• facebook
  • whatsapp
  • telegram

పరమాణు నిర్మాణం

1. ఎల‌క్ట్రాన్‌, ప్రోటాన్‌, న్యూట్రాన్‌,  α- క‌ణం - ఈ నాలిగింటిలో ప్రాథమిక కణం కానిదేది?
జవాబు: కణం


2. అణువు దేంతో తయారవుతుంది?
జవాబు:  ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్


3. కేథోడ్ కిరణాలను కనుక్కుందెవరు?
జవాబు:  జె.జె. థామ్సన్


4. రుణావేశ కణాల సమూహంలోని కణాలకు ఎలక్ట్రాన్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు?
జవాబు:  జి.జె. స్టనీ


5. 'పరమాణువు విభజించడానికి వీలుకాని అతి సూక్ష్మమైన కణం' అని సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
జవాబు:  డాల్టన్


6. ప్రోటాన్ ద్రవ్యరాశి, ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి కంటే ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది?
జవాబు:  1837


7. న్యూట్రాన్ల విద్యుదావేశం ఎంత?
జవాబు:  ఆవేశరహితం 8. ఎవరి నమూనాను 'గ్రహమండల నమూనా' అని పిలుస్తారు?
జవాబు:  రూథర్‌ఫర్డ్


9. కేంద్రకం చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలను ప్రవేశపెట్టిందెవరు?
జవాబు:  సోమర్‌ఫీల్డ్


10. ఒక పరమాణు ప్రామాణిక ద్రవ్యరాశి (amu) దేనికి సమానం?
జవాబు:  1.64 × 10-24 గ్రా.


11. కెనాల్ కిరణాలు (Canal rays) అని వేటినంటారు?
జవాబు:  ధనధ్రువ కిరణాలు


12. ప్రోటాన్లను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?
జవాబు:  గోల్డ్ స్టెయిన్


13. కేంద్రకం చుట్టూ నిర్ణీత కక్ష్యలు (Orbits) ఉంటాయని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
జవాబు:  నీల్స్‌బోర్


14. ఒక పదార్థం ఏర్పడటంలో క్రియాశీల పాత్ర వహించేది ఏది?
జవాబు:  పరమాణువులు


15. ఎలక్ట్రాన్‌కు తరంగ స్వభావం ఉంటుందని ప్రతిపాదించిందెవరు?
జవాబు:  డీబ్రోగ్లీ

Posted Date : 31-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌