• facebook
  • whatsapp
  • telegram

సంధులు

1. వ్యాకరణ పరిభాషలో గుణాలు అని వేటిని అంటారు?

జ: ఏ-ఓ-అర్‌      


2. ‘మహాత్ముడు’ను విడదీస్తే ఏర్పడే రూపం?

జ: మహా + ఆత్ముడు

3. ‘ఒక + ఒక = ఒకానొక’ ఇందులో జరిగిన సంధి ఏది?

జ:  అత్త్వ సంధి


4. ‘ఉండునంత’ను విడదీస్తే వచ్చే రూపం...

జ:  ఉండు + అంత     


5. ‘జగన్మాత’లోని సంధి ఏది.....

జ: అనునాసిక సంధి   


6. ‘లేలెమ్ము’ను విడదీస్తే ఏర్పడే రూపం....

జ: లెమ్ము + లెమ్ము


7. అత్తునకు సంధి?

జ: బహుళం      


8. ‘అప్పటికే’ను విడదీస్తే ఏర్పడే రూపం....

జ:  అప్పటికిన్‌ + ఏ  


9. ఆ-ఈ-ఏ అనే సర్వనామాలను ఏమంటారు?

జ: త్రికములు


10. ‘గుర్వాజ్ఞ’లోని సంధి ఏది?

జ:  యణాదేశ సంధి   


11. కిందివాటిలో భిన్నమైన సంధి ఏది?

1)  సవర్ణ దీర్ఘ సంది   2) గుణ సంధి  3) యణాదేశ సంధి   4) వృద్ధి సంధి

జ: యణాదేశ సంధి

12. ‘విద్యాలయం’ విసంధి రూపం....

జ: విద్యా + ఆలయం  


13. సంధి తప్పకుండా జరగడాన్ని వ్యాకరణ పరిభాషలో ఏమంటారు?

జ:  నిత్యం


14. ‘వచ్చాడతను’ అనే పదంలోని పూర్వ, పర స్వరాలు....

జ:  ఉ + అ


15. ‘పంకిలమౌను’ అనే పదాన్ని విడదీస్తే ఏర్పడే రూపం....

జ:  పంకిలము + ఔను 


16. ‘ధనమే’ పదంలోని సంధి ఏది?

జ: ఉత్త్వ సంధి


17. ‘కూరగాయలు’లో ‘క’కు బదులు ‘గ’ రావడం....

జ:  ఆదేశం 


18. ‘ఎవరిష్టం’లోని సంధి పదాలు....

జ:  ఎవరి, ఇష్టం


19. ‘మాయిల్లు’ అనే పదంలో సంధి జరిగిన తీరు.....

జ:  నిషేధం  


20. కిందివాటిలో యడాగమం లేని పదాన్ని గుర్తించండి.

1)  వచ్చి యిచ్చినా       2) మా యూరు 

3) అతడు యముడు     4) మాయక యున్న

జ: అతడు యముడు


21. ‘తానేమీ’ అనే పదాన్ని విడదీస్తే ఏర్పడే రూపం.....

 జ: తాను + ఏమీ  


22. ‘గుణౌద్ధత్యం’ అనే పదాన్ని విడదీస్తే ఏర్పడే రూపం.....

జ: గుణ + ఔద్ధత్యం

23. కిందివాటిలో వృద్ధి సంధికి ఉదాహరణ? 

1) నీయెడ      2) రసైకస్థితి 

3) దుశ్చరితం       4) భారతాంబ

జ: రసైకస్థితి 

24. జీత భత్యాలు బావుండే పనినే అందరూ కోరుకుంటారు. ‘భత్యాలు’ పదాన్ని విడదీస్తే వచ్చే రూపం.....

జ: భత్యము + లు  


25. ఈ ప్రకృతి అత్యంత రమణీయం. ‘అత్యంత’ పదంలోని సంధి పేరు....

జ:  యణాదేశ సంధి


26. అందు చూడాకర్ణుడను పరివ్రాజకుడు గలడు. ‘చూడాకర్ణుడను’ పదాన్ని ఎలా విడదీయాలి?

జ:  చూడాకర్ణుడు + అను 


27. ‘అమ్మగారింట్లో’ సంధి ఏది?

జ: ఇత్త్వ సంధి


28. ‘చరణాభివాదనం’ను విడదీస్తే వచ్చే రూపం?

జ:  చరణ + అభివాదనం

మాదిరి ప్రశ్న‌లు

1. ‘ప్రళయాబ్ధి’లోని సంధి ఏది? 
1) సవర్ణదీర్ఘ సంధి      2) గుణ సంధి     3) యణాదేశ సంధి     4) వృద్ధి సంధి


2. ‘వాడెక్కడ’ అనే పదాన్ని ఎలా విడదీయాలి?
1) వాడె + ఎక్కడ     2) వాడు + ఎక్కడ     3) వాడున్‌ + ఎక్కడ     4) వా + డెక్కడ


3. రెండు పదాల కలయికను ఏమంటారు?
1) సంధి     2) సమాసం      3) విగ్రహ వాక్యం     4) సంయుక్త పదం


4. సంధి జరిగే పదాల మధ్య ‘య్‌’ అదనంగా వస్తే అది?
1) యుగం     2) యగాగమం     3) యాగమం     4) యడాగమం


5. సంధి జరగవచ్చు, సంధి జరగకపోవచ్చు - ఈ స్థితిని ఏమంటారు?     
1) వ్యవస్థిత విభాష     2) విభాష     3) వైకల్పికం     4) బహుళం


6. ‘మేలది’ అనే పదంలోని సంధి?
1) అత్వసంధి     2) ఉత్వసంధి     3) ఇత్వసంధి     4) ఆమ్రేడిత సంధి


7. సర్వేశ్వరా అనే పదాన్ని సర్వ + ఈశ్వరా అని విడదీస్తాం కదా, అయితే ‘ఏ’ అనే అచ్చు వేటి స్థానంలో ఏకాదేశంగా వచ్చింది?
1) అ స్థానంలో     2) ఈ స్థానంలో     3) అ-ఈ స్థానంలో     4) అ-ఉ స్థానంలో


8. ‘టుగాగమ సంధి’ ఏ రకమైన సంధి?
1) ఆగమ సంధి     2) ఆదేశ సంధి     3) ఆగమాదేశ సంధి     4) వైకల్పిక సంధి 


9. నిత్య నిషేధ వైకల్పిక అన్యవిధాలకు ఏమని పేరు?
1) నిపాతము     2) వ్యవస్థిత విభాష     3) క్వచిత్ప్రవృత్తి     4) బహుళం


10. య, వ, ర లకు వ్యాకరణ పరిభాషలో ఏమని పేరు? 
1) సవర్ణములు     2) గుణములు     3) యణ్ణులు     4) జశ్శులు


11. పేదరాలు అనే పదంలో ఆగమంగా వచ్చిన వర్ణం ఏది? 
1) రు     2) ర     3) రా     4) ర్‌


12. ‘దశార్ణము’లోని సంధి ఏది? 
1) సవర్ణదీర్ఘ సంధి     2) గుణ సంధి     3) వృద్ధి సంధి     4) యణాదేశ సంధి


13. ‘ఏమైంది’ - విసంధి రూపాన్ని గుర్తించండి.
1) ఏమి + అయింది     2) ఏమి + ఐంది     3) ఏము + అయింది     4) ఏమ్‌ + అయింది


14. ‘త్రికము’ అని వేటిని అంటారు? 
1) ఆ, ఈ, ఏ     2) అ, ఇ, ఎ     3) ఏ, ఓ, ఆర్‌      4) ఇ, టి, తి


15. ‘అధిపురాలు’ను విడదీయగా ఏర్పడిన రూపం? 
1) అధిపు + రాలు     2) అధిపు + ఆలు     3) అధిప + ఆలు     4) అధిప + రాలు


16.  పేరు, చిగురు, పొదరు ....... లాంటి వాటిని వ్యాకరణ పరిభాషలో ఏమంటారు? 
1) ఆగమాదులు     2) ఆదేశాదులు     3) పేర్వాదులు     4) అందర్వాదులు


17. కిందివాటిలో ఆదేశ సంధి ఏది? 
1) సవర్ణదీర్ఘ సంధి     2) గుణ సంధి     3) వృద్ధి సంధి     4) యణాదేశ సంధి


18. ‘కఱకుటమ్ము’లో ఆగమంగా వచ్చిన వర్ణం? 
1) టు     2) ట్‌     3) ట     4) ఱ


19. ‘తగంజెప్ప’లోని సంధి ఏది? 
1) సరళాదేశ సంధి     2) గసడదవాదేశ సంధి     3) ప్రాతాధి సంధి     4) నుగాగమ సంధి


20. ‘యడాగమ సంధి’లో వచ్చే వర్ణం? 
1) య     2) యట్‌     3) య్‌     4) యడ


21. నా స్నేహితుని కేలఁదట్టగానే ఉలికిపడ్డాడు. (గీత గీసిన పదాన్ని విడదీయండి) 
1) కేల + దట్టగానే     2) కేలన్‌ + తట్టగానే     3) కేలన్‌ + దట్టగానే     4) కేల + తట్టగానే


22. ‘జగజ్జనని’ పదాన్ని విడదీయగా ఏర్పడే రూపం? 
1) జగ + జనని     2) జగన్‌ + జనని     3) జగత్‌ + జనని     4) జగత్‌ + జ్జనని


23. ‘మాయిల్లు’ ఏ సంధి? 
1) అత్వసంధి     2) ఇత్వసంధి     3) ఉత్వసంధి     4) యడాగమ సంధి


24. ‘ముత్తైదువ’ విసంధి రూపం? 
1) ముత్త + ఐదువ     2) ముత్తు + ఐదువ     3) ముత్త + అయిదువ     4) ముత్తు + అయిదువ


25. ‘రుగాగమ సంధి’ ఏ సమాసంలో జరుగుతుంది? 
1) కర్మధారయ సమాసం     2) ద్విగు సమాసం     3) ద్వంద్వ సమాసం     4) బహువ్రీహి సమాసం


26. కిందివాటిలో ఆగమ సంధి కానిది? 
1) టుగాగమ సంధి      2) దుగాగమ సంధి      3) రుగాగమ సంధి      4) పుంప్వాదేశ సంధి


27. ‘పూఁదోట’లోని సంధి?  
1) ప్రాతాధి సంధి      2) పుంప్వాదేశ సంధి      3) నుగాగమ సంధి      4) దుగాగమ సంధి


28. కర్మధారయము నందు ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు టుగాగమంబగు అనేది ఏ సంధి సూత్రం? 
1) కర్మధారయ సంధి      2) పుంప్వాదేశ సంధి      3) లులనల సంధి      4) టుగాగమ సంధి


29. ‘అతి + ఆదరము’ను కలపగా అత్యాదరము ఏర్పడుతుంది. అయితే ‘య’ ఏ స్థానంలో వచ్చింది? 
1) ఆస్థానం      2) అస్థానం      3) ఇస్థానం      4) ఈస్థానం


30. ‘పుట్టినిల్లు’లోని సంధి ఏది? 
1) అత్వసంధి      2) ఇత్వసంధి      3) ఉత్వసంధి      4) నుగాగమ సంధి


31. ‘మించకుండు’ అనే పదం విసంధి రూపం? 
1) మించకున్‌ + ఉండు      2) మించక + ఉండు     3) మించకు + ఉండు        4) మించకన్‌ + ఉండు


32. ‘సరియైన’ అనే పదాన్ని ఎలా విడదీయాలి? 
1) సరి + అయైన      2) సరి + యైన      3) సరి + ఐన      4) సరి + అయిన

సమాధానాలు

1-1; 2-2; 3-1; 4-4; 5-3; 6-2; 7-3; 8-1; 9-4; 10-3; 11-4; 12-3; 13-2; 14-1; 15-3; 16-3; 17-4; 18-2; 19-1; 20-3; 21-2; 22-3; 23-4; 24-1; 25-1; 26-4; 27-1; 28-4; 29-3; 30-1; 31-2; 32-3.

రచయిత: సూరె శ్రీనివాసులు

Posted Date : 09-04-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌