• facebook
  • whatsapp
  • telegram

నిష్పత్తులు

మాదిరి సమస్యలు


1. ఒక సంచిలో రూ.10, రూ.50 నోట్లు 12 ఉన్నాయి. రూ.10, రూ.50 నోట్ల సంఖ్య నిష్పత్తి 1 : 2. అయితే ఆ సంచిలోని మొత్తం సొమ్ము ఎంత? (రూపాయల్లో)

1 ) 420       2 ) 440       3 ) 460       4 ) 480

సాధన: సంచిలోని రూ.10, రూ.50 నోట్ల నిష్పత్తి = 1 : 2

రూ.10 నోట్ల సంఖ్య = 1x అనుకోండి

రూ.50 నోట్ల సంఖ్య = 2x అనుకోండి

లెక్క ప్రకారం1x + 2x = 12

 3x = 1

  x= 4

సంచిలోని మొత్తం సొమ్ము = (1 × 4)10 + (2 × 4)50 = (4)10 + (8)50 = 40 + 400 = 440

సమాధానం: 2
 


2. ఒక సంచిలో రూ.1, 50 పై., 25 పై. నాణేలు 420 ఉన్నాయి. వాటి విలువల నిష్పత్తి 2 : 3 : 5. అయితే ఆ సంచిలో రూ.1 నాణేలు ఎన్ని ఉన్నాయి?

1 ) 60       2 ) 45       3 ) 30       4 ) 90

సాధన: సంచిలోని రూ.1, 50 పై., 25 పై. నాణేల విలువల నిష్పత్తి = 2 : 3 : 5

సంచిలోని రూ.1, 50 పై., 25 పై. నాణేల విలువలు వరుసగా 2x, 3x, 5x  అనుకోండి.

సంచిలోని రూ.1 నాణేల సంఖ్య =2x

సంచిలోని 50 పై. నాణేల సంఖ్య = 3x × 2 = 6x 

సంచిలోని 25 పై. నాణేల సంఖ్య =  5x × 4  =20x

లెక్క ప్రకారం, 2x + 6x + 20x = 420

28x = 420

రూ.1 నాణేల సంఖ్య = 2x = 2 × 15 = 30

సమాధానం: 3
 



3. ఒక సంచిలో 50 పై., 25 పై., 10 పై. నాణేలు 560 ఉన్నాయి. వాటి విలువల నిష్పత్తి 13 : 11 : 7. అయితే ఆ సంచిలోని 25 పై. నాణేల సంఖ్య?

1 ) 187     2 ) 198     3 ) 252     4 ) 176

సాధన: సంచిలో 50 పై., 25 పై., 10 పై. నాణేల విలువల నిష్పత్తి = 13 : 11 : 7

50 పై., 25 పై., 10 పై. నాణేల సంఖ్యల నిష్పత్తి 

= 13 × 2 : 11 × 4 : 7 × 10

= 13 : 22 : 35

సంచిలోని 25 పై. నాణేల సంఖ్య = 


          

 సమాధానం:



4. ఒక సంచిలో రూ.1, రూ.2, రూ.5 నాణేలు 4 : 5 : 8 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ సంచిలోని నాణేల సంఖ్య 221. అయితే సంచిలో రూ.2 నాణేలు ఎన్ని ఉన్నాయి?

1 ) 65       2 ) 52       3 ) 104       4 ) 45 

సాధన: రూ.1, రూ.2, రూ.5 నాణేల నిష్పత్తి = 4 : 5 : 8.

సంచిలోని రూ.1, రూ.2, రూ.5 నాణేల సంఖ్య వరుసగా 4x, 5x, 8xఅనుకోండి. 

4x + 5x + 8x = 221   

17x = 22

రూ.2 నాణేల సంఖ్య = 5x = 5 × 13 = 65 

సమాధానం: 1



5. ఒక సంచిలో రూ.1, రూ.2, రూ.5 నాణేలు 4 : 5 : 8 నిష్పత్తిలో ఉన్నాయి. నాణేల విలువ రూ.216. అయితే ఆ సంచిలో రూ.2 నాణేలు ఎన్ని ఉన్నాయి?

1 ) 16    2 ) 20    3 ) 25    4 ) 30 

సాధన: సంచిలోని రూ.1, రూ.2, రూ.5 నాణేల నిష్పత్తి = 4 : 5 : 8

రూ.1, రూ.2, రూ.5 నాణేల సంఖ్య వరుసగా   4x, 5x, 8x అనుకోండి.

లెక్కప్రకారం, 4x × 1 + 5x × 2 + 8x × 5 = 216 4x + 10x + 40x = 216 

54x = 216 

రూ.2 నాణేల సంఖ్య =  5x 

= 5 × 4 = 20

సమాధానం: 2



 

6. ఒక సంచిలో రూ.2, రూ.5, రూ.10 నాణేలు 4 : 3 : 1 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి విలువ రూ.660. అయితే ఆ సంచిలో రూ.5 నాణేలు ఎన్ని ఉన్నాయి? 

1 ) 40       2 ) 50       3 ) 60       4 ) 75 

సాధన: రూ.2, రూ.5, రూ.10 నాణేల సంఖ్యల నిష్పత్తి = 4 : 3 : 1 రూ.2, రూ.5, రూ.10 నాణేల సంఖ్య వరుసగా 4x, 3x, 1x  అనుకోండి. 

లెక్కప్రకారం 4x × 2 + 3x × 5 + 1x × 10 =  రూ.660 

8x + 15x + 10x = రూ.660 

 రూ.5 నాణేల సంఖ్య =3x 

  = 3 × 20 = 60       

సమాధానం: 3




7. తేజ వద్ద రూ.1180 విలువైన సొమ్ము రూ.50, రూ.20, రూ.10 నోట్ల రూపంలో ఉన్నాయి. రూ.50, రూ.20 నోట్లకు మధ్య నిష్పత్తి 3 : 5. తేజ వద్ద ఉన్న మొత్తం నోట్ల సంఖ్య 50 అనుకుంటే, వాటిలో ఎన్ని రూ.10 నోట్లు ఉంటాయి? 

1) 9       2) 12       3) 15      4) 18

సాధన: రూ.50, రూ.20 నోట్ల సంఖ్యల నిష్పత్తి = 3 : 5

రూ.50, రూ.20 నోట్ల సంఖ్య వరుసగా 3x, 5x  అనుకోండి.

రూ.10 నోట్ల సంఖ్య = 50 − (3x + 5x) 
= 50 − 8x

లెక్క ప్రకారం   3x × 50 + 5x × 20 + (50 − 8x) × 10 = 1180 

150x + 100x + 500 − 80x = 1180

170x = 1180 − 500 = 680 

రూ.10 నోట్ల సంఖ్య = 50 − 8x = 50 − 8 × 4 = 50 − 32 = 18 

సమాధానం: 4



 

8. ఒక సంచిలో రూ.2 నాణేల సంఖ్య రూ.5 నాణేల సంఖ్యకు   5/2 రెట్లు. సంచిలోని మొత్తం నాణేల విలువ రూ.240. అయితే అందులోని రూ.5 నాణేల సంఖ్య....

1) 12       2) 24       3) 36       4) 48

సాధన: రూ.2 నాణేల సంఖ్య = రూ.5 నాణేల సంఖ్యకు 5/2 రెట్లు
సంచిలోని రూ.5 నాణేల సంఖ్య = x అనుకోండి.

సంచిలోని రూ.2 నాణేల సంఖ్య = 5/2xలెక్క ప్రకారం,

5x + 5x = 240  

10x = 240


రూ.5 నాణేల సంఖ్య: 24

సమాధానం: 2

 


 

Posted Date : 07-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌