• facebook
  • whatsapp
  • telegram

ప్రధానమంత్రులు - ప్రత్యేకతలు

1. కింది వాటిలో రాజీవ్‌గాంధీకి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి.

ఎ) ‘‘బికారీ హఠావో’’ అనే నినాదం ఇచ్చారు.

బి) 1991, మే 21న ఎల్‌టీటీఈ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురయ్యారు.

సి) ఆఫ్రికా ఫండ్‌ను ఏర్పాటు చేశారు.

డి) విశ్వాస తీర్మానంలో ఓడిపోయి పదవిని కోల్పోయారు

1) ఎ, సి, డి        2) ఎ, బి, డి 

3) ఎ, బి, సి        4) పైవన్నీ

2. వి.పి.సింగ్‌కు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి.

ఎ) ఎన్నికల సంస్కరణల కోసం దినేశ్‌ గోస్వామి కమిటీని ఏర్పాటు చేశారు.

బి) అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ‘‘జనమోర్చా’’ అనే సంస్థను నెలకొల్పారు.

సి) 1989, డిసెంబరు 2 నుంచి 1990 నవంబరు 12 వరకు ప్రధానిగా వ్యవహరించారు.

డి) 1990లో ‘‘అంతర్‌రాష్ట్ర మండలి’’ని ఏర్పాటు చేశారు.

1) ఎ, సి, డి         2) ఎ, బి, సి

3) ఎ, బి, డి         4) పైవన్నీ

3. విశ్వాస తీర్మానంలో ఓడిపోయి పదవిని కోల్పోయిన మొదటి ప్రధాని ఎవరు?

1) చంద్రశేఖర్‌                2)  ఇందిరాగాంధీ

3) విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌       4) మొరార్జీ దేశాయ్‌

4. చంద్రశేఖర్‌కు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి.

ఎ) భారత్‌లో రాజకీయ పాదయాత్రలకు శ్రీకారం చుట్టారు.

బి) భారత రాజకీయాలలో ‘యంగ్‌టర్క్‌’గా పేరొందారు

సి) ఎర్రకోట నుంచి ప్రసంగం చేయని ఏకైక ప్రధాని.

డి) ఇతని పాలనా కాలంలోనే రాజీవ్‌గాంధీ హత్యకు గురయ్యారు

1 ఎ, బి, సి         2) ఎ, సి, డి 

3) ఎ, బి, డి         4) పైవన్నీ

5. 1992, డిసెంబరు 6న ఏ ప్రధాని కాలంలో బాబ్రీమసీద్‌ కూల్చివేత ఘటన చోటుచేసుకుంది?

1) చంద్రశేఖర్‌            2) విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌

3) పి.వి.నరసింహారావు   4) ఐ.కె.గుజ్రాల్‌

6. పి.వి. నరసింహారావుకి సంబంధించి సరైన అంశాలను గుర్తించండి.

ఎ) ఒకే పదవీ కాలంలో లోక్‌సభలో ఎనిమిదిసార్లు అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నారు.

బి) రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని పదవిని చేపట్టారు.

సి) దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.

డి) 1991లో నూతన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

1) ఎ, బి, సి         2) ఎ, సి, డి 

3) ఎ, బి, డి         4) పైవన్నీ 

7. పి.వి. నరసింహారావుకి సంబంధించి సరికానిది ఏది? 

1) 14 భాషల్లో ప్రావీణ్యం గలవారు.

2) ‘‘దేశ్‌ బచావో, దేశ్‌ బనావో’’ అనే నినాదం ఇచ్చారు.

3) భారత విదేశాంగ విధానంలో ్డల్న్నిఁ న్చి(్మ శ్నిఃi‘్వృ విధానాన్ని ప్రవేశపెట్టారు.

4) సంకీర్ణ ప్రభుత్వాన్ని అయిదేళ్లు పూర్తిగా నిర్వహించారు.

8. ‘‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్‌’’ అని ఎవరు నినదించారు?

1) పి.వి.నరసింహారావు               2) అటల్‌ బిహారీ వాజ్‌పేయి

3) విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌            4) చంద్రశేఖర్‌

9. హెచ్‌.డి. దేవెగౌడకు సంబంధించి సరికానిది?

1) రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని పదవిని నిర్వహించిన రెండో వ్యక్తి

2) యునైటెడ్‌ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు.

3) అమెరికాతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నారు.

4) కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.

10. ఐ.కె.గుజ్రాల్‌ ప్రధానిగా వ్యవహరించిన కాలం....

1) 1997 ఏప్రిల్‌ 21 నుంచి 1998 మార్చి 18

2) 1996 జనవరి 19 నుంచి 1998 డిసెంబరు 22

3) 1997 మార్చి 26 నుంచి 1998 నవంబరు 26

4) 1998 ఫిబ్రవరి 11 నుంచి 1998 నవంబరు 18

11. అటల్‌ బిహారీ వాజ్‌పేయికి సంబంధించి సరైనది ఏది? 

ఎ) 1996 మే 16న తొలిసారిగా ప్రధాని పదవిని చేపట్టారు.

బి) 1998లో పోఖ్రాన్‌లో అణుపరీక్షలకు ఆదేశాలిచ్చారు.

సి) పాకిస్థాన్‌తో స్నేహం కోసం ‘‘లాహోర్‌’’ బస్సు యాత్రను నిర్వహించారు.

డి) NDA (National Democratic Alliance) కు నాయకత్వం వహించారు.

1) ఎ, బి, సి         2) ఎ, సి, డి

3) ఎ, బి, డి         4) పైవన్నీ

12. భారత పార్లమెంటుపై ఉగ్రదాడి ఎప్పుడు జరిగింది?   (ఆ సమయంలో భారత ప్రధానిగా అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఉన్నారు)

1) 2001, డిసెంబరు 13      2) 2001, నవంబరు 26

3) 2002, అక్టోబరు 29        4) 2002, సెప్టెంబరు 18

13. అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ను ఏర్పాటు చేసింది?

1) రంగనాథ్‌ మిశ్రా       2) మదన్‌ మోహన్‌ పూంచీ

3) ఎం.ఎన్‌.వెంకటాచలయ్య     4) జె.ఎస్‌. వర్మ

14. డా.మన్మోహన్‌సింగ్‌ దేశ ప్రధానిగా పనిచేసిన కాలం...

1) 2004, మే 22 నుంచి 2009, మే 25

2) 2009, మే 25 నుంచి 2009, డిసెంబరు 31

3) 2009, మే 25 నుంచి 2014, మే 25

4) 1, 3

15. డా.మన్మోహన్‌సింగ్‌కు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి.

ఎ) రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని పదవిని చేపట్టారు

బి) ఒక పదవీ కాలంలో రెండుసార్లు అవిశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు.

సి) అమెరికాతో ్డ123ృ అనే పౌర అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.

డి) అమెరికా ప్రభుత్వం నుంచి ‘‘టెంపుల్‌టన్‌’’ పురస్కారాన్ని పొందారు

1) ఎ, బి, సి         2) ఎ, సి, డి 

3) ఎ, బి, డి         4) పైవన్నీ

16. డా.మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వ కాలంలో రూపొందించిన చట్టాలకు సంబంధించి సరైనది ఏది?

ఎ) జాతీయ సమాచార హక్కు చట్టం, 2005

బి) గృహహింస నిరోధక చట్టం, 2005

సి) జాతీయ ఆహార భద్రతా చట్టం, 2013

డి) నిర్భయ చట్టం, 2013

1) ఎ, సి, డి         2) ఎ, బి, డి

3) ఎ, బి, సి          4) పైవన్నీ

17. మైనార్టీల సంక్షేమం కోసం అధ్యయనం చేసేందుకు డా.మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది?

1) మదన్‌ మోహన్‌ పూంచీ       2) రాజేంద్ర సచార్‌

3) ఎం.ఎన్‌.వెంకటాచలయ్య       4) జె.ఎస్‌.వర్మ

18. డా.మన్మోహన్‌సింగ్‌కు సంబంధించి సరైనది ఏది?

ఎ) మైనార్టీ సంక్షేమం కోసం 15 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు.

బి) 2009లో ‘‘వృద్ధుల సంరక్షణ చట్టాన్ని’’ రూపొందించారు.

సి) 2009లో ‘‘ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు’’ చట్టాన్ని రూపొందించారు.

డి) UPA (United Progressive Alliance) కూటమికి నేతృత్వం వహించారు.

1) ఎ, బి, సి         2) ఎ, సి, డి

3) ఎ, బి, డి         4) పైవన్నీ

19. పార్లమెంటులో సభ్యత్వం లేకుండానే ప్రధాని పదవిని చేపట్టిన వారెవరు?

1) డా.మన్మోహన్‌సింగ్‌

2) పి.వి.నరసింహారావు, హెచ్‌.డి. దేవెగౌడ

3) ఐ.కె. గుజ్రాల్, హెచ్‌.డి. దేవెగౌడ

4) చంద్రశేఖర్, వి.పి. సింగ్‌

20. 16వ లోక్‌సభ ఎన్నికల అనంతరం ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ తొలిసారి ఎప్పుడు బాధ్యతలు చేపట్టారు?

1) 2014, మే 26        2) 2014, జూన్‌ 18

3) 2015, మే 16       4) 2015, జులై 25

21. రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఎవరి నేతృత్వంలో ్డరీ-్న్రః’్ట్ణ’ ద్న్ఝ్ఝిi((i్న-ృ ను ఏర్పాటు చేసింది?

1) పి.కె. తుంగన్‌           2) శ్యాంపి ట్రోడా

3) నళినీ రంజన్‌ మిశ్రా       4) అతుల్‌ ముఖర్జీ 

22. వయోజనులైన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడానికి రాజీవ్‌గాంధీ ప్రభుత్వ కాలంలో చేపట్టిన కార్యక్రమం ఏది?

1) ఆపరేషన్‌ బ్లాక్‌బోర్డు   

2) ఆపరేషన్‌ జ్యోతి

3) నేషనల్‌ లిటరసీ మిషన్‌ 

4) నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ 

23. విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జాతీయ ఎస్సీ, ఎస్టీకు రాజ్యాంగ హోదా కల్పించింది?

1) 65 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1990

2) 66 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1990

3) 67 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1990

4) 68 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1990

సమాధానాలు   

1 - 3     2 - 4     3 - 3     4 - 4     5 - 3     6 - 2     7 - 4     8 - 2     9 - 3     10 - 1     11 - 4     12 - 1     13 - 3     14 - 4     15 - 1     16 - 4     17 - 2     18 - 4     19 - 2     20 - 1     21 - 2     22 - 3     23 - 1

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు

1. భారత ప్రధానమంత్రి తన నియామకం సమయంలో...  (Civils 2012)

1) పార్లమెంటు ఉభయ సభల్లో ఏదో ఒకదానిలో తప్పనిసరిగా సభ్యుడై ఉండనవసరం లేదు. కానీ 6 నెలల లోపల ఏదో ఒకసభలో సభ్యుడు కావాలి.

2) పార్లమెంటు ఉభయ సభల్లో ఏదో ఒకదానిలో తప్పనిసరిగా సభ్యుడై ఉండనవసరం లేదు. కానీ 6 నెలల లోపల లోక్‌సభలో సభ్యుడై ఉండాలి.

3) పార్లమెంటు ఉభయ సభల్లో దేనిలోనైనా సభ్యుడై ఉండాలి.

4) లోక్‌సభలో సభ్యుడై ఉండాలి.

2. విశ్వాస తీర్మానం వీగిపోయి అధికారం నుంచి తొలగిపోయిన తొలి ప్రధాని? (Group II 2012)

1) వి.పి.సింగ్‌          2) చంద్రశేఖర్‌

3) దేవెగౌడ            4) చరణ్‌సింగ్‌

3. 1984, అక్టోబరు 31 నుంచి 1989 డిసెంబరు వరకు భారత ప్రధానమంత్రిగా ఉన్నది ఎవరు? (Hostel Welfare Officer 2012)

1) పి.వి.నరసింహారావు   2) ఇందిరాగాంధీ

3) రాజీవ్‌గాంధీ        4) విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌

4. భారతదేశానికి మొదటి ఉప ప్రధానమంత్రి? (Asst. Social Welfare Officers 2012)

1) మొరార్జీ దేశాయ్‌        2) జగ్జీవన్‌రామ్‌

3) జి.బి. పంత్‌           4) వల్లభాయ్‌ పటేల్‌

5. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ రాజ్యసభలో ఏ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించారు? (Asst. Motor Vehicle Inspector 2013)

1) అసోం              2)  నాగాలాండ్‌

3) త్రిపుర               4) గుజరాత్‌

6. మన దేశ మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు జీవిత చరిత్ర తెలుగులో ఏ పేరుతో ప్రచురితమైంది? (Ts, AEES 2015)

1) లోపలి మనిషి         2) వెలుపలి మనిషి

3) మంచి మనిషి         4) మనిషిలో మనిషి

7. ‘‘స్వర్ణ చతుర్భుజి’’కి పునాది వేసిన భారతదేశ ప్రధానమంత్రి ఎవరు? (AP, Constables 2018)

1) జవహర్‌లాల్‌ నెహ్రూ               2) ఇందిరాగాంధీ

3) అటల్‌ బిహారి వాజ్‌పేయి         4) లాల్‌బహదూర్‌ శాస్త్రి

8. కింది వాక్యాల్లో సరికానిది ఏది? (TS, Constables 2016)

1) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మొదటి ప్రధాని - జవహర్‌లాల్‌ నెహ్రూ

2) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మొదటి ప్రధాని - డా.మన్మోహన్‌సింగ్‌

3) కేంద్ర బడ్జెట్‌పై తుదినిర్ణయం లోక్‌సభదే

4) రాయితీలు అభివృద్ధేతర వ్యయంలో భాగం.

9. ఏ ప్రధానమంత్రి కాలంలో పంచాయతీలకు రాజ్యాంగ హోదా కల్పించారు? (Group II 2012)

1) రాజీవ్‌గాంధీ         2) చంద్రశేఖర్‌

3) వి.పి.సింగ్‌            4) పి.వి.నరసింహారావు

10. పి.వి. నరసింహారావు ప్రధానమంత్రిగా పనిచేసిన కాలం? (aee'S 2006)

1) 1991-1996         2) 1992-1996

3) 1990-1996         4) 1989-1994

11. భారత ప్రధానిని ఏ దేశ ప్రధానితో పోల్చవచ్చు?

1) రష్యా              2) ఫ్రాన్స్‌   

3) ఇంగ్లండ్‌           4) స్వీడన్‌

12. నెహ్రూ 1946లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు గృహ మంత్రి ఎవరు?

1) సర్దార్‌ పటేల్‌         2) బల్‌దేవ్‌సింగ్‌

3) మహ్మద్‌ అలీ జిన్నా      4) లియాకత్‌ అలీఖాన్‌

సమాధానాలు

11     21     33     44     51     61     73     82     94     101     113     121 

Posted Date : 07-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌