1. చిక్కుడు జాతి మొక్కల వేరు బుడిపెల్లో సహజీవనం చేస్తూ నత్రజనిని స్థాపించే బ్యాక్టీరియా?
జ: రైజోబియమ్
2. నేలలో ఫాస్ఫరస్ ఏ రూపంలో ఎక్కువగా ఉంటుంది?
జ: రాక్ ఫాస్ఫేట్
3. కింది ఏ సూక్ష్మ జీవులను జీవ ఎరువులుగా వాడుతున్నారు?
1) బ్యాక్టీరియా 2) నీలి ఆకుపచ్చ శైవలాలు 3) శిలీంద్రాలు 4) అన్నీ
జ: 4 (అన్నీ)
4. నేలలో కరగని స్థితిలో ఉన్న ఫాస్ఫరస్‌ను కరిగించి మొక్కకు అందించే బ్యాక్టీరియా?
జ: బాసిల్లస్ మెగా థీరియం, బాసిల్లస్ సబ్టిలిస్
5. రైజోబియమ్ బ్యాక్టీరియాలో ఉండే నిఫ్ జన్యువులు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయి?
జ: నత్రజని స్థాపనకు
6. రసాయనిక ఎరువైన యూరియాను చల్లడం వల్ల మొక్కకు లభించేది?
జ: నత్రజని
7. అజొల్లా అనే ఫెర్న్ మొక్కలో సహజీవనం చేస్తూ నత్రజని స్థాపన చేసే నీలి ఆకుపచ్చ శైవలం
జ: అనబీనా
8. శిలీంద్రం, ఉన్నత శ్రేణి మొక్కల సహజీవనాన్ని ఏమంటారు?
జ: మైకోరైజా
9. రసాయనిక ఎరువుల్లో నత్రజని ఎరువులకు ఉదాహరణ
1) యూరియా 2) అమ్మోనియం సల్ఫేట్ 3) కాల్షియం అమ్మోనియం సల్ఫేట్ 4) అన్నీ
జ: 4 (అన్నీ)
10. వరి పొలాల్లో జీవ ఎరువుగా వాడే నీలి ఆకుపచ్చ శైవలాల వల్ల మొక్కకు ఎక్కువగా లభించేది
జ: నత్రజని
రచయిత: డాక్టర్ బి. నరేష్