• facebook
  • whatsapp
  • telegram

కేంద్రక రసాయనశాస్త్రం

11. సహజ రేడియోధార్మిక శ్రేణిలో అంత్య మూలకం ఏది?

1) నియాన్‌  (Ne)     2) సీసం (Pb)  3) థోరియం (Th)       4) బిస్మత్‌ (Bi)

జ: సీసం (Pb)

12. అణు రియాక్టర్‌ను మొదట నిర్మించిన శాస్త్రవేత్త ఎవరు?

1)  బెక్వెరెల్‌      2) స్ట్రాస్‌మన్‌   3)  ఫెర్మీ      4) రూథర్‌ఫర్ట్‌

జ: ఫెర్మీ

13. కింది అంశాలను జతపరచండి.

   జాబితా  - I                   జాబితా  - II 

a. గాయిటర్‌ చికిత్స        i. సోడియం - 24

b. శరీర రక్తసరఫరా        ii. కోబాల్ట్‌ - 60

  లోపాన్ని గుర్తించడం    

c. క్యాన్సర్‌ చికిత్స          iii. అయోడిన్‌-131

1) a-ii, b-i, c-iii       2) a-iii, b-i, c-ii      3) a-i, b-iii, c-ii       4) a-iii, b-ii, c-i     

జ:  a-iii, b-i, c-ii

14. కోబాల్ట్‌ - 60 ద్వారా విడుదలయ్యే ఏ వికిరణాన్ని రేడియోథెరపీలో వాడతారు?

1) బీటా - కిరణాలు              2) ఆల్ఫా - కిరణాలు  

3) గామా - కిరణాలు            4) ఎక్స్‌ - వికిరణాలు

జ: గామా - కిరణాలు

15. కిందివాటిలో ‘క్యూరీ’ దేని ప్రమాణం?

1) ఉష్ణం     2) రేడియోధార్మికత     3) బలం      4) గురుత్వత్వరణం

జ: రేడియోధార్మికత

16. అణురియాక్టర్‌లో న్యూట్రాన్‌ల వేగాన్ని తగ్గించడానికి ఉపయోగించే మితకారి ఏది?

1) గ్రాఫైట్‌    2) భారజలం   3) 1, 2     4) కాడ్మియం

జ: 1, 2

17. అణురియాక్టర్‌లో న్యూట్రన్‌లను శోషించుకుని గొలుసు చర్యను పూర్తిగా ఆపడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు?

1) కూలెంట్‌        2) నియంత్రకాలు    3) అణు ఇంధనాలు   4) మితకారులు

జ:  నియంత్రకాలు 

18. కిందివాటిలో వేటిని నియంత్రకాలుగా ఉపయోగిస్తారు?

1) బోరాన్‌ కడ్డీ         2) కాడ్మియం   

3) గాడోలినియం ఆక్సైడ్‌  4) పైవన్నీ

జ: పైవన్నీ

19. భారజలం రసాయన నామం ఏమిటి?

1) డ్యుటీరియం ఆక్సైడ్‌   2) కార్బన్‌ డైఆక్సైడ్‌    3) నైట్రిక్‌ ఆక్సైడ్‌      4) 2, 3

జ: డ్యుటీరియం ఆక్సైడ్‌

20. శిలాజాల వయసును నిర్ణయించడానికి ఉపయోగించే రేడియో ఐసోటోపు ఏది?

1) కార్బన్‌ -12    2) కార్బన్‌ - 14     3) ఆక్సిజన్‌ - 16     4) కోబాల్ట్‌ - 60

జ: కార్బన్‌ -14

21. కిందివాటిలో రేడియో ఐసోటోపునకు ఉదాహరణ?

1) హైడ్రోజన్‌-1     2) హైడ్రోజన్‌-2   3) హైడ్రోజన్‌-3     4) 1, 2

జ: హైడ్రోజన్‌-3 

22. కిందివాటిలో దేన్ని అణు ఇంధనంగా ఉపయోగిస్తారు?

1) యురేనియం (U)  2) థోరియం (Th)      3) కోబాల్ట్‌ (Co)      4) 1, 2 

జ: 1, 2 

23. కిందివాటిలో థోరియం ఖనిజం ఏది?

1) బాక్సైట్‌    2) మోనజైట్‌   3) హెమటైట్‌    4) గెలీనా

జ: మోనజైట్‌

24. కింది ఏ లోహాన్ని పిచ్‌బ్లెండ్‌ ఖనిజం నుంచి సంగ్రహిస్తారు?

1) జింక్‌      2) రాగి        3) యురేనియం      4) పైవన్నీ

జ: యురేనియం

25. ‘కేంద్రక సంలీనం’ అనే సూత్రం ఆధారంగా నిర్మించిన బాంబు ఏది?

1) హైడ్రోజన్‌ బాంబు  2) అణుబాంబు    3) 1, 2       4) ఏదీకాదు

జ: హైడ్రోజన్‌ బాంబు

26. రేడియో ఐసోటోపులను కింది ఏ రంగాల్లో ఉపయోగిస్తారు?

i. వ్యవసాయం     ii. పరిశ్రమలు     iii. వైద్యం     iv.  భూగర్భశాస్త్రం 

1) i, ii   2) ii, iii  3) i, ii, iii, iv  4) iii, iv

జ: i, ii, iii, iv

27. కిందివాటిలో సరైన జత కానిది ఏది?

1) 1 క్యూరీ = 3.7 x 1010 విఘటనం/ సెకన్‌

2) 1 బెక్వెరెల్‌ = 1 విఘటనం/ సెకన్‌

3) 1 రూథర్‌ఫర్డ్‌ = 106 విఘటనం/ సెకన్‌

4) 1 బెక్వెరెల్‌ = 100 విఘటనం/ సెకన్‌

జ: 1 బెక్వెరెల్‌ = 100 విఘటనం/ సెకన్‌

28. కిందివాటిలో అత్యుత్తమ అణు ఇంధనం ఏది?

1) థోరియం - 236             2) ఫ్లూటోనియం - 239   

3) యురేనియం - 236        4) నెఫ్ట్యూనియం - 239

జ: ఫ్లూటోనియం - 239

29. కిందివాటిలో కృత్రిమ రేడియోధార్మిక మూలకాలు ఏవి?

1) క్యూరియం      2) ఫెర్మియం   3) లారెన్షియం      4) పైవన్నీ

జ: పైవన్నీ

30. అణురియాక్టర్‌ నిర్మాణంలో ఇమిడి ఉన్న సూత్రం ఏమిటి?

1) కేంద్రక విచ్ఛిత్తి             2) అనియంత్రిత గొలుసు చర్య   

3) కేంద్రక సంలీనం            4) ఆక్సీకరణ చర్య

జ: కేంద్రక విచ్ఛిత్తి

31. హైడ్రోజన్‌ బాంబును కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?

1) ఎడ్వర్డ్‌ టెల్లర్‌           2) ఒపెన్‌ హైమర్‌ 

3) మిల్లికాన్‌               4) విక్రమ్‌ సారాభాయ్‌

జ: ఎడ్వర్డ్‌ టెల్లర్‌

32. కేంద్రక పరిమాణాన్ని ఏ ప్రమాణంలో కొలుస్తారు?

1) మిల్లీమీటర్‌    2) మైక్రోమీటర్‌   3) ఫెర్మీ    4) డెసీమీటర్‌

జ: ఫెర్మీ

33. ఎలక్ట్రాన్‌కు తరంగ స్వభావం ఉంటుందని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు?

1) డీబ్రోగ్లీ      2) జె.జె.థామ్సన్‌     3) క్యూరీ    4) రూథర్‌ఫర్డ్‌

జ: డీబ్రోగ్లీ 

34. కిందివాటిలో సరైనవి ఏవి?

i. వివిధ రేడియోధార్మిక పదార్థాలకు అర్ధజీవిత కాలాలు వేర్వేరుగా ఉంటాయి.

ii. రేడియోధార్మిక కిరణాల ఉనికిని గీగర్‌ - ముల్లర్‌ కౌంటర్, సింటిలేషన్‌ కౌంటర్‌ లాంటి సాధనాల ద్వారా తెలుసుకుంటారు.

1) i మాత్రమే    2) ii మాత్రమే     3) i, ii     4) ఏదీకాదు

జ:  i, ii

35. మేడమ్‌ క్యూరీ కనుక్కున్న రెండు మూలకాలు ఏవి?

1) పొలోనియం, రేడియం      2) రేడియం, బేరియం  

3) పొలోనియం, బిస్మత్‌       4) క్యూరియం, రేడియం

జ: పొలోనియం, రేడియం

36. మెదడులోని కణుతులను గుర్తించడానికి ఉపయోగించే రేడియోధార్మిక ఐసోటోపు ఏది?

1) కార్బన్‌ - 14              2) అయోడిన్‌ - 131   

3) టెక్నీషియం - 99m      4) సోడియం - 24

జ: టెక్నీషియం - 99m

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. సూర్యుడి నుంచి తీవ్రమైన వేడి వెలువడటానికి కారణం ఏమిటి?  (APPSC, FBO 2019)

 జ:  కేంద్రక సంలీనం


2. హైడ్రోజన్‌ బాంబు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? (APPSC, Group-IV 2012)

 జ: కేంద్రక సంలీనం


3. అణురియాక్టర్లలో మితకారిణిని ఎందుకు ఉపయోగిస్తారు? (APPSC, FBO 2019)

 జ: న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి  


4. సహజ రేడియోధార్మికతను కనుక్కున్నది ఎవరు? (APPSC, Group-IV 2012)

 జ:  హెన్రీ బెక్వెరెల్‌  


5. భూమి వయసును నిర్ధారించడానికి కింది ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? (APPSC, FBO 2019)

 జ: యురేనియం - లెడ్‌ డేటింగ్‌

6. రేడియోధార్మికతను కొలవడానికి దేన్ని ఉపయోగిస్తారు? (UPSC, NDA 2017)

 జ:  జి.ఎం.కౌంటర్‌    

7. అణుబాంబు ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది?  (APPSC, Group-IV-2012)

 జ:  కేంద్రక విచ్ఛిత్తి  

8. రేడియేషన్‌ చికిత్స పద్ధతిలో కోబాల్ట్‌-60ని వాడతారు. ఇవి సాధారణంగా వేటిని ప్రసరింపజేస్తాయి?

(APPSC, Assistant Research Officer 2013)

 జ:  గామా - కిరణాలు

9. కిందివాటిలో రేడియోధార్మిక శ్రేణి కానిది? (APPSC, DL 2012)

 జ:  కార్బన్‌ శ్రేణి  

10. ఆటంబాంబును మొదట రూపొందించింది? (APPSC, Tribal Welfare Officer-2012)

 జ: ఒపెన్‌ హైమర్‌


11. కేంద్రక బలం అనేది? (AP Police, SI 2018)

 జ: ఎల్లప్పుడు ఆకర్షణ బలం

Posted Date : 11-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌