• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్రపతులు - ప్రత్యేకతలు

1. రాష్ట్రపతిగా డా. బాబూ రాజేంద్రప్రసాద్‌కు సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) ‘ఇండియా డివైడెడ్‌’ అనే గ్రంథాన్ని రాశారు.

బి) రాష్ట్రపతి పదవిని రెండుసార్లు చేపట్టారు.

సి) 1962లో ‘భారతరత్న’ పురస్కారాన్ని పొందారు.

డి) హిందీకి జాతీయ భాష హోదా కల్పించడానికి కృషి చేశారు.

జ‌: పైవన్నీ


2. కిందివారిలో 'UNESCO' ఛైర్మన్‌గా వ్యవహరించింది?

1) డా. బాబూ రాజేంద్రప్రసాద్‌    2)  సర్వేపల్లి రాధాకృష్ణన్‌

3) డా. ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం    4) డాక్టర్‌ శంకర్‌దయాళ్‌ శర్మ

జ‌: సర్వేపల్లి రాధాకృష్ణన్‌


3. వివిధ రాష్ట్రపతుల ఎన్నికల్లో వారి ప్రత్యర్థులకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ) డా. బాబూ రాజేంద్రప్రసాద్‌ - కె.టి.షా

బి) డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ - సి.హెచ్‌.హరిరాం

సి) డా. జాకీర్‌ హుస్సేన్‌ - కోకా సుబ్బారావు

డి) ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌ - టి.చతుర్వేది

జ‌:  పైవన్నీ


4. డా. జాకీర్‌ హుస్సేన్‌కు సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) మనదేశానికి తొలి ముస్లిం రాష్ట్రపతిగా వ్యవహరించారు.

బి) ‘భారతరత్న’ పురస్కారాన్ని పొందారు.

సి) పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి.

డి) ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించి, రాష్ట్రపతి పదవిని చేపట్టారు.

జ‌:  పైవన్నీ


5. రాష్ట్రపతి వి.వి.గిరికి సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?

ఎ) ఉపరాష్ట్రపతిగా, తాత్కాలిక రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా వ్యవహరించారు.

బి) 1969లో నీలం సంజీవరెడ్డిపై గెలిచి రాష్ట్రపతి పదవిని చేపట్టారు.

సి) లోక్‌సభకు స్పీకర్‌గా వ్యవహరించారు.

డి) తన ఎన్నికపై నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.

జ‌:  ఎ, బి, డి


6. నీలం సంజీవరెడ్డికి సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?

ఎ) ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి.

బి) ముఖ్యమంత్రిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన మొదటి వ్యక్తి.

సి) లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.

డి) 1977 నుంచి 1982 వరకు రాష్ట్రపతిగా వ్యవహరించారు.

జ‌:  పైవన్నీ


7. కిందివారిలో రాష్ట్రపతులుగా గెలిచి, వారి ప్రత్యర్థులుగా పోటీపడిన వారిలో సరికాని జత ఏది?

1) జ్ఞానీ జైల్‌ సింగ్‌ - హెచ్‌.ఆర్‌.ఖన్నా

2) ఆర్‌.వెంకట్రామన్‌ - వి.కృష్ణయ్యర్‌

3) శంకర్‌ దయాళ్‌ శర్మ - జి.జి.స్వెల్‌

4) కె.ఆర్‌.నారాయణన్‌ - భైరాన్‌సింగ్‌ షెకావత్‌

జ‌:  కె.ఆర్‌.నారాయణన్‌ - భైరాన్‌సింగ్‌ షెకావత్‌

 
8. విదేశాల్లో ‘రాయబారిగా’ పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టినవారికి సంబంధించి సరికానిది?

1) శంకర్‌దయాళ్‌ శర్మ        2) సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 

3) కె.ఆర్‌.నారాయణన్‌        4) ఆర్‌.వెంకట్రామన్‌

జ‌: ఆర్‌.వెంకట్రామన్‌


9. వివిధ రాష్ట్రపతులు వారి ప్రత్యేకతలకు సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) ప్రజల రాష్ట్రపతి - ఏపీజే అబ్దుల్‌కలాం

2) తాత్విక రాష్ట్రపతి - సర్వేపల్లి రాధాకృష్ణన్‌

3) రాజనీతిజ్ఞ రాష్ట్రపతి - శంకర్‌దయాళ్‌ శర్మ

4) పాకెట్‌ వీటో రాష్ట్రపతి - ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌

జ‌: పాకెట్‌ వీటో రాష్ట్రపతి - ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌


10. తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తూ 1977లో ఆర్టికల్‌ 356ను ప్రయోగించి 9 కాంగ్రెస్‌ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసింది ఎవరు?

జ‌:  బి.డి.జెట్టి      


11.  ‘My Presidential Years’, అనే గ్రంథంలో రాష్ట్రపతి పదవిని ‘Emergency Lamp’ గా అభివర్ణించింది ఎవరు?

జ‌:  ఆర్‌.వెంకట్రామన్‌  


12. రాష్ట్రపతి పదవిలో ఉండి, లోక్‌సభ ఎన్నికల్లో సాధారణ పౌరుడిలా ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్రపతి ఎవరు?

జ‌: కె.ఆర్‌.నారాయణన్‌ 

13. కిందివారిలో రాష్ట్రపతులుగా గెలిచిన వారు - వారి ప్రత్యర్థులకు సంబంధించి  సరికాని జత?

1) ప్రతిభా పాటిల్‌ - భైరాన్‌సింగ్‌ షెకావత్‌    2) ఏపీజే అబ్దుల్‌ కలాం - లక్ష్మీ సెహగల్‌

3) ప్రణబ్‌ ముఖర్జీ - పి.ఎ.సంగ్మా              4)  కె.ఆర్‌.నారాయణన్‌ - ఎన్‌.ఎన్‌.దాస్‌

జ‌: కె.ఆర్‌.నారాయణన్‌ - ఎన్‌.ఎన్‌.దాస్‌


14. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి సంబంధించి కిందదివాటిలో సరైనవి ఏవి?

ఎ) ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు.

బి) రాజ్యసభకు 5 సార్లు ఎన్నికయ్యారు.

సి) లోక్‌సభకు 2 సార్లు ఎన్నికయ్యారు.

డి) ఉపరాష్ట్రపతిగా వ్యవహరించారు.

జ‌: ఎ, బి, సి      


గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు


1. భారత రాష్ట్రపతుల్లో కార్మిక ఉద్యమాలు/ ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమాలతో సంబంధం ఉన్న వారిని గుర్తించండి. (ఏపీ, సబ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ 2012, 
టీఎస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ 2016)

జ‌:  వి.వి.గిరి  


2. కిందివారిలో వరుసగా రెండుసార్లు రాష్ట్రపతిగా విధులు నిర్వహించింది ఎవరు?  (సబ్‌ఇన్‌స్పెక్టర్స్, కమ్యూనికేషన్స్‌ 2013)

1) డా. రాజేంద్రప్రసాద్‌     2) డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌

3) డా. జాకీర్‌ హుస్సేన్‌    4) 1, 2

జ‌: డా. రాజేంద్రప్రసాద్‌


3. ఇప్పటివరకు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో అత్యధిక మెజార్జీతో గెలిచింది ఎవరు?   (ఏపీపీఎస్సీ, గ్రూప్‌ II 2017)

జ‌:  కె.ఆర్‌.నారాయణన్‌ 


4. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, తాత్కాలిక రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా పనిచేసింది ఎవరు? (ఏపీ, గ్రామ వార్డు సచివాలయాలు 2019)

జ‌:  మహ్మద్‌ హిదయతుల్లా   


5. భారత రాష్ట్రపతి పదవిలో ఉన్న వ్యక్తులు మరణించిన సందర్భాల్లో తాత్కాలిక రాష్ట్రపతులుగా వ్యవహరించిన వారిని గుర్తించండి. (ఏపీ, గ్రామ వార్డు సచివాలయాలు 2019)

జ‌:  వి.వి. గిరి, మహ్మద్‌ హిదయతుల్లా, బి.డి.జెట్టి

Posted Date : 30-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌