• facebook
  • whatsapp
  • telegram

రసాయనశాస్త్రం - పరిశ్రమలు

1. కింది వాటిలో గాజు వేటి మిశ్రమం?

ఎ) కాల్షియం సిలికేట్‌ 

బి) సోడియం సిలికేట్‌

సి) సిలికా       డి) పైవన్నీ

2. కింది వాటిలో గాజుకు సంబంధించి సరైనది?

i. గాజు అతిశీతలీకరణం చెందిన ద్రవం

ii. సున్నపురాయి, సోడా యాష్, ఇసుకను గాజు తయారీలో ఉపయోగిస్తారు

iii. గాజు పారదర్శక లేక పారభాసిక పదార్థం

ఎ) i మాత్రమే       బి) ii, iii మాత్రమే 

సి) i, iii మాత్రమే      డి) పైవన్నీ 

3. గాజును ప్రత్యేక పద్ధతిలో చల్లబరిచే ప్రక్రియను ఏమంటారు?

ఎ) మంద శీతలీకరణం  బి) అన్నిలింగ్‌ 

సి) ఎ, బి         డి) గ్లాస్‌గాల్‌ 

4. కింది వాటిని జతపరచండి.

సబ్బు కలిగి ఉన్న       ఉపయోగం         

ఫాటీఆమ్లాల లవణం

A. Mg+2 లవణం     I. శరీర శుభ్రత సబ్బు  

B. K+లవణం       II. దుస్తులు ఉతికే సబ్బు

C. Na+ లవణం       III. ముఖానికి వాడే పౌడరు

5. కింది వాటిలో కచ్చితమైన ద్రవీభవన స్థానం లేనిది?

ఎ) గాజు     బి) బంగారం 

సి) వెండి     డి) మంచు

6. నీలం రంగు గాజు తయారీలో గాజుకు కలిపే పదార్థం ఏది?

ఎ) మాంగనీస్‌ డై ఆక్సైడ్‌ 

బి) క్రోమియం ఆక్సైడ్‌ 

సి) కార్బన్‌ డైఆక్సైడ్‌ 

డి) కాపర్‌ సల్ఫేట్‌ 

7. గాజుకు ఎరుపురంగుని కలిగించే లోహ ఆక్సైడ్‌ ఏది?

ఎ) క్యూప్రస్‌ ఆక్సైడ్‌ 

బి) క్రోమియం ఆక్సైడ్‌ 

సి) మెగ్నీషియం ఆక్సైడ్‌ 

డి) సోడియం ఆక్సైడ్‌ 

8. కింది వాటిని జతపరచండి.

గాజు రకం     ఉపయోగం

a. సోడాగాజు     I. ప్రయోగశాలలో వాడే గాజు పరికరాలు 

b. పైరెక్స్‌ గాజు    II. దృశా పరికరాలు 

c. ప్లింట్‌ గాజు     III. కిటికీ అద్దాలు

9. కింది దేనిలో గాజు కరుగుతుంది?

ఎ) పర్‌క్లోరిక్‌ ఆమ్లం (HClO4

బి) హైడ్రోఫ్లోరిక్‌ ఆమ్లం (HF) 

సి) నత్రిక్లామం (HNO3)

డి) హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం (HCl)

10. రసాయనికంగా సిమెంట్‌ వేటి మిశ్రమం? 

ఎ) కాల్షియం సిలికేట్‌ + కాల్షియం అల్యూమినేట్‌ 

బి) కాల్షియం సిలికేట్‌ + మెగ్నీషియం సిలికేట్‌ 

సి) మెగ్నీషియం అల్యూమినేట్‌  + కాల్షియం సల్ఫేట్‌ 

డి) కాల్షియం సల్ఫేట్‌ + కాల్షియం అల్యూమినేట్‌

11. కింది వాటిలో సరికానివి? 

ఎ) జిప్సం - CaSO4.2H2O

బి) ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ - CaSO4.1/2 H2

సి) సున్నపురాయి - CaCO3  

డి) గాజు ఎచ్చింగ్‌ - HCl

12. శరీర నొప్పులను తగ్గించే మందులను ఏమంటారు?  

ఎ) యాంటిపైరెటిక్స్‌      బి) యాంటిబయోటిక్స్‌ 

సి) అనాల్జెసిక్‌           డి) యాంటిసెప్టిక్స్‌   

13. జ్వరాన్ని తగ్గించే మందులను ఏమంటారు?

ఎ) యాంటిపైరెటిక్స్‌         బి) యాంటిబయోటిక్స్‌ 

సి) అనాల్జెసిక్‌             డి) ఆమ్ల విరోధులు  

14. కింద పేర్కొన్న వాటిలో యాంటాసిడ్‌కు (ఆమ్ల విరోధులు) ఉదాహరణ?

ఎ) పారాసెటమాల్‌       బి) ఆస్పిరిన్‌ 

సి) మిల్క్‌ ఆఫ్‌ మెగ్నీషియా డి) డైజోపామ్‌

15. పెన్సిలిన్‌ అనేది ఒక... 

ఎ) అనాల్జెసిక్‌        బి) యాంటిసెప్టిక్‌ 

సి) యాంటిబయోటిక్‌            డి) మాదకద్రవ్యం 

16. కింది వాటిలో మాదకద్రవ్యాలకు ఉదాహరణ ఏది?

ఎ) మార్ఫిన్‌           బి) హెరాయిన్‌ 

సి) ఎ, బి        డి) ఫార్మాల్డిహైడ్‌

17. కింది వాటిలో యాంటిసెప్టిక్‌ ఏది?

ఎ) డెటాల్‌       బి) లీవోడోపా 

సి) కేసిన్‌         డి) సిలికోన్‌

18. డెటాల్‌ ద్రావణం వేటి మిశ్రమం? 

ఎ) ఫినాల్‌ + టెర్బినియోల్‌ 

బి) ఫినాల్‌ + ఫార్మాల్డిహైడ్‌ 

సి) క్లోరోక్సైలినోల్‌ + టెర్బినియోల్‌ 

డి) క్లోరోక్సైలినోల్‌ + ఫార్మాల్డిహైడ్‌

19. కింది వాటిలో క్రిమిసంహారిణులు ఏవి?

ఎ) క్లోరిన్‌ జలద్రావణం 

బి) 4% ఫార్మాల్డిహైడ్‌ ద్రావణం

సి) ఎ, బి     డి) క్లోరోఫాం

20. టింక్చర్‌ ఆఫ్‌ అయోడిన్‌ అంటే? 

ఎ) ఆల్కహాల్‌ - నీటి మిశ్రమంలో కరిగించిన అయోడిన్‌ 

బి) ఆల్కహాల్‌ - నీటి మిశ్రమంలో కరిగించిన ఫినాల్‌

సి) ఆల్కహాల్‌ - ఫినాల్‌ మిశ్రమంలో కరిగించిన అయోడిన్‌ 

డి) నీరు - ఫినాల్‌ మిశ్రమం

21. ఎలర్జీని తగ్గించే మందులను ఏమంటారు?

ఎ) యాంటిసెప్టిక్స్‌       బి) యాంటిహిస్టమిన్స్‌ 

సి) యాంటిబయోటిక్స్‌ 

డి) అనాల్జెసిక్స్‌ 

22. యాంటిసెప్టిక్‌గా పనిచేసే పెర్‌హైడ్రాల్‌ వేటి విలీన మిశ్రమం? 

ఎ) బేరియం పెరాక్సైడ్‌ 

బి) ఫినాల్‌ - ఫార్మలిన్‌  

సి) ఫార్మిక్‌ ఆమ్లం 

డి) హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌

23. క్లోరోఫాం సూర్యకాంతి సమక్షంలో చర్య జరిపి ఏ విష పదార్థాన్ని ఏర్పరుస్తుంది?

ఎ) మస్టర్డ్‌ వాయువు  బి) టియర్‌ గ్యాస్‌ 

సి) ఫాస్‌జీన్‌       డి) క్లోరిన్‌ వాయువు

24. ఫాస్‌జీన్‌ (Phosgene) రసాయన ఫార్ములా ఏమిటి?

ఎ) COCl2    బి) COCl3 

సి) COx     డి)  CaCO3 

25. క్లింకర్‌ నుంచి పొడి సిమెంట్‌ తయారు కావడానికి ఉపయోగించే రసాయనం?

ఎ) జిప్సం     బి) పాలిమర్‌ 

సి) బొరాక్స్‌     డి) లెడ్‌ఆక్సైడ్‌

26. కింది వాటిలో ఏ ప్రక్రియ ద్వారా నూనెలను కొవ్వులుగా మార్చవచ్చు?

ఎ) ఆక్సీకరణం     బి) హైడ్రోజనీకరణం 

సి) జలవిశ్లేషణ     డి) ఎ, బి

27. కొవ్వుల్లోని కర్బన ప్రమేయ సముహం ఏది?

ఎ) ఆల్డిహైడ్‌     బి) ఎమైడ్‌ 

సి) ఎస్టర్‌    డి) ఎమైన్‌ 

28. కింది వాటిలో సరికానిది? 

ఎ) మిథైల్‌ ఆల్కహాల్‌ - విషపూరితమైంది

బి) క్లోరోఫాం - CHCl

సి) సబ్బు తయారీలో ఉత్పాదితం - ఫినాల్‌

డి) ఇండిగో మొక్కలు - నీలిమందు

29. చెరుకు రసం లోని ఆమ్లత్వాన్ని తగ్గించడానికి కలిపే రసాయనం పేరు.....

ఎ) Ca(OH)2    బి) Mg(OH)2

సి) Al(OH)3    డి) NH4OH

30. 96% ఇథైల్‌ ఆల్కహాల్‌ను ఏమంటారు?

ఎ) అబ్సల్యూట్ ఆల్కహాల్‌ 

బి) రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ 

సి) మెలాసిస్‌      డి) ప్రెస్‌మడ్‌

31. అబ్సల్యూట్ ఆల్కహాల్‌ (Absolute Alcohol) లో ఇథైల్‌ ఆల్కహాల్‌ శాతం ఎంత?

ఎ) 90%         బి) 96%  

సి) 100%         డి) 84%

32. సబ్బు తయారీలో ముఖ్యమైన ఉప ఉత్పన్నం ఏది?

ఎ) ఆల్కహాల్‌ + ఆల్డిహైడ్‌ 

బి) గ్లిసరాల్‌     సి) గ్లిసరాల్‌ ్ఘ కీటోన్‌ 

డి) ఎస్టర్‌ + గ్లిసరాల్‌

33. కింది వాటిలో కృత్రిమ తీపికారకం ఏది?

ఎ) గ్లూకోజ్‌     బి) శాకరిన్‌ 

సి) సుక్రోజ్‌     డి) పైవన్నీ

34. కింది వాటిలో ఆహారపదార్థాల సంరక్షకాలు ఏవి?

ఎ) సాధారణ ఉప్పు 

బి) సోడియం బెంజోయేట్‌ 

సి) సుక్రలోజ్‌     డి) ఎ, బి

35. కింది వాటిలో కాంప్లెక్స్‌ ఎరువుకు ఉదాహరణ? 

ఎ) ట్రై అమ్మోనియం ఫాస్ఫేట్‌

బి) యూరియా  సి) పొటాషియం సల్ఫేట్‌ 

డి) పొటాషియం క్లోరైడ్‌ 

36. కింది వాటిలో  శిలీంధ్ర నాశకాలు ఏవి?

ఎ) మాంకోజెబ్‌       బి) జోజోబా నూనె 

సి) సిట్రోనెల్లా నూనె  డి) పైవన్నీ

37. కింది వాటిలో కీటక నాశకమందుకు ఉదాహరణ ఏది?

ఎ) మలాథియాన్‌     బి) దీదీగి 

సి) లిండేన్‌      డి) పైవన్నీ

38. ఆస్పార్‌టేమ్‌ అనేది ఒక........

ఎ) ఎరువు     

బి) యాంటిబయోటిక్‌

సి) కృత్రిమ తీపికారకం 

డి) ఆహారపదార్థ సంరక్షకం

సమాధానాలు

1-డి      2-డి     3-సి     4-ఎ     5-ఎ     6-డి    7-ఎ     8-డి     9-బి     10-ఎ     11-డి     12-సి     13-ఎ     14-సి     15-ఎ     16-సి     17-ఎ     18-సి      19-సి     20-ఎ     21-బి     22-డి     23-సి     24-ఎ     25-ఎ     26-బి     27-సి     28-సి     29-ఎ     30-బి     31-సి     32-బి     33-బి     34-డి     35-ఎ     36-డి     37-డి     38-సి 

Posted Date : 02-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌