• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ ఖనిజ సంపద

1. రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
జవాబు:  రాజస్థాన్
 

2. రూర్ ఆఫ్ ఇండియా (Ruhr of India) అని దేనికి పేరు?
జవాబు:  ఛోటానాగ్‌పుర్ పీఠభూమి
 

3. మానవుడు తొలిసారిగా ఉపయోగించిన ఖనిజం ఏది?
జవాబు:  రాగి
 

4. ప్యాకేజింగ్ పరిశ్రమలో అత్యధికంగా ఉపయోగిస్తున్న ఖనిజం ఏది?
జవాబు: అల్యూమినియం
 

5. వజ్రపు గనులు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది?
జవాబు: మధ్యప్రదేశ్
 

6. గెలీనా ఏ ఖనిజపు ధాతువు?
జవాబు: సీసం
 

7. థర్మల్ ఇన్సులేషన్‌లో ముఖ్యంగా ఉపయోగించే ఖనిజం ఏది?
జవాబు:  రాతినార
 

8. ఆంధ్రప్రదేశ్‌లో బంగారు గనులు ఉన్న జిల్లా ఏది?
జవాబు:  అనంతపురం
 

9. నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది?
జవాబు:  తమిళనాడు
 

10. రాగితో జింకును కలపడం వల్ల ఏర్పడే Alloy ఏది?
జవాబు:  ఇత్తడి


11. సున్నపురాయిని ప్రధానంగా ఏ పరిశ్రమలో ముడి సరుకుగా ఉపయోగిస్తారు?
జవాబు:  సిమెంట్ పరిశ్రమ
 

12. అల్యూమినియం ఖనిజ రూపం ఏది?
జవాబు:  బాక్సైట్
 

13. మాంగనీస్ ఖనిజం ఏ రాష్ట్రంలో అత్యధికంగా లభిస్తుంది?
జవాబు:  ఒడిశా
 

14. ఏ ఖనిజం ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది?
జవాబు:  అభ్రకం
 

15. బంగారం ఏ శిలల్లో లభిస్తుంది?
జవాబు:  క్వార్ట్‌జ్ శిలలు

Posted Date : 08-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌