• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్రపతి - అధికారాలు, విధులు

1. కిందివాటిలో రాష్ట్రపతి నియమించే పదవులకు సంబంధించి సరికానిది ఏది?

1) జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు

2) జాతీయ సమాచార కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు

3) జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు

4) లోకాయుక్త ఛైర్మన్, సభ్యులు

2. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 75 (1) ప్రకారం రాష్ట్రపతి తన కార్యనిర్వాహక అధికారాల్లో భాగంగా ఎవరిని నియమిస్తారు?

1) ప్రధానమంత్రి, మంత్రిమండలి సభ్యులు

2) అడ్వకేట్‌ జనరల్, అటార్నీ జనరల్‌

3) లోకాయుక్త, ఉపలోకాయుక్త

4) జోనల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్, సభ్యులు

3. రాష్ట్రపతికి పరిపాలనా వ్యవహారాల్లో సహకరించేందుకు ప్రధాని నాయకత్వంలో కేంద్రమంత్రి మండలి ఉంటుందని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది?

1) ఆర్టికల్‌ 73 (1)                2) ఆర్టికల్‌ 74 (1)

3) ఆర్టికల్‌ 75 (2)               4) ఆర్టికల్‌ 77 (3)

4. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 76్బ1్శ ప్రకారం రాష్ట్రపతి ఎవరిని నియమిస్తారు?

1) పరిపాలనా ట్రైబ్యునళ్ల ఛైర్మన్‌

2) లోకాయుక్త          3) లోక్‌పాల్‌

4) అటార్నీ జనరల్‌

5. కిందివాటిలో రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలకు సంబంధించి సరైనవి ఏవి?

a) ఆర్టికల్‌ 124 - సుప్రీంకోర్టుకు ప్రధాన, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు.

 b) ఆర్టికల్‌ 217 - హైకోర్టులకు ప్రధాన, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు.

c) ఆర్టికల్‌ 148 - కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)ను నియమిస్తారు.

d) ఆర్టికల్‌ 151 - కేంద్రపాలిత ప్రాంతాలకు ముఖ్యమంత్రులను నియమిస్తారు.

1) a, c, d       2) a, b, d 

3) a, b, c     4) a, b, c, d

6. కిందివాటిలో రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి.

1) ఆర్టికల్‌ 280 - కేంద్ర ఆర్థిక సంఘానికి ఛైర్మన్, సభ్యులను నియమిస్తారు.

2) ఆర్టికల్‌ 155 - రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తారు.

3) ఆర్టికల్‌ 239 - కేంద్రపాలిత ప్రాంతాలకు ‘లెఫ్టినెంట్‌ గవర్నర్ల’ను నియమిస్తారు.

4) ఆర్టికల్‌ 311 - నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేస్తారు.

7. భారత రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ ప్రకారం ‘అంతర రాష్ట్రమండలి’ ్బఖి-్మ’౯ (్మ్చ్మ’ ‘్న్య-‘iః్శని ఏర్పాటు చేస్తారు?

1) ఆర్టికల్‌ 261       2) ఆర్టికల్‌ 262   

3) ఆర్టికల్‌ 263       4) ఆర్టికల్‌ 264 

8. రాష్ట్రపతి కార్యనిర్వాహక అధికారాలకు సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

a) ఆర్టికల్‌ 338 - జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌కు ఛైర్మన్, సభ్యులను నియమిస్తారు.

b) ఆర్టికల్‌ 338 (A) - జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌కు ఛైర్మన్, సభ్యులను నియమిస్తారు.

c) ఆర్టికల్‌ 340 - జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ఛైర్మన్, సభ్యులను నియమిస్తారు.

d) ఆర్టికల్‌ 324 - కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రధాన, ఇతర కమిషనర్లను నియమిస్తారు.

1) a, c, d       2) a, b, d

3) a, b, c        4) a, b, c, d

9. ఆర్టికల్‌ 80్బ3్శ ప్రకారం రాష్ట్రపతి కళలు, సాహిత్యం, సామాజిక సేవారంగాల్లో ప్రావీణ్యం ఉన్న ఎంతమందిని రాజ్యసభకు నామినేట్‌ చేస్తారు?

1) 8    2) 10    3) 12    4) 14

10. పార్లమెంట్‌ సమావేశాలు లేనప్పుడు దేశ శ్రేయస్సు కోసం రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌  ప్రకారం ‘ఆర్డినెన్స్‌’ను జారీ చేస్తారు?

1) ఆర్టికల్‌ 99         2) ఆర్టికల్‌ 123

3) ఆర్టికల్‌ 129       4) ఆర్టికల్‌ 131

11. సాధారణ బిల్లుల ఆమోదం విషయంలో లోక్‌సభ, రాజ్యసభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఆర్టికల్‌ 108 ప్రకారం పార్లమెంట్‌ ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు?

1) రాష్ట్రపతి             2) ప్రధానమంత్రి 

3) లోక్‌సభ స్పీకర్‌    4) సుప్రీంకోర్టు

12. రాష్ట్రపతి శాసనాధికారాలకు సంబంధించి  కిందివాటిలో సరైంది?

1) పార్లమెంట్ సమావేశాలను ప్రారంభించడాన్ని 'Summans' అంటారు.

2) పార్లమెంట్‌ సమావేశాలను దీర్ఘకాలంపాటు వాయిదా వేయడాన్ని'Prorogue' అంటారు.

3) లోక్‌సభను రద్దుచేయడాన్ని' Dissolve' అంటారు.

4) పైవన్నీ

13. పార్లమెంట్‌ ఆమోదించిన బిల్లులు ఆర్టికల్‌ 111 ప్రకారం ఎవరి ఆమోదంతో  చట్టాలుగా మారతాయి?

1) కేంద్రమంత్రిమండలి 

2) అటార్నీ జనరల్‌ ఆఫ్‌ ఇండియా 

3) రాష్ట్రపతి       4) సుప్రీంకోర్టు

14. పార్లమెంట్‌/ కేంద్ర మంత్రిమండలి ఆమోదించి పంపిన సాధారణ బిల్లులను రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు?

1) 36వ రాజ్యాంగ సవరణ చట్టం - 1975

2) 42వ రాజ్యాంగ సవరణ చట్టం - 1976

3) 44వ రాజ్యాంగ సవరణ చట్టం - 1978

4) 52వ రాజ్యాంగ సవరణ చట్టం - 1985

15. పార్లమెంట్‌/ కేంద్ర మంత్రిమండలి ఆమోదించి పంపిన బిల్లులకు రాష్ట్రపతి తన ఆమోదముద్ర వేయకుండా, పునఃపరిశీలనకు పంపకుండా తన వద్దే ఉంచుకోవడాన్ని ఏమంటారు?

1) సస్పెన్సివ్‌ వీటో (Suspensive Veto)

2) ప్రివెంటివ్‌ వీటో (Preventive Veto)

3) అబ్సల్యూట్‌ వీటో (Absolute Veto)

4) పాకెట్‌ వీటో (Pocket Veto)

16. కిందివాటిలో ఏ బిల్లును రాష్ట్రపతి ముందస్తు అనుమతితో మాత్రమే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంది?

a) ఆర్టికల్‌ 3 - రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు

b) ఆర్టికల్‌ 31 (A) - ఆస్తుల జాతీయీకరణ బిల్లులు

c) ఆర్టికల్‌ 112 - కేంద్ర వార్షిక బడ్జెట్‌

d) ఆర్టికల్‌ 109 - కాగ్‌ నివేదికకు సంబంధించిన బిల్లులు

1) a, b, c       2) a, c, d

3) a, b, d       4) a, b, c, d

17. పార్లమెంట్‌/ కేంద్ర మంత్రిమండలి ఆమోదించి పంపిన సాధారణ బిల్లులను రాష్ట్రపతి వెంటనే ఆమోదించాల్సిన అవసరం లేదని, ఒకసారి పునఃపరిశీలనకు పంపొచ్చని, పునఃపరిశీలన తర్వాత వచ్చిన బిల్లులకు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదం తెలపాలని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు?

1) 40వ రాజ్యాంగ సవరణ చట్టం - 1975

2) 42వ రాజ్యాంగ సవరణ చట్టం - 1976

3) 44వ రాజ్యాంగ సవరణ చట్టం - 1978

4) 49వ రాజ్యాంగ సవరణ చట్టం - 1982

18. రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారాలను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది?

1) ఆర్టికల్‌ 61       2) ఆర్టికల్‌ 72 

3) ఆర్టికల్‌ 77       4) ఆర్టికల్‌ 80

19. ఉన్నత న్యాయస్థానాలు విధించిన శిక్షలు, మరణ శిక్షను పూర్తిగా రద్దుచేసి, రాష్ట్రపతి క్షమాభిక్షను ప్రసాదించడాన్ని ఏమంటారు?

1) పార్డన్‌ (Absolving entire punishment)

2) కమ్యుటేషన్‌ (Changing nature of sentence)

3) రెస్పైట్‌ (Providing Relief)

4) రిప్రైవ్‌ (Postponement of sentence)

20. క్షమాభిక్ష అధికారాలను రాష్ట్రపతి  ఎవరి సలహామేరకు మాత్రమే ఉపయోగించాలి?

1) కేంద్ర మంత్రిమండలి 

2) కొలీజియం వ్యవస్థ 

3) పరిపాలనా ట్రైబ్యునల్‌ 

4) అటార్నీ జనరల్‌ ఆఫ్‌ ఇండియా

21. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయసలహాను తీసుకుంటారు?

1) ఆర్టికల్‌ 141       2) ఆర్టికల్‌ 142 

3) ఆర్టికల్‌ 143       4) ఆర్టికల్‌ 144

22. రాష్ట్రపతి సైనిక అధికారాలకు సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

a) త్రివిధ దళాలకు సుప్రీం కమాండర్‌గా వ్యవహరిస్తారు.

b) శత్రు దేశాలపై యుద్ధం ప్రకటిస్తారు.

c) విదేశాలతో శాంతి ఒప్పందం కుదుర్చుకుంటారు.

d) త్రివిధ దళాలకు అధిపతులను  నియమిస్తారు.

1) a, b, d       2) a, b, c

3) a, c, d       4) a, b, c, d

23. రాష్ట్రపతి, గవర్నర్లు ప్రసాదించే ‘క్షమాభిక్ష’ను న్యాయ సమీక్షకు ్బర్య్టిi‘i్చః ళి’్రi’్ర్శ గురిచేయొచ్చని ఏ కేసు సందర్భంగా  సుప్రీంకోర్టు పేర్కొంది?

1) ప్రకాశ్‌ కదం ్ర( స్టేట్‌ ఆఫ్‌ ఉత్తర్‌ ప్రదేశ్‌ కేసు

2) సుధాకర్‌ ్ర( స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసు

3) షంషేర్‌ సింగ్‌ ్ర( స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ కేసు

4) రంజన్‌ మిశ్రా ్ర( యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు


సమాధానాలు


1 - 4      2 - 1      3 - 2      4 - 4      5 - 3      6 - 4      7 - 3      8 - 4      9 - 3      10 - 2      11 - 1      12 - 4      13 - 3      14 - 2      15 - 4      16 - 1      17 - 3      18 - 2      19 - 1      20 - 1      21 - 3      22 - 4      23 - 2

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భారత రాజ్యాంగం ప్రకారం ఎన్ని రకాల అత్యవసర పరిస్థితులు ఉన్నాయి? (AP, SI 2018)

1) 4    2) 3    3) 5    4) 2

2. కిందివాటిలో భారత రాష్ట్రపతికి లేని వీటో (Veto) అధికారం ఏది? (TS, SI 2019)

1) Suspensive Veto      2) Pocket Veto      

3) Absolute Veto           4) Qualified Veto

3. ఒక ప్రత్యేక పార్లమెంట్‌ చట్టం షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు వర్తిస్తుందా? లేదా? అని నిర్ణయించే అధికారం కిందివారిలో ఎవరికి ఉంటుంది? (TS, SI 2019)

1) కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖమంత్రి   

2) ప్రధానమంత్రి       3) రాష్ట్రపతి 

4) గవర్నర్‌

4. కిందివాటిలో సరికానిది ఏది? (TS, Constables, Prelims 2018)

1) భారత ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాల్లో ఏ విషయాన్ని అయినా గవర్నర్‌ సమ్మతితో రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించొచ్చు.

2) రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాల్లో ఏ విషయాన్ని అయినా కేంద్ర ప్రభుత్వ అనుమతితో గవర్నర్‌ బేషరతుగా రాష్ట్రానికి అప్పగించొచ్చు.

3) కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాల్లో ఏ విషయాన్ని అయినా గవర్నర్‌ అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించొచ్చు.

4) రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాల్లో ఏ విషయాన్ని అయినా కేంద్ర ప్రభుత్వ సమ్మతి ద్వారా గవర్నర్‌ షరతులతో అప్పగించవచ్చు.

5. కిందివాటిలో సరైనవి ఏవి? (TS, Constables 2016)

a) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తారు.

b) గ్రామసభ రాజ్యాంగ సంస్థ.

c) న్యాయశాఖ నుంచి కార్యనిర్వాహక శాఖను వేరుచేయడం ప్రభుత్వ రాజ్యతంత్రంలో ఒక ఆదేశ సూత్రం.

1) a, b                2) b, c

3) a, c                4) a, b, c

సమాధానాలు: 1 - 2     2 - 4     3 - 3     4 - 3     5 - 4

రచయిత

బంగారు సత్యనారాయణ

Posted Date : 28-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌