1. ధ్వని విషయంలో సరైనవి ఏవి?
A) ధ్వని కాంతి తరంగాల లక్షణాలను కలిగి ఉంటుంది. B) ధ్వని ఉత్పత్తి, ప్రసారానికి కారణం కంపనాలు.
C) ధ్వని శక్తి స్వరూపం. D) ధ్వని విద్యుదయస్కాంత తరంగం.
1) A, C, D 2) B, C, D 3) B, C 4) A, B, C
2. గాలిలో ప్రయాణించే ధ్వని వేగం, యానకం ఏ లక్షణాలపై ఆధారపడి ఉంటుంది?
1) సాంద్రత 2) ఉష్ణోగ్రత
3) పీడనం 4) 1, 2
3. ఉరుము ఉరిమిన తర్వాత కొద్దిసేపు ఆ ధ్వని వినపడుతూనే ఉండటానికి కారణం?
1) ప్రతిధ్వని 2) ప్రతినాదం 3) విస్పందనాలు 4) పైవన్నీ
4. ధ్వని వేగం దేనిలో అధికం?
1) ఇనుము 2) నీరు 3) గాలి 4) శూన్యం
5. గాలిలో ధ్వని తరంగాలు ఏ రకానికి చెందినవి?
1) విద్యుదయస్కాంత అనుదైర్ఘ్య తరంగాలు
2) యాంత్రిక తిర్యక్ తరంగాలు
3) విద్యుదయస్కాంత తిర్యక్ తరంగాలు
4) యాంత్రిక అనుదైర్ఘ్య తరంగాలు
6. మెరుపు మెరిసిన కొంత సమయానికి ఉరుము వినిపించడానికి కారణం?
1) ధ్వని వేగం, కాంతి వేగం కంటే చాలా తక్కువ.
2) మెరుపు మెరిసిన కొంత కాలానికి ఉరుము ఉత్పత్తి అవుతుంది.
3) శూన్యంలో ధ్వని ప్రయాణించకపోవడం.
4) పైవన్నీ
7. చంద్రుడిపై ధ్వనివేగం?
1) శూన్యం 2) 330 మీటర్/సెకన్ 3) 108 మీటర్/సెకన్ 4)అత్యధికం
8. స్థిర తరంగాలు...
1) సాగదీసిన తీగలో ఏర్పర్చవచ్చు 2) ఆర్గాన్ గొట్టాల్లో ఉత్పత్తి అవుతాయి
3) స్థిరంగా ఉంటాయి 4) 1, 2
9. ప్రతిధ్వనిపై ఆధారపడేవి?
1) సోనార్ 2) గబ్బిలం 3) రాడార్ 4) 1, 2
10. అత్యుత్తమ ధ్వని శోషకం ఏది?
1) తెరిచిన కిటికీ 2) దూది
3) ఎండుగడ్డి 4) థర్మాకోల్
11. కిందివాటిని జతపరచండి.
i) శబ్ద తీవ్రత A) మీటర్
ii) ధ్వని శోషణ B) మెట్రిక్ సబైన్ గుణకం
iii) ధ్వని స్థాయి C) హెర్ట్జ్
iv) తరంగ కంపన D) బెల్ పరిమితి
1) i-D ii- B iii- C iv- A
2) i-A ii-B iii-C iv -D
3) i - D ii - C iii-B iv-A
4) i-A ii-C iii-B iv-D
12. మానవుడి చెవి ఒక సెకన్ కాలంలో వినే గరిష్ఠ విస్పందనాలు ఎన్ని?
1)10 2)16 3) 20 4) 20,000
13. అతిధ్వనుల పౌన:పున్యం విలువ...
1) 20 Hz కంటే తక్కువ
2) 200 Hz కంటే తక్కువ
3) 20,000 Hz కంటే ఎక్కువ
4) 20,000 Hz కంటే తక్కువ
14. మానవుడు వినే ధ్వనుల తరంగదైర్ఘ్యాల అవధి ఎంత?
1) 20 నుంచి 20,000 m 2) 20,000 నుంచి 2,00,000 m
3) 16.5 mm నుంచి 16.5 m 4) 20 నుంచి 100 dB
15. డాప్లర్ ప్రభావంతో ముడిపడిన ధ్వని తరంగం లక్షణం?
1) పిచ్ (స్థాయి) 2) గుణం
3) తీవ్రత 4) ఏదీకాదు
16. డాప్లర్ ప్రభావం ఏ సందర్భానికి వర్తించదు?
1) పరిశీలకుడు ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తే
2) ధ్వని జనకం ధ్వని వేగం కంటే అధిక వేగంతో ప్రయాణిస్తే
3) పరిశీలకుడు, ధ్వని జనకం రెండూ నిశ్చలంగా ఉన్నప్పుడు
4) పైవన్నీ
17. వంతెనపై సైనికులు కవాతు చేస్తే అది..
A) తప్పకుండా కూలిపోతుంది.
B) సహజ కంపనాలు చేస్తుంది.
C) అనునాదంతో కూలిపోవచ్చు.
D) బలాత్కృత కంపనాలు చేస్తుంది.
1) A, D 2)B,C 3) C, D 4) A, B
18. ప్రతిపాదన (A): గాలిలో తేమ శాతం పెరిగితే, గాలిలో ధ్వని వేగం పెరుగుతుంది.
కారణం (R): ఆర్ధ్రతతో పాటు గాలి సాంద్రత తగ్గి, ధ్వని వేగం పెరుగుతుంది.
1) A నిజం, కానీ R తప్పు.
2) A, R లు రెండూ నిజం, A కు R సరైన వివరణ.
3) A తప్పు, కానీ R నిజం.
4) A, R రెండూ నిజం, కానీ A కు R సరైన వివరణ కాదు.
19. కిందివాటిలో సరైన ధ్వని వేగ సమీకరణం ఏది?

20. తబలా ఏ రకమైన ఆర్గాన్ (సంగీత) గొట్టం?
1) మూసిన గొట్టం 2) తెరిచిన గొట్టం
3) 1, 2 4) ఏదీకాదు
21. గాలిలో ధ్వని ప్రసారం జరిగేటప్పుడు ఏది స్థిరంగా ఉంటుంది?
1)ఉష్ణం 2) ఉష్ణోగ్రత
3) పీడనం 4) సాంద్రత
22. యానకంలో ప్రయాణించే ధ్వని వేగాన్ని ప్రభావం చెందించే యానకం లక్షణాలు?
1) స్థితిస్థాపకత 2) జడత్వం
3) 1, 2 4) ఏదీకాదు
23. ధ్వనివేగం ్బ్ర్శ, పౌనఃపున్యం ్బ-్శ, తరంగదైర్ఘ్యం ్బః్శల మధ్య సంబంధం?

24. కిందివాటిలో చిన్నపిల్లల స్వరంలో ఏది అధికంగా ఉంటుంది?
1) పిచ్ (స్థాయి) 2) ధ్వని తీవ్రత
3) ధ్వనిశక్తి 4) పైవన్నీ
25. కిందివాటిలో సరైన ప్రవచనం ఏది?
A) అనుదైర్ఘ్య తరంగాలు ఘన, ద్రవ, వాయువుల్లో ప్రయాణిస్తాయి.
B) ఘన పదార్థాలు, సాగదీసిన తీగల్లోనే తిర్యక్ తరంగాలు ప్రయాణిస్తాయి.
C) ఉక్కు కడ్డీ(స్టీల్‌బార్)లో తిర్యక్, అనుదైర్ఘ్య తరంగాలు రెండూ ప్రయాణిస్తాయి.
D) నీటి ఉపరితలంపై మోటారు బోటు వల్ల ఏర్పడే తరంగాలు అనుదైర్ఘ్య, తిర్యక్ తరంగాలు.
1) A, C 2) B, C 3) A, D 4) పైవన్నీ
26. తరంగాల వ్యతికరణం ధర్మం వల్ల ఏర్పడేవి ఏవి?
1) స్థిర తరంగాలు 2) విస్పందనాలు
3) ప్రతిధ్వని 4) ఏదీకాదు
27. తెలియని శృతిదండం పౌనఃపున్యాన్ని తెలుసుకునేందుకు తోడ్పడేది ఏది?
1) విస్పందనాలు 2) డాప్లర్ ప్రభావం
3) అనునాదం 4) పైవన్నీ
28. ప్రతిపాదన(A): రెండు వస్తువుల పౌనఃపున్యాలు సమానంగా ఉన్నప్పుడు అందులో ఒకదాన్ని కంపిస్తే, మరొకటి కూడా గరిష్ఠంగా కంపిస్తుంది.
కారణం(R): ఈ సందర్భంలో వస్తువులు అనునాదంలో ఉంటాయి.
1) A నిజం, కానీ R తప్పు.
2) A, R లు రెండూ నిజం, A కు R సరైన వివరణ.
3) A తప్పు, కానీ R నిజం.
4) A, R రెండూ నిజం, కానీ A కు R సరైన వివరణ కాదు.
29. గాలిలో ధ్వనివేగం 340 మీటర్/సెకన్ ఉన్నప్పుడు, ప్రతిధ్వనిని వినాలంటే ధ్వని జనకానికి, పరిశీలకుడికి మధ్య ఉండాల్సిన కనీస దూరం ఎంత?
1) 340 మీటర్లు 2) 34 మీటర్లు
3) 17 మీటర్లు 4) 170 మీటర్లు
సమాధానాలు
1-3 2-4 3-2 4-1 5-4 6-1 7-1 8-4 9-4 10-1 11-1 12-1 13-3 14-3 15-1 16-4 17-3 18-2 19-3 20-1 21-1 22-3 23-1 24-1 25-4 26-2 27-1 28-2 29-3