• facebook
  • whatsapp
  • telegram

నైసర్గిక స్వరూపాలు - హిమాలయ పర్వతాలు

1. ఎవరెస్ట్‌ శిఖరం ఉన్న ప్రాంతం? (Group 2, 2004)
జ: కేంద్ర హిమాలయాలు


2. సాగర్‌మాతకు ఉన్న మరో పేరు? (Group 1, 2012)
జ: ఎవరెస్ట్‌


3. K2 పర్వతాగ్రం ఉన్న ప్రదేశం? (Jr. Steno, 2010)
జ:  కారకోరం


4. హిమాలయాల్లో ఎత్తైన శిఖరాలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? (Group-1, 1999)
జ: హిమాద్రి


5. ప్రపంచంలోని ఎత్తైన పర్వతాల్లో ఒకటైన అన్నపూర్ణ ఎక్కడ ఉంది?
జ: నేపాల్‌


6. ధవళగిరి శిఖరం ఏ ప్రాంతంలో ఉంది? (Group-1, 1999)
జ: నేపాల్‌
 

7. హిమాచల్‌ పర్వతాలు - హిమాద్రి మధ్య ప్రసిద్ధిగాంచిన లోయ?
జ: కశ్మీర్‌లోయ


8. మికిర కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
జ: అసోం


9. కిందివాటిలో ఏ రాష్ట్ర తీరాన్ని కోరమండల్‌ తీరం అని పిలుస్తారు? (2010, గ్రూప్‌ - 1) 
1) గుజరాత్‌           2) మహారాష్ట్ర      3) తమిళనాడు        4) కేరళ
జ: 3 (తమిళనాడు)


10. మలబార్‌ తీరప్రాంతపు బ్యాక్‌ వాటర్స్‌ను ఏమని పిలుస్తారు. (సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్, 2009)
జ: లాగూన్‌లు


11. కృష్ణ, గోదావరి డెల్టాల మధ్య ఉన్న సరస్సు? (డీఎల్‌ - 2012)
జ: కొల్లేరు సరస్సు


12. కిందివాటిలో సుభాష్‌ చంద్రబోస్‌ ద్వీప్‌ అని దేన్ని పిలుస్తారు? 
1) నీల్‌ ఐలాండ్‌                  2) రాస్‌ ఐలాండ్‌ 
3) హేవ్‌లాక్‌ ఐలాండ్‌          4) కచ్చతీవు ఐలాండ్‌
జ: 2 (రాస్‌ ఐలాండ్‌ )


13. కథియవార్‌ తీరం అని ఏ రాష్ట్ర తీరాన్ని పిలుస్తారు?
జ: గుజరాత్‌


14. దేశంలో అతిపొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం?
జ: గుజరాత్‌


15. ఆసియా ఖండంలోనే మొదటి బ్లూఫ్లాగ్‌ బీచ్‌?
జ: చంద్రభాగ బీచ్‌


16. భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుల ప్రకారం భారతదేశంలో అతి పురాతనమైన ముడుత పర్వతాలు ఏవి?
జ: ఆరావళి పర్వతాలు


17. ‘రూర్‌ ఆఫ్‌ ఇండియా’ అని పిలిచే ప్రాంతం ఏది?
జ: ఛోటానాగ్‌పూర్‌ పీఠభూమి


18. గంగా - సింధు మైదానాల్లో ఉండే చిత్తడి ప్రాంతాన్ని ఏమంటారు?
జ: టెరాయి


19. దోఆబ్‌లకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం?
జ: పంజాబ్‌ - హరియాణా మైదానం


20. ‘బిహార్‌ దుఃఖదాయని’ అని ఏ నదిని పిలుస్తారు?
జ: కోసి నది


21. భారతదేశంలో అతిపెద్ద భౌతిక విభాగం?
జ: ద్వీపకల్ప పీఠభూమి


22. ఇటీవలి కాలంలో ఏర్పడిన ఒండలి నేలలను ఏమంటారు?
జ: ఖాదర్‌

Posted Date : 08-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌