• facebook
  • whatsapp
  • telegram

జీవుల వర్గీకరణ

1. "కొన్ని నియమాల ఆధారంగా జీవులను వేర్వేరు వర్గాలుగా వేరు చేసి అమర్చే విధానం" ఏ శాస్త్ర పరిధిలోకి వస్తుంది?
జ: వర్గీకరణశాస్త్రం
 

2. జీవరాశులను గుర్తించి వర్గీకరించడానికి ప్రయత్నించిన తొలి వ్యక్తి?
జ: అరిస్టాటిల్
 

3. వర్గీకరణలో ప్రాథమిక ప్రమాణం (మూల ప్రమాణం)-
జ: జాతి
 

4. 'జాతులు' అనే పదాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు?
జ: జాన్ రే
 

5. జాతిని రెండు పేర్లతో పిలిచే ద్వినామీకరణ విధానాన్ని మొదటగా ప్రవేశపెట్టింది-
జ: గాస్పర్డ్ బాహీన్
 

6. లిన్నెయస్ వర్గీకరణలో భాగంగా జంతువుల మీద రాసిన గ్రంథం పేరేంటి?
జ: సిస్టమా నాచురె
 

7. 'వర్గీకరణ' అనే పదాన్ని మొదట ప్రతిపాదించింది
జ: ఎ.పి.డి. కండోల్
 

8. "దగ్గర పోలికలు కలిగి, ఒకదాంతో ఒకటి స్వేచ్ఛగా సంపర్కం జరుపుకునే జీవరాశుల సమూహమే"-
జ: జాతి
 

9. వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరు?
జ: లిన్నెయస్
 

10. చింతచెట్టు శాస్త్రీయ నామం - 'టామరిండస్ ఇండికా L' - ఇందులో 'L' అనే అక్షరం దేన్ని సూచిస్తుంది?
జ: ఆ చెట్టుకు శాస్త్రీయ నామం పెట్టింది లిన్నెయస్
 

11. భారతదేశంలో అనుసరిస్తున్న మొక్కల వర్గీకరణ విధానం-
జ: బెంథామ్, హుకర్ విధానం
 

12. 'అతిపురాతనమైన జీవులు' ఉన్న రాజ్యమేది?
జ: మొనీరా
 

13. 'నాస్టాక్, అనబీనా' లాంటి జీవులున్న రాజ్యం?
జ: మొనీరా
 

14. 'సముద్రంలో తేలియాడే పచ్చిక బయళ్లు' అని వేటినంటారు?
జ: డయాటమ్స్
 

15. 'భూమిని శుభ్రపరిచే తోటీలని' వేటినంటారు?
జ: శిలీంద్రాలు
 

16. 'ట్రాఖియోఫైటా' వర్గంలో అతి ప్రాథమికాలు -
జ: ఫెర్న్‌లు
 

17. 'మూన్ జెల్లీ'లు కింది ఏ వర్గానికి చెందిన జీవులు?
ఎ) ఫొరిఫెరా           బి) టీనోఫోరా         సి) సీలెంటిరేటా        డి) అనెలిడా
జ: టీనోఫోరా
 

18. ఒక శాస్త్రవేత్త తన పరిశోధనల కోసం HCl లాంటి ఆమ్లమాధ్యమంలో కూడా నివసించగలిగే ఏకకణ జీవులను ఎన్నుకున్నాడు. అవి ఏ రాజ్యానికి చెందినవి?
జ: మొనీరా
 

19. కిందివాటిలో నిర్దిష్ట కేంద్రకం ఉన్న ఏకకణ జీవులను గుర్తించండి.
ఎ) మొనీరా        బి) మెటాఫైటా         సి) మెటాజోవా        డి) ప్రొటిస్టా
జ: ప్రొటిస్టా

20. 'అత్యధిక వైవిధ్యం' చూపే జీవులు కింది ఏ రాజ్యానికి చెందుతాయి?
ఎ) మొనీరా          బి) ప్రొటిస్టా           సి) ప్లాంటే         డి) అనిమేలియా
జ: అనిమేలియా
 

21. వర్గీకరణ శాస్త్రం ఏ విషయంలో ఉపయోగపడదు?
జ: జీవులలో వ్యాధుల వల్ల కలిగే మార్పులను అధ్యయనం చేయడానికి

Posted Date : 31-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌