• facebook
  • whatsapp
  • telegram

రోబోటిక్స్

* రోబోట్ అనేది ఒక యంత్రం. ఇది మానవుడిని ఆశ్చర్యపరిచే విధంగా ఇచ్చిన పనిని చక్కగా నిర్వర్తిస్తుంది.


రోబోట్‌లో 3 ర‌కాలైన‌ తరాలు ఉన్నాయి

1) మొదటి తరం (సాధారణ రోబోట్‌లు)
* వీటిని చెవిటి, మూగ, గుడ్డి రోబోట్‌లు అంటారు.
* ఇవి మమూలు యంత్రాలను కలిగి ఉండి చెప్పిన పనిని సక్రమంగా పూర్తి చేస్తాయి.
వీటిని ఆటోమొబైల్ పరిశ్రమలో వెల్డింగ్, స్ప్రే చేయడంలో ఉపయోగిస్తారు.
* వీటికి గ్రహణ శక్తి లేదు. ఏదైనా తప్పు ఉంటే దాన్ని ఎలా పరిష్కరించాలో తెలియదు.
వస్తు పరికరాల అమరికలో తప్పు ఉంటే ఈ తరహా రోబోట్‌లు గమనించకుండా పనిచేసుకుంటూనే ఉంటాయి.
రెండో తరం రోబోట్‌లు
* మొదటి తరం కంటే వీటికి జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. ఇవి సాధారణంగా కంప్యూటరీకరించి ఉంటాయి.
* వీటికి 4º -  6º స్వేచ్ఛ ఉండి, తమ కదలికల్లో నియంత్రణ కలిగి ఉంటాయి.
మూడో తరం రోబోట్‌లు
* ఇవి చాలా సంక్లిష్ట రూపాన్ని కలిగి ఉంటాయి. వస్తువును చూడగలవు, స్పర్శించగలవు.
* సెన్సార్లు పంచిన సమాచారం ఆధారంగా నిర్ణయాలు చేయగలిగే శక్తిని కలిగి ఉంటాయి.
ఉదా: 1985లో ఎయిర్ ఇండియా జంబోజెట్ విమానం కనిష్క కూలినప్పుడు ఈ రోబోట్ల సహాయంతోనే బ్లాక్ బాక్స్‌ను సముద్రం నుంచి వెలికితీశారు.


రోబోటిక్స్ - ఉపయోగాలు

1) పరిశ్రమలు:
* రోబోట్‌లను పరిశ్రమల్లో  డ్రిల్లింగ్ చేయడం, పరికరాలను వాడటం, విడిభాగాలను లోడ్ చేయడం.
* పెయింట్ స్ప్రే చేయడం, వెల్డింగ్ చేయడం, పరికరాలను అసెంబుల్ చేయడం, వస్తువులను పరిశీలించడంలో ఉపయోగిస్తారు.
* భవిష్యత్తులో రక్షణ రంగంలో మానవుడు లేని ట్యాంకుల నిర్వహణలో రోబోట్‌లను వినియోగించనున్నారు.
* వైద్య రంగంలో శస్త్ర చికిత్స, నర్సింగ్‌కేర్‌లో ఉపయోగించే పైపుల్లో వచ్చే చీలికలను గుర్తించడానికి ఉపయోగిస్తారు. మైక్రో సర్జరీలలో ఇప్పటికే రోబోట్‌లను ఉపయోగిస్తున్నారు.
* గనుల్లో 24 గంటలు నడిచే యంత్రాలతోపాటు రోబోట్లను ఉపయోగించి విలవైన వనరులను సమర్థంగా వెలికితీస్తున్నారు.
సముద్ర గర్భంలో, అంతరిక్ష పరిశోధనా విభాగంలో, అణువిద్యుత్ కేంద్రాల్లో విస్ఫోటక పదర్థాలను గుర్తించడానికి; ఎయిర్‌పోర్ట్‌ల‌లో బాంబులను క‌నుక్కోవ‌డం, తొలగించడంలో; రసాయనశాలలో ప్రయోగాత్మక పనుల్లో ఉపయోగిస్తున్నారు.


రోబోటిక్ టెక్నాలజీ - భారతదేశం
* భారత్‌లోని ఐఐటీలలో, బెంగళూరు ఐఐఎస్సీ, జాదవ్‌పూర్ యూనివర్సిటీలలో రోబోటిక్ ప్రయోగశాలలు ఉన్నాయి.
ముంబయిలోని బాబా అణువిద్యుత్ పరిశోదనా కేంద్రం (BARC) న్యూక్లియర్ వ్యర్థాలను తొలగించడానికి రోబోట్‌లను లను ఉపయోగిస్తుంది.
టెల్కోలో స్పాట్ వెల్డింగ్ చేయడానికి, KIRLOSKARలో మోటార్లను అసెంబుల్ చేయడంలో, మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్‌లో స్ప్రే చేయడంలో ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
DRDO, DAC, HMT, IIT లు రోబోట్‌లను తయారు చేస్తున్నాయి.
బెంగళూరులోని 'సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్'(CAIR) సెన్సర్‌లను కలిగి ఉన్న వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మార్చే సామర్థ్యం ఉన్న చాతూ రోబోట్ (CHATOO ROBOT), నిపుణ (NIPUNA) రోబోట్‌లను తయారు చేసింది.


రోబోటిక్స్
* 1942లో ఇసాక్ అసిమోల్ రోబోటిక్స్‌కు సబంధించిన మూడు నియమాలను ప్రతిపాదించారు.
* 1948లో నోబెర్ట్ వైనర్ సైబర్ నెటిక్స్ అనే రోబోటిక్స్ ప్రాథమిక సూత్రాలను ప్రతిపాదించారు.
*  ఫుల్లీ అటానమస్ రోబోట్ 20వ శతాబ్దం ద్వితీయార్థంలో వచ్చింది.
*  మొదటి రోబోట్‌ను 1961లో తయారు చేశారు.

Posted Date : 31-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌