• facebook
  • whatsapp
  • telegram

లోహ సంగ్రహణ శాస్త్రం

1. కింది ఏ లోహాలు ప్రకృతిలో స్వేచ్ఛా స్థితిలో లభిస్తాయి?

1) ప్లాటినం       2) బంగారం 

3) సోడియం       4) 1, 2

2. కింది వాటిలో సరైన వాక్యం ఏది?

i) లోహాలన్నీ చాలా వరకు సంయోగ పదార్థాలుగా లభిస్తాయి.

ii) సమ్మేళనాల రూపంలో లభించే లోహాలను ఖనిజాలు అంటారు.

1) i మాత్రమే       2) ii మాత్రమే 

3) i, ii         4) ఏదీకాదు

3. పారిశ్రామికంగా ఏ ఖనిజం నుంచి లోహాన్ని లాభదాయకంగా సంగ్రహిస్తారో ఆ ఖనిజాన్ని ఏమంటారు?

1) ముడిపదార్థం     2) ధాతువు 

3) మిశ్రమ లోహం   4) అమాల్గమ్‌

4. కింది వాటిలో సరైంది ఏది?

i) అన్ని ధాతువులు ఖనిజాలు

ii) అన్ని ఖనిజాలు ధాతువులు

1) i మాత్రమే        2) ii మాత్రమే 

3) i, ii         4) ఏదీకాదు

5. కింది వాటిలో యురేనియం ఖనిజం ఏది?

1) సిన్నబార్‌       2) బారైట్‌ 

3) పిచ్‌బ్లెండ్‌       4) సాల్ట్‌పీటర్‌

6. కింది వాటిలో రాగి ఖనిజం ఏది?

1) మాలకైట్‌       2) కాపర్‌పైరటీస్‌ 

3) 1, 2        4) కోరండం

7. కింది అంశాలను జతపరచండి.

ఖనిజం       రసాయన ఫార్ములా

a) సున్నపురాయి        i) BaSO4

b) బారైట్‌        ii) NaCl 

c) రాతి ఉప్పు         iii) CaCO3

1) a-ii, b-i, c-iii        2) a-i, b-iii, c-ii

3) a-iii, b-i, c-ii         4) a-iii, b-ii, c-i

8. భూపటలంలో అత్యంత సమృద్ధిగా లభించే లోహం ఏది?

1) మెగ్నీషియం       2) ఆక్సిజన్‌ 

3) అల్యూమినియం   4) రాగి

9. మొట్టమొదట మానవుడు కృత్రిమంగా తయారు చేసిన మూలకం?

1) కాల్షియం       2) టెక్నీషియం 

3) రాగి       4) క్యూరియం

10. కింది అంశాలను జతపరచండి.

జాబితా - ఎ      జాబితా - బి

a) నాణేల లోహాలు     i) పాదరసం

b) ద్రవస్థితిలోని లోహం   ii) లిథియం

c) తేలికైన లోహం          iii) వెండి, బంగారం, రాగి

1) a-i, b-iii, c-ii       2) a-iii, b-ii, c-i

3) a-ii, b-i, c-iii       4) a-iii, b-i, c-ii

11. కింది వాటిలో మిశ్రమ లోహం ఏది?

1) ఇనుము       2) రాగి 

3) ఇత్తడి       4) పాదరసం

12. కింది ఏ భౌతిక పద్ధతుల ద్వారా ధాతువు నుంచి ఖనిజ మాలిన్యాన్ని వేరు చేస్తారు?

1) ప్లవన ప్రక్రియ

2) అయస్కాంత వేర్పాటు పద్ధతి

3) 1, 2      4) విద్యుత్‌ శోధనం

13. కింది ఏ ఖనిజ రూపం నుంచి ప్లవన ప్రక్రియ ద్వారా మాలిన్యాలను తొలగిస్తారు?

1) సల్ఫైడ్‌           2) ఆక్సైడ్‌ 

3) కార్బొనేట్‌       4) సల్ఫైట్‌

14. లోహ ధాతువును ఆక్సిజన్‌ సమక్షంలో అధిక ఉష్ణోగ్రతల వద్ద వేడిచేసే ప్రక్రియను ఏమంటారు?

1) ప్రగలనం        2) భర్జనం  

3) భస్మీకరణం        4) విద్యుత్‌ శోధనం 

15. కింది అంశాలను జతపరచండి.

ఖనిజం       ఖనిజ రూపం

a) మాగ్నటైట్‌        i) కార్బొనేట్‌

b) మాగ్నసైట్‌         ii) సల్ఫేట్‌

c) బారైట్‌            iii) ఆక్సైడ్‌

1) a-i, b-iii, c-ii      2) a-iii, b-ii, c-i

3) a-ii, b-i, c-iii     4) a-iii, b-i, c-ii

16. లోహ ధాతువును ఆక్సిజన్‌ రహిత వాతావరణంలో వేడిచేసే ప్రక్రియను ఏమంటారు?

1) భస్మీకరణం         2) భర్జనం   

3) స్వేదనం        4) పోలింగ్‌

17. కింది ఏ ఖనిజ రూపాలను భర్జనం లేదా  భస్మీకరణం ద్వారా లోహ ఆక్సైడ్‌లుగా మారుస్తారు?

1) లోహ కార్బొనేట్‌లు   

2) లోహ సల్ఫైడ్‌లు  

3) లోహ క్లోరైడ్‌లు        4) 1, 2

18. భర్జన ప్రక్రియకు ఏ కొలిమిని వాడతారు?

1) బ్లాస్ట్‌ కొలిమి             2) రివర్బరేటరీ కొలిమి 

3) విద్యుత్‌ కొలిమి       4) 1, 2

19. బంగారం లాటిన్‌ నామం ఏమిటి?

1) ప్లంబం      2) ఆరమ్‌  

3) అర్జెంటమ్‌       4) కాలియం

20. సిల్వర్‌ (వెండ్శి తర్వాత ఉత్తమ విద్యుత్‌ వాహకత ప్రదర్శించే లోహం ఏది?

1) మెగ్నీషియం      2) కాల్షియం   

3) కాపర్‌ (రాగి)        4) ఐరన్‌

21. కింది వాటిలో ఉత్కృష్ట లోహలు ఏవి?

i) బంగారం      ii) ఇనుము  iii) వెండి  

iv) కాల్షియం     v) ప్లాటినం   vi) క్రోమియం 

1) i, ii, iv, vi      2) i, iii, v

3) i, iv, v, vi        4)  ii, iii, iv, vi

22. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌లో ఉండే మూలకాలు ఏవి?

i) ఇనుము        ii) నికెల్‌ 

iii) కార్బన్‌         iv) క్రోమియం

1) i, iii        2) i, ii, iii, iv

3) i, iv        4) i, iii, iv

23. కంచులోని లోహాలు ఏవి?

i) రాగి        ii) తగరం  

iii) నికెల్‌        iv) క్రోమియం

1) i, ii      2) ii, iii      3) i, iii     4) iii, iv

24. ఫిలాసఫర్స్‌ ఊల్‌ (Philosophers Wool) అని దేన్ని అంటారు?

1) జింక్‌ క్లోరైడ్‌      2) జింక్‌ సల్ఫేట్‌

3) జింక్‌ ఆక్సైడ్‌       4) జింక్‌ కార్బొనేట్‌

25. కింది వాటిలో సరైనవి ఏవి?

i) బెసిమర్‌ కన్వర్టర్‌ను ఉక్కు తయారీలో ఉపయోగిస్తారు.

ii) ఇనుము అమాల్గమ్‌లను ఏర్పరచదు.

iii) పరమాణు గడియారాల్లో సీసియంను ఉపయోగిస్తారు.

iv) లోహాలు మంచి విద్యుత్‌ వాహకాలు.

1) i, ii, iii      2) ii, iii, iv  

3) i, iii, iv         4) i, ii, iii, iv

26. కింది వాటిలో కార్నలైట్‌ రసాయన ఫార్ములా ఏమిటి?

1) KCl               2) KCl.MgCl2.6H2O

3) KNO3             4) KAlSi3O8

27. రాతినార ఏ రకానికి చెందిన ఖనిజ రూపం?

1) కార్బొనేట్‌               2) క్లోరైడ్‌

3) సల్ఫేట్‌             4) సిలికేట్‌

28. క్విక్‌సిల్వర్‌ అని ఏ లోహాన్ని పిలుస్తారు?

1) వెండి               2) ప్లాటినం

3) పాదరసం               4) క్రోమియం

29. ఇనుము తుప్పు పట్టకుండా కాపాడటానికి కింది ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? 

1) ఎలక్ట్రోప్లేటింగ్‌    

2) గాల్వనైజేషన్‌

3) మిశ్రమ లోహాల తయారీ 

4) పైవన్నీ 

30. కింది వాటిలో పరిశుద్ధమైన ఇనుము రూపం ఏది?

1) పోత ఇనుము            2) ఉక్కు

3) చేత ఇనుము            4) 1, 2

31. గంట తయారీలో ఉపయోగించే లోహాలు ఏవి?

1) రాగి + ఇనుము  

2) రాగి + తగరం

3) ఇనుము + క్రోమియం 

4) రాగి + జింక్‌

32 . కింది అంశాలను జతపరచండి.

మిశ్రమ లోహం      ఉపయోగం

a) డ్యూరాల్యూమిన్‌     i) మీటర్‌ స్కేలు, లోలకాల తయారీ

b) ఇన్వార్‌ స్టీల్‌     ii) పాత్రలు, విగ్రహాలు

c) కంచు     iii) విమాన భాగాలతయారీ

1) a-iii, b-ii, c-i        2) a-ii, b-i, c-iii 

3) a-iii, b-i, c-ii      4) a-i, b-iii, c-ii

33. కింది వాటిలో సరికానిది ఏది?

1) సోల్డర్‌ : తగరం + సీసం

2) మాగ్నాలియం : మెగ్నీషియం + అల్యూమినియం

3) జర్మన్‌ సిల్వర్‌ : రాగి + జింక్‌ + నికెల్‌ 

4) గన్‌మెటల్‌ : ఇనుము + జింక్‌

34. గాల్వనైజేషన్‌లో ఇనుముపై ఏ లోహాన్ని పూతగా పూస్తారు?

1) క్రోమియం      2) జింక్‌

3) వెండి      4) నికెల్‌

సమాధానాలు

1 - 4  2 - 3  3 - 2  4 - 1  5 - 3  6 - 3  7 - 3  8 - 3  9 - 2  10 - 4  11 - 3  12 - 3  13 - 1  14 - 2  15 - 4  16 - 1  17 - 4  18 - 2  19 - 2  20 - 3  21 - 2  22 - 2  23 - 1  24 - 3     25 - 4     26 - 2     27 - 4  28 - 3    29 - 4    30 - 3    31 - 2    32 - 3      33 - 4     34 - 2

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. ఆభరణాల తయారీకి బంగారంలో ఏ లోహం కలుపుతారు? (TSPSC FSO 2017)

1) జింక్‌       2) రాగి 

3) వెండి       4) మెగ్నీషియం

2. కింది వాటిలో ఏ లోహాన్ని కత్తితో సులభంగా కోయవచ్చు? (APPSC ASO 2017)

1) సీసం          2) పొటాషియం

3) అల్యూమినియం      4) సెలీనియం

3. స్వచ్ఛమైన బంగారం ఎన్ని క్యారట్‌లు ఉంటుంది? (APPSC Group IV 2012)

1) 22      2) 23      3) 24      4) 25

4. ఖనిజాలు అనేవి? (TSPSC FSO 2017)

1) అంత ప్రధానం కాని వనరులు

2) తీరస్థ వనరులు మాత్రమే

3) పునరుత్పత్తి చేయలేని వనరులు

4) పునరుత్పత్తి చేయగల వనరులు

5. మిశ్రమ లోహాల్లో ఒక మూలకంగా ఉన్న పాదరసాన్ని ఏమంటారు? (AP SI 2008)

1) అమాల్గమ్‌      2) ఎమల్షన్‌

3) ఆల్నికో      4) సోల్డర్‌

6. ఇనుము, నికెల్, క్రోమియంల మిశ్రమాన్ని ఏమంటారు?  (APPSC Group IV 2012)

1) సీసం          2) ఇత్తడి

3) స్టెయిన్‌లెస్‌ స్టీల్‌      4) కంచు

7. రాగి, జింక్‌ లోహాల మిశ్రమం? (APPSC Group IV 2012)

1) సీసం               2) ఇత్తడి

3) స్టెయిన్‌లెస్‌ స్టీల్‌      4) కంచు

8. కింది వాటిలో వెండి (సిల్వర్‌) లేనిది? (APPSC Group-IV 2012)

1) హార్న్‌ సిల్వర్‌      2) జర్మన్‌ సిల్వర్‌

3) రూబీ సిల్వర్‌      4) లూనార్‌ కాస్టిక్‌

9. బాక్సైట్‌ ఏ లోహపు ముఖ్య ధాతువు? (APPSC FDO 2012)

1) జింక్‌             2) అల్యూమినియం

3) ఇనుము         4) నికెల్‌

10. ఖనిజాల కాఠిన్యతను తెలిపే స్కేలు ఏది? (AP SI 2017)

1) బీఫార్ట్స్‌ స్కేలు      2) మొహ్స్‌ స్కేలు

3) ఒమరీ స్కేలు      4) మెర్కాలీ స్కేలు

11. సజల హైడ్రోక్లోరిక్‌ ఆమ్లంతో చర్య జరిపి హైడ్రోజన్‌ వాయువును విడుదల చేయని లోహం ఏది? (UPSC 2016)

1) పాదరసం       2) అల్యూమినియం

3) మెగ్నీషియం      4) ఇనుము

12. అచ్చు వేసేందుకు వాడే టైఫ్‌ మెటల్‌లో ఉన్న లోహం? (APPSC Group-III 2012)

1) ఉక్కు          2) నికెల్‌             3) సీసం           4) బిస్మత్‌

13. 22 క్యారట్ల బంగారంలో ఉండే రాగి భార శాతం?  (APPSC Group-II-2012)

1) 12.8%              2) 10.8% 

3) 9.4%               4) 8.4%


14. ఫ్యూజ్‌ వైర్‌ (Fuse Wire) లక్షణం ఏమిటి? (APPSC Group-II 2012)

1) అధిక నిరోధం, అధిక ద్రవీభవన స్థానం

2) స్వల్ప నిరోధం, స్వల్ప ద్రవీభవన స్థానం

3) అధిక నిరోధం, స్వల్ప ద్రవీభవన స్థానం

4) స్వల్ప నిరోధం, స్వల్ప ద్రవీభవన స్థానం

సమాధానాలు

1 - 2     2 - 2      3 - 3      4 - 3     5 - 1      6 - 3     7 - 2     8 - 2      9 - 2      10 - 2     11 - 1     12 - 3      13 - 4      14 - 4   

Posted Date : 05-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌