మాదిరి ప్రశ్నలు
1. వృత్త పద్యాలు ప్రధానంగా ఏవి?
1) ఉత్పలమాల, మత్తేభం 2) చంపకమాల, శార్దూలం
3) మత్తేభం, శార్దూలం 4) పైవన్నీ
2. జాతి పద్యాలు ఏవి?
1) తేటగీతి, సీసం 2) ఆటవెలది, తేటగీతి
3) కందం, ద్విపద 4) సీసం, ఆటవెలది
3. కంద పద్యంలో బేసి స్థానాల్లో ఏ గణం ఉపయోగించకూడదు?
1) రగణం 2) భగణం 3) నల గణం 4) జగణం
4. వృత్త పద్యాలు ఏ ఛందస్సు?
1) మార్గ ఛందస్సు 2) దేశీ ఛందస్సు 3) మాత్ర ఛందస్సు 4) పైవన్నీ
5. సూర్యగణాలు ఎన్ని?
1) 2 2) 4 3) 6 4) 8
6. ‘అన్నమయములైన వన్ని జీవమ్ములు’ అనేది ఏ పద్యానికి ఉదాహరణ?
1) ద్విపద 2) తేటగీతి 3) ఆటవెలది 4) కందం
7. ఉత్పలమాల పద్యానికి ప్రతి పాదానికి అక్షరాల సంఖ్య?
1) 20 2) 19 3) 21 4) 10
8. ‘పొదలి యొండొండ దివియును బువియు దిశలు’ అనేది ఏ పద్యానికి ఉదాహరణ?
1) కందం 2) ఆటవెలది 3) సీసం 4) తేటగీతి
9. ద్విత్వ సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరాలు?
1) లఘువు 2) గురువు 3) 1, 2 4) ఏదీకాదు
10. చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా ..... అనే పద్యపాదం దేన్ని సూచిస్తుంది?
1) చంపకమాల 2) ఉత్పలమాల 3) శార్దూలం 4) మత్తేభం
11. అనుచుంజేవురు మీరు కన్నుగనతో నాస్పంది తోష్ఠంబుతో... అనే పద్య పాదం దేనికి ఉదాహరణ?
1) ఉత్పలమాల 2) చంపకమాల 3) శార్దూలం 4) మత్తేభం
12. అర్థానుస్వరంతో కూడినవన్నీ
1) గురువు 2) లఘువు 3) ద్విత్వ 4) ఏదీకాదు
13. ఊరూరంజనులెల్ల భిక్షమిడరో యుండంగుహల్గల్గవో అనేది ఏ పద్య పాదం?
1) మత్తేభం 2) చంపకమాల 3) ఉత్పలమాల 4) శార్దూలం
14. జాతి, ఉపజాతి పద్యాలకు భేదం
1) ప్రాస నియమం 2) యతి 3) ప్రాసయతి 4) అక్షరాల సంఖ్య
15. ‘దెరయన నొప్ప సాంద్యనవదీధితి పశ్చిమ దిక్తటంబునన్’లో యతిమైత్రి ఉండే అక్షరం?
1) దె - తి 2) దె - దీ 3) దె - ప 4) దె - వ
16. 2 - 4 పాదాల చివరి అక్షరం గురువై ఉండాలి అనే నియమాన్ని కలిగిన పద్యం?
1) ద్విపద 2) సీసం 3) కందం 4) మంజరీ ద్విపద
17. హ్రస్వమైన అచ్చులను ఏమంటారు?
1) లఘువులు 2) ఉపధలు 3) గురువులు 4) పొల్లులు
18. క్షితిజం అనే పదానికి గురు, లఘువులు గుర్తించండి.
1) UIU 2) IIU 3) UII 4) IUI
19. ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు - అనే గణాలు గల పద్యం?
1) ఆటవెలది 2) ద్విపద 3) తేటగీతి 4) సీసం
20. ‘ఇనునసమాన తేజు దివసేంద్రు గనుంగొను మాడ్కి జూడగా’ అనే పాదంలోని గణాలు?
1) న - జ - భ - జ - జ - జ - ర 2) భ - ర - న - భ - భ - ర - వ
3) మ - స - జ - స - త - త - గ 4) స - భ - ర - న - మ - య - వ
21. కిందివాటిలో చతుర్మాత్రా గణాలు గల పద్యం?
1) తేటగీతి 2) ఆటవెలది 3) కందం 4) సీసం
22. ‘ధనము లేకుండెదెవరు మూడు తరములందు’ అనేది ఏ పద్య పాదం?
1) ద్విపద 2) ఆటవెలది 3) సీసం 4) తేటగీతి
23. ఘోర వికార సన్నిహిత కోపముఖంబులు దీప్త విద్యుడు.... అనే పద్య పాదం దేనికి ఉదాహరణ?
1) మత్తేభం 2) శార్దూలం 3) ఉత్పలమాల 4) చంపకమాల
24. కంద పద్యంలోని రెండు, నాలుగు పాదాల్లో ఎన్ని గణాలు ఉంటాయి?
1) 4 2) 5 3) 3 4) 8
25. ఇంద్ర గణాలు ఎన్ని?
1) 4 2) 6 3) 2 4) 8
సమాధానాలు
1-4; 2-3; 3-4; 4-1; 5-2; 6-3; 7-1; 8-4; 9-2; 10-1; 11-4; 12-2; 13-4; 14-1; 15-2; 16-3; 17-1; 18-2; 19-3; 20-1; 21-3; 22-4; 23-3; 24-2; 25-2.
రచయిత: సూరె శ్రీనివాసులు