• facebook
  • whatsapp
  • telegram

నంబర్‌ - ర్యాంకింగ్‌ - టైమ్‌ సీక్వెన్స్‌ టెస్ట్‌

నంబర్‌ టెస్ట్‌


1. కింది శ్రేణిలో వరుస సంఖ్యల మధ్య తేడాగా 2 ఎన్నిసార్లు వచ్చింది?  

6   4   1   2   2    2   8   7   4   2   1   5   3   5   8   6   7   9

1) 3            2) 2             3) 4               4) 5


సాధన:   6 4  1   2   2   2   8   7   4   2   1    5   3 
5   8   6   7   9
6 − 4 = 2,   4 − 2 = 2,
5 − 3 = 2,   8 − 6 = 2

సమాధానం: 3


2. కింద ఇచ్చిన అంకెల క్రమంలో 6కు ముందు, 7కు తర్వాత ఎన్ని 5లు ఉన్నాయి? 

3   1   2   4   5   6   7   5   6   5   7   2   4   7   5    6   6   5   7

1) 1          2) 3            3) 2          4) 4

సాధన: 3 1 2 4 5 6 7 5 6 

          5 7 2 4 7 5 6 6 5 7

సమాధానం: 3


3. 3 1 5 4 9 7 8 6 లోని రెండవ, అయిదవ, ఎనిమిదవ అంకెలతో ఏర్పడే సంఖ్య రెండంకెల సంఖ్య 'y' కు వర్గం. అయితే ఆ సంఖ్య 'y' లోని ఒకట్ల స్థానంలోని అంకె ...

1) 1          2) 6         3) 4          4) 2

సాధన: ఏర్పడే సంఖ్య: 196

142 = 196

కావాల్సిన అంకె: 4

సమాధానం: 3

సూచనలు (ప్ర.4 - 5): కింది సంఖ్యాశ్రేణిని పరిశీలించి, ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

7 8 9 7 6 5 3 4 2 8 9 7 2 4 5 9  2 9 7 6 4 7


4. శ్రేణిలో ఉన్న అంకెల మొత్తం ఎంత?

1) 130       2) 140       3) 120      4) 129

సాధన:  

అంకెల మొత్తం = 7 + 8 + 9 + 7 + 6 + 5 + 3 + 4 + 2 + 8 + 9 + 7 + 2 + 4 + 5 + 9 + 2 + 9 + 7 + 6 + 4 + 7 = 130

సమాధానం: 1 


5. మొదటి సగం శ్రేణిలోని అంకెల మొత్తానికి, రెండో సగం శ్రేణిలోని అంకెల మొత్తానికి మధ్య వ్యత్యాసం ఎంత?

1) 5      2) 4       3) 7       4) 6

సాధన: కావాల్సిన సంఖ్య = 

(7 + 8 + 9 + 7 + 6 + 5 + 3 + 4 + 2 + 8 + 9)  -  (7 + 2 + 4 + 5 + 9 + 2 + 9 + 7 + 6 + 4 + 7)

= 68 - 62 = 6  

   సమాధానం: 4


6.   7, 5, 9, 6, 4, 3, 9, 5, 2 అంకెల క్రమంలోని సంఖ్యలను ఆరోహణక్రమంలో రాస్తే ఎన్ని అంకెలు అదే స్థానంలో ఉంటాయి?

1) 1      2) 2      3) 3      4) 0

సాధన: 

ఇచ్చిన క్రమం: 7, 5, 9, 6, 4, 3, 9, 5, 2

ఆరోహణ క్రమం: 2, 3, 4, 5, 5, 6, 7, 9, 9

ఏ అంకె కూడా అదే స్థానంలో లేదు.

సమాధానం: 4


7. 5, 6, 0, 1, 3, 5, 9, 8, 7, 3, 4, 7, 9, 6 అంకెల క్రమంలో రెండు ప్రధాన సంఖ్యలు పక్కపక్కనే వచ్చే సందర్భాలు ఎన్ని?

1) 3       2) 2       3) 4       4) 1

సాధన: 

5, 6, 0, 1, 3, 5,  9, 8, 7, 3,  4, 7, 9, 6

రెండు ప్రధాన సంఖ్యలు పక్కపక్కనే వచ్చే సందర్భాలు: 2

సమాధానం: 2


8. 4, 3, 5, 8, 3, 4, 6, 4, 4, 8, 7, 3, 2, 1, 0, 8, 4, 3, 2 అంకెల క్రమంలో ముందు 8 ఉండి, తర్వాతి సంఖ్య బేసి సంఖ్యగా ఉన్న అంకెల సంఖ్య ....

1) 1       2) 3         3) 4        4) 2

సాధన: 4 3 5 8 3  4 6 4 4

          8 7 3 2 1 0 8 4 3 2

ముందు 8 ఉండి, తర్వాతి సంఖ్య బేసి సంఖ్యగా ఉన్న అంకెల సంఖ్య = 2

సమాధానం: 4


ర్యాంకింగ్‌ టెస్ట్‌


9. హరిత తన తరగతిలో మొదటి నుంచి 8వ స్థానంలో, చివరి నుంచి 24వ స్థానంలో ఉంది. ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య 40 ఉండాలంటే ఇంకా ఎంతమందిని చేర్చాలి?

1) 10      2) 16      3) 9      4) 8

సాధన: చేర్చాల్సిన విద్యార్థుల సంఖ్య 

= (40 − (24 + 8)) + 1
= (40 − 32) + 1
= 8 + 1 = 9

సమాధానం: 3


10. ఒక తరగతిలో శ్రావ్య ర్యాంక్‌ పైనుంచి 7వది కింది నుంచి 26వది. అయితే ఆ తరగతిలోని విద్యార్థుల సంఖ్య ఎంత?

1) 31      2) 33      3) 36      4) 32

సాధన: తరగతిలోని విద్యార్థుల సంఖ్య 

= ((7 + 26) − 1) = 33 − 1 = 32

సమాధానం: 4


11. చెట్ల వరుసలో ఒక చెట్టు చివరి నుంచి, మొదటి నుంచి 5వ స్థానంలో ఉంది. అయితే ఆ వరుసలో ఎన్ని చెట్లు ఉన్నాయి?

1) 8      2) 9       3) 10       4) 11

సాధన: 


 వరుసలో మొత్తం 9 చెట్లు ఉన్నాయి.

సమాధానం: 2


12. ఒక తరగతిలో సరిత ర్యాంకు మొదటి నుంచి 16, చివరి నుంచి 49 అయితే ఆ తరగతిలో ఉన్న విద్యార్థుల సంఖ్య ....

1) 65      2) 64      3) 67      4) 66

సాధన: రెండు వైపులా ఇచ్చిన ర్యాంకులను కలిపి వాటి నుంచి 1 తీసేయాలి

= (16 + 49) − 1
= 65 − 1 = 64


సమాధానం: 2


13. ఆంగ్ల అక్షరమాలలో చివరి నుంచి 21 అక్షరాలు, మొదటి నుంచి 20 అక్షరాలు తీసుకుంటే వాటిలో మధ్యలో ఉండే అక్షరం ఏది?

1) M        2) K        3) N        4) L

సాధన: చివరి నుంచి 21వ అక్షరం = F

మొదటి నుంచి 20వ అక్షరం = T

F G H I J K L M N O P Q R S T
మధ్యలో ఉండే అక్షరం = M

సమాధానం: 1


14. ఒక వరుసలో హరిత ఎటు నుంచి చూసినా 17వ స్థానంలో, శ్రావ్య కుడి వైపు నుంచి 18వ స్థానంలో ఉన్నారు. అయితే ఎడమవైపు నుంచి శ్రావ్య ఏ స్థానంలో ఉంది?

1) 15         2) 17         3) 18         4) 16

సాధన: మొత్తం విద్యార్థుల సంఖ్య 

= 2 × 17 − 1
= 34 − 1 = 33
కుడి వైపు నుంచి శ్రావ్య స్థానం = 18

ఎడమవైపు నుంచి శ్రావ్య స్థానం 

= 33 − 18 + 1 = 16

సమాధనం: 4


15. 39 మంది విద్యార్థులు ఉన్న తరగతిలో శ్రావ్య కంటే హరిత 7 స్థానాలు ముందుంది. శ్రావ్య స్థానం చివరి నుంచి 17 అయితే హరిత స్థానం మొదటి నుంచి ఎన్నోది?

1) 16      2) 17      3) 18      4) 15

సాధన:

శ్రావ్య చివరి నుంచి 17వ స్థానంలో ఉంది.

శ్రావ్య కంటే హరిత 7 స్థానాలు ముందుంది.

కాబట్టి హరిత కంటే ముందున్న విద్యార్థుల సంఖ్య = 39 - 24 = 15

మొదటి నుంచి హరిత స్థానం = 16


సమాధానం: 1


టైమ్‌ సీక్వెన్స్‌ టెస్ట్‌


1. రవి ఒక సమావేశానికి హాజరయ్యేందుకు ఉదయం 10:10 కి వచ్చాడు. అతడు హరి కంటే 30 ని. ముందు వచ్చాడు. హరి సమావేశ నిర్ణీత సమయానికి 10 ని. ఆలస్యంగా వచ్చాడు. సమావేశ నిర్ణీత సమయం ఎంత?

1) 10:40 AM       2) 10:10 AM        3) 10:30 AM     4) 10:50 AM

సాధన: సమావేశ నిర్ణీత సమయం  = ఉదయం 10:30

రవి వచ్చిన సమయం  = ఉదయం 10:10

హరి వచ్చిన సమయం  = ఉదయం 10:40


సమాధానం: 3


2. హరిత సాయంత్రం 3:45 కి డ్యాన్స్‌ క్లాస్‌కు బయలుదేరింది. ఆమె ఇంటి నుంచి పాఠశాలకు నడవాలంటే 15 ని. సమయం పడుతుంది. ఆమె డ్యాన్స్‌ క్లాస్‌ 1 గం.30 ని. సేపు జరుగుతుంది. ఆమె నేరుగా ఇంటికి వెళ్లింది. అయితే హరిత ఇంటికి ఎన్ని గంటలకు వెళ్తుంది?

1) 5:30 PM     2) 5:40 PM       3) 5:45 PM     4) 5:55 PM 

సాధన: 3.45 + 15ని. + 90ని. + 15ని.

= 5:45 PM


సమాధానం: 3


3. తిరుపతి రైల్వేస్టేషన్‌ నుంచి చిత్తూరుకు ప్రతి అర్ధగంటకు ఒక రైలు బయలుదేరుతుంది. అయితే ఎంక్వయిరీ క్లర్క్‌ ప్రయాణికులకు ఈ విధంగా చెప్పాడు ‘‘ఒక రైలు స్టేషన్‌ నుంచి బయలుదేరి ఇప్పటికి 10 ని. అయ్యింది, తర్వాతి రైలు స్టేషన్‌ నుంచి 9 గం.35 ని.కు బయలుదేరుతుంది’’. అయితే ఎంక్వయిరీ క్లర్క్‌ ప్రయాణికులకు అనౌన్స్‌ చేసిన సమయం ఎంత?

1) 9 గం. 20 ని.      2) 9 గం. 15 ని.    3) 9 గం. 10 ని.      4) 9 గం. 25 ని.

సాధన: = 9.35  30 ని.

   = 9.05 ని. + 10 ని.

   = 9 గం. 15 ని.

సమాధానం: 2


అభ్యాస ప్రశ్నలు


1. 46 మంది విద్యార్థులు ఉన్న ఒక తరగతిలో శిల్ప ర్యాంకు 12. అయితే ఆమె ర్యాంకు చివరి నుంచి ఎన్నవది?

1) 33       2) 35       3) 37        4) 34

జ: 2


2. ఒక తరగతిలో వనిత పైనుంచి 9 వది. కింద నుంచి 25వది. అయితే ఆ తరగతిలోని విద్యార్థులు సంఖ్య?

1) 28       2) 33       3) 34       4) 35

జ: 2


3. రమ్య ఒక వరుసలో కుడివైపు నుంచి 12వ విద్యార్థి, ఎడమవైపు నుంచి 4వ విద్యార్థి అయితే ఇంకా ఎంతమందిని కలిపితే ఆ వరుసలో మొత్తం 28 మంది విద్యార్థులు ఉంటారు?

1) 16       2) 24       3) 13       4) 15

జ: 3


4. 49 మంది బాలురు ఉన్న వరుసలో ఎడమ వైపు నుంచి సరిత స్థానం 39. అదే వరుసలో కుడివైపు నుంచి కావ్య స్థానం 17 అయితే ఆ వరుసలో వారిద్దరి మధ్య ఎంతమంది విద్యార్థులు ఉన్నారు?

1) 4          2) 6          3) 7         4) 5

జ: 4


5. ఒక పరీక్షలో ఉత్తీర్ణులైన వారిలో రూపశ్రీ ర్యాంకు మొదటి నుంచి 16వది, చివరి నుంచి 29వది. ఆరుగురు విద్యార్థులు పరీక్ష రాయలేదు, మరో ఆరుగురు పరీక్షలో ఉత్తీర్ణత పొందలేదు. అయితే ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య .....

1) 45       2) 56       3) 55       4) 45

జ: 2


6. 50 మంది ఉన్న తరగతిలో మొదటి నుంచి సునీత, శ్రీజల ర్యాంకులు వరుసగా 2, 5. అయితే చివరి నుంచి వారి ర్యాంకులు వరుసగా ....

1) 48, 46       2) 49, 46        3) 49, 47        4) 48, 45

జ: 2


7. 39 మంది ఉన్న తరగతిలో రమ్య కంటే రాము 7 ర్యాంకులు ముందు ఉన్నాడు. చివరి నుంచి రమ్య ర్యాంకు 17. అయితే మొదటి నుంచి రాము ర్యాంకు ఎంత?

1) 16        2) 17        3) 18        4) 19

జ: 1


8. 13 మంది వ్యక్తులు ఒక వరుస క్రమంలో నిలబడి ఉన్నారు. మొదటి నుంచి ప్రతి రెండో వ్యక్తి పురుషుడు. మొదటి, చివరి వ్యక్తులు మహిళలు అయితే ఆ వరుసలో ఉన్న పురుషులు ఎంతమంది?

1) 4          2) 7         3) 5          4) 6

జ: 4


9. బాలుర వరుసలో ఎడమవైపు నుంచి అయిదో వాడు K, కుడివైపు నుంచి ఆరోవాడు R. వారి స్థానాలు తారుమారు చేసుకుంటే K స్థానం ఎడమ నుంచి 13వది. అయితే కుడివైపు నుంచి R స్థానం ....

1) 7        2) 11       3) 14       4) 18 

జ: 3


10. ఒక సమావేశానికి Q కంటే P 40 నిమిషాలు ఆలస్యంగా సాయంత్రం 3.30 నిమిషాలకు  వచ్చాడు. నిర్ణీత సమయం కంటే 15 నిమిషాలకు ముందే Q చేరుకున్నాడు.  అయితే ఆ సమావేశ నిర్ణీత సమయం ఎంత? 

1) 2.55 PM       2) 3.00 PM      3) 3.05 PM       4) 3.10 PM

జ: 3

Posted Date : 30-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌