• facebook
  • whatsapp
  • telegram

మన విశ్వం

1. సౌర వ్యవస్థకి చెందిన ఖగోళ వస్తువులు ఏవి?

1) సూర్యుడు                    2) సూర్యుడు, ఎనిమిది గ్రహాలు

3) సూర్యుడు, గ్రహాలు, గ్రహశకలాలు   4) సూర్యుడు, గ్రహాలు, గ్రహ శకలాలు, తోకచుక్కలు

జ: 4


2. కింది ప్రవచనాల్లో సరైనవి ఏవి?

ఎ. గ్రహాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తాయి.

బి. సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతాడు

సి. గెలాక్సీ కేంద్రం చుట్టూ సూర్యుడు పరిభ్రమిస్తాడు

డి. గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకారంగా కక్ష్యల్లో తిరుగుతాయి

1) ఎ, బి       2) సి, డి      3) ఎ, బి, సి       4) ఎ, బి, సి, డి

జ: 4


3. సూర్యాస్తమయ  సమయాల్లో మనకి సూర్యుడిలో కనిపించే నల్లటి మచ్చలు (Sun spots) దేనివల్ల ఏర్పడతాయి?

1) అధిక అయస్కాంత క్షేత్రంతో ఆ ప్రదేశాలు చల్లారడం వల్ల

2) అల్ప  అయస్కాంత క్షేత్రంతో ఆ ప్రదేశాలు చల్లారడం వల్ల

3)  అధిక   అయస్కాంత క్షేత్రంతో ఆ ప్రదేశాలు వేడెక్కడం వల్ల

4) అల్ప   అయస్కాంత క్షేత్రంతో ఆ ప్రదేశాలు వేడెక్కడం వల్ల

జ: 1


4. నక్షత్రాలు వేటి నుంచి ఏర్పడతాయి?

1) రోదసిలోని ఘనపదార్థాల నుంచి

2) రోదసిలోని వాయువులు, ధూళితో కూడిన మేఘాల నుంచి 

3) హైడ్రోజన్‌ కేంద్రకాల సంలీనం వల్ల            4) పైవన్నీ

జ: 2


5. భూమికి అతి సమీపంలోని నక్షత్రం ఏది?

1) చంద్రుడు        2) ఆల్ఫా సెంటారి   3) ప్రాక్సిమా సెంటారి     4) సూర్యుడు

జ: 4


6. నక్షత్రాల విస్ఫోటనానికి సంబంధించి నోవా, సూపర్‌నోవాల మధ్య వ్యత్యాసం ఏది?

1) నోవా - జంట నక్షత్రాలకు సంబంధించింది, సూపర్‌ నోవా - ఒకే నక్షత్రానికి సంబంధించింది. 

2) సూపర్‌ నోవా, నోవా కంటే అత్యంత శక్తిమంతమైన పేలుడు 

3) నోవాలో హైడ్రోజన్‌ కేంద్రకాలు సంలీనం (Fusion) చెందితే, సూపర్‌ నోవాలో సిలికాన్‌ కేంద్రకాలు సంలీనం చెందుతాయి.

4) పైవన్నీ

జ: 4


7. భూమి చుట్టూ తిరిగే కృత్రిమ ఉపగ్రహం నుంచి ఏదైనా విడిభాగం ఊడిపోతే అది ...

1) కిందకు స్వేచ్ఛగా పడిపోతుంది.         2) ఉపగ్రహంతోపాటే పరిభ్రమిస్తుంది

3) అక్కడే నిశ్చలంగా ఉంటుంది   4) భూమి నుంచి దూరంగా అనంతంలోకి ప్రయాణిస్తుంది

జ: 2


8. భూమికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం ఏది?

1) శుక్రుడు      2) బుధుడు   3) గురుడు       4) బృహస్పతి

జ: 1


9. గ్రహ శకలాల పట్టీ (Belt of asteroids) ఏ రెండు గ్రహాల మధ్య ఉంది?

1) బుధుడు, శుక్రుడు               2) శుక్రుడు - భూమి

3) అంగారకుడు - బృహస్పతి     4) బృహస్పతి - శని

జ: 3


10. కృష్ణబిలం (Black hole) దేని రూపాంతరం?

1) గెలాక్సీ          2) నక్షత్రం   3) తోకచుక్క          4) గ్రహం

జ: 2


11.  మానవుడి శరీరం నుంచి ప్రతి సెకనుకి సుమారు 100 ట్రిలియన్ల సంఖ్యలో చొచ్చుకుని పోయే ‘‘న్యూట్రినో’’లను ఉత్పత్తి చేసేది ఏది?

1) సూర్యుడు       2) ఇతర నక్షత్రాలు     3) బ్లాక్‌ హోల్స్‌       4) పైవన్నీ

జ: 4


12. కింది అంశాలను జతపరచండి.

జాబితా  I                      జాబితా  II

a) అతి చిన్న గ్రహం        i) యురేనస్‌

b) అరుణ గ్రహం            ii) శని

c) రెండో అతిపెద్ద గ్రహం   iii) అంగారకుడు

d) తూర్పు నుంచి         iv) బుధుడు

పడమరకి ఆత్మభ్రమణం

చెందే  గ్రహం

1) a-iv, b-iii, c-ii, d-i              2) a-i, b-ii, c-iii, d-iv
3) a-iv, b-ii, c-iii, d-i             4) a-ii, b-iii, c-iv, d-i

జ: 1


13. భూమి ఆత్మభ్రమణ కాలం 23.9 గంటలు. పరిభ్రమణ కాలం ఎంత? 

1) 365.25 రోజులు     2) 364.25 రోజులు

3) 366.25 రోజులు     4) 365.24 రోజులు

జ: 1


14. పాలపుంత (గెలాక్సీ)లో నక్షత్రాలు, సౌర వ్యవస్థలో గ్రహాలు, గ్రహంతో ఉపగ్రహాలు బంధితమై ఉండటానికి కారణమైన బలం ఏది?

1) అయస్కాంత బలం      2) విద్యుత్‌ బలం 

3) గురుత్వ బలం    4) పైవన్నీ

జ: 3


15. సూర్యుడి నుంచి భూమి ఎన్నో గ్రహం?

1) 2      2) 3      3) 4      4) 5

జ: 2


16.  'Red shift' (అరుణ విస్థాపనం)కి వ్యతిరేకమైంది ఏది?

1) Black shift             2) White shift
3) Blue shift               4) Yellow shift

జ: 3

17. టైటాన్‌ అనే ఉపగ్రహం ఏ గ్రహానికి చెందింది?

1) శని          2) గురుడు    3) యురేనస్‌          4) నెప్ట్యూన్‌  

జ: 1


18. పాలపుంత (గెలాక్సీ) అంచున ఉండే సూర్యుడు పాలపుంత కేంద్రకం చుట్టూ తిరగడానికి పట్టే కాలం సుమారుగా ఎంత?

1) 150 మిలియన్‌ సంవత్సరాలు      2) 250 మిలియన్‌ సంవత్సరాలు   

3) 350 మిలియన్‌ సంవత్సరాలు      4) 450 మిలియన్‌ సంవత్సరాలు

జ: 2


19. వాయేజర్‌ 1, 2 అనే అంతరిక్ష శోధకాల విధి?

1) శని గ్రహం వలయాల శోధన       2) అంగారకుడి వాతావరణ అణు ఘటకాల శోధన

3) బుధ గ్రహ వాతావరణ విశ్లేషణ     4) బాహ్య అంతరిక్షం (Outer space) పరిశోధన

జ: 4


20. హేలీ తోకచుక్క తిరిగి ఏ సంవత్సరంలో భూమికి సమీపంలోకి రానుంది?

1) 2031      2) 2041      3) 2051       4) 2061

జ: 4


21. కింది ప్రవచనాల్లో సరైంది ఏది?

ఎ. గ్రహాలు సూర్యుడి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యల్లో తిరుగుతాయి.

బి. తోకచుక్కలు సూర్యుడి చుట్టూ వృత్తాకార కక్ష్యల్లో తిరుగుతాయి

సి. తోకచుక్కలు సూర్యుడి చుట్టూ దీర్ఘవత్తాకార కక్ష్యల్లో తిరుగుతాయి

డి. తోకచుక్క తోక భాగం సూర్యుడి వైపు ఉంటుంది.

1) ఎ, సి       2) బి, డి         3) ఎ, బి        4) ఎ, సి, డి

జ: 1


22. ‘‘చంద్రశేఖర్‌ అవధి’’ దేనికి సంబంధించింది?

1) నక్షత్రం పుట్టుక  

2) ఒక నక్షత్రం ద్రవ్యరాశి ఆధారంగా కృష్ణబిలంగా మారడానికి ఉండే అవకాశాన్ని తెలియజేస్తుంది

3) గ్రహాల పుట్టుక         4) బిగ్‌ బ్యాంగ్‌ సిద్ధాంతం

జ: 2


23. గ్రహాల్లో అత్యధిక సాంద్రతను కలిగిన గ్రహం ఏది?

1) భూమి       2) శుక్రుడు   3) బృహస్పతి       4) అంగారకుడు

జ: 1


24. సౌర వ్యవస్థలో సుమారు ఎంత శాతం ద్రవ్యరాశి సూర్యుడిలో కేంద్రీకృతం అయ్యింది?

1) 79%       2) 89%      3) 99%      4) 50%

జ: 3


25. పరిమాణం, ద్రవ్యరాశి, సాంద్రతల్లో భూమిని పోలిన గ్రహం ఏది?

1) బుధుడు       2) శుక్రుడు   3) బృహస్పతి       4) శని

జ: 2


26. సౌర వ్యవస్థలోని గ్రహాల్లో దేన్ని నీటిలో వేస్తే అది నీటిపై తేలుతుంది? 

1) శని         2) యురేనస్‌        3) నెప్ట్యూన్‌        4) బుధుడు

జ: 1


27. భూమికి మరొక పేరు-

1) అరుణ గ్రహం        2) నీలి గ్రహం (blue planet)
3) పసుపు గ్రహం      4) ఏదీ కాదు

జ: 2


28. మనం చంద్రుడిని ఒక వైపు నుంచే చూడడానికి కారణం ఏమిటి?

1) చంద్రుడికి ఆత్మభ్రమణం లేనందు వల్ల

2) చంద్రుడి ఆత్మభ్రమణ కాలం, పరిభ్రమణ కాలానికి దాదాపు సమానం కావడం వల్ల

3) చంద్రుడి ఆత్మభ్రమణ దిశ, భూమి, ఆత్మ భ్రమణ దిశలు సమాంతరంగా ఉండటం వల్ల

4) చంద్రుడి ఆత్మభ్రమణ కాలం, భూమి ఆత్మ భ్రమణ కాలానికి సమానం కావడం వల్ల

జ: 2


29. కింది ఏ గ్రహాలకు చుట్టూ వలయాలు ఉన్నాయి?

ఎ. బృహస్పతి, శని 

బి. యురేనస్, నెప్ట్యూన్‌

సి. బృహస్పతి, శుక్రుడు  

డి. అంగారకుడు, భూమి

1) ఎ       2) ఎ, బి       3) సి       4) సి, డి

జ: 2


30. భూమికి కవల గ్రహమని దేనికి పేరు?

1) కుజుడు      2) బుధుడు       3) శుక్రుడు       4) శని

జ: 3


31. బుధగ్రహం విషయంలో సరైంది ఏది?

ఎ. ఆత్మభ్రమణ కాలం అత్యధికం   

బి. పరిభ్రమణ కాలం అత్యల్పం   

సి. ఆత్మభ్రమణ కాలం అత్యల్పం

డి. పరిభ్రమణ కాలం అత్యధికం

1) బి మాత్రమే     2) ఎ, డి     3) బి, సి    4) ఏదీకాదు

జ: 1

32. ఏ గ్రహంపై రోజు సమయం అత్యల్పం?

1) బృహస్పతి       2) శని       3) యురేనస్‌       4) నెప్ట్యూన్‌

జ: 1


33. ఏ గ్రహాన్ని ‘మార్నింగ్‌’ లేదా ‘ఈవెనింగ్‌ స్టార్‌’ అని పిలుస్తారు?

1) బృహస్పతి       2) శుక్రుడు      3) శని       4) భూమి

జ: 2


34. కృష్ణబిలం-

ఎ. దీని నుంచి కాంతి కూడా తప్పించుకోలేదు 

బి. అత్యధిక సాంద్రతను కలిగి ఉంటుంది

సి. అత్యధిక గురుత్వాకర్షణను కలిగి ఉంటుంది

డి. అధిక ద్రవ్యరాశితో ఉండే నక్షత్ర రూపాంతరం

1) ఎ, సి       2) ఎ, బి      3) ఎ, బి, సి       4) ఎ, బి, సి, డి

జ: 4

35. నక్షత్రం నుంచి వచ్చే కాంతి రంగును నిర్ణయించేది ఏది?

1) ద్రవ్యరాశి          2) సాంద్రత      3) ఘనపరిమాణం    4) ఉష్ణోగ్రత

జ: 4


36. సౌర కుటుంబంలోని అన్ని గ్రహాల మొత్తం ద్రవ్యరాశికి రెట్టింపు ద్రవ్యరాశి ఉన్న గ్రహం?

1) శని          2) భూమి       3) యురేనస్‌           4) బృహస్పతి

జ: 4 


37. సూర్యుడిపై అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించ తలపెట్టిన మిషన్‌ పేరు? 

1) సూర్య - L1      2) ఆదిత్య - L1      3) భాను - L1      4) మిషన్‌ సూర్య

జ: 2 


38. అంగారకుడి కక్ష్యావర్తన కాలం ఎన్ని రోజులు? 

1) 687 రోజులు     2) 487 రోజులు     3) 587 రోజులు     4) 680 రోజులు

జ: 1


39. శని గ్రహంపై ఒక రోజు భూమిపై ఎన్ని గంటలకు సమానం? 

1) 11.7          2) 10.7          3) 9.7           4) 13.7

జ: 2


40. ఏ గ్రహ కక్ష్యలో తిరిగే గ్రహ శకలాల సముదాయాన్ని ట్రోజన్‌ గ్రహ శకలాలు అంటారు?

1) బృహస్పతి          2) నెప్ట్యూన్‌         3) బుధుడు           4) శుక్రుడు

జ: 1


41. సూర్యుడి నుంచి కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం సుమారుగా?

1) 7 నిమిషాలు     2) 8 నిమిషాలు     3) 10 నిమిషాలు   4) 15 నిమిషాలు

జ:  2

Posted Date : 27-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌