కోల్‌గ్యాస్ iii. మీథేన్
1) a-iii, b-i, c-ii 2) a-iii, b-ii, c-i
3) a-ii, b-i, c-iii 4) a-i, b-iii, c-ii
20. కిందివాటిలో ప్రధాన ఇంధన వినియోగ రంగాలు ఏవి?
1) గృహ రంగం 2) పరిశ్రమల రంగం
3) రవాణా రంగం 4) పైవన్నీ
21. కిందివాటిలో బొగ్గు రకం కానిది ఏది?
1) హెమటైట్ 2) ఆంథ్రసైట్
3) లిగ్నైట్ 4) బిట్యుమినస్
22. మనదేశంలో లిగ్నైట్ రకం బొగ్గు అధికంగా లభించే ప్రాంతం?
1) నైవేలి - తమిళనాడు
2) సోహాగ్‌పూర్ - మధ్యప్రదేశ్
3) ఝరియా - ఝార్ఖండ్
4) సింగరేణి - తెలంగాణ
23. గ్యాసోహాల్ ఇంధనం వేటి మిశ్రమం?
1) పెట్రోల్ + డీజిల్
2) పెట్రోల్ + ఆల్కహాల్
3) డీజిల్ + ఆల్కహాల్
4) సహజవాయువు + ఆల్కహాల్
24. కిందివాటిలో సరైంది ఏది?
1) ఇంధన పొదుపులో ఇంధన వ్యర్థాన్ని తగ్గించి, వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించడం ముఖ్యం.
2) హైడ్రోజన్ ఇంధనం శుభ్రమైంది, దీనికి గరిష్ఠ ఇంధన దక్షత ఉంటుంది.
3) సౌరపలకల నిర్మాణంలో సిలికాన్ అనే అర్ధలోహాన్ని ఉపయోగిస్తారు.
4) పైవన్నీ
25. ఇంధన సంరక్షణ దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు?
1) డిసెంబరు 26 2) డిసెంబరు 16
3) డిసెంబరు 24 4) డిసెంబరు 14
26. కింది అంశాలను జతపరచండి.
ఇంధనం కెలోరిఫిక్ విలువ
a. పెట్రోల్ i. 1,50,000 కి.జౌ./ కి.గ్రా.
b. బొగ్గు ii. 45,000 కి.జౌ./ కి.గ్రా.
c. హైడ్రోజన్ iii. 30,000 కి.జౌ./ కి.గ్రా.
1) a-ii, b-iii, c-i 2) a-i, b-iii, c-ii
3) a-ii, b-i, c-iii 4) a-iii, b-ii, c-i
27. ఎసిటిలీన్ ఏ రకానికి చెందిన ఇంధనం?
1) ద్రవ ఇంధనం
2) ఘన ఇంధనం
3) ప్రాథమిక వాయు ఇంధనం
4) ద్వితీయ వాయు ఇంధనం
28. కిందివాటిలో అణు ఇంధనాలు ఏవి ?
1) యురేనియం 2) థోరియం
3) ప్లూటోనియం 4) పైవన్నీ
29. లిగ్నైట్ ఏ రకానికి చెందిన ఇంధనం?
1) ప్రాథమిక 2) ద్వితీయ
3) ద్రవ 4) వాయు
30. కోల్‌తారులో సుమారుగా ఎన్ని రసాయన పదార్థాలు ఉంటాయి?
1) 300 2) 400 3) 200 4) 100
31. కొవ్వొత్తి మంటలో అధికవేడిని ఇచ్చే ప్రాంతం ఏది?
1) నల్లని ప్రాంతం
2) నీలిరంగు ప్రాంతం
3) పసుపురంగు ప్రాంతం
4) మైనపు భాగం
32. ఒక పదార్థం మండటం ప్రారంభించే కనిష్ఠ ఉష్ణోగ్రతను ఏమంటారు?
1) జ్వలన ఉష్ణోగ్రత
2) ద్రవీభవన ఉష్ణోగ్రత
3) బాష్పీభవన ఉష్ణోగ్రత
4) సందిగ్ధ ఉష్ణోగ్రత
33. కిందివాటిలో అత్యల్ప జ్వలన ఉష్ణోగ్రత కలిగిన పదార్ధం ఏది?
1) కాగితం 2) కిరోసిన్
3) కలప 40 పేడ
34. ఇథనోల్ రసాయన ఫార్ములా ఏమిటి?
1) C2H5OH 2) CH3OH3
3) CH3OH 4) C4H10
35. కిందివాటిలో మిశ్రమానికి ఉదాహరణ?
1) LPG 2) సహజ వాయువు
3) 1, 2 4) నీరు
36. సౌరపలకల నిర్మాణంలో ఉపయోగించే అర్ధవాహకం ఏది?
1) కార్బన్ 2) సిలికాన్
3) సల్ఫర్ 4) ఆక్సిజన్
సమాధానాలు
1-1, 2-2, 3-4, 4-1, 5-2, 6-4, 7-1, 8-4, 9-1, 10-2, 11-1, 12-3, 13-2, 14-1, 15-1, 16-2, 17-1, 18-2, 19-1, 20-4, 21-1, 22-1, 23-2, 24-4, 25-4, 26-1, 27-4, 28-4, 29-1, 30-3, 31-2, 32-1, 33-2, 34-1, 35-3, 36-2.