• facebook
  • whatsapp
  • telegram

సంఖ్యా వ్యవస్థ

ముఖ్యాంశాలు

* అంకెలు = 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9

* సహజ సంఖ్యలు = 1, 2, 3, 4, 5, .....

* బేసి సంఖ్యలు = 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, .....

* సరి సంఖ్యలు = 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, .....

* ప్రధాన సంఖ్యలు = 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, .....

* సంయుక్త సంఖ్యలు = 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16, 18, 20, ...

* మొదటి n సహజ సంఖ్యల మొత్తం  

* మొదటి n బేసి సంఖ్యల మొత్తం  n2

* మొదటి n సరి సంఖ్యల మొత్తం n(n + 1)

మాదిరి సమస్యలు

1. మొదటి 15 సహజ సంఖ్యల మొత్తం ఎంత?

1) 125       2) 115        3) 150      4) 120

సాధన: 

 

సమాధానం: 4


2. రెండంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి?

1) 99       2) 95       3) 90       4) 91

సాధన: 

సమాధానం: 3

3. మొదటి 100 సహజ సంఖ్యలను రాయడానికి మొత్తం ఎన్ని అంకెలను ఉపయోగిస్తారు?

1) 189        2) 190        3) 191        4) 192

సాధన: 

సమాధానం: 4


4. కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఒక పుస్తకంలోని 200 పేజీల సంఖ్యలను ముద్రించడానికి తన కీబోర్డులో ఉన్న కీ (మీట)లను ఎన్నిసార్లు ఉపయోగిస్తాడు?

1) 492     2) 482     3) 476      4) 485

సాధన: కంప్యూటర్‌ ఆపరేటర్‌ 200 పేజీల సంఖ్యలను ముద్రించడానికి కీబోర్డ్‌లో ఉన్న కీలను ఉపయోగించే సంఖ్య

= 200 సంఖ్యలను రాయడానికి ఉపయోగించే మొత్తం అంకెలు

= (9 x 1) + (90 x 2) + (101 x 3)

= 9 + 180 + 303 = 492 సార్లు

సమాధానం: 1

5. 61 నుంచి 90 వరకు ఉన్న సంఖ్యల మొత్తం ఎంత?

1) 2165     2) 2265          3) 2365        4) 2465

సాధన: 

సమాధానం: 2

6. రవి ఒక పుస్తకంలోని పేజీల సంఖ్యలను ముద్రించడానికి 3937 అంకెలను ఉపయోగించాడు. అయితే ఆ పుస్తకంలో ఉన్న మొత్తం పేజీలు ఎన్ని?

1) 1251      2) 1261      3) 1361      4) 1262

సాధన: 1 నుంచి 9 వరకు ఉన్న సంఖ్యలను ముద్రించడానికి ఉపయోగించే మొత్తం అంకెలు = 9

1 నుంచి 99 వరకు ఉన్న సంఖ్యలను ముద్రించడానికి ఉపయోగించే మొత్తం అంకెలు 

= (9 x 1) + (90 x 2)

= 9 + 180 = 189

1 నుంచి 999 వరకు ఉన్న సంఖ్యలను ముద్రించడానికి ఉపయోగించే మొత్తం అంకెలు

= (9 x 1) + (90 x 2) + (900 x 3)

= 9 + 180 + 2700 = 2889

పుస్తకంలో 999 కంటే ఎక్కువ ఉన్న పేజీల సంఖ్య = x అనుకోండి.

పుస్తకంలోని మొత్తం పేజీల సంఖ్య 

= 999 + x

= 999 + 262 = 1261

సమాధానం: 2

7. మొదటి 50 బేసి సంఖ్యల మొత్తం.....

1) 2500      2) 2400       3) 2550     4) 2600

సాధన: 1 + 3 + 5 + ... (50 సంఖ్యలు) = n2

  = 502 = 2500 

సమాధానం: 1

8. 1 నుంచి 100 వరకు ఉన్న సహజ సంఖ్యల్లో సరి సంఖ్యల మొత్తం ఎంత?

1) 2500    2) 2600        3) 2650      4) 2550

సాధన: 1 నుంచి 100 వరకు ఉన్న సహజ సంఖ్యల్లో సరి సంఖ్యలు

= 2, 4, 6, 8, ...... 98, 100

2 + 4 + 6 + 8 + ...... + 100 =

 2 + 4  + 6 + ... +50(సంఖ్యలు)

 = 50 (50 + 1) = 50 x 51 = 2550 

సమాధానం: 4

9. 66666 + 666.66 + 6.6666 = ...... 

1) 67339.3266       2) 66339.3266 

3) 68339.3236       4) 67339.4266

సాధన:

సమాధానం: 1

10. మొదటి - సహజ సంఖ్యల మొత్తం 210 అయితే n విలువ?

1) 18          2) 16           3) 20    4) 24

సాధన: 

సమాధానం: 3


11. మొదటి 25 సహజ సంఖ్యల సరాసరి ఎంత?

1) 12.5         2) 13     3) 12      4) 26

సాధన: మొదటి 25 సహజ సంఖ్యల సరాసరి 

సమాధానం: 2

12. 7372  x 7372 + 7372 x 628 = ?

1) 58976800     2) 59876000

3) 58976000     4) 58769000

సాధన: 7372 x 7372 + 7372 x 628

= 7372 )7372 + 628)

= 7372 x 8000

= 58976000

సమాధానం: 3

13. A, Bలు రెండు ధనపూర్ణ సంఖ్యలు 

9A2 = 12A + 96, B2 = 2B + 3 అయితే 5A + 7B విలువ ఎంత?

1) 41      2) 51      3) 61      4) 48

సాధన:

సమాధానం: 1

14. మూడంకెల అతిపెద్ద సంఖ్య, మూడు విభిన్న అంకెలతో ఏర్పడే మూడంకెల అతి చిన్న సంఖ్యల మొత్తం ఎంత?

1) 1011     2) 1101      3) 1009      4) 1110

సాధన: మూడంకెల అతిపెద్ద సంఖ్య = 999

మూడు విభిన్న అంకెలతో ఏర్పడే మూడంకెల అతిచిన్న సంఖ్య = 102

మొత్తం: 999 + 102 = 1101 

సమాధానం: 2

15. 1, 4, 6, 7లతో ఏర్పడే నాలుగంకెల అతిపెద్ద సంఖ్యకు, నాలుగంకెల అతి చిన్న సంఖ్యకు మధ్య భేదం?

1) 6471       2) 6417        3) 6174       4) 6714

సాధన: 1, 4, 6, 7లతో ఏర్పడే

4 అంకెల అతి పెద్ద సంఖ్య = 7641

4 అంకెల అతి చిన్న సంఖ్య = 1467

భేదం = 7641  1467 = 6174

సమాధానం: 3

అభ్యాస ప్రశ్నలు

1. మూడంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి?

1) 999          2) 990          3) 899           4) 900

2. అయిదంకెల అతి పెద్ద సంఖ్యకు, నాలుగంకెల అతి చిన్న సంఖ్యకు మధ్య భేధం....

1) 96991     2) 99889

3) 98999     4) 90999

3. మొదటి 100 సహజ సంఖ్య మొత్తం....

1) 5050          2) 4055          3) 4850         4) 5250

4. మొదటి 100 బేసి సంఖ్యల మొత్తం.....

1) 5000          2) 8000 

3) 10000        4) 12000 

5. మొదటి 40 సరి సంఖ్యల మొత్తం .....

1) 1740          2) 1681         3) 1600       4) 1640

6. 12345679 x 9 = ........ 

1) 123123123   2) 111111111 

3) 321321321   4) 212121211

7. ఒక పుస్తకంలో ఉన్న 150 పేజీల సంఖ్యలను ముద్రించడానికి కంప్యూటర్‌ ఆపరేటర్‌ కీ బోర్డులోని మీటలను ఎన్నిసార్లు వాడతాడు?

1) 354        2) 345          3) 342         4) 339

8. మొదటి n సహజ సంఖ్యల మొత్తం 496 అయితే n విలువ ఎంత?

1) 31       2) 30       3) 29       4) 32

సమాధానాలు

1 - 4          2 - 3          3 - 1          4 - 3       5 - 4          6 - 2          7 - 3          8 - 1

రచయిత

సీహెచ్‌. రాధాకృష్ణ

Posted Date : 04-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌