• facebook
  • whatsapp
  • telegram

పార్లమెంట్‌

1. పార్లమెంటరీ విధానానికి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) ‘పార్లమెంట్‌’ అనే పదం ఫ్రెంచ్‌ భాషలోని ‘పార్లర్‌’ అనే పదం నుంచి ఆవిర్భవించింది.

బి) బ్రిటన్‌ పార్లమెంట్‌ను ప్రపంచ పార్లమెంట్‌లకు మాత (Mother)గా పేర్కొంటారు.

సి) మనదేశం పార్లమెంటరీ విధానాన్ని ‘బ్రిటన్‌’ నుంచి గ్రహించింది.

డి) పార్లమెంటరీ విధానంలో దేశాధినేత వాస్తవ కార్యనిర్వాహక అధికారాలను కలిగి ఉంటారు.

1) ఎ, బి, డి    2) ఎ, బి, సి     3) ఎ, సి, డి    4) పైవన్నీ

జ: 2

 
2. ఏ చట్టం ద్వారా మనదేశంలో తొలిసారిగా “Legislative Council”ను ఏర్పాటు చేశారు?

1) చార్టర్‌ చట్టం, 1853                 2) ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1861

3) భారత ప్రభుత్వ చట్టం, 1935     4) పిట్స్‌ ఇండియా చట్టం, 1781

జ: 1


3. మనదేశంలో తొలిసారిగా కార్యనిర్వాహక శాఖ నుంచి శాసననిర్మాణ శాఖను ఏ చట్టం ద్వారా వేరు చేశారు?

1) రెగ్యులేటింగ్‌ చట్టం, 1773           2) సెటిల్‌మెంట్‌ చట్టం, 1781

3) చార్టర్‌ చట్టం, 1833                  4) ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1872

జ: 3


4. కేంద్ర శాసన వ్యవస్థలో ‘ద్విసభా విధానం’ ప్రవేశపెట్టడానికి గల కారణం?

1) మాంటేగ్‌ చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1919    2) భారత ప్రభుత్వ చట్టం, 1935

3) మింటోమార్లే సంస్కరణల చట్టం, 1909         4) భారత స్వాతంత్య్ర చట్టం, 1947

జ: 1


5. ఏ చట్టం ప్రకారం కేంద్ర లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌లో ముగ్గురు భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించారు?

1) రెగ్యులేటింగ్‌ చట్టం, 1773                2) చార్టర్‌ చట్టం, 1813

3) ఇండియన్‌ కౌన్సిల్‌ చట్టం, 1861       4) భారత ప్రభుత్వ చట్టం, 1935

జ: 3


6. భారత రాజ్యాంగంలో పార్లమెంట్‌ గురించిన వివరణ ఎక్కడ ఉంది?

1) Vవ భాగం, ఆర్టికల్స్‌ 79 నుంచి 122          2) Vవ భాగం, ఆర్టికల్స్‌ 78 నుంచి 121

3) Vవ భాగం, ఆర్టికల్స్‌ 81 నుంచి 131          4) Vవ భాగం, ఆర్టికల్స్‌ 82 నుంచి 119

జ: 1


7. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 79 ప్రకారం పార్లమెంట్‌ అంటే?

1) రాజ్యసభ, లోక్‌సభ, ప్రధానమంత్రి           2) రాజ్యసభ, లోక్‌సభ, మంత్రిమండలి

3) రాజ్యసభ, లోక్‌సభ, రాష్ట్రపతి                 4) ఏదీకాదు

జ: 3


8. పార్లమెంటరీ విధానానికి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) దేశాధినేత నామమాత్రపు అధికారాలను కలిగి ఉంటారు.

బి) ప్రభుత్వాధినేత వాస్తవ అధికారాలను కలిగి ఉంటారు.

సి) దీన్ని “Westminster” విధానం అంటారు.

డి) దేశాధినేత లోక్‌సభకు సమష్టి బాధ్యత వహిస్తారు.

1) ఎ, బి, సి       2) ఎ, సి, డి            3) ఎ, బి, డి       4) పైవన్నీ

జ: 1


9. ‘‘ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమైన పార్లమెంట్‌ భారతదేశంలో అతిపెద్ద పంచాయతీ లాంటిది’’ అని ఎవరు వ్యాఖ్యానించారు?

1) డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌               2) డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌

3) సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌             4) పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ

జ: 4


10. పార్లమెంట్‌ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది?

1) 1952, మే 13     2) 1950, మే 13      3) 1951, మే 13     4) 1951, జులై 18

జ: 1


11. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ ప్రకారం పార్లమెంట్‌ 3 రకాల పద్ధతుల ద్వారా రాజ్యాంగాన్ని సవరించగలదు?

1) ఆర్టికల్‌ 361     2) ఆర్టికల్‌ 268     3) ఆర్టికల్‌ 366     4) ఆర్టికల్‌ 368

జ: 4


12. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదు, అని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది?

1) అజయ్‌ కుమార్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

2) మేనకా గాంధీ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

3) గోలక్‌నాథ్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసు

4) కేశవానంద భారతి Vs స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు

జ: 3


13. రాజ్యాంగ మౌలికస్వరూపానికి విఘాతం కలగకుండా పార్లమెంట్‌ రాజ్యాంగాన్ని సవరించవచ్చని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది?

1) కేశవానంద భారతి Vs స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసు

2) చంపకం దొరై రాజన్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ మద్రాస్‌ కేసు

3) శంకరీ ప్రసాద్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

4) రంగనాథ్‌ మిశ్రా Vs స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌ కేసు

జ: 1


14. కిందివాటిలో పార్లమెంట్‌కు ఉన్న ఎన్నికల ఆధికారాన్ని గుర్తించండి.

ఎ) రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజ్‌లో పార్లమెంట్‌ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు ఓటర్లుగా ఉంటారు.

బి) ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజ్‌లో పార్లమెంట్‌ ఉభయసభల మొత్తం సభ్యులు ఓటర్లుగా ఉంటారు.

సి) రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్‌ కాలేజ్‌లో పార్లమెంట్‌ ఉభయసభల మొత్తం సభ్యులు ఓటర్లుగా ఉంటారు.

1) ఎ, సి      2) ఎ, బి       3) ఎ       4) పైవన్నీ

జ: 2


15. పార్లమెంట్‌ ఏ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని తొలగించగలదు?

1) అభిశంసన తీర్మానం     2) అవిశ్వాస తీర్మానం

3) కోత తీర్మానం              4) మహాభియోగ తీర్మానం

జ: 4


16. పార్లమెంట్‌ ఆర్థిక అధికారానికి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని నిర్దేశిస్తుంది.

బి) వార్షిక బడ్జెట్‌ను ఆమోదిస్తుంది.

సి) విదేశాల నుంచి రుణాలు సేకరించే బిల్లులకు ఆమోదముద్ర వేస్తుంది.

డి) నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తుంది.

1) ఎ, బి, డి    2) ఎ, సి, డి         3) ఎ, బి, సి    4) పైవన్నీ

జ: 4


17. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ ప్రకారం పార్లమెంట్‌ అనుమతి లేనిదే ‘కేంద్ర సంఘటిత నిధి’ నుంచి ప్రభుత్వం ఖర్చుచేయడానికి వీల్లేదు?

1) ఆర్టికల్‌ 266      2) ఆర్టికల్‌ 267     3) ఆర్టికల్‌ 268     4) ఆర్టికల్‌ 311

జ: 1


18. పార్లమెంట్‌ అనుమతి లేనిదే కేంద్రప్రభుత్వం ప్రజల నుంచి అదనపు పన్నులు వసూలు చేయకూడదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తుంది?

1) ఆర్టికల్‌ 237    2) ఆర్టికల్‌ 329       3) ఆర్టికల్‌ 265    4) ఆర్టికల్‌ 309

జ: 3


19. పార్లమెంట్‌ కింది ఏ అంశంపై శాసనాలు రూపొందిస్తుంది?

1) కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపై         2) ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపై

3) అవశిష్ట అంశాలపై                           4) పైవన్నీ

జ: 4


20. మనదేశంలో ఇప్పటివరకు ఆర్టికల్‌ 108 ప్రకారం పార్లమెంట్‌ ఉభయ సభల సంయుక్త సమావేశాలు ఏ సంవత్సరాల్లో జరిగాయి?

1) 1961, 1978, 1999        2) 1961, 1978, 2002

3) 1961, 1982, 1998        4) 1961, 1971, 2001

జ: 2


21. రాష్ట్రపతి జారీచేసే ఆర్డినెన్స్‌ ఎవరి ఆమోదం ద్వారా చట్టంగా మారుతుంది?

1) సుప్రీంకోర్టు    2) పార్లమెంట్‌      3) కేబినెట్‌    4) అటార్నీ జనరల్‌

జ: 2


22. పార్లమెంట్‌ ఉభయసభల సంయుక్త సమావేశానికి సంబంధించి కిందివాటిలో సరికానిది ఏది?

1) ఆర్థిక బిల్లుల విషయమై సమావేశాన్ని ఏర్పాటుచేసే వీల్లేదు.

2) లోక్‌సభ స్పీకర్‌ ఏర్పాటు చేస్తారు.

3) సాధారణ బిల్లులపై ఏర్పాటు చేస్తారు.        4) రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు.

జ: 2


23. పార్లమెంట్‌ సభ్యుల ప్రత్యేక హక్కులు, రక్షణల గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటోంది?

1) ఆర్టికల్‌ 105    2) ఆర్టికల్‌ 107       3) ఆర్టికల్‌ 101    4) ఆర్టికల్‌ 98

జ: 1


24. మనదేశంలో పార్లమెంట్‌ సమావేశాలు జరిగేటప్పుడు చివరి రెండు గంటల సమయంలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లుకు అనుమతిస్తారు. అయితే అది ఏ రోజున ఉంటుంది?

1) మంగళవారం    2) బుధవారం      3) గురువారం    4) శుక్రవారం

జ: 4


25. 1925 నుంచి 1939 మధ్య కేంద్ర శాసనసభకు స్పీకర్‌గా వ్యవహరించిన తొలి భారతీయుడు ఎవరు?

1) జాన్‌ మతాయ్‌               2) విఠల్‌భాయ్‌ పటేల్‌

3) సర్దార్‌ హుకుంసింగ్‌        4) గోపాల స్వామి అయ్యంగార్‌

జ: 2


గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు


1. అవశిష్ట శాసనాధికారాలు ఎవరికి చెందుతాయి? (ఏపీ, సబ్‌ఇన్‌స్పెక్టర్స్‌ 2018)

1) పార్లమెంట్‌                         2) రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ

3) పంచాయతీ రాజ్‌ సంస్థలు      4) సహకార సంఘాలు

జ: 1


2. పార్లమెంట్‌ను ‘ప్రోరోగ్‌’ (Prorogue) చేయడం అంటే? (ఏపీ, సబ్‌ఇన్‌స్పెక్టర్స్‌ 2018)

1) రాష్ట్రపతి పార్లమెంట్‌ను రద్దు చేయడం

2) సభాధ్యక్షులు సభను వాయిదా వేయడం

3) ప్రస్తుత సమావేశాలకు ముగింపు పలికి, రాబోయే సమావేశాల వరకు విరామం ఇవ్వడం

4) పార్లమెంట్‌లో చర్చను సస్పెండ్‌ చేయడం

జ: 3


3. పార్లమెంట్‌ చట్టాలను చేస్తుంది. దీనికి సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి? (టీఎస్, సబ్‌ఇన్‌స్పెక్టర్స్‌ 2018)

1) ఆర్థిక బిల్లుతో సహా అన్ని బిల్లులను ఉభయ సభల్లో ఎందులోనైనా ప్రవేశపెట్టొచ్చు.

2) పార్లమెంట్‌ సభ్యులందరికీ వారివారి సభల్లో బిల్లులు ప్రవేశపెట్టే అధికారం ఉంది.

3) బిల్లును మంత్రి లేదా ప్రైవేట్‌ సభ్యుడు ప్రవేశపెట్టొచ్చు.

4) బిల్లును ప్రవేశపెట్టడానికి ముందే అధికారిక గెజిట్‌లో ప్రచురించిన బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు.

1) ఎ, బి, సి      2) బి, సి, డి          3) ఎ, బి, డి        4) ఎ, సి, డి

జ: 2


4. కిందివాటిలో పార్లమెంట్‌ సమావేశాలకు సంబంధించి సరికానిది ఏది? (టీఎస్, కానిస్టేబుల్స్‌ 2018)

1) స్పీకర్‌ సభలో లేనప్పుడు డిప్యూటీ స్పీకర్‌ అధ్యక్షత వహిస్తారు.

2) డిప్యూటీ స్పీకర్‌ లేనప్పుడు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ అధ్యక్షత వహిస్తారు.

3) డిప్యూటీ ఛైర్మన్‌ లేనప్పుడు రాజ్యసభ ఛైర్మన్‌ అధ్యక్షత వహిస్తారు.

4) స్పీకర్‌ అధ్యక్షత వహిస్తారు.

జ: 3


5. ‘గృహహింస’ చట్టాన్ని పార్లమెంట్‌ ఎప్పుడు రూపొందించింది? (సబ్‌ ఇన్‌స్పెక్టర్స్, కమ్యూనికేషన్స్‌ 2013)

1) 2005      2) 2004       3) 2003      4) 2002

జ: 1


6. కిందివాటిలో దేన్ని ‘మదర్‌ ఆఫ్‌ పార్లమెంట్‌’ అంటారు? (సబ్‌ఇన్‌స్పెక్టర్స్‌ 2012)

1) భారత పార్లమెంట్‌               2) బ్రిటిష్‌ పార్లమెంట్‌

3) అమెరికా కాంగ్రెస్‌                4) స్విస్‌ ఫెడరల్‌ అసెంబ్లీ

జ: 2


7. పార్లమెంట్‌ సభ్యుల విశేష అధికారాలకు సంబంధించి కిందివాటిలో సరికానిది? (ఏపీ, గ్రూప్‌ II 2017)

1) అరెస్టుల నుంచి స్వేచ్ఛ       2) సాక్షిగా హాజరు కావడం నుంచి మినహాయింపు

3) భావ ప్రకటన స్వేచ్ఛ

4) సభ్యుల వ్యక్తిగత స్వేచ్ఛ గురించి మాత్రమే పేర్కొన్నారు. మొత్తం సభకు ఎలాంటి స్వేచ్ఛ లేదు.

జ: 4

Posted Date : 27-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌