• facebook
  • whatsapp
  • telegram

జడ్జిమెంట్‌

సూచనలు (ప్ర.1 - 10): కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.


1. నీ స్నేహితుడు అతడి వివాహానికి నిన్ను ఆహ్వానించలేదు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు?


ఎ) అతడికి వ్యతిరేకంగా పట్టుదలగా వ్యవహరిస్తాను.


బి) నా శుభాకాంక్షలు తెలుపుతాను.


సి) పెళ్లికి హాజరవుతాను.   


డి) ఈ మొత్తం వ్యవహారాన్ని నిర్లక్ష్యం చేస్తాను.


2. ఒక వస్తువు కొన్నాక, ఆ దుకాణ యజమాని ఇవ్వాల్సిన దానికంటే రూ.100 ఎక్కువ ఇస్తే, అప్పుడు నువ్వు ఏం చేస్తావు?


ఎ) స్నేహితులకు విందు ఇస్తాను.


బి) రూ.20 దేవుడి హుండీలో వేసి, ఇంకా ఈ విధంగా డబ్బులు రావాలని ఆశిస్తాను.


సి) ఎక్కువ ఇచ్చిన డబ్బును తిరిగి దుకాణదారుడికి ఇస్తాను.


డి) ఏదీకాదు


3. నీ సహోద్యోగి అతడి విధులను సరిగ్గా నిర్వర్తించడం లేదు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు?


ఎ) అతడి పని చేయనితనాన్ని ఆసరాగా తీసుకుని నేను ముందుకెళ్తాను.


బి) మేనేజర్‌కు ఫిర్యాదు చేస్తాను.


సి) కేవలం నా విధులు నేను నిర్వర్తిస్తాను.


డి) అతడి విధులను కూడా నేను నిర్వర్తించి సంస్థకు చెడ్డపేరు రాకుండా చేస్తాను.


4. ఆడుకునేటప్పుడు నీ స్నేహితుడు ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగను పట్టుకుని షాక్‌కి గురైతే, నువ్వు ఏం చేస్తావు?


ఎ) ఆ తీగను పట్టుకుని దూరంగా విసిరేస్తాను.


బి) ఆ తీగను చెక్క కర్రతో లాగి విసిరేస్తాను.


సి) వైద్యుడ్ని పిలుస్తాను.


డి) అతడ్ని నా చేతులతో పట్టుకుని తీగబారి నుంచి లాగడానికి ప్రయత్నిస్తాను.


5. నీ స్నేహితుడు నిన్ను మోసం చేశాడని తెలుసుకుంటే, నువ్వు ఏం చేస్తావు?


ఎ) దెబ్బకు దెబ్బ తీస్తాను 


బి) అతడితో సంబంధాలు తెంచుకుంటాను.


సి) అతడు తన తప్పు తెలుసుకునేటట్లు చేస్తాను.


డి) ఇతర స్నేహితులకు అతడి గురించి చెబుతాను.


6. ఒక ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నాయి. నువ్వు వాటిని సంతృప్తికరంగా రాయలేనప్పుడు నువ్వు ఏం చేస్తావు?


ఎ) పరీక్షకుడితో ఇచ్చిన ప్రశ్నలు పాఠ్యపుస్తకంలో లేవని చెబుతాను.


బి) పరీక్ష రాసే వారిని హాలు నుంచి బయటకు రావాల్సిందిగా ప్రేరేపిస్తాను.


సి) నా పక్కన ఉన్న వ్యక్తి నుంచి సమాధానాలను కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తాను.


డి) నిదానంగా ఆలోచించి, నాకు తెలిసినంత వరకు ఆ ప్రశ్నలకు తగిన జవాబుల కోసం ప్రయత్నిస్తాను.


7. నువ్వు చేసిన తెలివి తక్కువ తప్పులు ఎవరైనా ఎత్తిచూపితే అప్పుడు ఏం చేస్తావు?


ఎ) నవ్వుతూ ఆ మాటలను విడచిపెడతాను


బి) తప్పులను కొనసాగిస్తాను


సి) ఆ వ్యక్తిపై కోపం చూపిస్తాను


డి) ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెబుతాను


8. నువ్వు, నీ స్నేహితుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు నీ మిత్రుడి మఫ్లర్‌కి నిప్పు అంటుకుంటే, నువ్వు ఏం చేస్తావు?


ఎ) నా స్నేహితులందరినీ పిలిచి అక్కడ చూడు అని చెబుతాను.


బి) వెంటనే అతడి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి, జరిగిన విషయం చెబుతాను.


సి) నిప్పు ఉన్న మఫ్లర్‌ను వెంటనే అతడిపై నుంచి తీసి, దానిపై నీరు పోస్తాను.


డి) మఫ్లర్‌ తీసి దూరంగా విసిరేస్తాను.


9. మీ ఇంట్లోని స్నానాల గదిలో కుళాయి లీకై నీరు కారుతూ, నిరంతరం శబ్దం వినపడుతుంటే, నువ్వు ఏం చేస్తావు?


ఎ) కుళాయి కింద ఏదైనా పాత వస్త్రాన్ని ఉంచుతాను.


బి) చెవులపై తలగడ పెట్టి నిద్రపోతాను.


సి) కుళాయి ద్వారం వద్ద ఒక బిందెను ఉంచుతాను.


డి) ప్లంబర్‌ని పిలిచి, కుళాయి మరమ్మతు చేయిస్తాను.


10. మీకు రోడ్డుపై ఒక ఉత్తరం కనిపించింది. దానిపై అడ్రస్‌తో పాటు ఉపయోగించని స్టాంపులు ఉన్నాయి. దాన్ని నువ్వు ఏం చేస్తావు?


ఎ ) దాన్ని అక్కడే వదిలిపెట్టి వెళ్తాను.


బి ) ఆ స్టాంపులను తీసేసి, కవరును నాశనం చేస్తాను.


సి )  ఆ కవరును తెరిచి చూసి, విషయం చదివి, పోస్ట్‌ చేస్తాను.


డి ) దగ్గర్లో ఉన్న తపాలా డబ్బాలో పోస్ట్‌ చేస్తాను.


సమాధానాలు

1-బి  2-సి 3-డి  4-బి 5-సి 6-డి 7-డి 8-సి 9-డి 10-డి


11. మీరు ఒక స్కూటర్‌పై రహదారిపై వెళ్లే సమయంలో ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును దొంగిలించి పారిపోతున్నారు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు?


ఎ) ఆ మహిళను ఓదారుస్తాను.


బి) దొంగలను పట్టుకునేందుకు వారిని వెంబడిస్తాను.


సి) జరిగిన విషయాన్ని పోలీసులకు తెలుపుతాను.


డి) తర్వాత ఏం జరుగుతుందో అని నిలబడి చూస్తాను.


12. శ్రమ లేనిదే లాభం ఉండదు  (No risk no gain) అనే నానుడిని నువ్వు ఎలా చూస్తావు?


ఎ) శ్రమ ఉంటే లాభం లేదనుకుంటాను.


బి) ఆ నానుడి సరైందని నమ్ముతాను.


సి) అవసరం లేని శ్రమ పిచ్చోళ్లు చేస్తారని నమ్ముతాను.


డి) సందర్భాలు శ్రమను కలిగిస్తాయని నమ్మి, వాటిని భరించి లాభం పొందుతాను.


13. మీ దృష్టిలో ఒక రిసెప్షనిస్ట్‌కు ఉండాల్సిన లక్షణం ఏమిటి?


ఎ) మూర్తిమత్వం  బి) ఓర్పు  సి) క్రమశిక్షణ  డి) నాయకత్వం


14. ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగి ఉండే ఉద్యోగికి కింది ఏ లక్షణం ఉండాలి?


ఎ) మంచి ఆలకింపు ఉన్న వ్యక్తిగా ఉండాలి.


బి) తొందరగా నిర్ణయాలు తీసుకోవాలి.


సి) మర్యాదతో కూడిన వినయం ఉండాలి.


డి) సమయస్ఫూర్తి ఉండాలి.


15. కళాశాల హాస్టల్‌లో మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు పప్పులో రాళ్లు వచ్చాయి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు?


ఎ) పప్పు తినకుండా వదిలిపెట్టి వేరే పళ్లెం తీసుకుంటాను.


బి) హాస్టల్‌ ఇన్‌ఛార్జికి ఫిర్యాదు చేస్తాను.


సి) వంట చేసిన వ్యక్తిపై ఆగ్రహం చూపిస్తాను.


డి) వంట నేనే చేసుకుంటాను.


16. స్నేహంపై మీ అభిప్రాయం?


ఎ) ఒక పరిమితికి లోబడిన సంబంధం


బి) ఒక తెలియని భాష      


సి) ఒక బాధ


డి) ఇద్దరు లేదా ముగ్గురి మధ్య ఉండే అనుబంధం


సమాధానాలు


11-బి   12-డి   13-బి   14-ఎ   15-బి   16-డి


17. మీరు ఒక చారిత్రక ప్రదేశాన్ని సందర్శించినప్పుడు ఏం చేస్తారు?


ఎ) అక్కడి వాతావరణానికి ఆనందిస్తాను.


బి) దాని ప్రత్యేకత తెలుసుకుంటాను


సి) అక్కడి సాంస్కృతిక, సాంఘిక విషయాలను కనుక్కుంటాను.


డి) ఏదీకాదు     

సమాధానం: సి


18. ఒక మనిషిలోని మంచి లక్షణం ఏది?


ఎ) ఇతరులను ఆనందపరచడం   బి) నిజాయతీ


సి) కష్టపడి పని చేయడం       డి) గౌరవంగా మాట్లాడటం


సమాధానం: బి


19. ఈ ఆధునిక ప్రపంచంలో నిజాయతీకి విలువ లేదా? దీనిపై మీ అభిప్రాయం?


ఎ) ఎల్లప్పుడూ విలువ ఉండదు.


బి) ఎక్కువ విషయాల్లో విలువ ఉండదు


సి) కొన్ని విషయాల్లో విలువ ఉండదు     డి) ఏదీకాదు


సమాధానం: సి


20. మీ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. మీరు ఏం చేస్తారు?


ఎ) రక్తదానం చేస్తాను


బి) రక్తదానం చేయడం నాకు ఇష్టం ఉండదు.


సి) నా స్నేహితులను రక్తం ఇవ్వడానికి ఒప్పిస్తాను


డి) ఏదీకాదు    

సమాధానం:


రచయిత

బూసర గణేష్, 

విషయ నిపుణులు 

Posted Date : 22-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌