• facebook
  • whatsapp
  • telegram

మూలకాల వర్గీకరణ - ధర్మాలు

మాదిరి ప్రశ్నలు

1. కిందివాటిలో సరైన వాక్యం ఏది?
ఎ) లోహాలు చాలా వరకు ఘనస్థితిలో ఉంటాయి.
బి) అలోహాలు ఘనస్థితి, ద్రవస్థితి లేదా వాయుస్థితుల్లో  ఉంటాయి.
సి) అలోహాలు సన్నటి తీగలాగా సాగే గుణం కలిగి ఉండవు.
డి) పైవన్నీ


2. కిందివాటిలో ద్రవస్థితిలో ఉండే అలోహం ఏది?
ఎ) మెర్క్యురీ        బి) పొటాషియం
సి) బ్రోమిన్‌        డి) క్లోరిన్‌


3. భూమి పొరల్లో అత్యధికంగా లభించే లోహం ఏది?
ఎ) ఇనుము        బి) అల్యూమినియం
సి) ఆక్సిజన్‌        డి) బంగారం


4. ‘వేసవి ద్రవం’ అని పిలిచే లోహం ఏది?
ఎ) సోడియం        బి) కాల్షియం
సి) గాలియం        డి) ఆస్మియం


5. ఆవర్తన పట్టికలో అతిపెద్ద పీరియడ్‌ ఏది?
ఎ) 6, 7            బి) 1, 2            సి) 3, 4               డి) 4, 5


6. ఆవర్తన పట్టికలో అతిచిన్న పీరియడ్‌ ఏది?
ఎ) 2          బి) 6         సి) 7         డి) 1


7. ఉత్కృష్ట వాయువుల సాధారణ ఎలక్ట్రాన్‌ విన్యాసం?
ఎ) ns2 np1          బి) ns2 np3
సి) ns2 np5         డి) ns2 np6


8. 1వ గ్రూపు, 2వ గ్రూపు మూలకాల సాధారణ ఎలక్ట్రాన్‌ విన్యాసం ఏమిటి?
ఎ) ns1 np1, ns2 ns2    బి) ns1, ns2
సి) ns2 np1, ns2 np2   డి) పైవేవీకావు


9. కిందివాటిలో ప్రాతినిధ్య మూలకాలకు ఉదాహరణ ఏది?
i) ఇనుము    ii) జింక్‌      iii) నైట్రోజన్‌
iv) సోడియం  v) కాల్షియం vi) మెగ్నీషియం
vii) కార్బన్‌      viii) క్లోరిన్‌
ఎ) i, ii, vi, vii    బి) iii, iv, v, vi, vii, viii
సి) ii, iv, vi, viii డి) i, iii, v మాత్రమే


10. మొట్టమొదట మూలకాలను వర్గీకరించిన శాస్త్రవేత్త?
ఎ) డొబరైనర్‌          బి) మెండలీవ్‌  
సి) హెన్రీ మోస్లే      డి) కొస్సెల్‌


11. కిందివాటిలో మూలకం ఏది?
ఎ) H     బి) H2     సి) H2O      డి) H2O2


12. కిందివాటిలో క్లోరిన్‌ మూలకం సంకేతం ఏమిటి?
ఎ) Ch        బి) Cl      సి) Cr      డి) Co
 

13. కిందివాటిలో ద్రవస్థితిలోని మూలకం ఏది?
ఎ) హైడ్రోజన్‌          బి) సోడియం  
సి) మెర్క్యురీ          డి) ఆక్సిజన్‌


14. కిందివారిలో మూలకాల వర్గీకరణకు కృషి చేసింది? 
ఎ) మెండలీవ్‌         బి) లూథర్‌ మేయర్‌  
సి) ఎ, బి          డి) గెలూసాక్‌


15. మెండలీవియం అనే మూలకం పరమాణు సంఖ్య?
ఎ) 100    బి) 102   సి) 108   డి) 101


16. కిందివాటిలో సరైంది ఏది?
ఎ) మూలక ప్రాథమిక ధర్మం పరమాణు భారం
బి) మూలక ప్రాథమిక ధర్మం పరమాణు సంఖ్య
సి) ఒకే గ్రూపులోని మూలకాలకు సారూప్య ధర్మాలు ఉంటాయి
డి) బి, సి 


17. వాతావరణంలో అధికంగా లభించే 18వ గ్రూపు మూలకం ఏది?
ఎ) He           బి) Ne     సి) Ar      డి) Xe


18. కింది ఏ ఉత్కృష్ట వాయువు బాహ్యకక్ష్యలో రెండు ఎలక్ట్రాన్‌లను మాత్రమే కలిగి ఉంటుంది?
ఎ) హీలియం       బి) నియాన్‌        సి) రేడాన్‌          డి) ఆర్గాన్‌


19. కొత్త మూలకాలకు, రసాయనాలకు నామకరణం చేసే సంస్థ ఏది?
ఎ) ACS         బి) IUPAC         సి) RSC          డి) పైవేవీకావు


20. మెండలీవ్‌ కాలం నాటికి తెలిసిన మూలకాలను ఎన్ని పీరియడ్‌లు, గ్రూపులుగా వర్గీకరించారు?
ఎ) 7 పీరియడ్‌లు, 8 గ్రూపులు   
బి) 7 పీరియడ్‌లు, 18 గ్రూపులు
సి) 8 పీరియడ్‌లు, 8 గ్రూపులు    
డి) 8 పీరియడ్‌లు, 18 గ్రూపులు


21. మూలకాలను అష్టకాలుగా వర్గీకరించి అష్టక పరికల్పనను ప్రతిపాదించింది ఎవరు?
ఎ) మెండలీవ్‌         బి) డొబరైనర్‌  
సి) న్యూలాండ్‌          డి) మోస్లే


22. మూలకాల ధర్మాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు అని ప్రతిపాదించింది ఎవరు?
ఎ) మెండలీవ్‌         బి) న్యూలాండ్‌  
సి) మోస్లే          డి) నీల్స్‌బోర్‌


23. కిందివాటిని జతపరచండి.
       జాబితా - i          జాబితా - ii
A) జడవాయువు           i) ఆక్సిజన్‌
B) ప్రాతినిధ్య మూలకాలు   ii) ఐరన్‌
C) పరివర్తన మూలకం        iii) నియాన్‌
D) అంతర పరివర్తన మూలకం iv) యురేనియం
ఎ) A-iii, B-i, C-iv, D-ii       బి) A-iii, B-ii, C-i, D-iv
సి) A-i, B-iii, C-ii, D-iv      డి) A-iii, B-i, C-ii, D-iv


సమాధానాలు: 1-డి, 2-సి, 3-బి, 4-సి, 5-ఎ, 6-డి, 7-డి, 8-బి, 9-బి, 10-ఎ, 11-ఎ, 12-బి, 13-సి, 14-సి, 15-డి, 16-డి, 17-సి, 18-ఎ, 19-బి, 20-ఎ, 21-సి, 22-ఎ, 23-డి.
 

p - బ్లాక్‌ మూలకాలు

1. కిందివాటిలో అల్యూమినా రసాయన ఫార్ములా ఏమిటి?
ఎ) Al       బి) Al2O3    సి) AlO2       డి) AlO


2. ఒకే మూలకం వివిధ భౌతిక రూపాల్లో లభ్యమవడాన్ని ఏమంటారు?
ఎ) సాదృశ్యం     బి) కేటనేషన్‌        సి) రూపాంతరత        డి) వల్కనీకరణం


3. మంటలు ఆర్పేందుకు ఉపయోగించే వాయువు ఏది?
ఎ) ఆక్సిజన్‌      బి) కార్బన్‌మోనాక్సైడ్‌ 
సి) కార్బన్‌ డైఆక్సైడ్‌ డి) వాటర్‌గ్యాస్‌


4. కిందివాటిలో సరికానిది ఏది?
ఎ) సిలికాన్‌ - Si        బి) సిలికా - SiO2
సి) పొడిమంచు - ఘన CO2
డి) ఇసుక - Al2O3


5. మేఘాల్లో మెరుపులు ఏర్పడినప్పుడు వాతావరణంలోని నైట్రోజన్, ఆక్సిజన్‌ వాయువులు కలిసి ఏ పదార్థాన్ని ఏర్పరుస్తాయి?
ఎ) నైట్రిక్‌ ఆక్సైడ్‌        బి) అమ్మోనియా 
సి) నైట్రేషన్‌ మిశ్రమం డి) నైట్రిక్‌ ఆమ్లం 


6. ఫాస్ఫారిక్‌ ఆమ్లం రసాయన ఫార్ములా?
ఎ) H3PO3        బి) H3PO2
సి) H3PO4         డి) P2O5


7. అమ్మోనియా (NH3) అణువు నిర్మాణం ఏమిటి?
ఎ) పిరమిడల్‌ ఆకృతి            బి) కోణీయ ఆకారం
సి) అష్టముఖీయ నిర్మాణం 
డి) చతుర్ముఖీయ నిర్మాణం


8. కింది ఏ సల్ఫర్‌ సమ్మేళనం కుళ్లిన కోడిగుడ్డు వాసనను కలిగి ఉంటుంది?
ఎ) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం      బి) హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ 
సి) విరంజన చూర్ణం    డి) హైపో


9. కింది అంశాలను జతపరచండి.

ఆమ్లం           రసాయన ఫార్ములా
a) మార్షల్‌ ఆమ్లం   i) H2SO5 
b) కారో ఆమ్లం        ii) H2S2O7 
c) ఓలియం        iii) H2S2O8
ఎ)  a-i, b-iii, c-ii        బి)  a-iii, b-ii, c-i 
సి) a-ii, b-i, c-iii       డి) a-iii, b-i, c-ii 


10. కింది అంశాలను జతపరచండి.
    గ్రూప్‌       బాహ్య ఎలక్ట్రానిక్‌ విన్యాసం
a) హాలోజన్‌లు       i) ns2np4
b) జడవాయువులు    ii) ns2np5 
c) చాల్కోజన్‌లు       iii) ns2np6 
ఎ)  a-ii, b-iii, c-i        బి) a-i, b-iii, c-ii 
సి) a-ii, b-i, c-iii        డి)  a-iii, b-ii, c-i 


11. హైపో రసాయన నామం ఏమిటి?
ఎ) సోడియం క్లోరైడ్‌        బి) సోడియం సల్ఫేట్‌
సి) సోడియం ఆక్సైడ్‌      డి) సోడియం థయోసల్ఫేట్‌


12. ఆక్సిజన్‌ను మొట్టమొదట కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?
ఎ) సి.డబ్ల్యు.షీలే       బి) హేబర్‌ 
సి) రాబర్ట్‌ బాయిల్‌   డి) ఎడ్వర్డ్‌ జెన్నర్‌


13. ఓజోన్‌ ఏ మూలకం రూపాంతరం?
ఎ) సల్ఫర్‌        బి) ఫాస్ఫరస్‌ 
సి) ఆక్సిజన్‌        డి) కార్బన్‌


14. కిందివాటిలో p- బ్లాక్‌ మూలకాల రుణవిద్యుదాత్మకతకు సంబంధించి సరైన క్రమం?
ఎ) ఆక్సిజన్‌ జి నైట్రోజన్‌ జి ఫ్లోరిన్‌
బి) నైట్రోజన్‌ జి ఆక్సిజన్‌ జి ఫ్లోరిన్‌
సి) ఫ్లోరిన్‌ జి ఆక్సిజన్‌ జి నైట్రోజన్‌
డి) ఫ్లోరిన్‌ జి నైట్రోజన్‌ జి ఆక్సిజన్‌


15. విరంజన చూర్ణం తయారీలో ఉపయోగించే హాలోజన్‌ ఏది?
ఎ) ఫ్లోరిన్‌         బి) క్లోరిన్‌ 
సి) బ్రోమిన్‌        డి) అయోడిన్‌


16. కిందివాటిలో బలహీన ఆమ్లం ఏది?
ఎ) HI         బి) HBr         సి) HCl         డి) HF


17. వజ్రం, గ్రాఫైట్, బొగ్గు మొదలైనవి ఏ మూలకం రూపాంతరాలు?
ఎ) సల్ఫర్‌        బి) ఆక్సిజన్‌ 
సి) కార్బన్‌         డి) ఫాస్ఫరస్‌


18. కిందివాటిలో ‘సాల్ట్‌కేక్‌’ అని దేన్ని పిలుస్తారు?
ఎ) సోడియం క్లోరైడ్‌          బి) సోడియం కార్బొనేట్‌
సి) సోడియం సల్ఫేట్‌      డి) సోడియం నైట్రేట్‌


19. బాక్సైట్‌ ధాతువు నుంచి సంగ్రహించే లోహం ఏది?
ఎ) ఐరన్‌        బి) మెగ్నీషియం        సి) అల్యూమినియం   డి) ఎ, సి


20. భూపటలంలో విస్తారంగా లభించే మూలకాల్లో రెండోది?
ఎ) అల్యూమినియం   బి) ఆక్సిజన్‌ 
సి) సిలికాన్‌        డి) ఐరన్‌


21. ఫాస్ఫరస్‌ అణువులోని పరమాణువుల సంఖ్య?
ఎ) 2      బి) 3      సి) 8      డి) 4


22. సాధారణ పటిక రసాయన నామం?
ఎ) పొటాషియం అల్యూమినియం సల్ఫేట్‌
బి) పొటాషియం అల్యూమినియం క్లోరైడ్‌
సి) సోడియం మెగ్నీషియం సల్ఫేట్‌
డి) సోడియం అల్యూమినియం ఫ్లోరైడ్‌


23. కింది ఏ మిశ్రమాన్ని థెర్మిట్‌ అంటారు?
ఎ) అల్యూమినియం పొడి + ఫెర్రిక్‌ ఆక్సైడ్‌
బి) బొగ్గుపొడి + ఫెర్రిక్‌ ఆక్సైడ్‌
సి) అల్యూమినియం పొడి + అల్యూమినియం ఆక్సైడ్‌
డి) మెగ్నీషియం పొడి + బొగ్గు పొడి


24. కిందివాటిలో కార్బన్‌ అస్పటిక రూపాంతరం కానిది?
ఎ) బొగ్గు        బి) కోక్‌         సి) దీపాంగారం        డి) గ్రాఫైట్‌


25. స్వచ్ఛమైన సిలికాను ఏమంటారు?
ఎ) సిలేన్‌        బి) సిలికోన్‌          సి) అమ్మోనాల్‌        డి) క్వార్ట్జ్‌


26. కిందివాటిలో గ్రాఫైట్‌కు సంబంధించి సరికానిది?
ఎ) గ్రాఫైట్‌ పొరల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది.
బి) గ్రాఫైట్‌ను పెన్సిళ్ల తయారీలో వాడతారు.
సి) ఇది బూడిద రంగులోని మెత్తని పదార్థం.
డి) గ్రాఫైట్‌ మంచి విద్యుత్‌ వాహకం కాదు.


27. వాటర్‌ గ్యాస్‌ ఏ వాయువుల మిశ్రమం?
ఎ) హైడ్రోజన్‌ + కార్బన్‌ మోనాక్సైడ్‌ 
బి) ఆక్సిజన్‌ + కార్బన్‌ మోనాక్సైడ్‌
సి) హైడ్రోజన్‌ + కార్బన్‌ డైఆక్సైడ్‌
డి) ఆక్సిజన్‌ + కార్బన్‌ డైఆక్సైడ్‌


28. బంగారాన్ని కరిగించడానికి స్వర్ణకారులు ఉపయోగించే ద్రవరాజం ఏ ఆమ్లాల మిశ్రమం?
ఎ) 1 : 3 నిష్పత్తిలో గాఢ హైడ్రోక్లోరికామ్లం, గాఢ నత్రికామ్లం
బి) 1 : 3 నిష్పత్తిలో గాఢ నత్రికామ్లం, గాఢ హైడ్రోక్లోరికామ్లం
సి) 3 : 1 నిష్పత్తిలో గాఢ నత్రికామ్లం, గాఢ సల్ఫ్యూరికామ్లం
డి) 3 : 1 నిష్పత్తిలో గాఢ హైడ్రోక్లోరికామ్లం, గాఢ సల్ఫ్యూరికామ్లం


29. కింది ఏ నైట్రోజన్‌ సమ్మేళనాన్ని పేలుడు పదార్థాలుగా ఉపయోగిస్తారు?
ఎ) నైట్రోగ్లిజరిన్‌        బి) టైనైట్రోగ్లిజరిన్‌        సి) నత్రికామ్లం        డి) ఎ, బి
 

30. మూలకాలన్నింటిలో అత్యధిక సమ్మేళనాలను ఏర్పరిచేది?
ఎ) ఆక్సిజన్‌        బి) సోడియం          సి) కార్బన్‌        డి) సల్ఫర్‌


31. కిందివాటిలో దహన సహకారి వాయవు ఏది?
ఎ) హైడ్రోజన్‌        బి) ఆర్గాన్‌           సి) ఆక్సిజన్‌        డి) నైట్రోజన్‌


32. కిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
i) మొక్కల్లో సూర్యరశ్మి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరిగినప్పుడు ఆక్సిజన్‌ వాయువు విడుదల అవుతుంది.
ii) సాధారణ విద్యుత్‌ బల్బుల్లో జడ వాతావరణం కోసం నైట్రోజన్‌ వాయువును నింపుతారు.
iii) ప్రకృతిలో లభించే పదార్థాలన్నింటిలో డైమండ్‌ చాలా కఠినమైంది.
iv) భూమి పొరల్లో అత్యధికంగా లభించే మూలకం ఇనుము.
v)  భూవాతావరణంలో సుమారు 78% నైట్రోజన్‌ ఉంటుంది.
ఎ) ii, iv          బి)  ii, iii, v          సి) i, ii, v         డి)  i, ii, iii, v 


33. కిందివాటిలో ‘సూపర్‌ హాలోజన్‌’ అని దేన్ని పిలుస్తారు?
ఎ) ఆక్సిజన్‌        బి) కార్బన్‌           సి) క్లోరిన్‌        డి) ఫ్లోరిన్‌


34. కిందివాటిలో సరికాని జత ఏది?
ఎ) కందెనలు - గ్రాఫైట్‌        బి) అగ్గిపెట్టెలు - ఎర్ర భాస్వరం
సి) విశ్వద్రావణి - నీరు         డి) బ్లీచింగ్‌ పౌడర్‌ - ఫ్లోరిన్‌


35. ముఖానికి ఉపయోగించే పౌడర్‌ తయారీలో వాడే ‘టాల్క్‌’ రసాయన నామం?
ఎ) మెగ్నీషియం సల్ఫేట్‌         బి) మెగ్నీషియం సిలికేట్‌
సి) మెగ్నీషియం క్లోరైడ్‌           డి) మెగ్నీషియం హైడ్రాక్సైడ్‌


36. అమ్మోనియా విషయంలో సరికానిది ఏది?
ఎ) అమ్మోనియా రంగులేని, ఘాటైన వాసన కలిగిన వాయువు.
బి) దీన్ని ఎరువుల తయారీలో ఉపయోగిస్తారు.
సి) ఇది క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది.
డి) ఇది ఒక కర్మన సమ్మేళనం.


37. పేలుడు పదార్థం ‘RDX’ పూర్తి పేరు?
ఎ) Research Development Explosive 
బి) Research Department Explosive
సి) Royal Development Explosive 
డి) Radiation Department Explosive 


38. నావికులు ఉపయోగించే ఆక్సిజన్‌ సిలిండర్లలో ఆక్సిజన్‌తో పాటు దేన్ని కలుపుతారు?
ఎ) నైట్రోజన్‌        బి) హీలియం          సి) క్లోరిన్‌        డి) అమ్మోనియా


39. కిందివాటిలో క్షారం ఏది?
ఎ) B(OH)3         బి) Al(OH)3        సి)  N2O         డి)  NO2 


40. సున్నపుతేటలోకి కార్బన్‌ డైఆక్సైడ్‌ వాయువును పంపితే ఏ రంగు అవక్షేపం ఏర్పడుతుంది?
ఎ) నలుపు        బి) తెలుపు         సి) ఎరుపు        డి) ఆరెంజ్‌


41. కిందివాటిలో నైట్రోజన్‌ కుటుంబంలోని మూలకం కానిది ఏది?
ఎ) ఫాస్ఫరస్‌        బి) ఆర్సినిక్‌           సి) యాంటిమొని        డి) సల్ఫర్‌


42. కింది ఏ ఆమ్లాన్ని గాజుపైన గుర్తులు, గాట్లు పెట్టడానికి వాడతారు?
ఎ) హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం            బి) హైడ్రోఫ్లోరిక్‌ ఆమ్లం
సి) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం          డి) ఎసిటిక్‌ ఆమ్లం


43. కిందివాటిలో విష వాయువు ఏది?
ఎ) నైట్రోజన్‌         బి) క్లోరిన్‌ 
సి) కార్బన్‌ డైఆక్సైడ్‌   డి) ఏదీకాదు


44. కింది అంశాలను జతపరచండి.
జాబితా - I        జాబితా - II
a) మంచు + ఉప్పు   i) అమ్మోనాల్‌
b) అల్యూమినియం +  ii) కార్బోజెన్‌ 
  అమ్మోనియం నైట్రేట్‌ 
c) ఆక్సిజన్‌ +       iii) శీతలీకరణ 
   కార్బన్‌ డైఆక్సైడ్‌     మిశ్రమం

ఎ) a-iii, b-ii, c-i        బి) a-ii, b-i, c-iii
సి)  a-iii, b-i, c-ii       డి) a-i, b-iii, c-ii 


45. నైట్రోజన్‌ కుటుంబానికి చెందిన ఏ మూలకం గాలిలో మండటం వల్ల నీటిలో నిల్వ చేస్తారు?
ఎ) ఫాస్ఫరస్‌        బి) సల్ఫర్‌ 
సి) సోడియం        డి) గ్రాఫైట్‌


46. నీటిని శుభ్రపరచడానికి ఉపయోగించే ఆక్సిజన్‌ రూపాంతరం ఏది?
ఎ) హైపో        బి) ఓజోన్‌          సి) అమ్మోనియా        డి) నైట్రోలిమ్‌


47. ప్రతిపాదన (A): థైరాక్సిన్‌ హార్మోన్‌ ఉత్పత్తికి అయోడిన్‌ ఆవశ్యకత చాలా ఎక్కువ.
కారణం (R): అయోడిన్‌ ఉత్పతనం చెందుతుంది.
ఎ) A నిజం కానీ R తప్పు.
బి) A తప్పు కానీ R నిజం.
సి) A, R రెండూ నిజం, Aకు A సరైన వివరణ.
డి) A, R రెండూ నిజం, Aకు R సరైన వివరణ కాదు.


48. కిందివాటిలో సూపర్‌ ఆక్సైడ్‌కు ఉదాహరణ?
ఎ) SO2        బి) H2O2       సి) KO2        డి) MgO


సమాధానాలు: 1- బి, 2- సి, 3- సి, 4- డి, 5- ఎ, 6- సి, 7- ఎ, 8- బి, 9- డి, 10- ఎ, 11- డి, 12- ఎ, 13- సి, 14- సి, 15- బి, 16- డి, 17- సి, 18- సి, 19- సి, 20- సి, 21- డి, 22- ఎ, 23- ఎ, 24- డి, 25- డి, 26- డి, 27- ఎ, 28- బి, 29- డి, 30- సి, 31- సి, 32- డి, 33- డి, 34- డి, 35- బి, 36- డి, 37- బి, 38- బి, 39- బి, 40- బి, 41- డి, 42- బి, 43- బి, 44- సి, 45- ఎ, 46- బి, 47- డి, 48- సి.

Posted Date : 20-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌