• facebook
  • whatsapp
  • telegram

జాతీయాలు

1. ‘తిరుగులేనిది’ అనే అర్థంలో వాడే జాతీయం ఏది?

జ‌: సుగ్రీవాజ్ఞ        


2. ‘సంతోషంతో ఉప్పొంగిపోవడం’ అనే ఉద్దేశాన్ని చెప్పడానికి వాడే జాతీయం ఏది?

జ‌: మిన్నందుకోవడం


3. దుష్టుడి చేతికి చిక్కి, బయటపడటానికి వీలులేని సందర్భంలో కింది ఏ జాతీయాన్ని వాడతారు?

జ‌: కబంధ హస్తాలు 


4. ‘కృత్యాద్యవస్థ’ అనే జాతీయం ఏ విధంగా ఏర్పడింది?

జ‌: అనుభవం ఆధారంగా వచ్చింది 


5. ‘కారాలు మిరియాలు నూరడం’ అనే జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతారు?

జ‌: మిక్కిలి కోపంతో ఉన్నప్పుడు 

6. ‘గుండెలు బరువెక్కడం’ అనే జాతీయానికి అర్థం? 

జ‌: గుండెలు బాధతో నిండటం


7. ‘నిరుపయోగం’ అనే అర్థంలో ఏ జాతీయాన్ని వాడతారు?

జ‌: గతజల సేతు బంధనం  


8. ‘కృషికి తగ్గట్లే ఫలితం’ అనే అర్థాన్ని ఇచ్చే జాతీయం ఏది?

జ‌: పిండి కొద్దీ రొట్టె  


9. ‘మొక్కవోని పట్టుదల’ అనే అర్థాన్ని చెప్పే సందర్భంలో ఏ జాతీయాన్ని వాడతారు?

జ‌: అకుంఠిత దీక్ష    

10. ‘పరశురామ ప్రీతి’ అనే జాతీయానికి అర్థం ఏమిటి?

జ‌: దహించడం


11. కిందివాటిలో శరీర అవయవాలను తెలిపే జాతీయాన్ని గుర్తించండి.

జ‌: కాలికి బలపం కట్టుకుని తిరగడం 

 

12. ‘అగస్త్యభ్రాత’ అనే జాతీయానికి అర్థం ఏమిటి?

జ‌: పేరుతెలియని వాడు 


13. పై పై డాంబికాన్ని ప్రదర్శించే సందర్భంలో వాడే జాతీయం ఏది?

జ‌: మేకపోతు గాంభీర్యం


14. ‘తు.చ. తప్పకపోవడం’ అనే జాతీయానికి అర్థం....

జ‌: ముఖ్యం కాని దాన్ని కూడా వదలక పోవడం 


15. ‘అత్యంత ప్రమాదకరం’ అనే అర్థాన్నిచ్చే జాతీయం ఏది?

జ‌:  కత్తిమీద సాము  


16. ఒక దానితో మరొక దానికి ఏ సంబంధం లేకపోయినా ఏదో పరస్పర సంబంధం ఉన్నట్లు అనిపించే సందర్భంలో ఏ జాతీయాన్ని వాడతారు?

జ‌:  కాకతాళీయం

17. ఒక వృత్తిలో నిపుణుడు అని చెప్పడానికి ఏ జాతీయాన్ని ఉపయోగిస్తారు?

జ‌: అందె వేసిన చేయి  

18. ఒక వ్యక్తి ఒక పక్షంలో ఉండి అవతలి పక్షం వారికి సహాయం చేసే  సందర్భంలో వాడే జాతీయం ఏది?

జ‌: శల్య సారథ్యం 

19. పోట్లాడుకుంటున్నా గుట్టూ మట్టూ లేని సంసారం చేసే సందర్భంలో వాడే జాతీయం ఏది?

జ‌: మార్జాల దాంపత్యం 

20. కిందివాటిలో అనుకరణ శబ్దాలకు సంబంధించిన జాతీయాన్ని గుర్తించండి.

జ‌: గుటుక్కుమను  


21. పైకి మెత్తగా కనిపించే వాళ్ల గురించి చెప్పాల్సి వస్తే ఏ జాతీయాన్ని వాడతారు?

జ‌: గోముఖ వ్యాఘ్రం 


22. ‘ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలదు’ అనే జాతీయం ఎలా ఏర్పడింది? 

జ‌: అతిశయోక్తుల ఆధారంగా వచ్చింది 

23. తల్లిదండ్రుల  విషయానికి సంబంధించిన జాతీయం ఏది?

జ‌: కడుపున చిచ్చుపెట్టడం


24. ‘మాటలు చెప్పడం వల్ల పనులు కావు’ అనే సందర్భంలో ఏ జాతీయాన్ని వాడతారు?

జ‌:  మంత్రాలకు చింతకాయలు రాలవు

Posted Date : 29-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌