• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్‌ విభజన - సమస్యలు, సవాళ్లు

1. 2014 ఆంధ్రప్రదేశ్‌ విభజన బిల్లు రాజ్యసభలో ఏ తేదీన ఆమోదం పొందింది?

జ:  2014, ఫిబ్రవరి 20  


2. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు?

జ:  2014, మార్చి 1


3. జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పేర్కొన్న మొదటి సూచన ఏది?

జ: ఆంధ్రప్రదేశ్‌లో యథాతథ స్థితిని కొనసాగించాలి


4. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014లో పేర్కొన ‘నియమిత దినం’ ఏది?

జ:  2014, జూన్‌ 2  


5. కింది సంఘటనలను అవి జరిగిన కాలాల ఆధారంగా సరైన క్రమంలో అమర్చండి.

ఎ) జై ఆంధ్ర ఉద్యమం 

బి) జై తెలంగాణ ఉద్యమం

సి) గిర్‌గ్లానీ కమిషన్‌  

డి) జీవో నెంబర్‌ 610

ఇ) 32వ రాజ్యాంగ సవరణ 

1) ఎ, బి, సి, ఇ, డి             2) బి, ఎ, ఇ, డి, సి

3) బి, ఎ, ఇ, సి, డి             4) ఇ, సి, బి, ఎ, డి

జ:  బి, ఎ, ఇ, డి, సి

6. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014లో ‘నియమిత దినం’ అంటే?

జ:  గెజిట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీచేసిన రోజు

7. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనను శాస్త్రీయంగా పూర్తిచేయడానికి నియమించిన కమిటీ ఏది?

జ:  శ్రీకృష్ణ కమిటీ


8. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే  లోక్‌సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారు?

జ: 2014, ఫిబ్రవరి 14   


9. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థితిగతుల పరిశీలనకు ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీకి కార్యదర్శిగా ఎవరు వ్యవహరించారు?

జ:  వినోద్‌కుమార్‌ దగ్గల్‌

Posted Date : 12-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌